Look out
-
సూర్యవన్షీ సాహసం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్ ’. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ , రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్‌కుమార్ c చేసి, వీర్ సూర్యవన్షీ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’ (2021) చిత్రం విడుదలై ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో, ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలోని అక్షయ్ లుక్‌ను విడుదల చేసినట్లుగా రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఇందులో అక్షయ్ లుక్ చూస్తుంటే పోలీసాఫీసర్‌గా మరోసారి ఆయన సహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సింగమ్ ఎగైన్ ’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
యాక్షన్.. ఎమోషన్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా కీలక పాత్రలు చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా యూనిట్ వెంకటేష్ లుక్‌ని రిలీజ్ చేసింది. ‘‘వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. హీరోతో పాటు ఎనిమిది మంది ముఖ్య నటీనటులపై 16 రోజుల్లో కీలకమైన హై యాక్షన్– ఎమోషనల్ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్వైజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా: ఎస్.మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్). -
నాగశౌర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
శుక్రవారం (జనవరి 22) బర్త్‌డే సందర్భంగా నాగశౌర్య రెండు లుక్స్‌లో కనిపించారు. ఒకటి ఎయిట్ ప్యాక్ దేహంతో రఫ్‌గా, మరొకటి సంప్రదాయబద్ధమైన కుర్రాడి లుక్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘లక్ష్య’లో మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు శౌర్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు శౌర్య. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. మరో సినిమా ‘వరుడు కావలెను’ విషయానికొస్తే.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా ఓ ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో నాగౌశర్య ముస్తాబవుతున్న సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది మేలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
పవర్ఫుల్ రోల్
నాయకుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు... ఇలా ఏ పాత్రలో అయినా నటించి, మెప్పించగల నటుడు విజయ్ సేతుపతి. త్వరలో విడుదల కానున్న ‘ఉప్పెన’లో ఆయన కీలక పాత్ర చేశారు. శనివారం (జనవరి 16) విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘ఇందులో విజయ్ సేతుపతిది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అద్భుతంగా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
మూడు భాషల వసంత కోకిల
‘కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని..’ పాట చాలామందికి తెలుసు. కమల్‌హాన్, శ్రీదేవి జంటగా రూపొందిన ‘వసంత కోకిల’ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ ఎక్కడోచోట వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని గుర్తు చేయడానికి కారణం తమిళ నటుడు బాబీ సింహా ‘వసంత కోకిల’ పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నారు. నేడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని హీరో రానా విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడీగా కాశ్మీర పర్దేశీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా రెడీ అవుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, కెమెరా: గోపీ అమరనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ సుందర్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్స్: జె. విద్యా సాగర్, యు. దిలీప్ కుమార్, నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రేష్మీ సిం. -
సన్యాసిలా ఆలోచించగలనా?
లాక్డౌన్లో షూటింగ్ లేకపోయినా కొత్త స్క్రిప్ట్‌లు, తదుపరి సినిమాల విషయాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజాగా లుక్ టెస్ట్ కోసం ఇలా గుండు బాస్‌గా మారారు. లుక్ ఫిక్సయిందా? మరి చిరు నెక్ట్స్ సినిమాలో ఇలాంటి క్రేజీ గెటప్‌తో కనిపిస్తారా? వేచి చూడాలి. ఈ ఫోటోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి – ‘అర్బన్ మాంక్ (సిటీ సన్యాసి). మరి సన్యాసిలా ఆలోచించగలనా?’ అని క్యాప్షన్ చేశారు. -
గూఢచారి అక్షయ్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
ముఖ్యమంత్రి పాత్రలో...
ప్రముఖ క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చరణ్ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు. -
అను ఎలాంటి అమ్మాయి?
‘‘మంచి, చెడు అనేది మనం చూసే దృష్టి కోణాన్ని, పరిస్థితిని బట్టి ఉంటుంది. అను మనస్తత్వం ఎలాంటిదో మీరే (ప్రేక్షకులు) ఈ వేసవిలో నిర్ణయించండి’’ అన్నారు కాజల్ అగర్వాల్. ఇంతకీ అను ఎవరంటే ఎవరో కాదు.. ‘మోసగాళ్ళు’ సినిమాలో కాజల్ చేసిన పాత్ర పేరిది. శుక్రవారం అను లుక్‌ని రిలీజ్ చేశారు. మంచు విష్ణు హీరోగా జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో వయామార్ ఎంటర్టైన్మెంట్స్, ఏవీఏ బ్యానర్స్ పతాకాలపై విరోనిక మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి కీలక పాత్రధారి. ‘‘దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కపుల్ దేవ్
‘‘తన కలల కంటే కూడా తన భర్త కలల్ని తనవిగా భావించే స్త్రీలందరికీ ఈ సినిమా అంకితం’’ అంటున్నారు దీపికా పదుకోన్. 1983లో భారత జట్టు తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచిన సంఘటన ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకోన్ చేశారు. ఆల్రెడీ రణ్వీర్ లుక్‌ని విడుదల చేశారు. రణ్వీర్–దీపికా కలిసి ఉన్న లుక్‌ను బుధవారం విడుదల చేశారు. వివాహం తర్వాత ఈ కపుల్ కలసి నటించిన చిత్రమిది. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన సంఘటనతో తీసిన సినిమాలో చిన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు దీపికా. ‘83’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
నవంబరులో మైదాన్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇందులో ప్రియమణి కథానాయిక. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని అజయ్ లుక్స్‌ను గురువారం విడుదల చేశారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ (1950–1963) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ‘మైదాన్’ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్‌కి చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబరు 27న ఈ చిత్రం విడుదల కానుంది. -
చెంప చెళ్లుమనేట్టు చెప్పాలి
కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలను బలంగా చెప్పాలి. చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి కథనే చెప్పబోతున్నాం అంటున్నారు తాప్సీ. ఆమె ముఖ్య పాత్రలో అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తప్పడ్’. తప్పడ్ అంటే చెంపదెబ్బ అని అర్థం. ఈ సినిమాలో తాప్సీ లుక్‌ను విడుదల చేశారు. ‘‘అనుభవ్సార్తో పని చేస్తే అర్టిస్ట్‌గా మనల్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే కథ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పకుండా చెప్పవలసిన కథ. ‘తప్పడ్’ ఈ ఏడాది ‘పింక్’ (2016) లాంటి సినిమా అవుతుంది’’ అన్నారు తాప్సీ. -
వందకి వంద
‘సూర్మా’లో హాకీ ప్లేయర్, ‘సాండ్ కీ ఆంఖ్’లో షూటర్.. ఇలా క్రీడలకు సంబంధించిన పాత్రలను తాప్సీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు దేశం గర్వపడేలా చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ‘శభాష్ మిథు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలోని తాప్సీ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. రాహుల్ థొలాకియా దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘నా జీవిత కథను ప్రపంచానికి చూపిస్తున్నందుకు థ్యాంక్స్ వయాకామ్ 18. మీరు కచ్చితంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు’’ అని మిథాలీ ట్వీట్ చేశారు. అలాగే తాప్సీ పోస్టర్ చాలా బాగుందని ప్రశంసించారామె. ‘‘ఇప్పటివరకు నన్ను మీకు నచ్చిన క్రికెట్ క్రీడాకారుడు ఎవరు? అని చాలామంది అడిగారు. అయితే వాళ్లను మీ అభిమాన క్రికెట్ క్రీడాకారిణి ఎవరు? అని అడగాలి. అలాగే వాళ్లు క్రికెట్‌ని ఇష్టపడుతున్నారా? లేదా ఏ జెండర్ (ఆడ లేక మగ) ఆడుతున్నారనేదాన్ని బట్టి వాళ్ల ఇష్టం ఆధారపడి ఉంటుందా? ఏది ఏమైనా ‘మిథాలీ.. మీరు ఓ గేమ్ చేంజర్’’ అని పోస్టర్ రిలీజ్ సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాప్సీ లుక్‌కి వందకు వంద మార్కులు పడ్డాయి. 2021 ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
బంధాలను గుర్తు చేసేలా...
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నటులు సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్‌లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్ ఉన్న లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
శ్రీదేవి సైకిల్ ఎక్కారు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనున్నారు. -
గాల్లో యాక్షన్
తనపై ఎటాక్ చేసినవారికి తనదైన శైలిలో జవాబు చెబుతున్నారు విశాల్. ఇందుకోసం కత్తులు, తుపాకులతో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో విశాల్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం విశాల్ అండ్ టీమ్ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లొచ్చారు. టర్కీ షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు విశాల్. ఇందులో తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... విశాల్–సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
బీచ్ బేబి
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యూయెల్ రోల్ చేశారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. బుధవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రణరంగం’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున కాజల్ ఆనందంగా సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘మను చరిత్ర’ సినిమాకు కాజల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
లుక్ డేట్ లాక్?
‘ఆర్ఆర్ఆర్లో’ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది? రామ్‌చరణ్ మీసాలతో ఎలా కనిపించబోతున్నారు? అని ఊహించుకుంటున్న ఫ్యాన్స్‌కో గుడ్‌న్యూస్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్–చరణ్‌ల లుక్ రివీల్ చేసే తేదీని రాజమౌళి ఫిక్స్ చేసేశారని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎవరూ ఫిక్స్ కాలేదు. కొమర మ్ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తారు. 1920లలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. స్వాతంత్య్రం వచ్చిన రోజున స్వాతంత్య్ర సమరయోధులుగా వీరి లుక్స్ రిలీజ్ చేస్తే బావుంటుంది అనుకున్నారట. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ కానుంది. -
ఖరాబ్ చేస్తా
జస్ట్ వారం క్రితం మీ దిమాక్లు ఖరాబు చేస్తానన్నారు నిధీ అగర్వాల్. అన్నంత పనీ చేశారు. ఇప్పుడు నభా నటేశ్ కూడా ఇదే మాట అంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన పాటల్లో ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే పాట ఒకటి. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో రామ్, నిధి, నభా పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వారం క్రితం ఈ పాటలోని నిధీ అగర్వాల్ లుక్‌ని విడుదల చేశారు. శుక్రవారం నభా నటేశ్ ఫొటో రిలీజ్ చేశారు. ‘‘నిధీ అగర్వాల్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నభా కూడా మార్కులు కొట్టేస్తారని, కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేస్తారని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ కీలక సమాచారంతో పరారైనట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్‌డిస్క్‌లతో అశోక్ ఉడాయించారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడం కోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు ఉన్న నేపథ్యంలో అశోక్ ఏపీలోనే తలదాచుకున్నాడని అనుమానిస్తున్నారు. అశోక్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్‌పోర్ట్ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. (డేటా చోర్.. బాబు సర్కార్) ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు... ఐటీ గ్రిడ్స్ సంస్థపై సోమవారం మరో కేసు నమోదైంది. హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా తయారు చేయించుకున్న ఈ యాప్‌లో ఇతర పార్టీలకు చెందిన వారిని అక్రమంగా ఓటర్ లిస్టు నుంచి తొలగించే కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఈ మేరకు ‘సేవామిత్ర’వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అశోక్, కమలేష్, అబ్దుల్ సమా మరికొందరు కలిసి టీడీపీ అనుకూలంగా లేని వారిని టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతోపాటు యాప్‌లో ఉంచి సర్వే చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) ఈ యాప్ ఉన్న ట్యాబ్‌లతో బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్తున్న టీడీపీ క్యాడర్... ఏపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని 10 నుంచి 15 రకాల ప్రశ్నలు అడుగుతున్నారని, ఇలా టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ పేరుతో బెదిరించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సదరు సంస్థ ప్రయత్నిస్తోందని దశరథరామిరెడ్డి ఆరోపించారు. టీడీపీని వ్యతిరేకించే వారి వివరాలను ఆయా కార్యకర్తలు టీడీపీలోని కీలక వ్యక్తికి పంపిస్తున్నారని, ఈ స్థాయిలో జరిగే కుట్రలో ఆయా వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఓట్లు తొలగించడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ప్రభుత్వ పథకాలు చేరకుండా కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) దీంతో ఐటీ గ్రిడ్స్‌కు చెందిన నిర్వాహకులపై ఐపీసీలోని 420, 419, 467, 468, 471, 120 (బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తాజా కేసు నేపథ్యంలో అశోక్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా వారు సేకరించిన సమాచారం ప్రకారం అశోక్ విజయవాడ చుట్టుపక్కల తలదాచుకున్నట్లు గుర్తించారు. అతని కోసం రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. అశోక్‌ను పట్టుకొని అన్ని కోణాల్లోనూ విచారిస్తే ఈ స్కాం వెనుక ఉన్న ఏపీ ప్రభుత్వ, టీడీపీ పెద్దల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) -
ఈ డాన్ ప్రత్యేకం
అక్రమ్ సురేష్ హీరోగా, ఢిల్లీ బ్యూటీ ఖుషీ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘అక్రమ్’. సురేష్ మేడిది దర్శకత్వంలో అమరావతి మూవీస్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మాస్ యాక్షన్ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అక్రమ్ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘రాణా’ పాత్ర లుక్‌ని నటుడు సుమన్ లాంచ్ చేశారు. సురేష్ మేడిది మాట్లాడుతూ– ‘‘డాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రాక్, రాణా, అక్రమ్, రాణా ప్రతాప్‌సింగ్ అనే నాలుగు పాత్రల్లో హీరో కనిపిస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరికీ నచ్చే చిత్రమిది. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ సినిమా. డాన్ల సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీ సెట్లో చిత్రీకరించిన ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్. ఓ షెడ్యూల్, 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజర్‌ని రిలీజ్ చేస్తాం. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటిగారు అక్కినేనికి ‘నటసామ్రాట్’ బిరుదును ఇచ్చారు. ఈ చిత్రంలో అక్రమ్ సురేష్ గెటప్ చూసి ‘టాలీవుడ్ తలైవా’ అనే బిరుదును ఇచ్చారు’’ అన్నారు. చిత్ర సమర్పకుడు విస్సా కోటి, శివకుమార్ పాల్గొన్నారు. పోసాని కృష్ణమురళి, సుమన్, లిపికా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.యు.సాయి, కెమెరా: అనీల్. -
యుద్ధ వీరుడు
బాలీవుడ్లో సెట్స్‌పై ఉన్న పీరియాడికల్ మూవీస్ లిస్ట్‌లో ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా ఒకటి. 1670 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మరాఠా చీఫ్ కమాండర్‌గా ఉన్న తానాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. ఈ సినిమా తాజా లుక్‌ను రిలీజ్ చేశారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘దేదే ప్యార్ దే, టోటల్ ధమాల్’ చిత్రాల విడుదల కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ‘తానాజీ’ కాకుండా ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లోనూ అజయ్ దేవగన్ నటించనున్నారు. -
‘పాలసీ’ మార్చుకుంటారా?
♦ పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ♦ ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కొనసాగించొచ్చు ♦ పెయిడప్‌గా మార్చుకుంటే సరిపోతుంది ♦ కనీసం మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తేనే ఈ చాన్స్ ♦ లేదంటే పాలసీని సరెండర్ చేసుకోవచ్చు చాలా మంది పెద్దగా ఆలోచించకుండానే బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటివారు పాలసీ పత్రం చేతికొచ్చాక దాన్ని వెనక్కి పంపేసేందుకు ‘లుక్ అవుట్’ పీరియడ్ ఎటూ ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించాక ఆ పాలసీకన్నా మెరుగైనవి మార్కెట్లోకి రావటమో... లేకపోతే సదరు పాలసీ మరీ తక్కువ రాబడులను ఇస్తుండటమో... లేకపోతే కవరేజీ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడటమో జరుగుతుంటుంది. అలాంటపుడు వారి ఆలోచనలు మారుతుంటాయి. మరి అప్పుడేం చెయ్యాలి? ఆ పాలసీని రద్దు చేసుకోవటమెలా? ఒకవేళ రద్దు చేసుకుంటే అప్పటిదాకా చెల్లించిన ప్రీమియం సొమ్మయినా వెనక్కి వస్తుందా? దానికి లాభాలేమైనా జతవుతాయా? లేకపోతే అసలుకూ మోసం వస్తుందా? ఇవన్నీ చాలామందికి సందేహాలే. నిజానికి కాల వ్యవధి తీరకుండానే బీమా పాలసీని వెనక్కిచ్చేయాలంటే అందుకు సంప్రదాయ ఎండోమెంట్ పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి ఇకపై ఏటా ప్రీమియం చెల్లించకుండా దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం. రెండోది పాలసీని వెనక్కిచ్చేసి (సరెండర్) వాళ్లు ఇచ్చినంత తీసుకోవడం. సరెండర్కూ కొన్ని నిబంధనలు... సరెండర్ అంటే పాలసీ కాల వ్యవధి తీరకుండానే దాన్నుంచి పూర్తిగా తప్పుకోవడం. ఈ సమయంలో పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని స్వాధీనపు విలువగా (సరెండర్ వ్యాల్యూ) పేర్కొంటారు. వరుసగా మూడేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించి ఉంటే ఆ తర్వాత పాలసీని సరెండర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చెల్లించిన ప్రీమియంలో కొంత వరకు వెనక్కి వచ్చే అవకాశముంది. పదేళ్లు, అంతకు మించిన కాల వ్యవధి గల పాలసీ తీసుకుని మూడేళ్లు కూడా ప్రీమియం చెల్లించకుండా, ఏడాది, రెండేళ్లు మాత్రమే చెల్లించి సరెండర్ చేస్తే... ఎల్ఐసీ వంటి బీమా కంపెనీలు రూపాయి కూడా వెనక్కివ్వవు. అలాగే, దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకునే అవకాశం కూడా ఉండదు. సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పాలసీ సరెండర్ విలువ ఎంతో బీమా సంస్థ పాలసీ బాండ్లో పేర్కొంటుంది. మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియంలో 30 శాతం వరకూ స్వాధీనపు విలువ దక్కుతుంది. ఇందులో కూడా మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియంలో రూపాయి రాదు. రైడర్ల ప్రీమియం, ట్యాక్స్ చెల్లింపులు కూడా వెనక్కు రావు. పాలసీ కాల వ్యవధి, ఎప్పుడు స్వాధీనం చేస్తున్నారన్న అంశంపైనే పాలసీ స్వాధీనపు విలువ ఆధారపడి ఉంటుంది. అయితే మూడేళ్లు దాటిన పాలసీల విషయంలో మాత్రం స్పెషల్ సరెండర్ వ్యాల్యూను బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. ఇవి 30 శాతంకన్నా తప్పనిసరిగా అధికంగా ఉంటాయి. పాలసీని సరెండర్ చేస్తున్నట్టు ఎల్ఐసీకి తెలియజేసిన తర్వాత సరెండర్ వ్యాల్యూని ఖరారు చేయడం జరుగుతుంది. మూడేళ్ల పాలసీ సరెండర్ విలువ చెల్లించిన ప్రీమియంలలో 30 శాతం. నాలుగేళ్ల నుంచి ఏడో ఏడాది వరకు స్వాధీనపు విలువ 50 శాతం. ఇలా పాలసీ కాల వ్యవధి దగ్గర పడుతున్న కొద్దీ ఈ శాతం పెరుగుతూ వెళుతుంది. పాలసీ తీసుకున్న తొలి ఏడు సంవత్సరాల్లో సరెండర్ చేస్తే స్వాధీనపు విలువను ఐఆర్డీఏ నిర్ణయిస్తుంది. ఏడేళ్లు దాటితే ఎంత ఇవ్వాలన్నది బీమా సంస్థ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇం దుకు కూడా ఐఆర్డీఏ ఆమోదం తప్పనిసరి. బీమా రక్షణ పోయినట్టే! పాలసీని సరెండర్ చేస్తే జీవితానికి ఉన్న బీమా రక్షణను కోల్పోతారు. పాలసీని రద్దు చేసుకుంటే తదుపరి ప్రీమియంలు చెల్లించరు కనక పన్ను ప్రయోజనమూ కోల్పోతారు. ఎండోమెంట్ పాలసీని రెండేళ్లలోపు వెనక్కిచ్చేసినా... యులిప్ పాలసీని ఐదేళ్లలోపు స్వాధీనం చేసినా వాటిపై లోగడ పొందిన ఆదాయపన్ను ప్రయోజనాలనూ వదులుకోవాల్సి ఉంటుంది. పెయిడప్ పాలసీగా మార్చుకుంటే... వరుసగా మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత... ఎప్పుడైనా ఒక ఏడాది ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దీన్ని పెయిడప్ పాలసీగా వ్యవహరిస్తారు. దీంతో ఈ పాలసీల్లో సమ్ అష్యూరెన్స్‌ను తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.5 లక్షలకు సమ్ అష్యూరెన్స్ (బీమా) ఉందనుకోండి. 