ఇష్క్‌ జైసా కుచ్‌.. | Fighter: Deepika Padukone and Hrithik Roshan Sizzle in New Song Ishq Jaisa Kuch | Sakshi
Sakshi News home page

ఇష్క్‌ జైసా కుచ్‌..

Published Sat, Dec 23 2023 1:17 AM | Last Updated on Sat, Dec 23 2023 1:17 AM

Fighter: Deepika Padukone and Hrithik Roshan Sizzle in New Song Ishq Jaisa Kuch - Sakshi

హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని  మమతా ఆనంద్, రామన్‌ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా నుంచి ‘ఇష్క్‌ జైసా కుచ్‌..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌ల మధ్య వచ్చే ఫుల్‌ రొమాటింక్‌ సాంగ్‌ ‘ఇష్క్‌ జైసా కుచ్‌..’. దీపిక, హృతిక్‌ డ్యాన్స్‌ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ షంషేర్‌ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్‌ లీడర్‌ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్‌ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement