సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్‌తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్‌పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్ అస్లం ఖాన్ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది.
అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్‌ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్‌పెడ్లర్ ప్రణోయ్ దాస్‌కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్ 300 గ్రాముల ఏంఫెటమైన్ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు.
బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఓ బైక్ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment