సోనూ నిగమ్
న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పొచ్చు. సుశాంత్ మరణం చిత్రసీమలోని చీకటి కోణాన్ని ప్రజలకు మరోసారి తెలియజేసింది. బాలీవుడ్ ప్రముఖుల నెపోటిజం(బంధుప్రీతి) తాలూకు కోరల్లో చిక్కుకుని తామూ తీవ్రంగా కష్టాలు పడ్డామంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దబాంగ్ దర్శకుడు సల్మాన్, ఆయన కుటుంబంపై బాహాటంగానే విమర్శలు చేశారు. తాజాగా ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ చిత్ర పరిశ్రమలోని మరో కోణాన్ని ఎత్తిచూపారు.
శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన స్పందిస్తూ.. సినిమా కంటే సంగీత పరిశ్రమలో ఇంకా పెద్ద మాఫియా ఉందని అన్నారు. అధికారంలో ఉన్న ప్రముఖుల కారణంగా కొత్త వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సంగీత పరిశ్రమలోని ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తిపై కరుణ కలిగి ఉండాలన్నారు. సుశాంత్ లాగానే రేప్పొద్దున చిత్ర పరిశ్రమలోని ఓ గాయకుడో, పాటల రచయితో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ( సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?)
Comments
Please login to add a commentAdd a comment