అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్‌.. కేసు నమోదు! | Complaint Against Sonu Nigam For Kannada fan Request To The Pahalgam Issue | Sakshi
Sakshi News home page

పహల్గాం ప్రస్తావన.. సింగర్‌పై కేసు నమోదు!

Published Sat, May 3 2025 11:24 AM | Last Updated on Sat, May 3 2025 11:55 AM

Complaint Against Sonu Nigam For Kannada fan Request To The Pahalgam Issue

కాన్సర్ట్‌ మధ్యలో పహల్గాం దాడి గురించి ప్రస్తావించినందుకుగానూ ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌(Sonu Nigam) చిక్కుల్లో పడ్డారు. అతని వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగమ్‌పై  కర్ణాటక రక్షణ వేదిక (KRV)బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ సోనూ నిగమ్‌ చేసిన వ్యాఖ్యలు ఏంటి? కన్నడ ప్రజలు అతనిపై ఎందుకు అసహజం వ్యక్తం చేస్తున్నారు?

కన్నడ పాటలోనే పాడాలి
బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌కి సంగీత ప్రపంచంలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలోనే ఎక్కువ పాటలు పాడినప్పటికీ..తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ..ఇలా అన్ని     ప్రాంతాల్లోనూ ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. తుళు, మైథిలీ, నేపాలి భాషల్లోనూ ఆయన పాటలు ఆలపించారు. ఆయన నిర్వహించే సంగీత కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు హాజరవుతుంటారు. తాజాగా ఆయన బెంగళూరులో కాన్సర్‌ నిర్వహించారు. సోనూ నిగమ్‌ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడ భాషలో పాడాలంటూ డిమాండ్‌ చేశారు. 

ఆ అభిమాని పదే పదే అదే కోరడం..గట్టిగా అరవడంతో సోనూ నిగమ్‌ సహనం కోల్పోయాడు. పాటలు పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకుల గురించి మాట్లాడారు. కన్నడ భాష అంటే తనకు కూడా ఇష్టమేనని..కానీ ఆ అభిమాని ఆ భాషలోనే పాడాలని బెదిరించడం తనకు నచ్చలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి ప్రస్తావించారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాం దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్‌ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఘాటుగా స్పందించారు.

 

సింగర్‌పై కన్నడ ప్రజలు అసహనం
సోనూ నిగమ్‌ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొంతమంది తమ మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికతో పాటు మరికొంత మంది కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే కాన్సర్ట్‌లో సోనూ నిగమ్‌ కన్నడ ప్రేక్షకులపై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. నేను అన్నిభాషల్లో పాటలు పాడాను కానీ.. ఎక్కువగా కన్నడలోనే మంచి పాటలు పాడాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది. నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా అనుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను ఎక్కడ కాన్సర్ట్‌ నిర్వహించిన అక్కడకి కన్నడ ప్రజలు వస్తారు. వారి కోసం ఆ భాషలో పాటలు పాడుతాను. కానీ ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడాలని బెదిరించడం నా మనసుని నొప్పించింది’ అని సోనూ నిగమ్‌ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement