
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలోని బంధుప్రీతి, మాఫియా వంటి అంశాల గురించి సోషల్ మీడియలో తెగ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోషల్‌మీడియాలో ‘క్విట్ బాలీవుడ్’ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా ‘చాలు.. నేను బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన ప్రతి దాని నుంచి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘బాలీవుడ్‌లో ఉండను.. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక తన ట్విట్టర్ అకౌంట్ నేమ్ కూడా అనుభవ్ సిన్హా(నాట్ బాలీవుడ్) అని మార్చేశారు. ఇతర ఫిల్మ్‌మేకర్లు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా అనుభవ్ సిన్హా కంటే ముందు ‘బాలీవుడ్ చోడో’ అంటూ ట్వీట్ చేశారు. (ట్యూబ్ భళ్లుమంది)
Bollywood was.
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 22, 2020
హన్సల్ మెహతా.. ‘చోడో బాలీవుడ్.. ఇది ఎప్పటికి ప్రథమ స్థానంలో ఉండదు’ అని ట్వీట్ చేశారు. అంతేకాక ఈ ముగ్గురు తమకు ఆదర్శంగా నిలిచిన పలువురు ప్రసిద్ధ డైరెక్టర్ల పేర్లను ట్వీట్ చేశారు. రాజ్ కపూర్, గురు దత్, రిత్విక్ ఘటక్, బిమల్ రాయ్, మృణాల్ సేన్, హృషికేశ్ ముఖర్జీ, కె ఆసిఫ్, విజయ్ ఆనంద్ , జావేద్ అక్తర్, తపన్ సిన్హా, గుల్జార్, శేఖర్ కపూర్, కేతన్ మెహతా వంటి వారితో పాటు వర్థమాన దర్శకులు అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వాని పేర్లను తమ ట్వీట్‌లో ఎంబెడ్ చేశారు. వీరంతా కేవలం భారతీయ సినిమాలు తీశారని ప్రశంసించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని తాము పరిశ్రమలోకి వచ్చామని తెలిపారు. ఇప్పుడు కూడా భారతీయ సినిమాల వైపు మళ్లాలని కోరుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment