బాలీవుడ్‌కు గుడ్‌బై | Anubhav Sinha explains Bollywood resignation tweet | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు గుడ్‌బై

Published Thu, Jul 23 2020 1:00 AM | Last Updated on Thu, Jul 23 2020 1:00 AM

Anubhav Sinha explains Bollywood resignation tweet - Sakshi

అనుభవ్‌ సిన్హా

‘‘ఇక చాలు, దుకాణం సర్దేస్తున్నాను, బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నాను’’ అని ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు ప్రముఖ దర్శకుడు అనుభవ్‌ సిన్హా. షారుక్‌ ఖాన్‌తో ‘రా–వన్‌’, రిషీ కపూర్, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ముల్క్‌’, ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా ‘ఆర్టికల్‌ 15’, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన తాప్సీ ముఖ్యపాత్ర పోషించిన ‘తప్పడ్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అనుభవ్‌.

2001లో కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘గులాబ్‌ గ్యాంగ్‌’, ‘జిద్‌’ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘‘ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది. ఇకనుంచి ఓ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నా’’ అన్నారు అనుభవ్‌. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనుభవ్‌ హఠాత్తుగా రాజీనామా చేయాలనే  నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమై ఉంటుంది? అనే చర్చ హిందీ పరిశ్రమలో జరుగుతోంది. అయితే ‘‘బాలీవుడ్‌కి రాజీనామా చేస్తున్నాను కానీ సినిమాలు చేస్తాను’’ అని పేర్కొన్నారు అనుభవ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement