
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, చార్మి
‘ఫైటర్’ చిత్రానికి ముంబైలో ముహూర్తం జరిపారు పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం ఉదయం ముంబైలో ప్రారంభమయింది. విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండను సరికొత్త లుక్‌లో చూపించనున్నారట పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment