ఆలియా భట్ సినిమా డిజాస్టర్‌.. డైరెక్టర్‌ షాకింగ్ నిర్ణయం! | Jigra Director Vasan Bala Deletes Twitter Account After Box Office Failure, Check Out Deets Inside | Sakshi
Sakshi News home page

Vasan Bala: ఆలియా భట్ సినిమా డిజాస్టర్‌.. ఖాతా డిలీట్‌ చేసిన డైరెక్టర్‌!

Published Sun, Oct 20 2024 2:58 PM | Last Updated on Sun, Oct 20 2024 4:50 PM

Jigra director Vasan Bala deletes Twitter account after box office failure

బాలీవుడ్ స్టార్ ‍హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్‌ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.

అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్‌ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్‌ సెర్చ్ చేస్తే ట్విటర్‌లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement