హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్.
ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.
అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్‍కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్‍ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩
Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL— Netflix India (@NetflixIndia) March 20, 2024
Comments
Please login to add a commentAdd a comment