బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న అంటే గురువారమే థియేటర్లలోకి రానుంది. హిందీలో ఒకింత పర్లేదు గానీ తెలుగులో అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అలాంటిది విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రబృందానికి మరో షాక్ తగిలింది.
(ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?)
బాలీవుడ్ మరీ దారుణంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా మూవీస్ మరీ ఎక్కువైపోతున్నాయి. పఠాన్, టైగర్.. ఇలా లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే తీసిన ఏరియల్ యాక్షన్ మూవీ 'ఫైటర్'. హృతిక్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించారు. అలానే 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు.
యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ 'ఫైటర్' సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్‌గా సల్మాన్ 'టైగర్ 3' ఇలానే నిషేధానికి గురవగా, ఇప్పుడు 'ఫైటర్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. యూఏఈలో మాత్రం పీజీ 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. ఇకపోతే గల్ఫ్ కంట్రీస్‌లో నిషేధం వల్ల 'ఫైటర్' మూవీకి మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం ఉండే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment