నభా నటేశ్
జస్ట్ వారం క్రితం మీ దిమాక్‌లు ఖరాబు చేస్తానన్నారు నిధీ అగర్వాల్. అన్నంత పనీ చేశారు. ఇప్పుడు నభా నటేశ్ కూడా ఇదే మాట అంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన పాటల్లో ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే పాట ఒకటి.
హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో రామ్, నిధి, నభా పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వారం క్రితం ఈ పాటలోని నిధీ అగర్వాల్ లుక్‌ని విడుదల చేశారు. శుక్రవారం నభా నటేశ్ ఫొటో రిలీజ్ చేశారు. ‘‘నిధీ అగర్వాల్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నభా కూడా మార్కులు కొట్టేస్తారని, కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేస్తారని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment