‘‘చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలానే అయ్యాను. అదే చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద బోనస్‌లా భావిస్తున్నాను. ‘సవ్యసాచి’ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ‘మిస్టర్ మజ్ను’ రెస్పెక్ట్‌ని తెచ్చిపెట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించింది’’ అని హీరోయిన్ నిధీ అగర్వాల్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించారు. గత గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ నాకు తొలి మాస్ బ్లాక్‌బస్టర్‌ని అందించింది అంటూ పలు విశేషాలను పంచుకున్నారు నిధీ అగర్వాల్.
► సినిమా రిలీజ్ రోజున విజయవాడలో ఉన్నాను. ఉదయం ఎనిమిదిన్నరకు డైరెక్టర్ చందు మొండేటిగారు ‘ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌కి కంగ్రాట్స్’ అంటూ మెసేజ్ పంపించారు. సినిమాకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సక్సెస్‌ని మనసుకి తీసుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. ఈ సినిమాతో నాకు మాస్ పవర్ ఏంటో తెలిసింది. నేనింకా సినిమా చూడలేదు. చూద్దామంటే నాక్కూడా టికెట్స్ దొరకలేదు (నవ్వుతూ).
► సోషల్ మీడియా నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్‌గా ఉంటోంది. నాకెంతో ప్రేమను ఇస్తుంటారు. 60–70 పాజిటివ్ కామెంట్స్‌లో ఒకటీ అరా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ మొన్న ఒక్కసారి మాత్రమే రియాక్ట్ అయ్యాను. (‘ఇస్మార్ట్ శంకర్’లో ఎక్స్‌పోజింగేనా? నటనకేమైనా స్కోప్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు.. నటనతో పాటు చాలా చేశాను అని స్పందించారు నిధి).
► ‘మిస్టర్‌మజ్ను’ తర్వాత పూరీ సార్‌ని కలిశాను. ఇందులో నీది సైంటిస్ట్ పాత్ర. ఇది సూపర్‌హిట్ ఫిల్మ్ నిధీ. నువ్వు చేయాలి అన్నారు పూరీగారు. ఆయన సినిమాకు నో ఎలా చెబుతాను? పూరీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆయన సినిమాలు చూశాను. ఆయనకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ సూపర్. నేను పని చేయాలనుకున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. పెద్ద దర్శకుల సినిమాలతో మ్యాజిక్ జరుగుతుంది. పూరీగారి హీరోయిన్ అవడం లక్కీ అని ఫీలవుతున్నాను.
► సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండవు. స్క్రిప్ట్ బావుంటుంది, ఈ ఐడియా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో సినిమాలు చేస్తాం. ఫ్రైడే టు ఫ్రైడే సక్సెస్‌ని నేను నమ్మను. సినిమా రిజల్ట్‌ను ఎప్పుడూ నేను హార్ట్‌కి తీసుకోను. యాక్టింగ్ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తాను.
► రామ్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. తనో స్వీట్‌హార్ట్. ఛార్మీగారు నిర్మాతగా సూపర్. చేయాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు. పూరీగారు సెట్లో అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి. చాలా కైండ్. సెట్స్‌లో చాలా సరదాగా అనిపించేది.
► నా గురించి రామ్‌గోపాల్ వర్మగారు ట్వీట్ (సూర్యుడి కన్నా హాట్ అని నిధీని ఉద్దేశించి ట్వీట్) చేశారు. ఆయన తీసిన ‘రంగీలా’ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు కూడా ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చేసేయొచ్చు. ‘రంగీలా’ సినిమా గురించి పూరీగారితో ఓ రోజు సరదాగా షేర్ చేసుకున్నాను. తర్వాత వర్మగారు నా గురించి ట్వీట్ చేశారు. సో.. నేనేదంటే అది జరుగుతుంది (నవ్వుతూ).
► గ్లామర్ సీన్స్ ఎవరితో తీస్తున్నారు, ఏ దర్శకుడు తీస్తున్నారు అన్నది ముఖ్యం. స్క్రీన్ మీద ఎలా ఉంటుందన్నది ముఖ్యం. పూరీగారు నన్ను బాగా చూపించారు. నిన్న మా పేరెంట్స్ సినిమా చూసి బావున్నావు అన్నారు.
► ప్రస్తుతం ‘జయం’ రవితో ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో వేరే చిత్రాలు అంగీకరించలేదు. ఇప్పుడైతే నేను లవ్‌లో లేను. సింగిల్‌గా ఉన్నాను.
► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో పేజీల పేజీల డైలాగ్స్ చెప్పాను. తెలుగు మీద మంచి అవగాహన వచ్చింది. ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పుకోలేదు. కానీ డబ్బింగ్ చెబితే మాత్రం ఓ లవ్‌స్టోరీ సినిమాకు కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. లవ్ స్టోరీల్లో డైలాగ్స్ చాలా ముఖ్యం కదా.. అందుకే.
Comments
Please login to add a commentAdd a comment