fighter
-
హెజ్బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.‘‘దక్షిణ లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes. These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024 ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్‌లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.💔 pic.twitter.com/FGY2iDlvaA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024 సెప్టెంబరు 23 నుంచి లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్‌పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్‌పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి : ఆమె మహిళలకు ఆదర్శం
సాక్షి, ముంబై: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రజక బాంధవులు వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్రను గురించి స్మరించుకున్నారు. బోరీవలిలో....గొరాయి రజక మిత్రమండల్ అధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. దొరలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మకు జోహార్లు చెబుతూ.... కొవ్వొత్తులు వెలిగించి పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఐఈసందర్భంగా మండల్ కోశాధికారి చింతకింది మల్లేష్ మాట్లాడుతూ.... కోఠిలోని మహిళా యునివర్సిటికీ చాకలి ఐలమ్మ పేరిట నామకరణం చేయడం అభినందనీయమని, ఐలమ్మ ధైర్య, సాహసాలు ప్రతి మహిళకు ఆదర్శమని పేర్కొన్నారు. దీంతో బావితరాలకు ఐలమ్మ పేరు చిరస్మరణీయంగా మిగిలి పోతుందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ అధ్యక్షురాలియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు ముత్యాల బాల నరసయ్య, సెక్రటరీ బాగోలా అంజయ్య,కోశాధికారి చింతకింది మల్లేశ్, సంఘం సభ్యులు ముత్యాల భూ లచ్చయ్య, ముత్యాల స్వామి, యాదగిరి నిమ్మరాజు, మహిళలు నిమ్మరాజు భాగ్యలక్ష్మి, ముత్యాల వసంత, కిచిగారి కళావతి, చింతకింది కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు అంటాప్హిల్లో... ముంబై, అంటాప్ హిల్‌లోని తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆమె చేసిన త్యాగాలు, సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నదిగోటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మరిపెళ్లి మల్లేష్ కోశాధికారి భూమ చిన్న నర్సింహ, ఉప కోశాధికారి భూమా యాదయ్య, కార్యవర్గ సభ్యులు అక్కనపెల్లి నరసింహ, తాందారి వెంకన్న, బొమ్మపాలెం వెంకటేష్బాసవాడ కృష్ణ, అయితే రాజు మల్లేష్, పొన్న సోమయ్య, రెడ్డిపల్లి ఎల్లయ్య, భూమా వెంకటేష్, రెడ్డిపల్లి లింగయ్య, చర్లపల్లి వెంకటే‹Ù, వడ్డెబోయిన నాగరాజు, మనపెద్ది శ్రీనివాస్, భూమా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాందివలిలో... పశ్చిమ కాందివలి చార్కోప్లోని బుద్దవిహార్‌లో ముంబై రజక ఫౌండేషన్ అధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో రజక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల మహేందర్, ముత్యాల సంతోష్, మదనాల సత్తన్న, మదనాల నర్సింహులు, అక్కోల శ్రీనివాస్, గోలి శంకర్, స్వామి నల్లూరి, పోగుల రాజేశ్, గాయకులు దుబ్బాక నరేష్ లక్ష్మణ్ ఎనగందుల మమత, దవనపల్లి సుమ, కూన స్వరూప, శోభ, పద్మ, పూజ, లలిత తదితరులు పాల్గొన్నారు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్‌లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్‌లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
Daughter Save Father: సాయుధులతో ఒంటరిగా పోరాడి..
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్పూర్లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf— Vistaar News (@VistaarNews) August 6, 2024 Video Credits: Vistaar News -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్‌తో సమావేశమయ్యారు. శంకర్‌కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్‌రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్‌లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తుండటం వల్ల థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నవాటిలో 'ఓం భీమ్ బుష్' కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. లాజిక్స్ కంటే కామెడీని నమ్ముకున్న ఈ చిత్రం ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో కూడా ప్రస్తుతం 'హనుమాన్' హవా నడుస్తోంది. అలానే ఈ వారమైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. కానీ పలు డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగు స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. అలానే పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మార్చి 18 నుంచి 24 వరకు) నెట్‌ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 21 ఫైటర్ (హిందీ మూవీ) - మార్చి 21 (రూమర్ డేట్) బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22 హాట్‌స్టార్ అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 20 సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20 ఎక్స్-మ్యాన్ '97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 లూటేరే (హిందీ సిరీస్) - మార్చి 22 ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24 అమెజాన్ ప్రైమ్ మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) - మార్చి 19 ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21 రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 21 జియో సినిమా ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 21 బుక్ మై షో ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19 ఆపిల్ ప్లస్ టీవీ పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 ఆర్గిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23 (ఇదీ చదవండి: Priyanka Chopra: ఒక్క నెక్లెస్.. ఏకంగా అన్ని కోట్లు.. ఏంటంత స్పెషల్?) -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
బాబు లీల.. కేడర్ గోల
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కేడర్‌కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్‌ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
హృతిక్ రోషన్‌కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్‌ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్ మిలటరీ ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. It is bring reported that the #US has began air strikes on #Iraq Earlier we saw 5 B1 lancers flying from US towards Middle East region pic.twitter.com/bjGntkKz9I — Free Pakistan 🇺🇦 🇷🇺 🇮🇱 🇵🇸 🇺🇸 (@ukr69h) February 3, 2024 ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు. ARE WE AT WAR😳😳😳 The United States has begun a wave of airstrikes in Iraq and Syria. This is retaliation for a fatal drone attack that killed three soldiers. pic.twitter.com/JmJsM5Gpe3 — Graham Allen (@GrahamAllen_1) February 2, 2024 -
‘ఫైటర్’తో 14వ సారి 100 కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్!
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్ కి మరో రికార్డ్ కూడా దక్కింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఫైటర్ మూవీ ఆడియన్స్ ని అలరిస్తోంది. (చదవండి: ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ) ఓవర్సీస్ లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది.వార్ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్ లో ఫైటర్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఫైటర్ చిత్రం సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ చిత్రంతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు లివే! కభీ ఖుషి కభీ గమ్ క్రిష్ ధూమ్2 జోధా అక్బర్ 5.జిందా న మిలేగా దోబారా అగ్నిపథ్ క్రిష్ 3 బ్యాంగ్ బ్యాంగ్ మొహంజదారో కాబిల్ 11,సూపర్ 30 వార్ విక్రమ్ వేద ఫైటర్ -
దీపికా పదుకొణ్ మసాలా సాంగ్‌ను తొలగించిన 'ఫైటర్' టీమ్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్‌లో సాంగ్‌ను చూసినవారు థియేటర్లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్ మేకర్స్ షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్‌పై ఈ సాంగ్ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది. ఈ సాంగ్‌లో హీరోయిన్ దీపికా పదుకొణ్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్‌లో చూపించడం కరెక్ట్ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్‌గా ఆ సాంగ్‌ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొణ్ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది. కానీ ఆ సమయంలో షారుక్ ఖాన్ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్ థియేటర్లో కూడా రన్ అయింది. ప్రస్తుతం ఫైటర్ సినిమా విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. యూట్యూబ్‌లో మాత్రం ఈ సాంగ్‌ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
స్టార్ హీరో దేశభక్తి సినిమాపై వివాదం.. ఆ దేశాల్లో నిషేధం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న అంటే గురువారమే థియేటర్లలోకి రానుంది. హిందీలో ఒకింత పర్లేదు గానీ తెలుగులో అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అలాంటిది విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రబృందానికి మరో షాక్ తగిలింది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) బాలీవుడ్ మరీ దారుణంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా మూవీస్ మరీ ఎక్కువైపోతున్నాయి. పఠాన్, టైగర్.. ఇలా లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే తీసిన ఏరియల్ యాక్షన్ మూవీ 'ఫైటర్'. హృతిక్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించారు. అలానే 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ 'ఫైటర్' సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్గా సల్మాన్ 'టైగర్ 3' ఇలానే నిషేధానికి గురవగా, ఇప్పుడు 'ఫైటర్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. యూఏఈలో మాత్రం పీజీ 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. ఇకపోతే గల్ఫ్ కంట్రీస్‌లో నిషేధం వల్ల 'ఫైటర్' మూవీకి మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Hrithik Roshan: కష్టాన్నీ ప్యార్ కియా.. సూపర్‌హీరో బన్‌గయా!
