Anubhav Sinha
-
ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనేక్ మూవీ ట్రైలర్‌ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఒక మిషన్‌ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ 'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్‌గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్‌గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆంథాలజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాప్సీ..
హిందీలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తారల జాబితాలో తాప్సీ కచ్చితంగా ఉంటారు. ఇప్పటికే ఈ బ్యూటీ డైరీ దాదాపు నాలుగైదు సినిమాల కాల్షీట్స్తో నిండిపోయింది. ఈ కాల్షీట్స్ను కాస్త సర్దుబాటు చేసి ఓ ఆంథాలజీకి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాప్సీతో ‘ముల్క్’, ‘థప్పడ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హా ఈ ఆంథాలజీకి ఓ నిర్మాత. హిందీలో ‘ధారావి, చమేలి, సీరియన్ మ్యాన్’ వంటి సినిమాలు తెరకెక్కించిన సుధీర్ మిశ్రా దర్శకుడు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ వంటి అంశాల నేపథ్యంలో ఈ ఆంథాలజీ రూపుదిద్దుకోనుంది. -
‘సుశాంత్ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుభవ్ సిన్హా, రైటర్ అపూర్వ అస్రానీ కార్తీక్ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. And by the way... when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet. — Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021 అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అనుభవ్ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. I respect Anubhav Sinha for calling out the very obvious campaign against #KartikAaryan. A year ago I had blogged about the bullying Sushant Singh Rajput went through. And though I remain blacklisted for it by many journalists, I feel like something IS changing for the better.✊ https://t.co/8DbWRtLGa7 — Apurva (@Apurvasrani) June 4, 2021 కార్తీక్ ఆర్యన్ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్ స్పందించింది. కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. చదవండి: సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు -
రియా బెయిల్: బాలీవుడ్ నటుల స్పందన
ముంబై : నటుడు సుశాంత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రక్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల పాటు ఉన్న రియాకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ని సమర్పించాల్సిందిగా చెప్పింది. అయితే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు.. అతడికి అక్టోబర్ 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. చదవండి: రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్! కాగా రియాకు బెయిల్ లభించడంపై బాలీవుడ్‌లోని పలువురు నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ్ సిన్హా, సోని రజ్ధాన్, హర్హాన్ అక్తర్ వంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘చివరికి రియాకు బెయిల్ లభించింది’ అని అనుభవ్ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్‌ను సోని రీట్వీట్ చేశారు. అలాగే బెయిల్ అందించినందుకు బాంబే హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రియా జైల్లో ఉన్న సమయంలో ఆమెకు మద్దతు తెలుపుతూ తనను విడుదల చేయాలని స్వరా భాస్కర్, రచయిత కనికా ధిల్లాన్ సహా పలువురు నటులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రియా బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్ -
'థప్పడ్' సినిమాకు అరుదైన గౌరవం
ముంబై: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన హిట్ సినిమా ‘థప్పడ్’కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో జరిగే 14వ ప్రతిష్టాత్మక ఆసియా ఫిల్మ్ అవార్డ్‌కు గాను అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన థప్ఫడ్ రెండు ఆవార్డులకు ఎంపికైంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో థప్పడ్ నామినేట్ బరిలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనుభవ్ సిన్హా సోమవారం ట్విట్టర్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తి చేశారు. దీంతో అనుభావ్ సిన్హాకు బాలీవుడ్ నటీనటులు, దర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిర్మాత రీమా కాగ్టీ, దర్శకుడు అలకృత శ్రీవాస్తవ ట్వీట్ చేస్తూ అనుభవ్, తాప్పీలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి) అదే విధంగా ఈ ఆవార్డుకు థప్పుడ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘కేయ్ ఇషికవా, సో లాంగ్, మై సన్ బై వాంగ్ జియాషువాయ్, ఎ సన్ బై చుంగ్ మోంగ్-హాంగ్, మొహమ్మద్ రసౌలోఫ్తో పాటు బాంగ్ జూన్ హోలు, ఆస్కార్ గెలిచుకున్న పరాన్నజీవి’ సినిమాలు కూడా ఉత్తమ చిత్రాలకు ఈ ఆవార్డుకు నామినేట్ అయ్యాయి. అదే విధంగా ఉత్తమ ఎడిటింగ్ గాను ‘‘జాంగ్ యేబో ఫర్ బెటర్ డేస్, యంగ్ జిన్ మో ఫర్ ప్యారడైస్, లీ చట్చేటీకూల్ ఫర్ సో లాంగ్, మై సన్’’లతో పాటు పలు సినిమాలు కూడా పోటి పడుతున్నాయి. అయితే భర్త విక్రమ్ (పావైల్ గులాటి)తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న అమృత (తాప్సీ) వైవాహిక బంధాన్ని ఒక్క చెంప దెబ్బ ఎలా ప్రభావితం చేసిందో దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాలో తాప్సి అమృతగా ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. (చదవండి: వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!) -
కరోనా కథలు
కరోనా అందర్నీ కుదిపేసింది. ఇలాంటి అనూహ్య ముప్పుని ఎవ్వరూ ఊహించలేదు. కరోనా మీద, కరోనా సమయంలో ఏర్పడ్డ సంక్షోభం మీద సినిమాలు చేస్తున్నట్టు ఆల్రెడీ పలువురు దర్శకులు ప్రకటించారు. తాజాగా కరోనా మీద మరో సినిమా ప్రకటన వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా మరికొందరు దర్శకులతో కలసి ఓ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ (పలు కథల నేపథ్యంలో సినిమా) చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలూ కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ కథల్లో ప్రముఖ నటీనటులే కనిపిస్తారని సమాచారం. -
బాలీవుడ్‌కు గుడ్‌బై
‘‘ఇక చాలు, దుకాణం సర్దేస్తున్నాను, బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నాను’’ అని ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా. షారుక్ ఖాన్‌తో ‘రా–వన్’, రిషీ కపూర్, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ముల్క్’, ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘ఆర్టికల్ 15’, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన తాప్సీ ముఖ్యపాత్ర పోషించిన ‘తప్పడ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అనుభవ్. 2001లో కెరీర్ ప్రారంభించిన ఆయన ‘గులాబ్ గ్యాంగ్’, ‘జిద్’ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘‘ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది. ఇకనుంచి ఓ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నా’’ అన్నారు అనుభవ్. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనుభవ్ హఠాత్తుగా రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమై ఉంటుంది? అనే చర్చ హిందీ పరిశ్రమలో జరుగుతోంది. అయితే ‘‘బాలీవుడ్‌కి రాజీనామా చేస్తున్నాను కానీ సినిమాలు చేస్తాను’’ అని పేర్కొన్నారు అనుభవ్. -
‘ఇక చాలు.. రాజీనామా చేస్తున్నాను’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలోని బంధుప్రీతి, మాఫియా వంటి అంశాల గురించి సోషల్ మీడియలో తెగ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోషల్‌మీడియాలో ‘క్విట్ బాలీవుడ్’ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా ‘చాలు.. నేను బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన ప్రతి దాని నుంచి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘బాలీవుడ్లో ఉండను.. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక తన ట్విట్టర్ అకౌంట్ నేమ్ కూడా అనుభవ్ సిన్హా(నాట్ బాలీవుడ్) అని మార్చేశారు. ఇతర ఫిల్మ్మేకర్లు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా అనుభవ్ సిన్హా కంటే ముందు ‘బాలీవుడ్ చోడో’ అంటూ ట్వీట్ చేశారు. (ట్యూబ్ భళ్లుమంది) Bollywood was. — Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 22, 2020 హన్సల్ మెహతా.. ‘చోడో బాలీవుడ్.. ఇది ఎప్పటికి ప్రథమ స్థానంలో ఉండదు’ అని ట్వీట్ చేశారు. అంతేకాక ఈ ముగ్గురు తమకు ఆదర్శంగా నిలిచిన పలువురు ప్రసిద్ధ డైరెక్టర్ల పేర్లను ట్వీట్ చేశారు. రాజ్ కపూర్, గురు దత్, రిత్విక్ ఘటక్, బిమల్ రాయ్, మృణాల్ సేన్, హృషికేశ్ ముఖర్జీ, కె ఆసిఫ్, విజయ్ ఆనంద్ , జావేద్ అక్తర్, తపన్ సిన్హా, గుల్జార్, శేఖర్ కపూర్, కేతన్ మెహతా వంటి వారితో పాటు వర్థమాన దర్శకులు అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వాని పేర్లను తమ ట్వీట్లో ఎంబెడ్ చేశారు. వీరంతా కేవలం భారతీయ సినిమాలు తీశారని ప్రశంసించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని తాము పరిశ్రమలోకి వచ్చామని తెలిపారు. ఇప్పుడు కూడా భారతీయ సినిమాల వైపు మళ్లాలని కోరుకుంటున్నామన్నారు. -
‘చెంప దెబ్బతో కాదు.. విజయంతో సమాధానం’
ముంబై: నటిగా, బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక చొప్రా తన కెరీర్లో మరో మైలు రాయికి చేరుకున్నారు. అమెజాన్ మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్‌పై ఆమె సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. అది తెలిసి ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా గతంలో ప్రియాంక గురించి ఓ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్‌ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. (అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్) Thappad nahi.. kaam se maaro.. 💪🏽 lol. Thank you @anubhavsinha for the support.. https://t.co/IkfzZcKCko — PRIYANKA (@priyankachopra) July 1, 2020 అనుభవ్ ట్వీట్ చేస్తూ ‘అవును ఓ మ్యాగజైన్లో పేర్కొన్నట్లుగా కెరీర్లో మిమ్మల్ని ఎవరూ తాకలేరు ప్రియాంక’ అంటూ ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. అది చూసిన ప్రియాంక ‘చెంప దెబ్బతో కాదు.. మీ సక్సెస్‌తో సమాధానం ఇవ్వండి. నాకు సపోర్టు చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అంతేగాక ప్రియాంక అభిమానులు ఆమెపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తన గురించి తెలియని ఎన్నో విషయాలను తన ‘అన్ఫినిష్డ్ పుస్తకం’లో పంచుకోవాలని కోరారు. -
కరోనా: వాలంటీర్ల కోసం చూస్తున్న దర్శకుడు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశంలోని షాపింగ్ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నింటినీ మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనాను అరికట్టేందుకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఈ మహమ్మారి ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా రోజువారి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. కాగా ఈ వైరస్ ప్రభావంతో అతలాకుతలమైన వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా ముందుకు వచ్చారు. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!) 1/2 Hi friends. I am looking for some volunteers within 3-4 Km of Infiniti Andheri. People who will pick up grains from Near Infiniti and take them to 3-4 different areas for distribution to the needy. — Anubhav Sinha (@anubhavsinha) March 22, 2020 ముంబైలోని కూలీలందరికి రేషన్ సరఫరా చేసుకుందుకు వాలంటీర్లు కావాలంటూ ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘హాయ్ ఫ్రెండ్స్.. నేను ముంబై పరిసరాల్లోని రోజువారి కూలీలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాను. ఇందుకోసం 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఉన్న వివిధ ప్రాంతాల వారందరికి నిత్యవసర వస్తువులు సరఫరా చేసుందుకు వాలంటీర్లు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని కోరారు. (కరోనా ఎఫెక్ట్ : ప్యాకేజ్ ప్రకటించనున్న కేంద్రం) వాలంటీర్లు ఇవ్వాల్సిన సమాచారం.. వారంలో రెండు సార్లు ఈ ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నందున వీటి అవసరం ఎవరెవరికి, ఎంతమందికి ఉందన్న విషయంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కడి నుంచి మీరు తీసుకు వెళ్లాలనుకుంటున్నారు, ఎవరికి ఇవి అవసరం అనే విషయాలపై సమాచారం ఇవ్వాలని.. దీని కోసం తన ఫేస్బుక్ పేజీ ద్వారా సంప్రదించాలని ట్విటర్లో సూచించారు. కాగా తాప్సీ పొన్ను లీడ్రోల్లో ఆయన రూపొందించిన ‘థప్పడ్’ సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
నేను చీకటిని జయించాను: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల నటించిన ‘థప్పడ్’ సినిమా విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని.. అమృత పాత్రలో ఒదిగి అందరిని ఆకర్షించారంటూ తాప్సీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇక తాజాగా తాప్సీ చీరలో ఉన్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోకి ‘నేను ధైర్యంగా ఉన్నాను.. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిరాడంబరంగా ఉన్నాను.. ఎందుకంటే.. నేను నిరాశను ఎదుర్కొన్నాను. బలవంతురాలిని.. ఎందుకంటే పరిస్థితులు నన్ను అలా మార్చాయి. కృతజ్ఞతతో ఉన్నాను ఎందుకంటే నష్టాన్ని తెలుసుకున్నాను. ఇక నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అంటూ స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.(భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి) View this post on Instagram “I am Brave because I've faced darkness, Humble because I've felt despair, Strong because I've had to be, Grateful because I've known loss, and HAPPY because I've learned what matters.” A post shared by Taapsee Pannu (@taapsee) on Mar 10, 2020 at 9:59pm PDT కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు! ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 4 లక్షల లైక్స్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక తాప్సీ పోస్టు చూసిన నెటిజన్లు బాలీవుడ్ నటినటులు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. తాప్సీ తాజా చిత్రం ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా..‘నువ్వు స్మార్ట్ అయ్యావు తాప్సీ’ అంటూ కామెంటు చేశాడు. ఆయనతో పాటు తాప్సీ ‘సాంద్ కీ ఆంఖ్’ సహ నటి భూమి ఫెడ్నేకర్.. ‘సుందరి’ అంటూ హర్ట్ ఎమోజీనీ జత చేశారు. ఇక నటుడు విక్రాంత్ మెస్సీ కూడా ‘మేరీ రాణీ’ అంటూ కామెంటు చేశాడు. -
బూతులు తిట్టి సారీ చెప్పిన దర్శకుడు
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థప్పడ్’ (చెంపదెబ్బ అని అర్థం). ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తొలివారం రూ.23 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లపై ఓ వెబ్సైట్ కాస్త వ్యంగ్యంగా ‘థప్పడ్కు ప్రేక్షకులు చెంప పగిలేలా సమాధానమిచ్చారు’ అని శీర్షిక పెట్టింది. సాధారణంగా సినిమాల మీద వచ్చే ఇలాంటి విమర్శలను దర్శకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హాకు మాత్రం ఆ టైటిల్ చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందీ.. వార్త రాసిన వాళ్లను ఎడాపెడా తిట్టేశాడు. చెప్పడానికి కూడా వీల్లేని బూతులు అనేశాడు. ‘వీళ్లు సినిమా వ్యాపారం నుంచి వ్యభిచారం బిజినెస్‌లోకి మారిపోయారు. నా డబ్బులు.. నా సినిమా.. నా లాభం. మధ్యలో మీకేంటి..? నేనేమైనా మీకు షేర్లు అమ్మానా? పోనీ మీరేమైనా షేర్లు నాకు అమ్మారా? ముందు వెళ్లి సినిమా చూడండి. వీలైతే ఇష్టపడండి, లేకపోతే ద్వేషించండి. అది మీ ఇష్టం’ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు. (ఆ విషయం గురించి దయచేసి అడగకండి: తాప్సీ) ‘సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాతే అసలైన కలెక్షన్ల వివరాలు తెలుస్తాయి. దీని కన్నా ముందే వెల్లడించే కలెక్షన్లు కేవలం ఊహాగానాలు, ఇంకా ఇష్టమొచ్చినట్లుగా రాసుకొన్నవి మాత్రమే’నని పేర్కొన్నాడు. అయితే సిన్హ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీ తిట్లలో మహిళలను కించపరుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని మొట్టికాయలు వేశారు. దీంతో అతను తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. థప్పడ్ చిత్రాన్ని కించపరచడంతో కోపం పట్టలేకపోయానని.. ఈ క్రమంలో తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని అనుభవ్ పేర్కొన్నాడు. (తాప్సీ ‘థప్పడ్’ మూవీ రివ్యూ) -
చెంప చెళ్లుమనేట్టు చెప్పాలి
కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలను బలంగా చెప్పాలి. చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి కథనే చెప్పబోతున్నాం అంటున్నారు తాప్సీ. ఆమె ముఖ్య పాత్రలో అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తప్పడ్’. తప్పడ్ అంటే చెంపదెబ్బ అని అర్థం. ఈ సినిమాలో తాప్సీ లుక్‌ను విడుదల చేశారు. ‘‘అనుభవ్సార్తో పని చేస్తే అర్టిస్ట్‌గా మనల్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే కథ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పకుండా చెప్పవలసిన కథ. ‘తప్పడ్’ ఈ ఏడాది ‘పింక్’ (2016) లాంటి సినిమా అవుతుంది’’ అన్నారు తాప్సీ. -
‘తాప్సీకి నటించడం రాదు’
వరుస విజయాలతో బాలీవుడ్లో దూసుకుపోతున్నారు హీరోయిన్ తాప్సీ. తాజాగా తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ త్వరలోనే అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని పేర్కొంటూ దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు తాప్సీ. Cheers to the new beginning with some good food! This one is a subject way too close to my heart. I’ve been wanting to do this since years. It becomes exciting when it happens with the ‘Man of The Moment’ @anubhavsinha 8th March 2020 will surely be the day to watch out for ! pic.twitter.com/2ynuW6jmGF — taapsee pannu (@taapsee) July 7, 2019 దీనిపై విశాల్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘అనుభవ్ సర్, మీ సినిమాలో తాప్సీకి బదులు మరో నటిని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సీకి నటించడం రాదు’ అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన తాప్సీ అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘సారీ.. ఇప్పుడేం చేయలేవ్. ఎందుకంటే సినిమాకు సంతకం చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా నేను అది జరగనివ్వను. ఒక పనిచెయ్. నేను మరో సినిమాకు సంతకం చేసేలోపు ఆ చిత్రంలో నన్ను ఎవ్వరూ తీసుకోకుండా ఆపి చూడు’ అని ఛాలెంజ్ విసిరారు. బాగా బుద్ది చెప్పారంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. Sorry yaar, ab toh sab kuch sign n seal ho chuka hai. Ab toh sir ko main hi nahi nikaalne dungi. But ek kaam karo, agli wali ke liye rok lo kyunki shayad woh bhi main lock karva lu jald hi. #TryAgain https://t.co/vK7avyN8XR — taapsee pannu (@taapsee) July 7, 2019 -
ముస్లింల దేశభక్తికి ఇన్ని పరీక్షలా?
ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశం ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని తాజా హిందీ సినిమా ‘ముల్క్’ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే– ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు ముస్లిం. ఈ లెక్కన 2021 జనాభా లెక్కల్లో వారి సంఖ్య 20 కోట్లు దాటిపోతుంది. భారతదేశపు అత్యంత విజయవంతమైన సృజనాత్మక పరిశ్రమ సినిమారంగంలో ముస్లింల శాతం జనాభాలో వారి నిష్పత్తి కన్నా ఎక్కువే. మన చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడుగురు ఉత్తమ నటులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్లో ముస్లింలు ఒకరి కంటే ఎక్కువ మందే ఉన్నారు. భారత సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హిందీ సినిమాల్లో ముస్లింల కథాంశంతో నిర్మించే చిత్రాలు బాగా తక్కువ. చాలా అరుదుగా ముస్లింలు ప్రధాన పాత్రధారులుగా తీసే సినిమాల్లో వారిని చాలా మంచి మనుషులుగా లేదా నిజంగా చెడ్డవారిగా చూపిస్తారు. అందుకే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన తాజా హిందీ చిత్రం ‘ముల్క్’ పైన చెప్పిన ముస్లిం సినిమాలకు భిన్నంగా ఉంది. హిందీ సినిమాల్లో ముస్లిం పాత్రలు హిందీ సినిమాల్లో ముస్లింలను చిత్రించిన తీరును బట్టి ఈ తరహా చిత్రాలను మూడు దశల్లో వచ్చినవిగా అంచనా వేయవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1960ల వరకూ మొఘల్ చరిత్రకు సంబంధించిన ప్రముఖుల కథల ఆధారంగా వరకూ తీసిన సినిమాలే ఎక్కువ. తాజ్‌మహల్, ముఘలే ఆజం, రజియా సుల్తానా వంటివి ఈ తరహా సినిమాలు. అదే కాలంలో మేరే మెహబూబ్ నుంచి పాకీజా వరకూ నిర్మించిన ‘ముస్లిం సాంఘిక’ సినిమాల్లో ప్రేమ, కవిత్వం, భూస్వామ్యవర్గం ఆడంబరాలు వంటి అంశాలతో నిండి ఉన్నాయి. 1970ల్లో ముస్లింలను ‘ఆగ్రహంతో ఉన్న యువకుల’ లక్షణాలతో చూపిస్తూ హిందీ సినిమాలు వచ్చాయి. ఈ రకం సినిమాల్లో విశాల హృదయంతో, నిజాయితీతో ధైర్యసాహసాలు ప్రదర్శించే ముస్లిం పాత్రధారులు చివర్లో దేశం కోసం, తమ హిందూ స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడం చూశాం. 1973లో ప్రకాశ్‌మెహ్రా తీసిన ‘జంజీర్’ షేర్‌ఖాన్ పాత్రలో ప్రాణ్ ఇందులో తన మిత్రుడు, హీరో అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ‘యారీ హై ఈమాన్ మేరా, యార్ మేరా జిందగీ’ అంటూ పాడిన పాట పై అంశానికి అద్దం పడుతోంది. 1980ల చివరి వరకూ వచ్చిన హిందీ చిత్రాల్లోని ముస్లింలు దాదాపుగా మంచివాళ్లుగానే ఉంటారు. అరుదుగా దుష్టపాత్రల్లో కనిపిస్తారు. తర్వాతి దశలో తీరు మారింది. దీన్ని హిందీ సినిమాల్లో సన్నీ దేవల్ దశగా పిలుద్దాం. దేశంలో మతతత్వం పెరుగుతున్న ఈ కాలంలో ముస్లింలను చెడ్డవాళ్లుగా, ఎక్కువగా ఉగ్రవాదులుగా చిత్రిస్తూ సినిమాలు వచ్చాయి. అప్పటి సినిమాల్లో ఒకటైన ‘జాల్’(వల)లో హీరో సన్నీ దేవల్ మంచి మనిషిగా దుష్టులకు(వారంతా ముస్లింలే) గుణపాఠం చెబుతాడు. ఆ సమయంలో వెనుక నుంచి ‘ఓం నమః శివాయ’ అనే మాటలు బిగ్గరగా వినిపిస్తారు. ముస్లింలు అంటే దుష్టులు వస్తున్నప్పుడు సమీపంలోని మసీదు నుంచి ముస్లింలకు నమాజు చేయాలని కోరే పిలుపు ‘అజా’ వస్తుంది. దేశభక్తి గల కథానాయకుని భార్య పాత్రలో టబూ నటించింది. ఆమె భర్తకు ద్రోహం చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. దేవల్ హీరోగా చేసిన ఇలాంటిదే మరో చిత్రం ‘ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’(గూఢచారి ప్రేమకథ అని అర్ధం). ఇందులో దేవల్ ముస్లిం భార్యగా ప్రియాంకా చోప్రా నటించింది. భర్త దుష్టులైన ముస్లింలతో పోరాడుతుంటే, ఆమె భర్త కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. గదర్ ఏక్ ప్రేమ్ కథా అనే చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంత మతవిద్వేషంతో కూడిన హిందీ సినిమా ఏదీ అప్పటి వరకూ రాలేదని అప్పటి ఎడిటర్ ఎంజే అక్బర్ నాతో అన్నారు. అప్పటి నుంచి మళ్లీ ట్రెండ్ మారింది. ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించారు ఇస్లాం అంటే భయపడే రోజుల్లో ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించిన సినిమాలకు గిరాకీ పెరిగింది. కశ్మీర్లో ఉగ్రవాదం, అల్ కాయిదా, ఇండియన్ ముజాహదీన్ కార్యకలాపాలు ఎక్కువ కావడం దీనికి కార ణం. ముస్లిం పాత్రధారులు ఉన్న 50 సినిమాలపై అష్రఫ్ ఖాన్, సయీదా జరియా బుఖారీ 2011లో జరిపిన అధ్యయనం ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ సినిమాల్లో 65.2 శాతం ముస్లింలను చెడ్డ గుణాలున్న వారిగా, దాదాపు 30 శాతం చిత్రాల్లో తటస్థులుగా, కేవలం 4.4 శాతం సినిమాల్లో వారిని దుష్టులుగా చూపించారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. జాన్ అబ్రహం నటించిన న్యూయార్క్, షారుఖ్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్, మలయాళ సినిమా అన్వర్లో ముస్లింలే కథానాయకులు. ముల్క్లో గొప్ప మార్పు! అనుభవ్ మిశ్రా సిన్హా దర్శకత్వం వహించిన ‘ముల్క్’ నిజంగా భిన్నమైన చిత్రం. హిందీ ప్రాంత నగరంలో(వారణాసి) నివసించే సాధారణ ముస్లిం కథే ఇందులో చూస్తాం. అయితే దీనిలో ప్రధాన పాత్రధారి(ముస్లిం) హిందూ కోడలు కుటుంబానికి కొంత దూరంగా ఉంటుంది. ముల్క్లో ముస్లింలను దేశభక్తిగల మంచి మనుషులుగానేగాక దుష్టులుగా, ఉగ్రవాదులుగా చూపించారు. ఇందులో మంచి ముస్లిం పోలీసు అధికారి పాత్రలో రజత్ కపూర్ చాలా తక్కువ మాటలతో, గొప్ప నటన ప్రదర్శించారు. వారణాసి ఉగ్రవాద వ్యతిరేక పోలీసు బృదం అధిపతిగా ఆయన తన సొంత మతానికి చెందిన వారిని గడగడలాడిస్తూ ప్రాణాలు తీయడంలో ఉత్సాహం చూపిస్తూ చేసిన నటన ఆకట్టుకుట్టుంది. రోజూవారీ సమస్యలున్న సగటు కుటుంబం కథ ఇది. ఇందులో ఎప్పటిలా కనిపించే మూస కోర్టు దృశ్యాలున్నాయి. ఈ కుటుంబ సభ్యుడైన కొడుకు ఉగ్రవాదిగా మారి పెట్టిన బాంబు పేలగా ముగ్గురు ముస్లింలు సహా 16 మంది మరణిస్తారు. తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణిస్తాడు. నేటి హిందీ ప్రాంత భారత ముస్లిం మనసులో కదలాడే భయం, అభద్రతాభావం, పరస్పర విరుద్ధమైన సంశయాలు, అనుమానాలు, ఆశలు, నిస్పృహలు–ఇవన్నీ సమ్మిళతమై వేధిస్తున్నట్టు ‘ముల్క్’లో కనిపించాయి. ఈ సినిమాలో లాయర్ మురాద్ అలీ మహ్మద్ (రిషికపూర్) సోదరుడి కొడుకు షాహిద్(ప్రతీక్ బబ్బర్) యువ ఉగ్రవాది. అతనిపై అనేక ఒత్తిళ్లతోపాటు ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వరని, ప్రపంచవ్యాప్తంగా వారిపై వివక్ష చూపిస్తున్నారనే ప్రచారం ప్రభావం చూపిస్తుంది. నిజంగా ఏడుగురిలో ఒకరైన ముస్లిం మనసులో ఇలాంటి ఆలోచనలుంటే దేశం ఇంకా అల్లకల్లోలం కాలేదేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశంలో ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని ముల్క్ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే–ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. మనం దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి మరణించిన సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్, ఏపీజే అబ్దుల్ కలాం, షెహనాయి విధ్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అభిమానిస్తాం. మిగిలిన ముస్లింలందరూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. వాస్తవానికి ఉగ్రవాదులే ముస్లింలలో చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆయన సందేశం. ఇరవై ఏళ్లకు పైగా రాస్తున్న ఈ కాలమ్‌లో నేను రెండు సార్లు మాత్రమే హిందీ సినిమాల గురించి రాశాను. మన సమాజం లేదా రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పును (రాజకీయ పడితులు, నేతలు గుర్తించనివి) ప్రస్తావించిన సినిమాల గురించి చర్చించాను. సంపదను, ధనికుల జీవనశైలిని గొప్పగా చూపించిన ఫర్హాన్ అఖ్తర్ సినిమా దిల్ చాహ్తాహై(2001) గురించి మొదటిసారి రాశాను. రెండో సినిమా మసాన్. నీరజ్ ఘ్యావణ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ చిత్రంలో అప్పటి అడ్డూ అదుపూ లేని అభివృద్ధి సమాజంలో, వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి మసాన్ ప్రయత్నించింది. ముల్క్ మాదిరిగానే మసాన్‌ను కూడా వారణాసి నేపథ్యంలోనే నిర్మించారు. ఆధునిక భారతంలో సాధారణ ముస్లిం కుటుంబం కథనే అనుభవ్ సిన్హా ఎంత భిన్నగా చూపించారంటే–ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలంటూ కొందరు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది. అయితే, గతంలో మేఘనా గుల్జార్ తీసిన ‘రాజీ’లో ఓ పాకిస్థానీ సైనికుడి కుటుంబంలోని సభ్యులు మంచివారిగా చిత్రించారు. ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం, ఆత్మవిశ్వాసం భారతీయులకు ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇప్పుడు ముల్క్ కూడా ‘రాజీ’లో మాదిరిగానే వాస్తవాలను ధైర్యంగా చెప్పింది. 2005లో ఇదే వారణాసి నగరంలోని గొప్ప ముస్లిం కళాకారుడు బిస్మిల్లా ఖాన్ నుంచి ఓ అద్భుతమైన పాఠం నేర్చుకున్నాను. నా ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూ కోసం ఆయనను కలిసినప్పుడు, ‘‘జిన్నా స్వయంగా మిమ్మల్ని కోరినా మీరు 1947లో పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోలేదు?’’ అని ప్రశ్నించాను. ‘‘ కైసే జాతే హమ్? వహా హమారా బనారస్ హై క్యా?’’(ఎందుకు వెళ్తాను? అక్కడేమైనా మా బెనారస్ ఉందా?) అని బిస్మిల్లాఖాన్ జవాబిచ్చారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంచి సందేశమిస్తున్న ముల్క్ చూడాలనే నేను సలహా ఇస్తున్నాను. శేఖర్ గుప్తా ,వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ (twitter@shekargupta) -
‘నా సినిమా పైరసీలో అయినా చూడండి’
సినీ రంగాన్ని వేదిస్తున్న తీవ్ర సమస్యల్లో పైరసీ ఒకటి. ఇండస్ట్రీ వర్గాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. అందుకే తమ సినిమాల ప్రమోషన్ సమయంలో పైరసీ వ్యతికేరంగా అభిమానులకు పిలుపునిస్తుంటారు స్టార్స్. అయితే తాజాగా ఓ దర్శకుడు తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పిలుపునివ్వటం హాట్ టాపిక్ మారింది. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ముల్క్. హిందూ ముస్లింల మధ్య స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై పాకిస్తాన్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించటంపై స్పందించిన దర్శకుడు అనుభవ్ సిన్హా తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పాక్ ప్రజలకు పిలుపు నిచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుభవ్ ‘ప్రియమైన నా పాకిస్తాన్ ప్రజలకు.. నేను తీసిన ముల్క్ సినిమాపై పాక్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించింది. మీరంతా చట్టబద్ధంగా థియేటర్లలోనే నా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ అలా చూసే అవకాశం లేకపోతే పైరసీలో అయిన చూడండి. సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని నిషేందించిందో మీకే అర్ధమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు, నిజా నిజాలు మీకు తెలియకూడదనే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది’ అన్నారు. అయితే అనుభవ్ సిన్హా వ్యాఖ్యలు పైరసీ ప్రొత్సహించే విధంగా ఉన్నయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
‘ముల్క్’.. అక్కడ బ్యాన్
దాయాది దేశం పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో వచ్చిన భారతీయ చిత్రాలను నిషేధిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కోవలోకి మరో చిత్రం చేరింది. రిషి కపూర్, తాప్సీ ప్రధాన పాత్రలుగా, అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ముల్క్’. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన ‘ఇస్లామిక్ ఫోబియా’ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ పాక్ మాత్రం ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించకూడదంటూ నిషేధిత ఆజ్ఞలు జారీ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో విడుదలైన పలు విజయవంతమైన చిత్రాలను పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన వీరే ది వెడ్డింగ్ చిత్రాన్ని వల్గర్‌గా ఉందంటూ బ్యాన్ చేసింది. ‘మెన్యూరేషన్’ ఇతివృత్తంగా అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ప్యాడ్మాన్ చిత్రాన్ని కూడా నిషేధించింది. అందుకు పాక్ సెన్సార్ బోర్డ్ చెప్పిన కారణం ‘ఇలాంటి విషయాలను మా దేశంలో బహిరంగంగా చర్చించడం నిషేధం అందుకే ప్యాడ్మాన్ను నిషేధించాం’ అని పాక్ సెన్సార్ బోర్డు తెలిపింది. ఇస్లామ్‌కు వ్యతిరేకమైన చేతబడి ఇతివృత్తంగా తెరకెక్కిందంటూ అనుష్క శర్మ ‘పారి’ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఇవే కాక అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రాజీ’, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘రాయిస్’ చిత్రాలను కూడా ఇలాంటి కారణాలు చెప్పే నిషేదించింది. ఇదే క్రమంలో ఇప్పుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘ముల్క్’ చిత్రాన్ని నిషేధించింది. అయితే ఈ నిషేధంపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా పాక్ సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ‘ఈ చిత్రం ముస్లింలకు, పాకిస్తాన్‌కు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో తెరకెక్కించింది కాదు. ఇది మనపై మనకు, మన చూట్టు ఉన్న వారి పట్ల మనం ప్రదర్శించే ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన చిత్రం. ఇది మీ గురించి, నా గురించి చెప్పే చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక పాక్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.. సహ ఉనికి గురించి చర్చించే ఈ చిత్రాన్ని పాక్ ఎందుకు బ్యాన్ చేసింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీకు ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఆ రోజు తప్పకుండా ఈ సినిమా చూసి అప్పుడు చెప్పండి పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఎందుకు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిందో’ అంటూ ట్వీట్ చేశారు. -
‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’
పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంపై హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ముద్ర పడింది. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో పాటు మీడియా అత్యుత్సాహం కూడా తోడవడం వారిని మరింతగా కుంగదీస్తోంది. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ లాయర్ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి’ ఇదీ సంక్షిప్తంగా ‘ముల్క్’ సినిమా కథ. కోర్టు రూంలో జరిగే డ్రామా ప్రధానంగా నడిచే ఈ సినిమాను దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కించారు. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, రాజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన.. ‘ముల్క్’ సినిమా ఆగస్ట్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ‘నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు, వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం కల్పించేందుకే అనుభవ్ ఈ సినిమా తీస్తున్నట్టు ఉంది. అసలు ఈ సినిమా వెనుక ఉన్నది ఎవరంటూ’ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తనపై ట్రోల్ చేస్తోన్న వారందరికి దిమ్మ తిరిగేలా ఓపెన్ లెటర్‌తో సమాధానమిచ్చారు ‘ముల్క్’ దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’ మిమ్మల్ని, మీ ఆలోచనా ధోరణిని చూస్తుంటే జాలి వేస్తోంది. మీ పనికిమాలిన ట్రోలింగ్ వల్ల ఎంతో మంది వ్యక్తుల కెరీర్లు, జీవితాలు ప్రభావితమవుతాయని మీకసలు తెలిసినట్టు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి(సోషల్ మీడియా) రావడం. ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం. ఇది కాదు కావాల్సింది’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సినిమా నిర్మాతల గురించి తెలియజేస్తూ.... ‘‘ముల్క్’ సినిమాకు దావూద్ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్ గానీ డబ్బులు సమకూర్చడం లేదు. కావాలంటే దావూద్, రాహుల్ గాంధీ, మోహన్ భగవత్‌లను మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. ఈ సినిమా దర్శకుడిగా చెప్తున్నా.. దీపఖ్ ముకుత్, ఆయన తండ్రి కమల్ ముకుత్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా తెలుకోండి’ అంటూ అనుభవ్ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. An open letter to all the trolls. Bring it on!!! pic.twitter.com/QSLMOBLmnz — Anubhav Sinha (@anubhavsinha) July 15, 2018 -
ఒక పోస్టర్.. నాలుగు సినిమాలు
ముంబై: ఒక కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందంటే.. అందులో హైలెట్ అయ్యే అంశాలనే కాదు.. లోపాలు వెతికి మరీ సోషల్ మీడియాలో పెట్టేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కొత్త సినిమా భూమి విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ మధ్యే చిత్ర ఫస్ట్ లుక్‌తోపాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా కాలం తర్వాత భాయ్ నుంచి వస్తున్న సినిమా కావటం, ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే ఉండటంతో అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే పోస్టర్ హాలీవుడ్ చిత్రం ది గ్రే(2012) నుంచి కాపీకొట్టారంటూ విమర్శలు చెలరేగాయి. దీనిపై చిత్ర మేకర్ అనుభవ్ సిన్హా తన ఫేస్బుక్లో సుదీర్ఘ వివరణే ఇచ్చుకున్నారు. అయితే అది కాపీ ఏం కాదని, గతంలో ఇలాంటి పోస్టర్లు హాలీవుడ్లో చాలానే వచ్చాయంటూ కొన్ని పాత హాలీవుడ్ సినిమా పోస్టర్లు పంచుకోగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. లోగన్, ఫ్రీ స్టేట్ ఆఫ్ జోన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ పోస్టర్లు కూడా అదే మాదిరిగా ఉన్నాయని, అంత మాత్రానా ఇలా పోలుస్తూ తప్పుబట్టడం సరికాదన్నది విశ్లేషకుల వాదన.