చార్మికి డ్రగ్స్‌తో సంబంధం లేదు
తండ్రి దీప్‌సింగ్ ∙తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ‘‘నా కూతురు (చార్మి) గురించి నాకు తెలుసు. పదమూడేళ్ల నుంచి తను వర్క్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేస్తూనే ఉంది. ఒకవేళ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ (డ్రగ్స్)లో నా కూతురు ఇన్వాల్వ్ అయ్యుంటే.. ఇంత అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్ ఉండేది కాదు..’’ అని సినీనటి చార్మి తండ్రి దీప్‌సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘హార్డ్‌వర్క్, డెడికేషన్ చార్మిని ఇంత దూరం తీసుకొచ్చాయి. వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పట్నుంచి ఫ్యామిలీ బాగోగులన్నీ తానే చూస్తోంది. ఇలాంటి అర్థంపర్థం లేని తప్పుడు ఊహాగానాలను ఎలా ఎదుర్కోవాలో నాకు, నా కూతురికి బాగా తెలుసు. కానీ మా అమ్మాయిపై వస్తున్న వార్తలు, కూతురికి సంబంధంలేని విషయాల్లో టార్గెట్ చేస్తున్న తీరు చూసి నా భార్య కలత చెందింది. ఆమె హృదయం ముక్కలైంది.
ఇప్పుడామె ఆరోగ్యం బాగోలేదు. మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, కథలు, వార్తలు ప్రచారం చేసే ముందు దయచేసి వాళ్ల ఫ్యామిలీ గురించి ఆలోచించండి. టీవీల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి ముందు మీరు నిజానిజాలకు కట్టుబడి ఉంటే.. మీపై మాకెంతో గౌరవం ఉంటుంది. లేదంటే ఆ వార్తలు మీ స్థాయిని తగ్గించడమే కాదు.. ఓ వ్యక్తిని చెడుగా చిత్రీకరిస్తాయి. నేను పూరిగారికి మంచి స్నేహితుణ్ణి. ఆయనకు పని తప్ప మరో ధ్యాస ఉండదు. చాలా మంచి వ్యక్తి. ఐయామ్ ష్యూర్... ఆయన కూడా ఇలాంటి తప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి కాదు. త్వరలోనే క్లీన్‌చీట్ వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.