హాలీవుడ్ సినిమాలకి ఎంతోమంది సూపర్ హీరోలు. సూపర్ మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, ఫెంటాస్టిక్ ఫోర్... ది లిస్ట్ నెవర్ స్టాప్స్... మరి మనకు సూపర్ హీరో? క్రిష్.. క్రిష్ 1.. క్రిష్ 2.. క్రిష్ 3... అందం ఉంది, నటన ఉంది, పర్సనాలిటీ ఉంది, ఎనర్జీ ఉంది, సిక్స్ ప్యాక్ ఉంది... వీటన్నింటికి తోడు ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే ఆత్మశక్తి ఉంది. అందుకే హృతిక్... సూపర్ రోషన్. దేవుడు మనకు ఏదైనా అదనంగా ఇస్తే సంతోషించాలి. కానీ హృతిక్ విషయంలో అది రివర్స్ అయ్యింది. దేవుడు అతనికి ఒకటి అదనంగా ఇచ్చాడు. ఏమిటో తెలుసా? కుడి చేతికి ఆరో వేలు. స్కూల్లో పిల్లలు అతణ్ణి వింతగా చూసేవారు. వెక్కిరించేవారు. వికృత పిల్లవాడి కింద జమకట్టేవారు. కుడి చేతి బొటన వేలు పక్కన ఇంకో బొటన వేలు ఉండటం హృతిక్ లోపం. దానిని కట్ చేసి తీసేయలేము. అలాగని ఉంచుకోలేము. ఎటువంటి ఇతర సమస్యలేని ఈ సమస్య చిన్నారి హృతిక్‌ని ఛిన్నాభిన్నం చేసింది. ఎవరితోనూ కలిసేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. ఫలితం... నత్తి. చిన్నప్పుడు హృతిక్ రోషన్‌కు నత్తి ఉండేది. మాట్లాడటానికి తడబడేవాడు. స్కూల్లో ఓరల్ టెస్టులు ఉంటాయి కదా. లేచి నిలబడి ఏదో ఒకటి ఒప్పజెప్పాలి. ఆ రోజు తప్పనిసరిగా స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఇంట్లో ఇదంతా పెద్ద నరకం. జె.ఓం ప్రకాష్ పేరు ఎవరైనా వినే ఉంటారు. ఇతడు నిర్మాత– దర్శకుడు. ‘జైజై శివశంకర్’ వంటి రాజేష్ ఖన్నా సూపర్‌హిట్ పాటలున్న ‘ఆప్ కి కసమ్’ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇతడే. ఇతని కుమార్తెనే నటుడు రాకేష్ రోషన్ వివాహం చేసుకున్నాడు. వీళ్లకు పుట్టినవాడే హృతిక్ రోషన్. తాత జె.ఓం ప్రకాష్ మాత్రం హృతిక్ మానసిక, శారీరక సమస్యలను పట్టించుకునేవాడు కాదు. తన మనవడు పెద్దయ్యి పెద్ద హీరో అవుతాడని అతడి నమ్మకం. అందుకే తాను తీసే సినిమాల్లో చైల్డ్ అప్పియరన్స్ ఇప్పించేవాడు. హృతిక్ అలా అరడజను సినిమాల్లో నటించాడు. సినిమా వాతావరణం అలా తెలుసు. తండ్రి రాకేష్ రోషన్ హీరో కనుక అలా కూడా సినిమాలు తెలుసు. బాబాయ్ రాజేష్ రోషన్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కుటుంబంలో పుట్టిన హృతిక్ కచ్చితంగా సినిమా హీరోయే కావాలి. కాని అదంత సులభం కాలేదు. తండ్రులు కొడుకులను కాపాడాలనుకుంటారు. రాకేష్ రోషన్ కూడా హృతిక్‌ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే అతడి జీవితం సాఫీగా సాగలేదు. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. నిర్మాతగా ట్రై చేశాడు. అందులోనూ ఫ్లాప్స్ చూశాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక చివరి ప్రయత్నంగా దర్శకుడిగా మారి ‘ఖుద్గర్జ్’ సినిమా తీశాడు. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఖూన్ భరీ మాంగ్’, ‘కిషన్ కన్హయ్య’ వంటి భారీ హిట్స్ ఇచ్చాడు. అయినా సరే గ్యారంటీ లేని ఈ రంగంలోకి వచ్చే ముందు ఏదో ఒక బతుకు విద్య ఉండాలని కొడుకు విషయంలో భావించాడు. ‘అమెరికా వెళ్లి స్పెషల్ ఎఫెక్ట్స్ నేర్చుకునిరా’ అన్నాడు హృతిక్‌ని. హృతిక్ అంగీకరించాడు. దానికి ముందు ఏదైనా టెక్నికల్ కోర్సు కూడా చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికీ సరే అన్నా హృతిక్ మనసు చెబుతోంది– ఇవన్నీ తన పనులు కాదని, తను పుట్టింది వీటి కోసం కాదని, తను హీరో కావాలని. ఒకరోజు నేరుగా వెళ్లి తండ్రి వద్ద చెప్పేశాడు– నాన్నా... ఇవన్నీ నా వల్ల కాదు. నేను హీరోనే అవుతా. రాకేష్ రోషన్ పరికించి చూశాడు. ‘సరే... స్క్రీన్ మీద ఏదైనా ఒకటి జరగాలంటే స్క్రీన్ వెనుక ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరు’ అని ఆదేశించాడు. హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు– ఆరో అసిస్టెంట్ డైరెక్టర్‌గా. రాకేష్ రోషన్ కొడుకు అన్న అదనపు గౌరవం సెట్లో హృతిక్‌కు ఏ మాత్రం ఉండేది కాదు. అందరిలాగే కష్టపడాలి. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి ఉండాలి. ‘కోయ్లా’, ‘కరణ్ అర్జున్’ సినిమాలకు అలా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. నైరోబీలో షూటింగ్ జరుగుతుంటే అందరూ ముందే స్నానాలు చేసి వెళ్లిపోతే తను ఆరోవాడు కనుక ఆఖరు చేయాల్సి వచ్చేది. అప్పటికి నీళ్లు అయిపోయి బురద నీళ్లు వచ్చేవి. ఆ బురదనీళ్లలోనే స్నానం చేసి షూటింగ్‌కు వెళ్లేవాడు. పైకి రావాలంటే కష్టం చేయాలి. పైకి వచ్చిన ప్రతివాడూ ఇలాంటి కష్టం తప్పనిసరిగా చేసే ఉంటాడు. హృతిక్‌ని హీరోగా లాంచ్ చేయాలి. తాను హీరోగా ఫ్లాప్ అయ్యాడు... కాని తన కొడుకు హీరోగా ఫ్లాప్ కాకూడదు అనుకున్నాడు రాకేష్ రోషన్. కానీ ఈ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. హృతిక్‌కు ఉన్న నత్తి ఒక సమస్య. రెండు అతడి వెన్నులో, మోకాలిలో మరో సమస్య. డాక్టర్ పరీక్షించి చూసి ‘నువ్వు జన్మలో డాన్స్ చేయలేవు. చేయకూడదు’ అని చెప్పాడు. ఓడిపోయేవాడైతే ఆ మాట విన్న వెంటనే పోతాడు. కానీ హృతిక్ గెలవాలని నిశ్చయించుకున్నవాడు. అంతే ఆ మాటనే సవాలుగా చేసుకుని డాన్స్ క్లాసుల్లో చేరాడు. మోకాలూ వెన్నూ విరగనీ.. నాశనం కానీ తాను మాత్రం బెస్ట్ డాన్సర్‌గా నిలవాలి అని ప్రాక్టీస్ చేశాడు. డాక్టర్ చెప్పిన సమస్య ఎటు పోయిందో ఏమో. హృతిక్ ఇప్పుడు బెస్ట్ డాన్సర్ అయ్యాడు. ఇక నత్తి విషయం. స్పీచ్ థెరపీ తీసుకున్నాడు. అంతే కాదు అర్ధరాత్రి రెండు గంటలకు లేచి ఏదో ఒక సినిమాలోని ఏదో ఒక డైలాగును గుర్తు చేసుకుని నత్తి లేకుండా దానిని చెప్పడానికి పొద్దున వరకూ ప్రాక్టీసు చేసేవాడు. నత్తి పోయింది. డాన్స్ వచ్చింది. ఇక హీరో కావడానికి రెడీగా ఉన్నాడు. కానీ అందుకు దారిలో మూడు కొండలు అడ్డంగా నిలుచుని ఉన్నాయి. ‘కహో నా ప్యార్ హై’ 2000 సంవత్సరంలో వచ్చింది. కానీ అప్పటికి ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ బాలీవుడ్‌ను ఏలుతున్నారు. బాలీవుడ్ అంటే ఈ ఖాన్ త్రయమే. దీనిని బద్దలు కొట్టే హీరో కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. అలాంటి వారు ఎవరూ రారనే ధైర్యంతో ఖాన్లు ఉన్నారు. ఇప్పుడు హృతిక్ వస్తే వీరి చరిష్మాను బ్రేక్ చేసే స్థాయిలో రావాలి. అలా అతణ్ణి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రాకేష్ రోషన్ ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. లవ్ స్టోరీ, మంచి పాటలు, కొత్త రకమైన డాన్సులు, అందంగా కనిపించే హీరోయిన్ అమీషా పటేల్.... జనవరి 14, 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’... విడుదలైంది. ఖాన్ త్రయం పేరుతో అలుముకున్న ఆకాశం బద్దలైంది. జనం ఆమిర్, షారుక్, సల్మాన్ ఖాన్‌లను తాత్కాలికంగా మర్చిపోయారు. ఎక్కడ చూసినా హృతిక్ రోషన్ జపమే. రాజేష్ ఖన్నా తర్వాత ఆ స్థాయిలో ఆడపిల్లలు వెర్రెత్తి పోయింది హృతిక్ రోషన్ కోసమే. దేశంలో ఎక్కడ కనిపించినా వేలాది మంది మూగిపోవడం మొదలుపెట్టారు. నెల్సన్ మండేలా అంతటి వాడు తమ దేశంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావలసిందిగా హృతిక్‌కు వర్తమానం పంపాడు. హిమాలయాల్లో ముక్కు మూసుకొని ఉండే సాధువులు కూడా గుంపులుగా ముంబై వచ్చి హృతిక్‌ని చూసి వెళ్లారనేది నిజంగా జరిగిన నిజం. కొందరు హృతిక్‌ని కొత్త అవతార్ అన్నారు. మీడియా దీనికి ‘హృతిక్ మేనియా’ అని పేరు పెట్టింది. హృతిక్ ఓవర్‌నైట్ సూపర్ స్టార్. కాని ప్రకృతి బేలెన్స్ చేయడం లేదు. ఎగరేసిన వస్తువు కింద పడాలి. అది రూలు. పడ్డాక స్థిరత్వం వస్తుంది. ఎగిరినా సరే కాళ్లు నేల మీద ఉండాలన్న తత్త్వం తెలిసొస్తుంది. ‘కహో నా ప్యార్ హై’ తర్వాత హృతిక్ రోషన్ వరుస పెట్టి ఫ్లాప్స్ ఇచ్చాడు. ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’, ‘యాదే’, ‘ఆప్ ముఝే అచ్ఛే లగ్నే లగే’, ‘ముజ్సే దోస్తీ కరోగే’, ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’... ఈ సినిమాల్లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారి సినిమా ఉంది. ప్రఖ్యాత దర్శకుడు సూరజ్ భరజ్యాతా దర్వకత్వం వహించిన సినిమా కూడా ఉంది. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. రెండేళ్లలో ఆరేడు ఫ్లాప్స్ ఇచ్చే సరికి ఖాన్ త్రయం బహుశా ముసిముసిగా నవ్వు కొని ఉంటుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని అనుకొని ఉంటుంది. మీడియా అయితే హృతిక్ ఒన్ ఫిల్మ్ వండరనీ అతడి పని అయిపోయినట్టేనని శాసనాలు దండోరా వేయించింది. కానీ అయిపోయిందంటే అయిపోయినట్టు కాదు. తిరిగి మొదలైనట్టు. తండ్రి దర్శకత్వంలో హృతిక్ హీరోగా మళ్లీ మొదలైన సినిమా ‘కోయి మిల్గయా’. హీరోకి బుద్ధిమాంద్యం... తోడుగా ఒక అంతరిక్ష జీవి... ‘కోయి మిల్గయా’ ఆడకపోయి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ ఆబాల గోపాలం ఆ సినిమా చూసింది. తండ్రీ కొడుకులు మళ్లీ హిట్ కొట్టారు. వాళ్లు ఒకటి అనుకున్నారు. హృతిక్ మిగిలిన దర్శకుల దర్శకత్వంలో భిన్నమైన సినిమాలు చేస్తూ ఉంటాడు... కానీ తండ్రి మాత్రం రెగ్యులర్‌గా అతడితో కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉంటాడు అని. అందుకనే హృతిక్ బయట దర్శకుల దర్శకత్వంలో ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి సినిమాలు చేస్తే తండ్రి దర్శకత్వంలో ‘క్రిష్’, ‘క్రిష్ 3’ వంటి సూపర్ హీరో సినిమాలు చేసి హాలీవుడ్‌కి స్పెడర్ మేన్, ఐరన్ మేన్ ఉన్నట్టు మనకు ఒక ‘క్రిష్’ ఉన్నాడని, ఉండగలడని నిరూపించాడు. అయితే అతడు కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదని అతడిలో ఒక మంచి నటుడు ఉన్నాడని ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగి దొబారా’ నిరూపించాయి. హృతిక్ ఎంతో కష్టపడి చేసిన ‘మొహంజొదారో’ ఆడలేదు. కానీ అంధుడుగా నటించి, విడుదల చేసిన ‘కాబిల్’ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఫైటర్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటుంటే అలా!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఇప్పటికే 'ఫైటర్' మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా 'హీర్ ఆస్మాని' అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ లుక్‌లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
హృతిక్-దీపిక రొమాంటిక్ సాంగ్.. రెచ్చిపోవడంలో పీక్స్!
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ సాగుతున్నాయి. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఇష్క్ జైసా కుచ్' అని సాగే ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్, దీపిక ఫుల్ రొమాటింక్ మోడ్‌లో రెచ్చిపోయారు. ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించైతే చెప్పడానికి ఇంకేం లేదు. అంతలా అదరగొట్టేశారు! వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు 'ఫైటర్' సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా.. దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?) -
హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్' నుంచి పార్టీ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫైటర్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎక్కువగా ఏరియల్ యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నాటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఫైటర్ మూవీ నుంచి "షేర్ కుల్ గయ" అనే పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్లో గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలు వచ్చాయి. అవి రెండూ కూడా సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'ఫైటర్' టీజర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్లో ఫైటర్ చిత్రం రానుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్ యాక్షన్‌గా ఈ సినిమాను నిర్మించారు. 'ఫైటర్' టీజర్లో జెట్ ఫ్లైట్స్ విన్యాసాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్ వరకు ఫైట్ జెట్స్తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ ఫైటర్ చిత్రంతో అదే రేంజ్ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో దీపికా పదుకోన్- హృతిక్ రోషన్ల మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్. ఇదే ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్ ఖాన్‌కు కమ్‌బ్యాక్ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్‌లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్‌విక్‌లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్‌లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్‌లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్‌ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్‌గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్‌లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్‌లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్‌తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్‌కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్ చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు. నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్‌కు నిరంతరం సవాల్‌గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్‌గా తీర్చిదిద్దుతారు. ఇది కూడా చదవండి: ఆదివాసీల ‘జలియన్‌వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సవాన్లో ఏం జరిగింది?