20 ఏళ్ల కాల వ్యవధితో పాలసీ తీసుకోగా కేవలం పదేళ్ల పాటే ప్రీమియం చెల్లించారనుకుంటే... రూ.5 లక్షల సమ్ అష్యూరెన్స్‌లో సగమే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే 11వ ఏడాది నుంచి రూ.2.5 లక్షల బీమా (పెయిడప్ సమ్ అష్యూర్డ్)తో పాలసీ కొనసాగుతుంది. దీన్ని పెయిడప్ వ్యాల్యూగా అర్థం చేసుకోవాలి. దీంతోపాటు పదో ఏడాది వరకు జమైన బోనస్‌ను కూడా కలుపుతారు. దీన్నే మొత్తం చెల్లింపు విలువ (పెయిడప్+బోనస్)గా పేర్కొంటారు. అయితే, ఆ తర్వాత నుంచి ఎల్ఐసీ ప్రకటించే బోనస్, గ్యారంటీడ్ అషిషన్స్ ఈ ల్యాప్స్ అయిన పాలసీలకు వర్తించవు. కాల వ్యవధి తీరిన తర్వాత అప్పుడు పెయిడప్ వ్యాల్యూ+బోనస్ మాత్రమే ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఒకవేళ కాల వ్యవధి ముగిసే లోపు పాలసీదారుడు మరణించిన సందర్భంగా ఎదరైనా గానీ ఇంతే మొత్తం వస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకుంటే ఏటా ప్రీమియం రూ.47,000 అనుకోండి. ప్రతీ రూ.1,000కి సగటు బోనస్ 42 అనుకుంటే గడువు తీరే నాటికి మెచ్యూరిటీ విలువ రూ.18.5 లక్షలు అవుతుంది. రాబడుల రేటు 5.97%. ఇలా కాకుండా పాలసీదారుడు ఆరేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన (రూ.2,82,000) తర్వాత దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సమ్ అష్యూర్డ్ రూ.5.34 లక్షలకు తగ్గుతుంది. ప్రీమియం రూ.2,82,000 + బోనస్ 2,52,000 కలిపి ఈ మొత్తం ఖరారవుతుంది. అయితే ఈ మొత్తం కూడా మిగిలిన కాల వ్యవధి 14 ఏళ్లు ముగిసిన తర్వాతే చేతికందుతుంది. రాబడుల రేటు కేవలం 3.82 శాతం. స్పెషల్ సరెండర్ వాల్యూ ఉదాహరణకు రూ.6 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్లకు తీసుకుని ఏటా రూ.30,000 ప్రీమియం చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ.1,20,000 మాత్రమే చెల్లించారనుకుందాం. అప్పటి వరకు జమ అయిన బోనస్ సుమారు రూ.60,000. ఈ మొత్తంలో స్పెషల్ సరెండర్ వాల్యూ (స్వాధీనం విలువ) 30 శాతంగా ఉంటుంది. అంటే రూ.1,20,000+60,000 బోనస్ = రూ.1,80,000 అవుతుంది. ఇందులో 30 శాతం అంటే రూ.54,000. మరిన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించి ఉంటే ఈ సరెండర్ వాల్యూ పెరుగుతుంది. మొదటి మూడేళ్ల పాటు ఈ సరెండర్ వాల్యూ సున్నాగానే ఉంటుంది. నాలుగో ఏడాది నుంచే అమల్లోకి వస్తుంది. కాల వ్యవధి ముగిసే వరకు క్రమంగా పెరుగుతూ వెళుతుంది. స్వాధీనం చేసేదెలా? పాలసీ కొనుగోలు చేసిన ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. సర్వీసింగ్ బ్రాంచ్‌ను మార్చుకుంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలసీ పత్రాలు, దానిపై రుణం తీసుకుని ఉంటే వాటి తాలూకు పత్రాలు సర్వీసింగ్ బ్రాంచ్‌లోనే ఉంటాయి. అందుకే స్వయంగా పాలసీదారుడే సర్వీసింగ్ బ్రాంచ్‌కు వెళ్లి పాలసీని సరెండర్ చేయాలి. కావాల్సిన పత్రాలు పాలసీ బాండ్, ఎల్ఐసీ పాలసీ సరెండర్ ఫామ్ నంబర్ 5074ను ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని వెళ్లాలి. బ్యాంకు క్యాన్సిల్డ్ చెక్ (దానిపై పేరు ముద్రించి ఉండాలి) లేదా పాస్ బుక్ ఫొటోకాపీని వెంట తీసుకెళ్లాలి. ఎల్ఐసీ ప్రస్తుతం చెక్కులు ఇవ్వకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. అలాగే, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. ఈ పత్రాలను సమర్పించిన తర్వాత 5 నుంచి 10 రోజుల్లో బ్యాంకు ఖాతాలో ఎల్ఐసీ నుంచి ఫండ్స్ జమ అవుతాయి. చివరిగా ఓసారి ఆలోచించండి మీ దగ్గరున్న ఎల్ఐసీ పాలసీని పెయిడప్‌గా మార్చాలనుకుంటున్నా, సరెండర్ చేద్దామనుకుంటున్నా దీని కంటే ముందు వ్యక్తిగత బీమా కవరేజీ ఉందా, లేదా అన్నది సమీక్షించుకోవాలి. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఇది చాలా అవసరం. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ లభిస్తుంది. తాను లేని సందర్భంలో ఆశించిన అన్ని లక్ష్యాలను ఆదుకునేలా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. -
కార్తీపై లుక్ ఔట్ నోటీసులు
సాక్షి, చెన్నై: సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. ఐటీ, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ శుక్రవారం కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం.