![Taapsee Releases Her First Look Poster From Thappad - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/31/Tapsee--Thappad.jpg.webp?itok=SdVbfIN8)
తప్పడ్‌లో తాప్సీ
కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలను బలంగా చెప్పాలి. చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి కథనే చెప్పబోతున్నాం అంటున్నారు తాప్సీ. ఆమె ముఖ్య పాత్రలో అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తప్పడ్’. తప్పడ్ అంటే చెంపదెబ్బ అని అర్థం. ఈ సినిమాలో తాప్సీ లుక్‌ను విడుదల చేశారు. ‘‘అనుభవ్‌సార్‌తో పని చేస్తే అర్టిస్ట్‌గా మనల్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే కథ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పకుండా చెప్పవలసిన కథ. ‘తప్పడ్’ ఈ ఏడాది ‘పింక్’ (2016) లాంటి సినిమా అవుతుంది’’ అన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment