charmy
-
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
ఆ డైరెక్టర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను..!
-
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఛార్మి..!
-
విజయ్‌కి ‘లైగర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: ‘లైగర్’చిత్రంలో పెట్టుబడులకు సంబంధించిన సెగ ఆ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండకు తగిలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ప్రధానంగా భారీ బడ్జెట్‌తో కూడిన ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడులు పెట్టిన వారి విషయం పైనే ఈడీ దృష్టి పెట్టింది. కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్ ద్వారా లైగర్‌లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ గత నెల 17న ఈ సినిమా దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను 10 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు? విజయ్ తన మేనేజర్‌తో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులకు ఇవ్వడానికి తన వెంట కొన్ని పత్రాలను తెచ్చారు. ఉదయం 10.30 గంటలకు విజయ్ను ప్రశ్నించడం ప్రారంభించిన అధికారులు గంట భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ చిత్ర నిర్మాణంతోపాటు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారులు ప్రశ్నల్ని సంధించారు. పారితోషికాన్ని చెక్కుల ద్వారానా, ఆన్‌లైన్‌లోనా లేదా నగదు రూపంలో తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను విజయ్ నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్నది ఈడీ అనుమానం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. నటించడం మాత్రమే తన బాధ్యతని, ఆర్థిక లావాదేవీల్లో కలగజేసుకోలేదని చెప్పారని సమాచారం. తాను ఎక్కువగా దర్శకుడితోనే సంప్రదింపులు జరిపానని, తమ మధ్య పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు, వివిధ ఫంక్షన్ల సమయంలోనూ రాకపోకలు సాగించిన, హాజరైన వారి జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. వీరికి నిర్మాతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అధికారులు త్వరలో మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. లైగర్ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్, అపూర్వ మెహతా సైతం ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్నీ ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే విజయ్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారికి కావాల్సిన జవాబులిచ్చా.. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. విచారణ నేపథ్యంలో అధికారులు తన రెమ్యునరేషన్ వివరాలు అడిగారని, తాను చెప్పానని పేర్కొన్నారు. ‘మీరందరూ ఎలా ఉన్నారు. (మీడియా వాళ్లను ఉద్దేశించి) చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... దాదాపు రోజంతా కదా!! నేను లోపల (ఈడీ కార్యాలయంలో) 12 గంటలు ఉన్నా. ఈడీ వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వారికి కావాల్సిన జవాబులు ఇచ్చాను. మీరు ఎంతగానో ప్రేమిస్తారు... ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిచినప్పుడు వచ్చి నా డ్యూటీ నేను చేశాను. గురువారం రమ్మని పిలవలేదు’అని విజయ్ అన్నారు. ఏ కేసుపై మిమ్మల్ని విచారించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్ అంటూ వెళ్లిపోయారు. -
‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది
‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్ ఫ్యాన్స్ కూడా కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు. రామ్, పూరి జగన్నాథ్ ► పూరీగారితో పాటు టీమ్ అందరం సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి. ఈ సినిమా కథను రామ్ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. రామ్ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను. ► విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం. ► ఓటీటీకి కంటెంట్ క్రియేట్ చేయడానికి మా పూరి కనెక్ట్స్ సంస్థ కూడా ప్రిపేర్ అవుతోంది. భవిష్యత్‌లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్‌లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ► ఈ లాక్డౌన్ టైమ్‌లో పూరీగారికి రైటింగ్ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో పూరి కనెక్ట్స్ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్ లేదు. మా పూరి కనెక్ట్స్ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్‌లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్‌ను ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. -
ఫైటింగ్ షురూ
‘ఫైటర్’ చిత్రానికి ముంబైలో ముహూర్తం జరిపారు పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం ఉదయం ముంబైలో ప్రారంభమయింది. విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండను సరికొత్త లుక్‌లో చూపించనున్నారట పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫైటర్ విజయ్
‘ఇస్మార్ట్ శంకర్’ తో పూరి జగన్నాథ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సక్సెస్ జోష్‌లోనే మరో హిట్ సాధించాలని స్రిప్ట్ వర్క్‌ని స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు పూరి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెట్టా లేనుకుంటున్నారు. హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే పూరి...విజయ్ దేవరకొండను ఏ మాస్ యాంగిల్లో ప్రజెంట్ చేయబోతున్నారా? అని విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
క్రేజీ కాంబినేషన్
హీరో క్యారెక్టరైజేషన్లు తీర్చిదిద్దడంలో పూరి జగన్నాథ్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం యూత్‌లో ఎనర్జిటిక్‌గా దూçసుకెళ్తున్న పేరు విజయ్ దేవరకొండ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌ను క్రేజీ అనకుండా ఉండలేం. ‘‘పూరి కనెక్ట్స్ గర్వంగా మా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తున్నాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని నిర్మాత చార్మీ తెలిపారు. -
మాస్ పవర్ ఏంటో తెలిసింది
‘‘చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలానే అయ్యాను. అదే చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద బోనస్‌లా భావిస్తున్నాను. ‘సవ్యసాచి’ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ‘మిస్టర్ మజ్ను’ రెస్పెక్ట్‌ని తెచ్చిపెట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించింది’’ అని హీరోయిన్ నిధీ అగర్వాల్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించారు. గత గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ నాకు తొలి మాస్ బ్లాక్‌బస్టర్‌ని అందించింది అంటూ పలు విశేషాలను పంచుకున్నారు నిధీ అగర్వాల్. ► సినిమా రిలీజ్ రోజున విజయవాడలో ఉన్నాను. ఉదయం ఎనిమిదిన్నరకు డైరెక్టర్ చందు మొండేటిగారు ‘ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌కి కంగ్రాట్స్’ అంటూ మెసేజ్ పంపించారు. సినిమాకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సక్సెస్‌ని మనసుకి తీసుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. ఈ సినిమాతో నాకు మాస్ పవర్ ఏంటో తెలిసింది. నేనింకా సినిమా చూడలేదు. చూద్దామంటే నాక్కూడా టికెట్స్ దొరకలేదు (నవ్వుతూ). ► సోషల్ మీడియా నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్‌గా ఉంటోంది. నాకెంతో ప్రేమను ఇస్తుంటారు. 60–70 పాజిటివ్ కామెంట్స్‌లో ఒకటీ అరా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ మొన్న ఒక్కసారి మాత్రమే రియాక్ట్ అయ్యాను. (‘ఇస్మార్ట్ శంకర్’లో ఎక్స్పోజింగేనా? నటనకేమైనా స్కోప్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు.. నటనతో పాటు చాలా చేశాను అని స్పందించారు నిధి). ► ‘మిస్టర్మజ్ను’ తర్వాత పూరీ సార్‌ని కలిశాను. ఇందులో నీది సైంటిస్ట్ పాత్ర. ఇది సూపర్‌హిట్ ఫిల్మ్ నిధీ. నువ్వు చేయాలి అన్నారు పూరీగారు. ఆయన సినిమాకు నో ఎలా చెబుతాను? పూరీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆయన సినిమాలు చూశాను. ఆయనకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ సూపర్. నేను పని చేయాలనుకున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. పెద్ద దర్శకుల సినిమాలతో మ్యాజిక్ జరుగుతుంది. పూరీగారి హీరోయిన్ అవడం లక్కీ అని ఫీలవుతున్నాను. ► సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండవు. స్క్రిప్ట్ బావుంటుంది, ఈ ఐడియా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో సినిమాలు చేస్తాం. ఫ్రైడే టు ఫ్రైడే సక్సెస్‌ని నేను నమ్మను. సినిమా రిజల్ట్‌ను ఎప్పుడూ నేను హార్ట్‌కి తీసుకోను. యాక్టింగ్ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తాను. ► రామ్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. తనో స్వీట్హార్ట్. ఛార్మీగారు నిర్మాతగా సూపర్. చేయాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు. పూరీగారు సెట్లో అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి. చాలా కైండ్. సెట్స్‌లో చాలా సరదాగా అనిపించేది. ► నా గురించి రామ్‌గోపాల్ వర్మగారు ట్వీట్ (సూర్యుడి కన్నా హాట్ అని నిధీని ఉద్దేశించి ట్వీట్) చేశారు. ఆయన తీసిన ‘రంగీలా’ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు కూడా ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చేసేయొచ్చు. ‘రంగీలా’ సినిమా గురించి పూరీగారితో ఓ రోజు సరదాగా షేర్ చేసుకున్నాను. తర్వాత వర్మగారు నా గురించి ట్వీట్ చేశారు. సో.. నేనేదంటే అది జరుగుతుంది (నవ్వుతూ). ► గ్లామర్ సీన్స్ ఎవరితో తీస్తున్నారు, ఏ దర్శకుడు తీస్తున్నారు అన్నది ముఖ్యం. స్క్రీన్ మీద ఎలా ఉంటుందన్నది ముఖ్యం. పూరీగారు నన్ను బాగా చూపించారు. నిన్న మా పేరెంట్స్ సినిమా చూసి బావున్నావు అన్నారు. ► ప్రస్తుతం ‘జయం’ రవితో ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో వేరే చిత్రాలు అంగీకరించలేదు. ఇప్పుడైతే నేను లవ్‌లో లేను. సింగిల్‌గా ఉన్నాను. ► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో పేజీల పేజీల డైలాగ్స్ చెప్పాను. తెలుగు మీద మంచి అవగాహన వచ్చింది. ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పుకోలేదు. కానీ డబ్బింగ్ చెబితే మాత్రం ఓ లవ్‌స్టోరీ సినిమాకు కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. లవ్ స్టోరీల్లో డైలాగ్స్ చాలా ముఖ్యం కదా.. అందుకే. -
స్క్రీన్ టెస్ట్
అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్ అవుతుంటాయి. అలాంటి రీమేక్ మూవీస్ గురించి ఈ వారం స్పెషల్. 1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్లో) జయభాదురీ టైటిల్ రోల్ చేశారు. ఇక్కడ (టాలీవుడ్) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుజాత 2. యన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా హిందీ ‘డాన్’కి రీమేక్. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా? ఎ) జితేంద్ర బి) రిషికపూర్ సి) మిథున్ చక్రవర్తి డి) అమితాబ్ 3. తమిళ సూపర్ డూపర్ హిట్ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్ హిట్ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) విజయ్‌కాంత్ బి) పార్తిబన్ సి) శరత్‌కుమార్ డి) రజనీకాంత్ 4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.విశ్వనాథ్ బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కె. మురళీమోహన రావు 5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం డి) తెనాలి రామకృష్ణ 6. హీరో రాజÔó ఖర్ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) నాగార్జున 7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళ్లో చేసిన నటుడెవరు? ఎ) యంజీఆర్ బి) శివాజీ గణేశన్ సి) జెమినీ గణేశన్ డి) శివకుమార్ 8. కన్నడ చిత్రం ‘యు టర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) ప్రియమణి బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) అంజలి డి) శ్రద్ధా శ్రీనాథ్ 9. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్ పి.వాసు. ఒరిజినల్ మలయాళ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) సురేశ్ కృష్ణ బి) సిద్ధిక్ లాల్ సి) ఫాజిల్ డి) ప్రియదర్శన్ 10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు? ఎ) రేఖ బి) హేమ మాలిని సి) శ్రీదేవి డి) డింపుల్ కపాడియా 11. ‘ప్రేమమ్’ తెలుగు సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఆ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) సాయిపల్లవి బి) మంజిమా మోహన్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) నివేథా థామస్ 12 మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్ హీరో ఎవరు? ఎ) అజిత్ బి) శివ కార్తికేయన్ సి) విజయ్ డి) సూర్య 13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్ చేశారు. తమిళ్లో ఆ సినిమా రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) జ్యోతిక సి) నయనతార డి) సమంత 14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్ వెర్షన్లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రియ బి) త్రిష సి) అమలాపాల్ డి) మీరా జాస్మిన్ 15. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) అజయ్ దేవగన్ బి) అక్షయ్ కుమార్ సి) సంజయ్‌దత్ డి) సైఫ్ అలీఖాన్ 16. విద్యాబాలన్ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్ డి) కె.యమ్ రాధాకృష్ణన్ 17. వెంకటేశ్ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీ ‘సూర్యవంశ్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఈవీవీ సత్యనారాయణ బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ 18. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో తెలుసా? ఎ) కరీనా కపూర్ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్ డి) ప్రియాంకా చోప్రా 19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్ ఒక్కరే. ఎవరా హీరోయిన్? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జమున డి) కాంచన 20. రీమేక్ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన శంకర్ ఓ హిందీ సినిమాని ‘నన్బన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు? ఎ) ఇలియానా బి) చార్మి సి) కాజల్ అగర్వాల్ డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ 12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
చార్మికి డ్రగ్స్‌తో సంబంధం లేదు
తండ్రి దీప్‌సింగ్ ∙తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ‘‘నా కూతురు (చార్మి) గురించి నాకు తెలుసు. పదమూడేళ్ల నుంచి తను వర్క్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేస్తూనే ఉంది. ఒకవేళ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ (డ్రగ్స్)లో నా కూతురు ఇన్వాల్వ్ అయ్యుంటే.. ఇంత అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్ ఉండేది కాదు..’’ అని సినీనటి చార్మి తండ్రి దీప్‌సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘హార్డ్‌వర్క్, డెడికేషన్ చార్మిని ఇంత దూరం తీసుకొచ్చాయి. వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పట్నుంచి ఫ్యామిలీ బాగోగులన్నీ తానే చూస్తోంది. ఇలాంటి అర్థంపర్థం లేని తప్పుడు ఊహాగానాలను ఎలా ఎదుర్కోవాలో నాకు, నా కూతురికి బాగా తెలుసు. కానీ మా అమ్మాయిపై వస్తున్న వార్తలు, కూతురికి సంబంధంలేని విషయాల్లో టార్గెట్ చేస్తున్న తీరు చూసి నా భార్య కలత చెందింది. ఆమె హృదయం ముక్కలైంది. ఇప్పుడామె ఆరోగ్యం బాగోలేదు. మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, కథలు, వార్తలు ప్రచారం చేసే ముందు దయచేసి వాళ్ల ఫ్యామిలీ గురించి ఆలోచించండి. టీవీల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి ముందు మీరు నిజానిజాలకు కట్టుబడి ఉంటే.. మీపై మాకెంతో గౌరవం ఉంటుంది. లేదంటే ఆ వార్తలు మీ స్థాయిని తగ్గించడమే కాదు.. ఓ వ్యక్తిని చెడుగా చిత్రీకరిస్తాయి. నేను పూరిగారికి మంచి స్నేహితుణ్ణి. ఆయనకు పని తప్ప మరో ధ్యాస ఉండదు. చాలా మంచి వ్యక్తి. ఐయామ్ ష్యూర్... ఆయన కూడా ఇలాంటి తప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి కాదు. త్వరలోనే క్లీన్‌చీట్ వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. -
‘మంత్ర 2’ ఆడియో ఆవిష్కరణ
-
ఛార్మి మంత్ర - 2 మూవీ స్టిల్స్
-
చార్మి నాయికగా మంత్ర 2
‘‘నేను ‘మంత్ర’ చేసిన తర్వాత అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారు? అని చాలామంది నన్నడిగారు. అదే తరహా సినిమా చేసే అవకాశం ఇప్పుడు దక్కింది. అయితే ‘మంత్ర’కీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. ఇదొక కొత్త రకం కథ. నేను సవాల్‌గా తీసుకోవాల్సిన సినిమా’’ అన్నారు చార్మి. శ్రీమతి పద్మ సమర్పణలో తేజ ఫిలింస్ పతాకంపై బోనాల శ్రీకాంత్, పి. శౌరిరెడ్డి, రవితేజ నిర్మిస్తున్న చిత్రం ‘మంత్ర-2’. చార్మి నాయికగా ఎస్వీ సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ‘మంత్ర’కి ఇది సీక్వెల్ కాదు. అదే తరహాలో ఉండే హార్రర్, థ్రిల్లర్ మూవీ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రవితేజ మాట్లాడుతూ - ‘‘ఈ కథకు చార్మీ అయితేనే బాగుంటుందనుకున్నాం. కథ వినగానే, ఆమె అంగీకరించారు. ‘మంత్ర’ అంతటి విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. సంగీతదర్శకుడిగా ఐదో సినిమా అని, పాటలతో పాటు, రీ-రికార్డింగ్‌కి కూడా స్కోప్ ఉందని శివశంకర్ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కె. సురేష్. -
ఇప్పటికింకా నా వయస్సు 25 ఏళ్ళే !
‘‘సినిమా అనేది బఫేలాంటిది. బఫేలో ఉన్న అన్ని వంటకాలను అందరూ తినరు. నచ్చినవే తింటారు. అలాగే, ఎవరికి నచ్చిన సినిమాని వాళ్లు చూస్తారు. అందరి నాడీ తెలుసుకోలేం కాబట్టి కథ, పాత్ర బాగున్న సినిమాలను ఎంపిక చేసుకుని చేస్తాను’’ అంటున్నారు చార్మి. చందు దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రేమ ఒక మైకం’ రేపు విడుదల కానుంది. ఇందులో ‘మల్లిక’ అనే వేశ్య పాత్ర చేశారు చార్మి. తన పాత్రతో పాటు సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తపరుస్తున్న చార్మీతో జరిపిన ఇంటర్వ్యూ... పెళ్లెప్పుడు? నా వయసు 25 అన్నాను కదా. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇది మంచి వయసు. 35 ఏళ్లల్లో కెరీర్ గురించి ఆలోచించలేం. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే. *** దర్శకుడు చందు ఈ సినిమా గురించి అడిగినప్పుడు ముందు ఒప్పుకోలేదట.. కారణం? గతంలో మూడు, నాలుగు సినిమాల విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. చెప్పింది ఒకటీ తీసింది ఒకటి. అందుకే నమ్మకం పోయింది. ఈసారి చేదు అనుభవం ఎదురు కాకూడదనుకున్నాను. కానీ చందు చెప్పిన కథ విన్న తర్వాత చేయాలని నిర్ణయించుకున్నాను. కాల్‌గాళ్ కేరక్టర్ కాబట్టి డైలాగ్స్, కాస్ట్యూమ్స్ మరీ ఇబ్బందికరంగా ఉంటాయేమో అన్నాను. అలా ఏం ఉండదని మాటిచ్చారు. నేను కూడా చుడిదార్లే వేసుకుని యాక్ట్ చేస్తానని చెప్పలేదు. అయితే గ్లామరస్ కాస్ట్యూమ్స్ విషయంలో ఓ గీత ఉంటుంది. ఆ గీత దాటకుండా ఉంటే చాలన్నాను. *** మరి.. చందు ఈ సినిమాని చెప్పినట్లే తీశారా? అలానే తీశారు. ఆయన సినిమాలు మ్యూజికల్ వేలో ఉంటాయి. ‘టెన్త్ క్లాస్’ సినిమా చూసినవాళ్లకి అది తెలుస్తుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. సాంగ్స్, రీ-రికార్డింగ్ అద్భుతంగా కుదిరాయి. *** మల్లిక గురించి చెబుతారా? ప్రాస్టిట్యూట్, కాల్ గాళ్‌కి మధ్య వ్యత్యాసం ఉంది. కాల్‌గాళ్ తనకు నచ్చినవాళ్లతోనే వెళుతుంది. ఇందులో మల్లిక అలాంటి అమ్మాయే. హైక్లాస్ కాల్‌గాళ్. స్టయిలిష్‌గా ఉంటుంది. తనను మించిన అందగత్తె లేదనుకుంటుంది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, ‘నీ ఫొటో పంపించు. నచ్చితే వస్తా’ అంటుంది. మల్లిక వెరీ బోల్డ్. *** మరి.. మల్లిక మహిళలకూ నచ్చుతుందా? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మహిళలందరికీ నచ్చేలా తీయాలనుకున్నాం. లేడీస్ అందరూ ఇష్టపడి చూసే విధంగా ఉంటుంది. ఎక్కడా అభ్యంతరకరంగా ఉండదు. *** ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందనుకుంటున్నారు? ‘ప్రేమ ఒక మైకం’ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘బాగుంది’ అని చిన్న మాట అన్నా చాలు.. ‘హిట్’ అయిపోతుంది. ఆ మాట అంటారనే నమ్మకం ఉంది. *** మీరు ప్రివ్యూ చూశారు కదా.. ఎలా అనిపించింది? నా మేనేజర్, డ్రైవర్, ఇంకొంతమందితో కలిసి చూశాను. క్లయిమాక్స్‌లో వాళ్లు కంట తడిపెట్టుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకులు కూడా కదిలిపోతారనే నమ్మకం ఉంది. ఎంత మంచి సినిమా అయినా, సరైన సమయంలో విడుదల చేయకపోతే.. ప్రేక్షకులకు రీచ్ కాదు. ఈ సినిమాకి పోటీ లేదు. మంచి టైమ్‌లో మంచి థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం కాబట్టి విజయం సాధించడం ఖాయం. *** డైలాగ్స్ సంగతేంటి? రచయిత పులగం చిన్నారాయణ అద్భుతంగా రాశారు. ఈ సినిమాకి డైలాగ్సే ఓ హీరో అని చెప్పాలి. లొకేషన్లో యాక్ట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు డైలాగ్స్‌కి చాలా ఇన్‌స్పయిర్ అయ్యాను. ప్రతి మాటకూ మంచి అర్థం ఉంది. *** ఈ సినిమా మీ చుట్టూనే తిరుగుతుందా? వాస్తవానికి నాకు పాపులార్టీ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. ఓ సింగర్, రైటర్, కాల్‌గాళ్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. *** మల్లిక పాత్రతో మరోసారి నంది అవార్డు సాధిస్తావనుకుంటున్నారా? మా ఇంట్లో బోల్డన్ని అల్మరాలున్నాయి. నంది వస్తే ఆనందమే. *** ఈ మధ్య ఏడు కిలోలు బరువు తగ్గారట. కారణం ఏంటి? నా పన్నెండేళ్ల కెరీర్లో చాలాసార్లు బరువు తగ్గిన, పెరిగిన సందర్భాలున్నాయి. కానీ అదంతా సినిమాల కోసం, దర్శకులు చెప్పి మీదట చేశాను. ఇప్పుడు నాకోసం తగ్గాను. ఇంకా ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా. ‘స్మాల్ సైజ్’కి చేరుకున్న తర్వాత మునుపటికన్నా రెట్టింపు ఉత్సాహంగా ఉంది. *** పన్నెండేళ్ల కెరీర్లో అపజయాల శాతం ఎక్కువే ఉంది. మీరేమంటారు? అది నిజమే. పదమూడేళ్ల వయసులో ఇండస్ట్రీకొచ్చాను. అది నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కాబట్టి మా అమ్మానాన్న, నా మేనేజర్ సలహా తీసుకునేదాన్ని. వాళ్లు తప్పు చెప్పారనను. ఇప్పుడు నా వయసు 25. నా నిర్ణయాలు నేను తీసుకుంటున్నాను. ఎప్పుడైన సందిగ్ధంలో పడ్డప్పుడు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మేనేజర్ సలహా తీసుకుంటాను. ఇక్కడ సక్సెస్, లక్ రెండూ ముఖ్యం. అదృష్టం నా వెంటే ఉంది. అందుకే... అనుకోకుండా రోజు, మంత్ర, ప్రేమ ఒక మైకం, ఇప్పుడు ప్రతిఘటనలాంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలు చేయడంవల్లే పన్నెండేళ్లయినా ఇంకా సినిమాలు చేయగలుగుతున్నాను. లేకపోతే మూడేళ్లకే కెరీర్ ముగిసిపోయేది.