Sonu Nigam
-
ఆశా భోంస్లే కాళ్లు కడిగిన సింగర్ సోను నిగమ్ (ఫోటోలు)
-
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
రామ్ లల్లా దర్శనం: సోనూ నిగమ్ భావోద్వేగం, బీ-టౌన్ సెల్ఫీ వైరల్
#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది. రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92 — Actual India (@ActualIndia) January 22, 2024 అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy — ANI (@ANI) January 22, 2024 #WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm — ANI (@ANI) January 22, 2024 కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్‌ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సింగర్ సోనూ నిగమ్‌పై ముంబైలో దాడి
-
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి, వీడియో వైరల్
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలోని చెంబూర్‌లో సోమవారం జగిరిన మ్యూజిక్ కన్సర్ట్‌లో కొందరు ఆయనపై దాడికి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాలు.. ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ ఆధ్యర్యంలో ముంబయిలోని చెంబూరులో జరిగిన ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సోనూనిగమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాటలు పాడి అలరించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా కొందరు ఆయనతో సెల్ఫీ దిగే వంకతో సోనునిగమ్పై దాడి చేశారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి స్టెప్స్‌పై నుంచి తొయడంతో ఆయన కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూ నిగమ్‌పై దాడి చేస్తున్న క్రమంలో ఆయన సహచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై సైతం సదరు గ్రూప్ దాడి చేసేందుకు యత్నించగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న బాడీగార్డ్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోనూ నిగమ్ బృందంలోని ఇద్దరు వ్యక్తులు స్టేజ్‌పై నుంచి కింద పడటంతో వారిలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! ఇక ఈ ఘటన అనంతరం సోనూ నిగమ్ మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ దిగాలని వచ్చి తనని తోయడంతో కింద పడ్డానని, వారిని ఆపేందుకు వచ్చిన తన అనుచరులపై కూడా దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్లు ఉద్ధవ్ ఠాక్రె పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు ఈ దాడికి పాల్పడినట్లు సోనూ నిగమ్ బృందం చెబుతుండగా.. సెల్ఫీలు తీసుకునే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే చెబుతుండటం గమనార్హం. #SonuNigam attacked by Uddhav Thackeray MLA Prakash Phaterpekar son and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/ERjIC96Ytv — Swathi Bellam (@BellamSwathi) February 20, 2023 Shocking😡 Padma Shri Singer #SonuNigam was attacked by the son of Shiv Sena MLA Prakash Phaterpekar. got some serious injuries & taken to Zen Hospital Chembur. Is this what a Padma Shri & a legend deserves? Demanding stringent action @Dev_Fadnavis @MumbaiPolice @mieknathshinde pic.twitter.com/4HnEMdTa9p — Akassh Ashok Gupta (@peepoye_) February 20, 2023 -
సింగర్ సోనూ నిగమ్‌కు అరుదైన గౌరవం.. 'పద్మశ్రీ'తో సత్కారం
Singer Sonu Nigam Bags Padma Shri Award 2022: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (జనవరి 25) ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ఈ ఏడాదికిగాను 128 మందికి ఈ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి తన అధికారిక నివాసం - రాష్ట్రపతి భవన్లో ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కు ఈ అరుదైన గౌరవ పురస్కారం దక్కింది. కళారంగంలో అనేక సేవలందించినందుకు గాను సోనూ నిగమ్‌ను 'పద్మశ్రీ' అవార్డుతో ప్రభుత్వం సత్కరించనుంది. జూలై 30, 1973న ఆగమ్ కుమార్ నిగమ్, శోభ నిగమ్ దంపతులకు హర్యానాలోని ఫరిదాబాద్‌లో జన్మించాడు సోనూ నిగమ్. నాలుగేళ్ల చిరుప్రాయం నుంచే తండ్రితోపాటు వేదికలెక్కి పాటలు పాడటం ప్రారంభించిన సోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 18 ఏళ్ల వయసులో బాలీవుడ్లో తానేంటే నిరూపించుకోవాలని ముంబైకి వచ్చాడు. హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ వద్ద శిక్షిణ తీసుకున్నాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, తెలుగు, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ప్రేమ, దేశభక్తి, రాక్, వేదనా భరిత గీతాలను ఆలపించాడు. -
పిలవని పేరంటానికి సింగర్, అందరూ షాక్!
Sonu Nigam Gives Special Surprise For A Newlywed Couple: సింగర్ సోనూ నిగమ్ పిలవని పేరంటానికి వెళ్లి అక్కడున్న అతిథులందరినీ షాక్‌కు గురి చేశాడు. ఏదో పని మీద ఉజ్జయిని వెళ్లిన ఆయన అక్కడి హోటల్లో బస చేశాడు. ఆ ప్రాంతంలోని మహంకాళి, కాలభైరవ ఆలయాలను సందర్శించి హోటల్‌కు తిరిగి వచ్చిన అతడికి అక్కడ పెళ్లితంతు జరగడం కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా మండపంలోకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. నిజానికి సోనూ పెళ్లిపందిట్లోకి వచ్చేటప్పుడు అక్కడ అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో సోనూ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సీన్ మారిపోయింది. బాధతో నిండి ఉన్న వారి ముఖాల్లో ఒక్కసారిగా సంతోషపు వెలుగులు విరజిమ్మాయి. సోనూను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికి సోనూ చేసిన పని వల్ల అక్కడున్న అతిథులతో పాటు ఆ కొత్త జంటకు ఈ సంఘటన కలకాలం గుర్తుండిపోతుంది. -
నా కుమారుడు అలా ఉండటం ఇష్టం లేదు : సోనూ నిగమ్
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మంచి టాలెంట్ ఉన్న యువ కళాకారులకు అవకాశాలు లభించడం లేదనీ, పెద్ద మ్యూజిక్ మాఫియా నడుస్తోందంటూ గతంలో సంచలనం రేపిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ (47) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీవన్ తన వృత్తిలో (గాయకుడిగా) ఉండాలని కోరుకోవడం లేదన్నారు. అంతేకాదు అదీ భారతదేశంలో నీవన్‌ను సింగర్‌గా చూడాలని తాను కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉంటున్నప్పటికీ ఇండియాలో గాయకుడిగా చెలామణి కావాలని తాను భావించడం లేదంటూ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) గాయకుడిగా మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, తన కుమారుడు గాయకుడిగా ఉండాలని కోరుకోవడం లేదని సోనూ తెగేసి చెప్పారు. చాలా తెలివైనవాడు, మంచి గాత్రంతో పాటు గేమింగ్ రంగంలో మంచి టాలెంట్ ఉన్న నీవన్ ప్రస్తుతం గేమింగ్ రంగంలో రాణిస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లో టామ్ గేమర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడని తెలిపారు. అలాగే పిల్లలు భవిషత్తులో ఏం కావాలో శాసించడం తనకిష్టం ఉండదనీ, తనకు తానుగా ఎలా రాణిస్తాడో చూద్దాం.. అని ఆయన పేర్కొన్నారు. కాగా తన తండ్రితో అనేక వేదికలపైనా, స్టూడియోలలలో తన ముద్దు ముద్దు ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు నీవన్. దీంతోపాటు ఇటీవల ఆన్లైన్ కన్సర్ట్‌లో సోనూతో కలిసి ఒక షో కూడా చేశాడు. సోనూ నిగమ్ ప్రస్తుతం తన కొత్త పాట ‘ఈశ్వర్ కా వో సచ్చా బాందా ’ విడుదలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
సోను నిగమ్‌పై వీడియో ద్వారా ప్రతిదాడి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్ చేశాడు. ఇది ‘టి సిరీస్’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్ కుమార్‌ను ఉద్దేశించినది. సోను నిగమ్ అంతటితో ఆగకుండా ‘భూషణ్ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్ ఆరోపణలకు భూషణ్‌కుమార్ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది. ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా ‘సోనూ నిగమ్ గారూ. టి సిరీస్ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్ కుమార్ గారు మిమ్మల్ని స్పాట్ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్‌తో కాకుండా మరో మ్యూజిక్ కంపెనీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్ వరల్డ్ ప్రస్తావన తెచ్చారు. మావారు మీ దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్ వరల్డ్‌తో లింక్స్ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jun 24, 2020 at 7:23am PDT -
సోనూ నిగమ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
ముంబై: సింగర్ సోనూ నిగమ్‌కు, గ్యాంగ్‌స్టర్ అబూ సలీంకు మధ్య సంబంధాలు ఉన్నాయని దర్శకురాలు, నటి దివ్వ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సంగీత పరిశ్రమలో కూడా పెద్ద మాఫియా ఉందంటూ సోనూ నిగమ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక టీ-సీరిస్ యాజమానికి భూషణ్ కుమార్, అబూ సలీం నుంచి తనకు ప్రాణహానీ ఉందని అతడిని నుంచి రక్షించాలని వేడుకున్నాడంటూ ఇటీవల ట్వీట్ చేశాడు. (అతడు కృతజ్ఞత లేని వాడు: నటి) దీంతో సోనూ నిగమ్ వ్యాఖ్యలను ఖండిస్తూ భూషణ్ కుమార్ భార్య దివ్వ ఖోస్లా సోషల్ మీడియాలో గురువారం వీడియోను షేర్ చేశారు. ‘‘గత కొద్ది రోజులుగా సోనూ నిగమ్ టి-సిరీస్, యాజమాని భూషణ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. పరిశ్రమలో సంబంధం లేని సంగీత దర్శకులకు, గాయకులకు, నటులకు, ప్రతిభ ఉన్న ఎంతోమంది బయట వ్యక్తులకు టీ-సిరీస్ సహాయపడింది. దర్శకురాలిగా నేను కొత్తవారికి అవకాశం ఇచ్చాను. వారిలో నలుగురు నేహా కక్కర్, రకుల్ ప్రీత్ సింగ్, హిమాన్ష్ కోహ్లి, స్వరకర్త ఆర్కో వృద్ది ఇప్పడు మంచి స్థాయికి ఎదిగారు’’ అంటూ చెప్పకొచ్చారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) అంతేగాక సోనూ నిగమ్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘సోషల్ మీడియాలో నిజాలను దాచడం సులభమే. కానీ ఓ గాయకుడిగా మీరు ఎంతమంది కింది స్థాయి ప్రతిభావంతులను ముందుకు తీసుకువచ్చారో చెప్పండి. మీరు తప్ప మరెవరికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారా? వాస్తవానికి టీ-సిరీస్‌లో పనిచేసే 97 శాతం మంది బయటి వారే. వారికి పరిశ్రమలో ఎలాంటి సంబంధాలు లేవు. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పిల్లలు కూడా కాదు. మేము ఎప్పుడూ ప్రతిభ ఉన్న కొత్తవారి కోసమే చూస్తాము’’ అని చెప్పారు. -
అతడు కృతజ్ఞత లేని వాడు: నటి
ముంబై: ముంబై: గాయకుడు సోనూ నిగమ్‌పై టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ భార్య, నటి దివ్వ కొస్లా ఇన్స్టాగ్రామ్ వేదికగా ధ్వజమెత్తారు. సోనూ నిగమ్ అబద్ధాలు చెబుతాడని, కృతజ్ఞత లేనివాడని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాటిని నమ్మిస్తూ క్యాంపయిన్ చేస్తున్నారో.... #సోనూ నిగమ్, అలాంటి వారికి ప్రేక్షకులు మనోభావాలతో ఎలా ఆడుకోవాలో కూడా తెలుసు, దేవుడా నువ్వే కాపాడాలి ’ అని దివ్వ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. (అది తన హృదయ లోతుల్లోనే అంతమైంది: నటి) తన భర్త భూషణ్ కుమార్‌ను టార్గెట్ చేయడం ద్వారా సోనూ నిగమ్ పాపులారిటీ పొందాలని చూస్తున్నాడని దివ్వ ఆరోపించారు. ‘సోనూ నిగమ్ జీ టీ-సిరీస్ పరిశ్రమలో మీకు మంచి గుర్తింపునిచ్చింది. మీకు భూషణ్‌తో ఇబ్బంది ఉంటే మీరు ముందే ఎందుకు చెప్పలేదు. మీరు పబ్లిసిటీ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను, మీ నాన్నగారు చేసిన ఎన్నో మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. మీ నాన్న గారు ఆ విషయంలో ఎప్పుడు కృతజ్ఞతగానే ఉన్నారు. కానీ కొంతమందికి కృతజ్ఞత ఉండదు’ అని దివ్య తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో భూషణ్ మాఫియా నడుపుతున్నారంటూ సోనూ నిగమ్ అంతకుముందు ఆరోపించారు. భూషణ్ తనకు వ్యతిరేకంగా కొందరు కళాకారులు మాట్లాడేలా చేశారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మెరీనా కువార్ వీడియోను యూట్యూబ్‌లో ప్లే చేస్తానని బెదిరించారని నిగమ్ ఆరోపించారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) -
సంగీత పరిశ్రమలో పెద్ద మాఫియా ఉంది
న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పొచ్చు. సుశాంత్ మరణం చిత్రసీమలోని చీకటి కోణాన్ని ప్రజలకు మరోసారి తెలియజేసింది. బాలీవుడ్ ప్రముఖుల నెపోటిజం(బంధుప్రీతి) తాలూకు కోరల్లో చిక్కుకుని తామూ తీవ్రంగా కష్టాలు పడ్డామంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దబాంగ్ దర్శకుడు సల్మాన్, ఆయన కుటుంబంపై బాహాటంగానే విమర్శలు చేశారు. తాజాగా ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ చిత్ర పరిశ్రమలోని మరో కోణాన్ని ఎత్తిచూపారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన స్పందిస్తూ.. సినిమా కంటే సంగీత పరిశ్రమలో ఇంకా పెద్ద మాఫియా ఉందని అన్నారు. అధికారంలో ఉన్న ప్రముఖుల కారణంగా కొత్త వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సంగీత పరిశ్రమలోని ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తిపై కరుణ కలిగి ఉండాలన్నారు. సుశాంత్ లాగానే రేప్పొద్దున చిత్ర పరిశ్రమలోని ఓ గాయకుడో, పాటల రచయితో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ( సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?) -
కరోనా : ఒక్క పాట.. 214 మంది గాయకులు
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కష్టసమయంలో ఒక కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతీ భారతీయుడికి సినీ గాయకులు ఉత్తేజపరిచే విధంగా సెల్యూట్ చేస్తూ పాట పాడారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 214 మంది సినీ గాయకులు 'జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం' అంటూ ఆలపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే, సోనూ నిగమ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ మహదేవన్, ప్రసూన్ జోషిలు కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మాట్లాడుతూ.. ' 'జయతు జయతు భారతం' ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి నమస్కారంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడింది. ఇప్పుడు అన్ని సవాళ్లకు మించి కొత్త 'జగా హువా భారత్'లో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది .మానవాళికి అతిపెద్ద సంక్షోభాలలో ఒకటి గెలిచింది ' అని పేర్కొన్నారు. ('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') -
పీఏసీఎల్ : ప్రముఖ గాయకుడికి సెబీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్‌కు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన లిమిటెడ్ (పీఏసీఎల్) నుంచి కొనుగోలు చేసిన ముంబైకి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జాత్‌లో నిగమ్ ఫామ్‌హౌస్ విక్రయంపై నిషేధం విధించింది. అలాగే గత 18 సంవత్సరాలుగా సమిష్టి పెట్టుబడి పథకాల ద్వారా పెట్టుబడిదారుల నుండి అక్రమంగా రూ .60,000 కోట్లకు పైగా వసూలు చేసిన పీఏసీఎల్‌పై సెబీ అనేక ఆంక్షలు విధించింది. ఆస్తుల విక్రయం, బదిలీలకు అనుమతిని నిరాకరించింది. మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విక్రయాన్ని లేదా బదిలీ చేయడాన్ని అడ్డుకుంటూ సెబీ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సోనూ నిగంతోపాటు వైటల్ సీ మార్కెటింగ్‌కు చెందిన స్థిర, చర ఆస్తుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి 9 తేదీన ఆదేశించింది. పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడానికి మరియు అమ్మకపు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అప్పగించిన పీఏసీఎల్ కమిటీకి, జనవరి 15, 2018న ఫాం హౌస్‌ను సోనూ నిగమ్ కొనుగోలు చేసిన వివరాలపై కమిటీకి తెలియజేస్తూ జాన్ కల్యాణ్ ట్రస్ట్ ఏప్రిల్ 2018 లో ఒక లేఖ రాసింది. పీఏసీఎల్ అనుబంధ సంస్ధ వైటల్ సీ మార్కెటింగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. అయితే 99 శాతానికి పైగా మూలధనం వాటా నేరుగా దాని 21 అసోసియేట్ కంపెనీలు నియంత్రిస్తాయని పీఏసీఎల్ 2018 మేలో ప్రత్ర్యేక కమిటీకి అందించిన సమాచారంలో తెలిపింది. దీని ప్రకారం, తమ అసోసియేట్ సంస్థ వైటల్ సీ మార్కెటింగ్ ఆస్తులను ఎటాచ్ చేయాలని సెబీని కోరింది. కాగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట ప్రజల నుంచి పీఏసీఎల్ అక్రమంగా రూ. 60వేల కోట్లు సమీకరించిందని తేలిన నేపథ్యంలో ఆగస్టు 22, 2014 నాటి ఉత్తర్వులలో డబ్బును తిరిగి చెల్లించాలని పీఏసీఎల్, దాని ప్రమోటర్లు డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. అయితే డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్, దాని తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల అన్ని ఆస్తులను అటాచ్ చేయాలని 2015 డిసెంబర్లో ఆదేశించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కూడా సంస్థ ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో సెబీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సంగతి తెలిసిందే. చదవండి: డెక్కన్ క్రానికల్ చైర్మన్‌పై సెబీ నిషేధం -
‘సోనూ నిగమ్‌ను చంపాలని చూశారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నిలేశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ను శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే చంపాలని చూశారని ఆరోపించారు. దీనికోసం పలుమార్లు ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. అసలు బాల్‌ఠాక్రే, సోనూ నిగమ్ కుటుంబాలు మధ్య సంబంధం ఏమిటని తనను అడగవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన పార్టీ నాయకుడు వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. నారాయణ్ రాణేపై పలు వ్యాఖ్యలు చేశారు. వినాయక్‌ను ఉద్దేశించే నిలేశ్ ఈవిధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలస్తోంది. ఇంకా నిలేశ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎప్పుడు బాల్‌ఠాక్రేను రాజకీయ విషయాల్లో తప్పుపట్టలేదు. కానీ కొందరు మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేస్తే నేను కూడా కొన్ని విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. శివసేనలో ఉన్నప్పుడు నారాయణ్ రాణే ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. ఆయన కుటుంబం శివసేనకు దూరమైంది. -
ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?
మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా, సిని, రాజకీయ రంగాల్లోని పలువురు ప్రముఖులు మీటూ దెబ్బకు ఠారెత్తిపోయారు. కలలో కూడా ఊహించని వారి పేర్లు తెరమీదకు వచ్చాయి. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బాలీవుడ్ ఇండస్ట్రీ పక్కకు పెట్టింది. ఇలా నిషేధం ఎదుర్కొంటున్న వారిలో కంపోజర్ అను మాలిక్ కూడా ఉన్నారు. సింగర్స్ సోనా మొహపాత్రా, శ్వేతా పండిట్ అను మాలిక్ తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. మరో ఇద్దరు మహిళలు కూడా అను మాలిక్ మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. దాంతో బాలీవుడ్ అను మాలిక్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాజ్ఞలను గాయకుడు సోను నిగమ్ వ్యతిరేకించారు. ఇలా చేసి అతని కుటుంబాన్ని బాధిస్తున్నారని ఆరోపించారు. అజెండా ఆజ్‌తక్‌తో మాట్లాడిన సోను నిగమ్, అను మాలిక్‌కు మద్దతిస్తూ.. ‘ఒక వేళ మీరు నాతో తప్పుగా ప్రవర్తించానని నేను ఆరోపిస్తే.. వెంటనే మీరు ఆధారాలేంటని అడుగుతారు. మరి అను మాలిక్ మీద ఆరోపణలు చేశారు. సరే ఇవి నిజమా, కాదా అనేది కూడా ఆలోచించకుండా జనాలు మిమ్మల్ని నమ్మారు. అలాంటప్పుడు సరైన ఆధారాలు చూపించాలి కదా. మరి ఆధారాలేవి? లేవు. కానీ ఇవేం ఆలోచించకుండా అతని మీద నిషేధం విదించారు. ఇది కరెక్టెనా. అతనికి పని దొరక్కుండా చేయడం ఎంత వరకూ న్యాయం. అతని కుటుంబాన్ని ఎలా హింసిస్తారు’ అంటూ ప్రశ్నించారు. మరోకరి జీవితాల్లోని తప్పోప్పులను నిర్ణయించే హక్కు మీకు ఎరిచ్చారన్నారు. మీరు అతన్ని నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ అతని కుటుంబాన్ని శిక్షించకూడదు. ముందు ఆధారాలు తీసుకురండి అన్నారు. సోను నిగమ్ మాట్లాడుతూ.. ‘అధికారం ఏ విధంగా దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ‘మీటూ’ అంటున్నారు. కానీ పదేళ్ల క్రితమే నేను దీనిని ప్రారంభించాను. అప్పుడు ఒక జర్నలిస్ట్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఓ దర్శకుని దగ్గరకు వెళ్లి నాతో పనిచేస్తే తనను తాను చంపుకుంటానని సదరు జర్నలిస్ట్ దర్శకున్ని బెదిరించాడు’ అంటూ తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చారు. అంతేకాక నాకు ఇద్దరు సోదరీమణులున్నారు. నేను వారికి అండగా నిలబడతాను. దాని అర్థం మరోకరికి పని దొరక్కుండా చేస్తానని కాదు అన్నారు. హింస, వేధింపు, ఎక్కడైనా ఉంటాయి. కార్పొరేట్ ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి. -
‘మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించకూడదు’
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మసీదుల్లో, ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ కూడా సోనూ నిగమ్‌కు మద్దతు పలికారు. నివాసప్రాంతాల్లోని మసీదుల్లో, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఆయన తేల్చిచెప్పారు. ‘ఆన్ రికార్డు చెప్తున్నా.. సోనూ నిగమ్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నివాస ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు’ అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనూ నిగమ్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాజాగా ముంబై పోలీసులు సోనూ నిగమ్‌కు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు. -
సోనూ నిగం సంచలన నిర్ణయం, ట్వీట్లు
ముంబై: బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్(43) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఇవాల్టి నుంచి తాను ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. మంగళవారం వరుస ట్వీట్లలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. సింగర్ అభిజీత్ భట్టాచార్య అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించడాన్ని సోనూ తీవ్రంగా తప్పుబట్టిన తన ట్విట్టర్ ఖాతాను రద్దు చేశాడు. భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం లేని చోట తాను ఉండదలచుకోలేదని సోనూ స్పష్టం చేశాడు. బీజేపీపీ ఎంపీ,నటుడు, పరేష్‌రావెల్, అభిజిత్ వివాదాస్పద ట్వీట్లను వెనకేసుకొచ్చిన సోనూ మొత్తం 24 ట్వీట్లలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిద్రపోతున్న వాళ్లని మేల్కొల్పవచ్చు గానీ.. నిద్ర నటిస్తున్నవారిని నిద్ర లేపడం కష్టమని తనకు అర్థమైందంటూ వాపొయాడు. పనిలోపనిగా మీడియాపై విమర్శలు గుప్పించాడు.మీడియా జాతీయవాదులుగా,కోల్డ్ బ్లడెడ్ సూడోలుగా చీలిపోయిందని,దోహద్రోహుల గురించి తెలుసుకోవడానికి వీరు సిద్ధంగా లేరంటూ దుయ్యబట్టాడు. అంతేకాదు కాసేపట్లో తన అకౌంట్ ఉండబోదని అందుకే తన ట్వీట్లను ముందే స్క్రీన్‌షాట్స్ తీసుకోవాలంటూ మీడియాకు కూడా సలహా ఇచ్చాడు. తను ట్విట్టర్ ను వీడడం సుమారు 7మిలియన్ల తన ఫాలోయర్లకు బాధకలింగవచ్చని..అలాగే కొంతమంది సాడిస్టులకు ఆనందంగా ఉంటుందటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ సంయమనం పాటించడంలేదనీ, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. "బ్యాలెన్స్ ఎక్కడ ఉందంటూ ట్వీట్ చేశాడు సున్నితమైన చర్చ ఎందుకు జరగడంలేదని అని ప్రశ్నించాడు..ప్రజలు "మానవులు ఉండటం నిలిపివేశారు" ప్రౌడ్ ముస్లిం, హిందువు, పాకిస్థానీయులుయ భారతీయులుగా ఉంటున్నారు తప్ప అంతకు మించి లేరని ఒక ట్వీట్లో రాసుకొచ్చాడు. చివరగా తను ట్విట్టర్‌కు వ్యతిరేకం కాదంటూ అభిమానులకు వివరణ ఇచ్చాడు. కానీ ట్విట్టర్ ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ట్విట్టర్ గ్రేటర్ ప్లాట్‌ఫాంగా నిలవొచ్చు అంటూనే.. థియేటర్లలో చూపించే పోర్న్ షోతో ట్విట్టర్ నో పోల్చాడు. కాగా బీజేపీఎంపీ పరేష్ రావల్ కశ్మీర్లో ఆర్మీ వాహనానికి రాళ్లురువ్వే యువకుడికి బదులుగా,ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ని కట్టాంటూ ట్వీట్ చేయడం వివాదాన్ని సృష్టించింది. జేఎన్‌యూ విద్యార్థిని సెహ్లా రహీద్ పట్ల అసభ్యకర ట్వీట్లు చేశాడన్న కారణంతో అభిజీత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సోనూకు 6.5 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. -
సోను నిగమ్... నివాన్... అజాన్...
సంవాదం శిరోముండనం చేసుకున్న తన తండ్రి సోను నిగమ్‌ను చూసి అతని పదేళ్ల కుమారుడు నివాన్ ఏమని అనుకుని ఉంటాడా అనే ఆలోచన వచ్చింది. ‘వాడు హతాశుడయ్యాడు నిజమే. కాని చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో వాడికి తెలియాలి కదా’ అని సోను నిగమ్ శిరోముండనం తర్వాత తన కొడుకును ఉద్దేశించి పత్రికల వాళ్లతో అన్నాడు. ఇక్కడ ‘చుట్టుపక్కల’ అనే మాట దగ్గర ‘ముస్లిం’ అని ఆ పసివాడు ఎక్కడ పూరించుకుంటాడో అని నాకు బెంగ కలిగింది. ముస్లింలు ఇలా ఉంటారు... ముస్లింల వల్లే మా నాన్న ఇలాంటి పనికి ఒడిగట్టాడు అని వాడికి అనిపించి ఉంటే, ఆ దురభిప్రాయం ఎప్పటికి పోతుందా అనేది ప్రశ్న. సోను నిగమ్ గాయకుడు. తెల్లవారి లేచి మైక్‌తోనే అతడి పని. కాని అతడికి ఆ మైక్ గురించే అభ్యంతరం వచ్చింది. ‘మసీదులు, గురుద్వారాలు, గుడులు లౌడ్ స్పీకర్ల ద్వారా చేసే అల్లరి గూండాగిరితో సమానం’ అని అర్థం వచ్చేలా ట్విట్టర్లో వ్యాఖ్య చేశాడు. అంతటితో ఆపి ఉంటే సరిపోయేది. కాని ‘నేను అజాన్‌తో బలవంతంగా ఎందుకు నిద్ర లేవాలి’ అని ప్రశ్నించాడు. ప్రవక్త కాలంలో కరెంటు లేదు... ఇప్పుడు మాత్రం ఎందుకు అని అన్నాడు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ దీనికి ఒక అడుగు ముందుకేసి ‘లౌడ్ స్పీకర్లు వాడి అజాన్ ఇవ్వమని ఖురాన్లో ఎక్కడా చెప్పలేదు’ అన్నారు. మక్కా మీద అంతిమ విజయం సాధించాక కాబా గృహం వద్దకు చేరుకున్న మహమ్మద్ ప్రవక్త అందరికీ వినిపించేలా కాబా గృహం ఎక్కి మరీ అజాన్ ఇవ్వమని నల్ల బానిస బిలాల్‌కు ఆదేశం ఇచ్చారు. అతడు ఇనుమడించిన ఉత్సాహంతో కాబా గృహం మీద ఎగబాకి ‘అల్లాహో అక్బర్’ (గాడ్ ఈజ్ గ్రేట్) అంటూ అజాన్ ఇచ్చిన ఘటన చెరగక చరిత్రలో నమోదు అయి ఉంది. ఇస్లాంలో ఐదు పూటలా నమాజు చేయాలని తప్పనిసరి ఆదేశం. ఆ నమాజు వేళలను ప్రజలకు గుర్తు చేయడానికి అజాన్‌ను నియుక్తం చేశారు. పనీ పాటా చేసుకునే ప్రజలకు గడియారం, సమయం తెలియదు. వారు కొత్తగా ఇస్లాంలో చేరారు. వారి నమాజు వేళను గుర్తు చేయడానికి ఆ రోజుల్లో పెద్దగా అరిచి పిలవడానికి అజాన్ ఒక మార్గమైంది. అది కొనసాగింది. ఇవాళ లౌడ్ స్పీకర్లలో వినిపించే అజాన్ కర్తవ్య నిర్వహణ కూడా వేళను గుర్తు చేయడమే. చాలా మంది ముస్లిం మహిళలు ఈ అజాన్ పిలుపు వినే ఇళ్లల్లో పనులకు విరామం ఇచ్చి నమాజు చదువుకుంటూ ఉంటారు. అజాన్ వారి కోసం కూడా. నిజానికి పెద్దగా అరిచి చెప్పడం ప్రతి మతంలో ఉంది. గోపురం ఎక్కి మరీ తిరు మంత్రాన్ని అరిచి చెప్పిన రామా నుజాచార్యుల ఉదంతం మనకు ఉంది. యజ్ఞాలలో యాగాలలో బృందంగా ఋత్విక్కులు పెద్దగా మంత్రాలు చదివేది ఇక్కడ ఒక క్రతువు జరుగుతున్నది అందరూ తరలి రండి అనే పరోక్ష ఆహ్వానం పలకడానికే. చర్చి బెల్, రక్షకుడి అభయాన్ని స్థిరపరచ డానికి. ఆదివారాలు లౌడ్ స్పీకర్లలో క్రీస్తు స్తుతి చేసేది ఆ రక్షకుడి శరణు కోరండి అని చెప్పడానికే. ఈ దేశంలో పాలకులు దేవుడిని తప్ప ప్రజలకు మరేమీ మిగల్చలేదు. ఇంట్లో ఆకలిగా ఉన్నా, ఒంట్లో ఆరోగ్యం బాగ లేకపోయినా, క్షణక్షణం జీవితం సంక్షోభంగా ఉన్నా, ఇలా ఎందుకు ఉన్నాము అని ప్రశ్నించుకోక దేవుడి వైపు చూడటమే ప్రజలకు మిగిలింది. జీవితంలో మరే ఆశా మిగలని మంద భాగ్యులకు మూఢ జనులకు ‘మతం ఒక మత్తు మందు’ అని మార్క్స్ అన్నది అందుకే. గంట మోగించి, మంత్రం చదివి, అజాన్ పలికి, భజనలు చేసి, బృందగానాలతో స్తుతించి దేవుడిని రక్ష కోరకపోతే ఈ దేశంలో ప్రజలు బతకలేరు. విద్యలో, ఉపాధిలో, బతుకులో అన్ని విధాలా వెనుకబడిన ముస్లింలు అల్లాహ్‌కు మోకరిల్లకపోతే అసలు బతక లేరు. అల్లాయే వారి ధైర్యం. అల్లాయే వారి స్థయిర్యం. అనాథలుగా ఉన్న ముస్లిం బాలురను, బాల కార్మికులుగా పని చేస్తున్న ముస్లిం బాలురను, శరణార్థులుగా మిగులుతున్న ముస్లిం బాలురను, ఏ కపటం ఎరుగక అన్ని మతాల బాలుర వలే బతుకుతున్న ముస్లిం బాలురను, ఇతర మతాల స్నేహితులతో గుండె నిండుగా నవ్వే ముస్లిం బాలురను వీరనే ఏముంది కేవలం దేవుడి దయకు వదిలిపెట్టిన అన్ని మతాల అధోజీవుల అభాగ్య బాలురను సోను నిగమ్ తన కుమారుడికి చూపకుండా తనకు తానుగా చేసుకున్న శిరోముండనానికి కారణమైన ఒక ముస్లిం పెద్దను చూపడమే దృష్టి దోషం. ఈ దేశంలో దేవుడు ‘లౌడ్’గా ఉండటం తప్పు లేదు. అతడు ఎంత లౌడ్‌గా ఉంటే సగటు మనిషికి అంత ఓదార్పు. ఈ మాట నీ కొడుకు నివాన్తో చెప్తావా సోను నిగమ్? – మహమ్మద్ ఖదీర్‌బాబు 9701332807 -
గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి?
-
గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి?
తనకు గుండు కొట్టించిన వాళ్లకు రూ. 10 లక్షలు ఇస్తానని ఫత్వా జారీ చేయడంపై ప్రముఖ గాయకుడు సోను నిగమ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన ఆయన.. తాను స్వయంగా గుండు కొట్టించుకున్నారు. ఆ పది లక్షలు ఏవని సదరు మౌల్వీని ప్రశ్నించారు. సోనూ నిగమ్ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయిద్ షా అతిఫ్ అలీ ఆల్ ఖ్వాద్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జీవితాంతం మహ్మద్ రఫీని తన తండ్రిలా భావించానని, అలాగే తన గురువు పేరు కూడా ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ సాహబ్ అని సోను నిగమ్ అన్నారు. అలాంటి తన మీద ఇలా బురద చల్లడానికి, ముస్లిం వ్యతిరేకి అనడానికి ఎలా నోళ్లు వచ్చాయన్నారు. అది తన సమస్య కాదని, వాళ్ల సమస్య అని అన్నారు. కాగా అంతకుముందే ఆయన తాను గుండు కొట్టించుకుంటానని చెప్పి, అందుకు మీడియావాళ్లను కూడా పిలిచారు. దీనిపై ఆయన వరుసపెట్టి ట్వీట్లు కూడా చేశారు. Today at 2pm Aalim will come to my place, and shave my head. Keep your 10 lakhs ready Maulavi. https://t.co/5jyCmkt3pm — Sonu Nigam (@sonunigam) 19 April 2017 So this is not religious Gundagardi.. https://t.co/5jyCmkt3pm — Sonu Nigam (@sonunigam) 19 April 2017 And Press is welcome to participate at 2pm. — Sonu Nigam (@sonunigam) 19 April 2017 -
‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’
కోల్ కతా: ఆలయాలు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ పై ఫత్వా జారీ అయింది. ఆయనకు గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. సోనూ నిగమ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. ‘సోనూ నిగమ్ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా నేను 10 లక్షల రూపాయలు ఇస్తాన’ని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయిద్ షా అతిఫ్ అలీ ఆల్ ఖ్వాద్రి ప్రకటించారు. దీనిపై సోనూ నిగమ్ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయొచ్చనని ట్వీట్ చేశారు. మీడియాను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తన ట్వీట్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు నిరూపిస్తే ఎక్కడికి రమ్మని చెబితే అక్కడకు వచ్చి క్షమాపణ చెబుతానన్నారు. మసీదుల గురించే కాకుండా ఆలయాలు, గురుద్వారాలు గురించి కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్ ట్వీట్లు చేయడంతో వివాదం రేగింది. -
సోను నిగమ్‌కు నాడు గూండాయిజం గుర్తురాలేదా?
న్యూఢిల్లీ: మసీదుల్లో, మందిరాల్లో మైకులు పెట్టి ప్రార్థనలు వినిపించడం గుండాయిజమే అంటూ ప్రముఖ పాప్ గాయకుడు సోను నిగమ్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకంటే ముందే స్పందించిన ముంబై హైకోర్టు మసీదుల్లో మైకులను ఎప్పుడో నిషేధించింది. అయినా కోర్టు ఉత్తర్వులు సరిగ్గా అమలు కావడం లేదు. అది వేరే విషయం. ‘మసీదులపై నిలబడి ముల్లాలు ఎందుకు అంత గట్టిగా పిలవాలి అల్లా ఏమీ చెవిటివాడు కాదుకదా!’ అని 15వ శతాబ్దానికి చెందిన బ్రజ్ (పాశ్చాత్య హిందీ కవి) కవి కబీర్ ఇంకా ముందే స్పందించారు. కబీర్ నుంచి సోనూ నిగమ్ వరకు ఎందరో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అయితే ప్రతిరోజు మసీదుల్లో, మందిరాల్లోనే వినిపించే ప్రార్థనలే గూండాయిజమా? వినాయకుని నిమజ్జనానికి, దుర్గా పూజకు, క్రిస్మస్ పండగకు మైకుల్లో అదరగొట్టే నినాదాలు, భక్తి గీతాలు, గుండెలు ఆగిపోయే రీతిలో డప్పులు మోగించడం, ఢిల్లీలో జరిగే జాగారణ రాత్రుల్లో తెల్లార్లు మైకుల్లో భజనలు, కీర్తనలు వినిపించడం గూండాయిజం కాదా? ఢిల్లీలో జరిగే జాగారణ కార్యక్రమాల్లో కూడా సోను నిగమ్ కూడా భక్తి గీతాలు ఆలపించారు. అప్పుడు ఆయనకు గూండాయిజం గుర్తురానట్లుంది. ఆధునిక భారతదేశంలో మత విశ్వాసకులు ఉన్నారు. ఛాందసవాదులున్నారు. హేతువాదులున్నారు. దేవుడిని నమ్మని నాస్తికులు ఉన్నారు. ఇందులో ఏ వర్గం వారు కూడా మరోవర్గంపై తమ అలవాట్లను, ఆచారాలను, సిద్ధాంతాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించకూడదు. అలా చేయడమంటేనే గూండాయిజం. ఈ లెక్కన దేశంలో గోవధను నిషేధించడం కూడా గూండాయిజమే. హిందువులు గోవులను పవిత్రంగా భావిస్తారని గోమాంసం తినే ముస్లింలపై నిషేధం విధించడమంటే ఏమిటీ? ఆధునిక భారత దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మతాల్లోనూ విశ్వాసాల్లోను మార్పు రావాలి. ఏ మతమైనా సర్వమానవ కల్యాణాన్ని కోరుకున్నప్పుడు ఒక వర్గం అభిప్రాయలను మరో వర్గంపై బలవంతంగా రుద్దడం అంటే గూండాయిజం కాదా? అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గ్రంధాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మైకులు లేవు. జనాన్ని పోగేసేందుకు గట్టిగా అరచి పిలిచే శక్తిగల యువకులను ప్రవక్త స్వయంగా నియమించారు. వారు మసీదులపైకి ఎక్కి సమావేశం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని సూచించడానికి గట్టిగా పిలిచేవారు. అలా పిలిచేవారే కాలక్రమంలో ముల్లాలయ్యారు. కాలక్రమంలో మైకులు రావడంతో వారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రార్థనా సమయాలు అందరికి తెలుసు. అందరి వద్ద గడియారాలున్నాయి. ఇప్పుడు కూడా మైకులు ఉపయోగించడం అవసరమా? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఏ దేవుడు కోరుకుంటారు? ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్
స్టైలిష్ యాక్టర్‌గా టాలీవుడ్ బాలీవుడ్ సినీ అభిమానులను అలరిస్తున్న సోనూసూద్, అనుకోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తనకు సంబంధం లేని విషయంలో నెటిజన్లు తనపై హేట్ కామెంట్స్ చేస్తుండటంపై ఆశ్యర్యం అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల గాయకుడు సోనూనిగమ్ మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం లు చేసే నమాజ్ ను ఉద్దేశించి,' ఇలా రోజు ప్రజల్ని బలవంతం నిద్రలేపటం ఎంత వరకు సమజసం' అంటూ కామెంట్ చేశాడు. సోనూ నిగమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ట్విట్టర్ పేజ్ లో సోనూ అని టైప్ చేయగానే ముందుగా సోనూ సూద్ పేరు వస్తుండటంతో నెటిజన్ లు సోనూ నిగమ్ కు బదులు సోనూసూద్ ను ట్యాగ్ చేస్తూ హేట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసిన సోనూసూద్ 'ఎవరు ఎవరితో ఏం చెప్పారు. దాని గురించి ఎవరు ఎందుకు నన్ను అడుగుతున్నారు. నాసా దీని గురించి రిసెర్చ్ చేస్తోంది. నేను ఇందులోకి ఎలా వచ్చాను?' అంటూ కామెంట్ చేశాడు. God bless everyone. I'm not a Muslim and I have to be woken up by the Azaan in the morning. When will this forced religiousness end in India — Sonu Nigam (@sonunigam) 16 April 2017 And by the way Mohammed did not have electricity when he made Islam.. Why do I have to have this cacophony after Edison? — Sonu Nigam (@sonunigam) 17 April 2017 I don't believe in any temple or gurudwara using electricity To wake up people who don't follow the religion . Why then..? Honest? True? — Sonu Nigam (@sonunigam) 17 April 2017 I am still wondering WHO said WHAT n to WHOM -
ఇది మతతత్వ గూండాగిరీ
గుళ్లు, మసీదులపై సోనూ నిగమ్ వ్యాఖ్య ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గుళ్లు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. ‘గుళ్లు, మసీదులు.. ప్రజలను లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎందుకు నిద్ర లేపుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని ఆపేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. నేను ముస్లింను కాను. కానీ ప్రతి రోజూ తెల్లవారుజామునే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. దేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడూ అంతమవుతుందో..’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ‘మహ్మద్ ప్రవక్త కాలంలో కరెంట్ లేదు. ఎడిసన్ తర్వాతే ఎందుకు నాకీ గోల (లౌడ్స్పీకర్లలో అజాన్ ఇవ్వడంపై)’ అని విమర్శించారు. -
దుమ్మురేపుతోన్న సచిన్ 'క్రికెట్' సాంగ్
-
దుమ్మురేపుతోన్న సచిన్ 'క్రికెట్' సాంగ్
ముంబై: సచిన్ టెండూల్కర్... ఈ పేరు తెలియనివారు మనదేశంలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో సచిన్ ఫొటో చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. ఎప్పుడూ బ్యాట్‌తో కనిపించే సచినేంటి? ఇలా..? అంటూ ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలను రేకెత్తించారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో సచిన్ టెండూల్కర్ కలిసున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో ఈ గందరగోళం నెలకొంది. ఇంతకీ సచిన్ ఏం చేయబోతున్నాడు? అలా ఎందుకు ఫొటో దిగాడు? అని ప్రశ్నించుకోవడం కనిపించింది. చివరికి ‘100 ఎంబీ’ యాప్ కోసం గాయకుడు సోనూతో కలిసి లిటిల్ మాస్టర్ ‘క్రికెట్ వాలీ బీట్’ పాట పాడినట్లు తెలియడంతో అంతా మరింత సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి సచిన్ టెండుల్కర్ మొదటిసారి పాట పాడారు. గాయకుడు సోనునిగమ్తో కలిసి గొంతుకలిపారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... ఆరు వరల్డ్ కప్‌లలో నాతోపాటు ఎందరో ఆడారు. వారందరికీ ఈ పాట అంకితం. దేశంలోని ప్రతి అభిమానిని ఈ పాట అలరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సోనూనిగమ్‌కు పోటీగా సచిన్ పాట పాడడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సచిన్‌ను అభినందిస్తున్నారు. శుభాకాంక్షల ట్వీట్లు కురిపిస్తున్నారు. -
'పాటలు పాడుతూ సెంచరీలు బాదేశాను'
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థులకు సింహస్వప్నం లాంటివాడు. అయితే తాను మ్యాచ్లాడుతున్నప్పుడు ఓ సింగర్ పాటలు పాడుతూ జోష్ పెంచి షాట్లు ఆడేవాడినని తెలిపాడు. ప్రముఖ ప్లే బ్లాక్ సింగర్ సోనూ నిగమ్ కు పుట్టినరోజు(జూలై 30) సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు. సింగర్ పుట్టినరోజునాడు సోనూ నిగమ్ పై తనకున్న అభిమానున్ని చాటుకున్నాడు వీరేంద్రుడు. తమిళం, తెలుగు, మరాఠీ, ఒడియా భాషలలో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సోనూకు వీరూ కూడా చాలా పెద్ద అభిమాని. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ సింగర్ పాటలను హమ్ చేస్తూ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేసేవాడినని ట్వీట్ చేశాడు. 2010లో కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 'అబ్ ముజే రాత్ దిన్' పాట పాడిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ సెంచరీ (165) సాధించడం విశేషం. క్రీజులో నిలబడి పాటలు పాడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం సెహ్వాగ్ ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించాడు. Happy Bday @sonunigam ,Enjoyed singing many of ur songs while batting,"Ab mujhe Raat Din"when I scored165 vs SouthAfrica at EdenGardens,2010 — Virender Sehwag (@virendersehwag) July 30, 2016 -
బెగ్గర్‌గా మారి.. రోడ్డుపక్కన సింగర్ పాటలు!
నగర జీవితమంటేనే ఉరుకులు, పరుగులతో గజిబిజీగా సాగిపోతుంటుంది. తమ చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో ఆగి చూసి.. తెలుసుకొనే తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరి పనుల్లో వారు మునుగుతూ వేగంగా సాగిపోవడమే జీవిత పరమార్థంగా మారిపోయింది. మన పరిసరాల్లో ఓ అద్భుతం జరుగుతున్నా.. ఓ అద్భుతమైన స్వరం గొంతెత్తి పాడుతున్నా.. ఆగి విని ఆస్వాదించే ఓపిక నగర జనానికి లేకపోయింది. అంతా కాలమహిమ! ఇదే విషయం తాజాగా ఓ ప్రఖ్యాత సినీ గాయకుడి విషయంలోనూ రుజువైంది. బాలీవుడ్ మధుర గాయకుడు సోను నిగమ్ ఇటీవల బిచ్చగాడి అవతారంలో ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఓ కార్నర్లో రోడ్డుపక్కన హార్మోనియం పెట్టుకొని జీవిత సత్యాలను గానం చేస్తుండగా.. సోనును ఎవరు గుర్తించలేదు సరికదా! మొదట్లో ఎవరు ఒక రెండు సెకన్లు ఆగి ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదించే ప్రయత్నించలేదు. మెల్లమెల్లగా ఒకరిద్దరు మూగి ఆయన గాన గాంధర్వాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కొందరు సంగీతప్రియులు ఆయన మధుర గానాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. కొందరు డబ్బులు ఇచ్చారు. ఓ యువకుడు ముందుకొచ్చి 'నువ్వు ఏమైనా తిన్నావని' బెగ్గర్ వేషంలో ఉన్న సోను నిగమ్ ను అడిగాడు. సోను చేతిలో 12 రూపాయలు పెట్టి మౌనంగా వెనుదిరిగాడు. 'బీయింగ్ ఇండియన్' యుట్యూబ్ చానెల్‌తో కలిసి సోను నిగమ్ ఈ సామాజిక ప్రయోగాన్ని (సోషల్ ఎక్స్పెరిమెంట్) చేశారు. చివరివరకు తాను ఎవరిననే విషయాన్ని చెప్పకుండా ఆయన తన గానాన్ని కొనసాగించారు. దేశంలో ప్రముఖ సంగీత స్వరమైన సోను నిగమ్ గొంతును ఎవరు గుర్తుపట్టకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. -
సింగర్ అత్యుత్సాహం.. ఫ్లైట్ సిబ్బందిపై వేటు
న్యూఢిల్లీ: గత నెలలో ముంబై నుంచి జోధ్‌పూర్ కు వెళ్లే విమానంలో ప్రయాణించిన సమయంలో ఓ గాయకుడు తన మధురమైన గాత్రంతో ప్రయాణికులతో పాటు ఎయిర్ హోస్టెస్ సిబ్బందిని థ్రిల్ చేశాడు. సింగర్ సోనూ నిగమ్ పాడిన పాట ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది తెలుసుకున్న జెట్ ఎయిర్ వేస్ ఆ విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. సిస్టమ్ ను దుర్వినియోగం చేశారన్న కారణంగా సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం ఈ శిక్ష ఖరారయింది. విమానంలోని మైక్రోఫోన్ ను ప్రయాణికుల సౌకర్యార్థం అనౌన్స్ మెంట్స్ కోసం మాత్రమే వాడాలని పేర్కొంటూ.. ఇలాంటివి భవిష్యత్తులో ఎప్పుడు పునరావృతం అవ్వరాదని కూడా హెచ్చిరించింది. సింగర్ మైక్రోఫోన్ యూజ్ చేస్తుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. జర్నీలో సాధారణంగా 'సీటు బెల్టు పెట్టుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లాంటి అనౌన్స్ మెంట్లు ప్రయాణికులకు అలవాటే. టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైనపుడు విమాన సహాయకురాలు ఇలాంటి సూచనలను మైక్ ద్వారా అందించడం కామన్.. అయితే బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన మధురమైన కంఠస్వరంతో ప్రయాణికులను పలకరించాడు. 'వీర్ జారా'లోని దో పల్ రుకో పాట, 'రిఫ్యూజీ'లో మరో పాటనను హమ్ చేశాడు. సోనూ నిగమ్ ను అకస్మాత్తుగా చూసి సంబరపడిపోయిన అభిమానులు కొంతమంది అతడితో పాటు గొంతు కలిపారు. కానీ, ఈ సీన్ అంతా వీడియో తీసీ ఎవరో ఇంటర్ నెట్లో అప్ లోడ్ చేయడం.. ఎయిర్ లైన్స్ దృష్టికి రావడంతో విమాన సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది అసలైన అసహనం.. ఫ్లైట్ సిబ్బందిని సస్పెండ్ చేయడంపై సింగర్ సోనూ నిగమ్ తీవ్రంగా స్పందించాడు. ఇది అసలైన అసహనం అంటూ వ్యాఖ్యానించాడు. కేవలం తాను విమానంలో పాట పాడినంత మాత్రాన విమాన సిబ్బందిని ఇలాంటి చర్యలకు పాల్పడుతారా అని ప్రశ్నించాడు. -
ప్రయాణికులను థ్రిల్ చేసిన సోనూ
ముంబై: విమానంలో ప్రయాణించేటపుడు 'సీటు బెల్టు పెట్టుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లాంటి అనౌన్స్ మెంట్లు ప్రయాణికులకు అలవాటే. టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైనపుడు విమాన సహాయకురాలు ఇలాంటి సూచనలను మైక్ ద్వారా అందించడం కామనే.. అయితే ఓ గాయకుడు తన మధురమైన కంఠస్వరంతో ప్రయాణికులను పలకరిస్తే ఎలా ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన స్వీట్ అండ్ మెలోడీ వాయస్ తో సరిగ్గా ఇలాగే చేశాడు. విమానంలోని మైక్రోఫోన్ అందుకుని తాను ఆలపించిన హిట్ సాంగ్స్ ను పాడి ప్రయాణికులను థ్రిల్ చేశాడు. 'వీర్ జారా'లోని దో పల్ రుకో పాటను హమ్ చేశాడు. సోనూ నిగమ్ ను అకస్మాత్తుగా చూసి సంబరపడిపోయిన అభిమానులు కొంతమంది అతడితో పాటు గొంతు కలిపారు. దీంతో మరింత థ్రిల్ అయ్యాడట సోనూ. విమానంలో సోనూ నిగమ్ చేసిన ఈ వెరైటీ కన్సర్ట్ ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
ప్రయాణికులను థ్రిల్ చేసిన సోనూ నిగమ్
-
'ఆ ఒక్కరు తప్ప.. ఎవరికైనా..'
న్యూఢిల్లీ: భారత దేశంలో తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఎవరికైనా ఉందని అయితే, ఒక్క సెలబ్రిటీకి మాత్రం లేదని ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ భిన్నంగా స్పందించారు. దేశంలో అసహన పరిస్థితులు, భావ వ్యక్తీకరణపై సోనూ శుక్రవారం తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నాడు. 'ఒక్క సెలబ్రిటీ తప్ప ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయాన్ని కలిగిఉండే హక్కు ఉంది. అయితే, ఇది నా అభిప్రాయం మాత్రం కాదు. ఎందుకంటే నేను ఇలాంటివాటికి విరుద్ధమైనవాడిని.. అస్సలు మద్ధతివ్వను' అని ఆయన చెప్పారు. భారత్‌లో అసహన పరిస్థితులు పెరిగాయని వ్యాఖ్యలు చేసి పలు విమర్శల పాలై ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్న సమయంలో తాజాగా సోనూ తన అభిప్రాయాన్ని ప్రకటించారు. -
నా సక్సెస్ కు తండ్రి మాటలే కారణం!
ముంబై: మన దైనందిన జీవితం ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో నిండి వుంటుంది. మనం ఏ పని చేయాలన్నా మూహూర్త బలం కన్నా సంకల్ప బలం గొప్పదంటంటారు. అయితే మన సంకల్ప బలం నెరవేరాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాలి. ప్రతీ మనిషి లక్ష్యం వెనుక స్థానిక పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా తన కెరీయర్ ఉన్నత స్థితికి వెళ్లడానికి ఇంట్లోని పరిస్థితులు అనుకూలించడమేనని అంటున్నాడు బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్. మన ఏ పని చేసినా ఆలోచన, ప్రణాళిక, కార్యాచరణ ఉండాలని తల్లి తండ్రులు చెప్పిన మాటలే తనను ఈరోజు ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందడానికి దోహద పడిందన్నాడు.ఎక్కువ కష్టించే తత్వం ఉండాలని ప్రత్యేకంగా తండ్రి చెప్పిన మాటలే తన జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయని సోనూ నిగమ్ స్పష్టం చేశాడు. నాకు 17 -18 సంవత్సరాలప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. ఆ సయమంలో తండ్రి చెప్పిన సలహా మాత్రం గొప్పగా అనిపించింది. తొలుత జీవితాన్ని ఎంజాయ్ చేస్తే.. తరువాత కష్టపడతావు. అదే జీవితంలో తొలుత కష్టపడితే తరువాత సుఖ పడతావు'అని తండ్రి చెప్పిన మాటలను సోనూ గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలే తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నాడు. తన తండ్రి మాటలను విన్న మరుక్షణం నుంచే కష్టించే తత్వాన్ని అలవాటు చేసుకున్నానని తెలిపాడు. -
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్
ముంబై: తనది అపర కాళీకాదేవి అవతారమంటూ వివాదాస్పద ఆహార్యం, ప్రవర్తనతో సంచలనం సృష్టిస్తోన్న రాధే మాకు మద్దతుగా బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్సైట్లో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని సృష్టిస్తున్నాయి. 'కురచ దుస్తులు ధరించారంటూ రాధేమాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారుగానీ మరి అదే కాళికాదేవి అంతకన్న తక్కువ దుస్తుల్లో కనిపిస్తారు గదా! మరి ఆ సంగేతేమిటి ? అసలు బట్టలంటూ ధరించకుండా నగ్నంగా సంచరించే, అసభ్యంగా నృత్యం చేసే సాధు పుంగవుల సంగతేమిటీ?' అంటూ సోను నిగమ్ ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేయడం ద్వారా కొత్త వివాదాన్ని రాజేశారు. 'ఆడవాళ్లకో న్యాయం, మగవాళ్లకో న్యాయమా?' అంటూ సోనూ నిగమ్ మరో ట్వీట్లో ప్రశ్నించారు. కుంభమేళా లాంటి కార్యక్రమాల్లో కొన్ని తెగల సాధువులు నగ్నంగా సంచరించినా, జుగుస్పాకరంగా నృత్యం చేసినా పట్టించుకోరని, వారిపై అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారని, మరి ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా? అంటూ కూడా ఆయన విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. భగవత్ స్వరూపిణీగా, అపర కాళీమాతాగా ప్రచారం పొందుతున్న రాధే మాపై కేసులు వేయడం న్యాయం కాదని, ఆమెను అలా చిత్రీకరిస్తున్నవారిపై, ఆమెను అలా కొలుస్తున్న భక్తజనంపై ఈ సమాజం, ఈ వ్యవస్థ కేసులు వేయాలని సోనూ నిగమ్ మరో ట్వీట్లో సూచించారు. కురచ దుస్తులు ధరిస్తూ, భక్తులను కౌగిలింతలు, ముద్దులతో ముంచెత్తుతూ దేవతలను అవమానపరుస్తున్నారంటూ హిందూ సంస్థలు గొడవ చేస్తున్న విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ముంబైకి చెందిన న్యాయవాది ఫాల్గుని బ్రహ్మభట్ కేసు కూడా వేశారు. మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్, కురచ దుస్తుల్లో వున్న రాధే మా ప్రైవేట్ ఫొటోలను ఆగస్టు ఐదవ తేదీన మీడియాకు విడుదల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అవి పూర్తిగా తన ప్రైవేట్ ఫొటోలని, ఇంట్లో ఎవరైనా అలాంటి దుస్తులు ధరించవచ్చని, దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆమె మీడియా ముందు సమర్థించుకోవడం విశేషం. Just my 2 pence. Kaali Maa is depicted in lesser clothes than Radhey Maa. Interesting that this country wants to sue a woman for her clothes — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Men Saadhus can walk naked. Dance embarrassingly, but it takes a rape charge to put them behind bars. So much for Gender equality? :) — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Wanna sue, sue the followers... Sue YOURSELVES.. For making them God men and women. Setting different rules for men and women, not fair. — Sonu Nigam (@sonunigam) August 16, 2015 -
జైలులో ‘తీహార్ ఐడల్’
న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ తరహాలో తీహార్ జైలు అధికారులు ఖైదీల కోసం ‘తీహార్ ఐడల్’ రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ మాట్లాడుతూ ఖైదీల ప్రదర్శన చూసిన తాను కంటి నుంచి నీరు కారకుండా తీవ్రంగా ప్రయత్నించానని చెప్పారు. వారి గానం ఆలకించిన తాను చలించి పోయానన్నారు. తన గాన మాధుర్యంతో అటు ఖైదీలను, ఇటు అధికారులను మైమరిపించిన సోను నిగమ్ ఖైదీలు కూడా అద్భుతంగా పాడారని ప్రశంసించారు. పాడాలన్న వారి తపన, అంకిత భావం తన కళ్లను చెమర్చకుండా ఆపలేకపోయిందని అన్నారు. ఓ జైలులో ప్రదర్శన ఇవ్వడం తనకు ఇదే మొదటిసారి అని, ఇక్కడ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటానని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇకపై తీహార్ ఐడల్ 3, 4, ఐదుతో పాటు భవిష్యత్తులో కూడా అన్ని పాటల పోటీలకు హాజరవుతానని సోను జైలు అధికారులకు హామీ ఇచ్చారు. ప్రముఖ గాయకులు రాజా హసన్, నందినీ దేవ్, నటి ఆకృతి భారతి, సోను నిగమ్ తండ్రి ఆగమ్ నిగమ్ కూడా ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. వచ్చే మే నెల వరకూ జైలు ఆవరణలోనే ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఢిల్లీ జైళ్ల డీఐజీ ముఖేశ్ ప్రసాద్, ఒకటో నంబరు జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ ఇతర జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తన మద్దతు తెలిపిన సోను నిగమ్ ముందుగా ప్రభుత్వం తన విధి నిర్వహించాలని, ఆ తరువాత పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
ఈ పాటకు ట్యూన్ తెలుసా? పల్లవి : అతడు: రావె నా చెలియా రావె నా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంతా గోల చెయ్యి ఆమె: మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం అ: ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి ॥॥ చరణం : 1 అ: జీన్స్ పాంటు వేసుకో లిప్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరుపే డై వేసి మార్చుకో...ఓ... యే... ఆ: ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగలమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డని చెప్పేయి ॥ చరణం : 2 ఆ: ఓ... కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు అ: ఎంటీవీ ఛానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్యి బామ్మా డిస్నీలాండులో కళ్లాపి జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మధ్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా ॥ చిత్రం : జీన్స్ (1998) రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : సోను నిగమ్, హరిణి -
సోనూతో గొంతు కలిపిన గడ్కారీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన వాతావరణంలో కాకలు తీరిన నేతలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయం ఇది. బుధవారం సమావేశానికి హాజరైన బీజేపీ నేత నితిన్ గడ్కారీ ప్రసిద్ధ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్‌తో గొంతు కలి పాడు. ఇండియా టుడే గ్రూప్ మీడియా నిర్వహించి న ఎజెండా ఆజ్‌తక్ సమావేశంలో గడ్కారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలుత ‘సోనూ కీ సర్గమ్’ పేరుతో సోనూ నిగమ్ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో రెండవ సెషన్ లో గడ్కారీ మాట్లాడాల్సి ఉంది. సోనూ కచేరీ వినడానికి సిద్ధమైన గడ్కారీ సోనూనిగమ్ తన అభిమాన గాయకుల్లో ఒకడని పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ‘సందేశే అతే హై’ పాటను కోరాడు. సోనూ మాట్లాడుతూ‘బార్డర్‌లోని ఈ పాట నా వృత్తి జీవితంలో ముఖ్యమైనది. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఈ పాట నాకు ఊతమైంది’ అని వివరించి పాట ఆలపించాడు. తర్వాత గడ్కారీ సోనూతో కలిసి ‘తుజ్సే నారాజ్ నహీ జిందగీ... హైరాన్ హూ మై’ అనే పాటను ఆల పించాడు. 1983లో విడుదలైన మౌసమ్ చిత్రంలోని ఈ గీతం ఎన్నికల నేపథ్యంలో గడ్కారీ మానసిక స్థితికి అద్దం పట్టినట్లుగా అనిపించింది. తర్వాత సంగీత పరిశ్రమలో చోట్టు చేసుకుంటున్న కొత్త వరవడులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రసిద్ధ గజల్ విధ్వాంసులు తలత్ అజీజ్, పంకజ్ ఉదాస్లు ప్రేక్షకుల్లో కూర్చొని సోనూ నిగమ్ మీద ప్రశంసలు కురిపించారు. -
సోనూనిగంకు బెదిరింపు కాల్
సాక్షి,ముంబై: గాయకుడు సోనూనిగంకు మాఫియా ముఠా నాయకుడు దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. వేరే సంస్థతోకుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని, తమ సంస్థతో కుదుర్చుకోవాలంటూ బెదిరించారని నిగం చెప్పారు. ఇలా చేయని పక్షంలో ఓ మహిళతో అక్రమ సంబంధం అంటగట్టి పరువు తీస్తామంటూ బెదిరించినట్లు వివరించారు. ఈ కాల్ పాకిస్థాన్నుంచి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కాగా నిగం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడు. గత నెలలోనూ నిగంకు అనేకసార్లు ఇలాగే బెదిరింపు ఫోన్కాల్లొచ్చాయి. అయితే వేటికీ స్పందించకపోవడంతో ఎస్ఎంఎస్ ద్వారా బెదిరించారు. గతంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, బోనీకపూర్‌లకు కూడా ఇలాగే ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.