Anil Kapoor
-
పెద్ద హీరోతో సినిమాకు సైన్ చేశా.. ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్‌కు రమ్మన్నాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు. -
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
తెల్లవారితే షూటింగ్.. రిహార్సల్స్ చేయకుండానే ఐశ్వర్యతో డ్యాన్స్ చేశా: అనిల్ కపూర్
ఐశ్వర్యా రాయ్, అక్షయ్ ఖన్నా, అనిల్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘తాల్’ (1999). సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు అవార్డులు, రివార్డులను సాధించింది. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనిల్ కపూర్. ‘‘తాల్’ గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విక్రాంత్ కపూర్ (‘తాల్’లో అనిల్ కపూర్ పాత్ర) రోల్ నా కెరీర్లో ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఈ పాత్రను నాకు ఇచ్చిన సుభాష్‌ను గుర్తుపెట్టుకుంటాను. ‘రమ్తా జోగి..’ నా ఫేవరెట్ సాంగ్. అయితే ఈ పాట నా ఫెవరెట్‌గా మారడం వెనక పెద్ద కథ ఉంది. నిజానికి ఈ పాటకు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేయాలి. కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకున్నారు. దీంతో ఈ పాటను రేపు చిత్రీకరిస్తామనగా, ముందు రోజు రాత్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వచ్చారు. నేను ఎటువంటి రిహార్సల్స్ లేకుండానే ఈ పాటను పూర్తి చేశాను. అదీ... ఐశ్వర్యా రాయ్ వంటి అద్భుతమైన డ్యాన్సర్ సరసన డ్యాన్స్ చేశాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే...ఫిల్మ్‌ఫేర్, జీ, ఐఎఫ్ఎఫ్ఏ, స్క్రీన్ అవార్డ్స్... ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఉత్తమ సహాయనటుడి విభాగం (‘తాల్’లో నటనకు గాను...)లో నాకు మేజర్ అవార్డులు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా ‘తాల్’ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది’’ అంటూ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు అనిల్ కపూర్. 12 పాటలు ఉన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
Savi Movie Review: ఫ్రెంచ్ సావిత్రి కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సావి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఓ సినిమా కథ బావుంటే ఆ కథకి ఏ భాషా హద్దు కాదు. అలాగే ఏ దేశమూ సరిహద్దు కాదు. దానికి సరైన ఉదాహరణ ‘సావి’ సినిమా. ‘సావి’ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. 2008లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రెడ్ కవాయే ‘ఎనీథింగ్ ఫర్ హర్’ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాను 8 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే, ఆరు మిలియన్ డాలర్ల రాబడితో సరిపెట్టుకుంది. అదే మూల కథతో సరిగ్గా రెండేళ్ళ తరువాత... అంటే 2010లో రస్సెల్ క్రోవ్ వంటి సీనియర్ నటుడుతో హాలీవుడ్ దర్శకుడు పాల్ హాగిస్ ‘ది నెక్ట్స్ త్రీ డేస్’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను 30 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే దాదాపు 67 మిలియన్ డాలర్లు సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ కథ ఫ్రెంచ్‌లో ప్రారంభమై హాలీవుడ్ చుట్టి 14 ఏళ్ళ తరువాత బాలీవుడ్‌కి ‘సావి’గా అడుగుపెట్టింది. అంతలా ఈ కథలో ఏముందో చూద్దాం. అందమైన ఓ చిన్న కుటుంబం. భార్య, భర్త, ఓ చిన్న పిల్లాడు. వీరే కథకు పాత్రధారులు. అనుకోని ఓ ఘటన వల్ల ఒక హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదీగా శిక్ష పడుతుంది భార్యకు. దేశం కాని దేశంలో తన బిడ్డకు తల్లిని దూరం చేయలేక ఆ భర్త శిక్ష అనుభవిస్తున్న తన భార్యను జైలు నుండి తప్పించి కుటుంబమంతా ఎలా వేరే దేశం చేరుకుంటారు అనేదే కథ. ‘సావి’లో పెద్ద మార్పేంటంటే భార్య బదులు భర్తను ఖైదీగా మార్చారు. పైగా ఇండియా సెంటిమెంట్ ప్రకారం సావి అంటే సావిత్రి అని దర్శకుడు అభినయ్ డియో సినిమా ఆఖర్లో చెప్పిస్తాడు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య ఖోస్లా టైటిల్ రోల్ చేశారు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకు ‘సావి’ మంచి ఛాయిస్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
టాలీవుడ్‌పై అనిల్ కపూర్ వ్యాఖ్యలు వైరల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మరోసారి సౌత్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్,ఫైటర్ చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన ఆయన విజయాన్ని అందుకున్నారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్‌గా ఎదిగానని అనిల్ కపూర్ అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడారు. 'మంచి పాత్రలకు నన్ను ఎంపిక చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని భాషల్లో నన్ను ఆధరిస్తారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ప్రస్తుతం వస్తున్న యూత్ ఆలోచనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అందుకే నేను సమయం దొరికితే ఎక్కువగా వారితో సంభాషిస్తాను. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే.. బాలీవుడ్లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ చిత్రాలే.. దేశంలో ఉండే గొప్ప నటుల్లో ఎక్కువమంది కూడా దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేసిన వారే.. అక్కడ గొప్ప యాక్టర్స్ ఉన్నారు. మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వచ్చినవే బాహుబలి,ఆర్ఆర్ఆర్,పుష్ప,కేజీఎఫ్ వంటి చిత్రాలు ఉన్నాయి. సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ విడదీయకండి. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి.' అని ఆయన అన్నారు. 1980లో వంశవృక్షం చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు అనిల్ కపూర్. డైరెక్టర్ బాపు ఆయన్ను పరిచయం చేశారు. బాపు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఇప్పటికే పలుమార్లు అనిల్ కపూర్ చెప్పారు. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
అబ్బురపరిచే విజువల్స్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా కనిపించనున్నారు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా మెప్పించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ట్రైలర్ చూస్తే హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్‌తో హృతిక్ రోషన్ నటన ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో బాలీవుడ్ హీరో లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్‌గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. दिल आसमान के नाम, और जान देश के नाम । जय हिन्द! 🇮🇳#FighterTrailer OUT NOW. https://t.co/8b4COYyiWy#Fighter Forever. #FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/ANMv5FreCv — Hrithik Roshan (@iHrithik) January 15, 2024 -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'ఫైటర్' టీజర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్లో ఫైటర్ చిత్రం రానుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్ యాక్షన్‌గా ఈ సినిమాను నిర్మించారు. 'ఫైటర్' టీజర్లో జెట్ ఫ్లైట్స్ విన్యాసాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్ వరకు ఫైట్ జెట్స్తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ ఫైటర్ చిత్రంతో అదే రేంజ్ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో దీపికా పదుకోన్- హృతిక్ రోషన్ల మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్. ఇదే ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్ ఖాన్‌కు కమ్‌బ్యాక్ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. -
ప్రమోషన్ లో ‘Animal’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనిల్ కూపూర్ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. -
Animal: ‘యానిమల్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Rashmika Mandanna: ‘యానిమల్’ మూవీ ప్రెస్మీట్లో రష్మిక మందన్న గ్లామర్ షో (ఫొటోలు)
-
యానిమల్ మూవీ కాస్ట్ ఫోటోలు
-
యానిమల్ నుంచి 'నాన్న నువ్ నా ప్రాణం' ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్’. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మొదటి పాటను కూడా విడుదల చేశారు. తాజాగా ఎమోషనల్‌గా ఉన్న రెండో సాంగ్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 'నాన్న నువ్ నా ప్రాణం' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో ఎమోషనల్‌గా ఉంది. తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. సోను నిగమ్ అద్భుతంగా ఆలపించారు. తాజాగా విడుదలైన పాటలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య జరిగే కథలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Anil Kapoor: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు అనీల్ కపూర్
-
త్రిశంకుస్వర్గం
సృష్టిలో ప్రకృతికి వికృతి ఉంటుంది. ప్రతి సృష్టికీ దానికి దీటైన ప్రతిసృష్టి కూడా ఉండనే ఉంటుంది. సహజమైన సృష్టి ప్రకృతి అయితే, మానవులు తమ అమోఘ మేధతో చేసిన ప్రతిసృష్టి వికృతి. సృష్టికి పోటీగా ప్రతిసృష్టి చేయాలనే తపన మానవులకు యుగాల కిందటే మొదలైంది. మానవులకు ఉన్న ఈ తపన వారి కల్పనల్లో ప్రతిఫలించింది. పురాణాలు మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు ప్రతిసృష్టి కల్పనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రతిసృష్టికి ఉదాహరణ మన పురాణాల్లోనే కనిపిస్తుంది. అదే– విశ్వామిత్ర సృష్టి. త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఏకంగా స్వర్గానికే నకలును సృష్టించాడు. విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గం దేవేంద్రుడి స్వర్గానికి ఏమాత్రమూ తీసిపోదు. కాకుంటే, కర్మకొద్ది త్రిశంకుడే అందులో తలకిందులుగా వేలాడుతూ నిలిచిపోయాడు. తన కోసం సృష్టించిన స్వర్గంలో తానే తలకిందులుగా వేలాడే దుర్గతి తటస్థించడమే ప్రతిసృష్టిలోని వికృతి! కృత్రిమ మేధతో పనిచేసే మరమనిషి ప్రస్తావన గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. హిఫీస్టస్ అనే గ్రీకుల దేవుడు క్రీట్ దీవిని రక్షించడానికి టాలోస్ అనే భారీ కంచు మరమనిషిని సృష్టించాడు. హిఫీస్టస్ మన భారతీయ పురాణాల్లోని విశ్వకర్మలాంటి వాడు. శిల్పులు, లోహశిల్పులు వంటి వారికి, అగ్నిపర్వతాలకు అధిదేవుడు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు కవి అపలోనీయస్ ఆఫ్ రోడ్స్ రాసిన ‘ఆర్గనాటికా’ కావ్యంలోనిది ఈ గాథ. ఈ కావ్యంలోనే ఒళ్లంతా బంగారమే గల మరమగువల గురించి కూడా వర్ణించాడు. వాళ్లను కూడా హిఫీస్టస్ సృష్టించాడు. ‘ఆర్గనాటికా’ గాథ ప్రకారం– హిఫీస్టస్ సృష్టించిన టాలోస్ను క్రీట్ రాజు జూస్ తన కొడుకు మైనోస్కు బహుమతిగా ఇచ్చాడు. మైనోస్ నియంతగా మారి టాలోస్ను తన శత్రువులను నిర్మూ లించడానికి వాడుకున్నాడు. కృత్రిమ మేధ శక్తిని, దుర్మార్గుల చేతిలో పడితే దానివల్ల వాటిల్లగల ప్రమాదాలనూ అపలోనీయస్ ఎంతో ముందుగానే ఊహించడం విశేషం. ‘ఆర్గనాటికా’ గాథకు ఇరవైమూడు శతాబ్దాల తర్వాత గాని ‘రోబో’ అనే మాట పుట్టలేదు. చెక్ రచయిత కారల్ కాపెక్ 1920లో రాసిన నాటకం ‘రోసమ్స్ యూనివర్సల్ రోబో’ ద్వారా ‘రోబో’ అనే మాటను వాడుకలోకి తెచ్చాడు. అప్పటి నుంచి మరమనిషికి ‘రోబో’ అనే మాట ఇంగ్లిష్‌లోకి వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకు మేధావి అరిస్టాటిల్ కూడా కృత్రిమ మేధ గురించిన ఆలోచనలు చేశాడు. ఆయన తన ‘పాలిటిక్స్’ గ్రంథంలో ‘ప్రతి పరికరమూ తనను ఉప యోగించే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా లేదా వారి అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా వాటి పని అవి చేసుకోగలిగితే చేతివృత్తుల వారికి కార్మికుల అవసరం ఉండదు. అలాగే యజమానులకు బానిసల అవసరం కూడా ఉండదు’ అని రాశాడు. మనుషులు శ్రమలో నిరంతరం నలిగిపోకుండా, వాళ్లు తమ పనులను యంత్రాలకు అప్పగించి నిక్షేపంగా జీవితాన్ని ఆస్వాదించాలనేది ఆయన ఆలోచన. కృత్రిమ మేధతో పనిచేసే మరమనుషులను గురించి ప్రాచీనులు కల్పనలు చేసేనాటికి ప్రపంచంలో కనీసం విద్యుత్తు వినియోగంలో లేదు. అప్పట్లో రవాణా వసతులు కూడా అంతంత మాత్రమే! అయితే, నాటి కల్పనలే నేటి కార్యాచరణలు. కాల్పనికమైన ఊహలే శాస్త్ర పురోగతికి ఊతమిస్తాయి. ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఆనాటి కల్పనల్లోని వర్ణనల మాదిరిగానే ఇంచుమించుగా మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పటికే వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ఎప్పటికప్పుడు మరింతగా ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఇవి కృత్రిమ మేధతో మనుషుల మాదిరిగానే పనులు చేయగలుగుతున్నాయి. కృత్రిమ మేధ తెరమీద ఏకంగా మను షులకు నకళ్లనే సృష్టిస్తోంది. కృత్రిమ మేధ ఇప్పుడు ఆధునిక కరాభరణాలైన స్మార్ట్ఫోన్లకూ పాకింది. కృత్రిమ మేధను విస్తృతంగా వాడుకలోకి తేగలిగిన శాస్త్రవేత్తలు అపర విశ్వామిత్రులే! విశామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గంలో త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతున్నట్లుగానే, ఆధునిక శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమమేధతో మానవాళి పరిస్థితులు తలకిందులవుతాయా అనే భయాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి నిష్కారణమైన భయాలు కావు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న సమస్యలతో సతమతమవుతున్న వారిలో అనుభవపూర్వకంగా తలెత్తుతున్న భయాలు. పలు దేశాలు రాజ్యాంగబద్ధంగా గోప్యత హక్కుకు భరోసా కల్పిస్తున్నా, కృత్రిమ మేధ వల్ల మనుషుల గోప్యతకు పూచీలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. కృత్రిమ మేధ దుర్వినియోగం వల్ల నేరాలు కూడా జరుగుతున్నాయి. కృత్రిమ మేధ కళా సాహితీరంగాల్లోని సృజనకు సవాలుగా మారింది. నిన్న మొన్నటి వరకు నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటిస్తేనే తెరమీద కనిపించేవారు. నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటించకపోయినా, అచ్చంగా వారి రూపాలను, హావ భావ విన్యాసాలను తెరమీద ప్రదర్శించే స్థాయికి చేరుకుంది కృత్రిమ మేధ. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇదే సమస్యపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, తన రూపాన్ని, మాటలను, హావభావాలను కృత్రిమ మేధ సహాయంతో ప్రదర్శించకుండా ఉండేలా కోర్టు నుంచి ఇటీవల ఉత్తర్వులను కూడా పొందాడు. కృత్రిమ మేధ ఒకవైపు కొన్ని పనులను సులభతరం చేస్తున్నా, మరోవైపు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారం కనుక్కోకుంటే... మన పరిస్థితి త్రిశంకుస్వర్గమే! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అమర్ అక్బర్ ఆంథోనీ రచయిత కన్నుమూత!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ రచయిత ప్రయాగ్ రాజ్ మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం బాంద్రాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 కాగా.. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అమర్ అక్బర్ ఆంథోనీ, నసీబ్, కూలీ చిత్రాలకు పనిచేశారు. ఆయన మృతిపట్ల అమితాబ్‌తో పాటు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. అమితాూబ్ బచ్చన్ నసీబ్, సుహాగ్, కూలీ, మర్డ్ చిత్రాలకు కథను అందించిన ప్రయాగ్ రాజ్.. రచయితగా 100కి పైగా చిత్రాలకు పనిచేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) రాజేష్ ఖన్నా రోటీ, ధర్మేంద్ర-జీతేంద్రల ధరమ్ వీర్, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలకు స్క్రీన్‌ప్లేకు సహకారం అందించడమే కాకుండా బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన "గెరఫ్తార్" కూడా ఆయనే రాశారు. రచయితగా అతని చివరి చిత్రం దివంగత ఎస్ రామనాథన్ దర్శకత్వం వహించిన "జమానత్". అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. కాగా.. ఆదివారం ఉదయం దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై నివాళులర్పించారు. I'm truly saddened by the loss of the late Prayag Raj. Working with him on "Hifazat" was a privilege. May his soul rest in peace.🙏🏻 pic.twitter.com/Al4RP7poFb — Anil Kapoor (@AnilKapoor) September 24, 2023 Sorry to hear about the passing away of writer director actor Prayag Raj. RIP pic.twitter.com/OZN2P7xQeH — Azmi Shabana (@AzmiShabana) September 23, 2023 -
ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ షూటింగ్లో భాగంగా ఎవరినైనా కొట్టేస్తాడని గతకొంతకాలంగా ఓ ప్రచారం జరుగుతోంది. సన్నివేశం బాగా రావడం కోసం సహనటులపై నిజంగానే చేయి చేసుకుంటాడని ఈ పుకారు చాటి చెప్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న అనిల్ కపూర్ ఈ రూమర్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ఇది నిజం కాదు. కొందరు కావాలనే కొన్నింటిని పెద్దవి చేసి చెప్తారు. అలాగైతే ఇంకా ఎక్కువమంది ఇంటర్వ్యూలకు పిలుస్తారని కాబోలు! కావాలని నేను ఎందుకు కొడతాను?' అని చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) కాగా అనిల్ కపూర్‌తో జుగ్‌జుగ్ జియోలో నటించిన మనీశ్ పౌల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తొలి సన్నివేశంలోనే అనిల్ చాలా చిరాకుపడ్డాడు. నన్ను చెంపదెబ్బ కొట్టబోయాడు. ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం బాగానే ఉన్నామనుకోండి' అని పేర్కొన్నాడు. తొలి సన్నివేశంలోనే అంత చిరాకు పడి కొట్టేదాకా వచ్చాడంటే అనిల్ ఇప్పటివరకు ఎంతమందిని కొట్టి ఉంటాడోనని ప్రచారం నడిచింది. ఇక అనిల్ సినిమాల విషయానికి వస్తే.. అతడు ఇటీవల నటించిన ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్‌లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 1కి వాయిదా పడింది. ఇకపోతే ఫైటర్ సినిమాలోనూ అనిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. (ఇది చదవండి: ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్ ) -
K.Viswanath: ఆయన కళ అజరామరం- కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్‌కు తెలుగులో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి.. కళాతపస్వి కే. విశ్వనాథ్. వాళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన మృతిపై కమల్ ఎమోషనల్ అయ్యారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్లే జీవితకాలం దాటినా.. ఆయన కళకు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. ఆయన కళ అజరామరం. అమితమైన అభిమాని కమల్ హాసన్ అంటూ ట్వీట్ చేశారాయన. Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM — Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023 కిందటి ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తన మాస్టర్ విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు కమల్. ఆ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు కమల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాగర సంగమంతో మొదలైన వీళ్ల కాంబోలో.. స్వాతి ముత్యం, శుభ సంకల్పం లాంటి కల్ట్ క్లాసిక్లు వచ్చాయి. శుభ సంకల్పంతో పాటు కురుతిపునాల్(ద్రోహి), ఉత్తమ విలన్ చిత్రాల్లో కలిసి నటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి స్పందిస్తూ.. కమల్ హాసన్‌కు సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో అంటూ విశ్వనాథ్ చమత్కరించారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని ఆలోచిస్తానన్నారాయన. K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple… RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx — Anil Kapoor (@AnilKapoor) February 2, 2023 ఇక.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. కే విశ్వనాథ్ మృతిపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. విశ్వనాథ్‌గారూ తనకెంతో నేర్పించారని, ఈశ్వర్ షూటింగ్ సందర్భంలో.. ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి చెందానని ట్వీట్ చేశారు అనిల్ కపూర్. కమల్ హాసన్ ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్లో ఈశ్వర్ పేరుతో రీమేక్ చేశారు విశ్వనాథ్. అందులో అనిల్ కపూర్, విజయశాంతి లీడ్ రోల్లో నటించారు. ఉత్తమ కథగా ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ కూడా అవార్డు దక్కింది. -
అంతా ఓకే.. అతని ఆటను మళ్లీ చూస్తాం: బాలీవుడ్ నటులు
టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం రిషబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్దెఎత్తున ట్వీట్స్ చేశారు. ప్రధాని మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తుండగా.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. (ఇది చదవండి: Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు) తాజాగా రిషబ్ పంత్‌ను బాలీవుడ్ నటులు పరామర్శించారు. డెహ్రడూన్‌లో ఆస్పత్రికి వెళ్లిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ రిషబ్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అనిల్ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. అభిమానులుగా మేము అతనిని కలిశాం. రిషబ్ త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దాం. అతని ఆటను మళ్లీ గ్రౌండ్లో చూస్తాం.' అని అన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. 'పంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చాం. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పంత్, అతని తల్లి, బంధువులను కలిసి మాట్లాడాం. అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పాం. మేము వారందరినీ నవ్వించాం.' అని అన్నారు. -
దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు
ఈ ఏడాది దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్ 24న దీపావళి వేడుకకు భారత దేశమంత సిద్ధమవుతుంది. ఇక పండగ అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక్కచోట చేరి ఆనందంగా గడపడం. అన్ని పండుగల్లో ప్రత్యేకత సంతరించుకునేది దీపావళి. ఈ పండగకు మాత్రమే ఒకరి ఇంటికి మరోకరు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంత ఒక్కచోట చేరి టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉత్తరాదిలో కనిపిస్తుంది. ఇక నార్త్ అనగానే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్. ప్రతి దీపావళికి బాలీవుడ్ సెలబ్రెటీలంత ఒక కుటుంబంగా మారిపోతారు. ఈ సందర్భంగా తమ విలావంత భవనంలో గ్రాండ్ పార్టీని నిర్వహించి బి-టౌన్ తారలకు ఆతిథ్యం ఇస్తుంటారు. అందులో అమితాబ్, షారుక్, కుటుంబం ముందుంటుంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లు ఈ వేడుకను చాలా సింపుల్ జరుపుకుంది బి-టౌన్. అందుకే గత రెండేళ్లు దీపావళి సందడి పెద్దగా కనిపించలేదు. మరి ఈ ఏడాది బాలీవుడ్ తారలు దీపావళి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, కాజోల్, కపూర్ కుటుంబం వంటి తారలు దీపావళిని ఎలా సెలబ్రెట్ చేసుకున్నారో ఓ సారి చూద్దాం. అమితాబ్ బచ్చన్ ‘జల్సా’ సందడి ప్రతి ఏడాది బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తన ఇంటిలో దీపావళి పార్టీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో బాలీవుడ్ తారలందరిక ఆహ్వానం అందుతుంది. ఆ రోజు సాయంత్రం ముంబైలోని ఆయన బంగ్లా జల్సాలో బాలీవుడ్ తారలంత మెరుస్తారు. 2019లో ఆయన ఆయన హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో షారూఖ్ ఖాన్, కాజోల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సారా అలీ ఖాన్, దీపికా పదుకొనే వరకు అందరూ బిగ్ బి దీపావళి పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీ షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో రాగా సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో వచ్చింది. సెలబ్రెటీ కపుల్ అయిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. షారుక్ ఖాన్ ‘మన్నత్’ వెలుగులు ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన భార్య గౌర్ ఖాన్, కూతురు, కొడుకలతో దీపావళికి చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంత ఒకే రంగు దుస్తులు ధరించి దీపావళికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. తమ విలాసవంతమైన బంగ్లా మన్నత్‌ను దీపాలతో కలకలలాడుతుంది. ప్రతి ఏడాది సెలబ్రెటీల అత్యత్తుమ దీపావళి సెలబ్రెషన్స్‌లో ఈ షారుక్ దంపతులు మొదటి స్థానంలో నిలుస్తారు. అంతేకాదు వీరి ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటాయి. కపూర్ ఫ్యామిలీ దీపావళి తళుకులు బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అన్నదమ్ములైన బోని కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ల కుటుంబాలు ప్రతి స్పెషల్ డేస్‌కు ఒక్కచోట చేరిపోతారు. ప్రతి దీపావళికి అనిల్ కపూర్, ఆయన భార్య సునీతా కపూర్ తమ నివాసం జూహులో గ్రాండ్ పార్టీని నిర్వహిస్తారు. ఈ పార్టీకి చాలామంది బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇక 2021లో కరోనా కారణంగా దీపావళిని కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకున్నారు. ఈ వేడుకలో బోని కపూర్ ఆయన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అర్జున్ కపూర్, అతడి ప్రియురాలు మలైకా అరోరా,అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఆమె భర్త ఆనంత్ ఆహుజా, షానయా కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, మహీప్ కపూర్ తదితరులు భారతీయ వస్త్రధారణలో మెరిశారు. కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ సినీ సెలబ్రెటీల కోసం ఆయన తరచూ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇక అందులో దీపావళి అంటే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. 2019లో, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో పనిచేసే నటీనటులతో పాటు సిబ్బంది కోసం దీపావళిని గ్రాండ్‌గా హోస్ట్ చేశారు. ఈ వేడుకలో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా ఇతర నటీనటులు సందడి చేశారు. -
నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఇక సోనమ్ కపూర్ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రముఖ సెలబ్రెటీ మ్యాగజైన్ వోగ్‌కు ఫొటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బిడ్డను ఎలా పెంచాలనుకుంటుందో వివరించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన బిడ్డ భవిష్యత్తుపై ప్రస్తావించింది. ‘మా నాన్న ఓ హీరో. మాది సెలబ్రెటీ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ మమ్మల్ని చాలా సాధారణంగా పెంచారు. చదవండి: ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే.. మా అమ్మనాన్నలు(అనిల్ కపూర్, సునీత్ కపూర్) నన్ను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్థన్‌ను చాలా గోప్యంగా పెంచారు. సెలబ్రెటీల లైఫ్‌కు దూరంగా మీడియా దృష్టికి పడకుండ జాగ్రత్త పడ్డారు. వారు అలా ఎలా ఉంచగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక నా విద్యాభ్యాసం అయితే ఏ స్టార్ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్‌లో జరిగింది. ఆ తర్వాత జూనీయర్ కాలేజ్ కోసం బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకు అలాంటి జీవితమే ఇవ్వాలనుకుంటున్నా. వారిని సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నా. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చెప్పాలంటే.. నా బిడ్డను ఇండియాలో చదివించాలా? లండన్‌లో చదివించాలా? అని ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నా. భారత్‌లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్న అనుభూతి ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటే నా బిడ్డ విషయంలో గోప్యత కష్టమవుతుంది. అదే సమయంలో చాలామంది స్టార్ కిడ్స్ ఇక్కడ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత కొన్ని అడ్డంకులను చాలా సులువుగా దాటగలమని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది సోనమ్. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చిన ఆమె ఆగస్ట్ 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘కరణ్ నా స్క్రిప్ట్ దొంగలించాడు’ అని ఓ రచయిత, ‘నా పాటను కాపీ కొంటాడు’ అని ఓ పాకిస్తాన్ సింగర్ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా కరణ్ జోహార్‌అప్‌కమింగ్ మూవీ ‘జగ్ జుగ్ జీయో’. ఇందులో వరుణ్ ధావన్, కియారా అద్వాని హీరోయిన్లు కాగా నీతూ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. ఈ నేపథ్యంలో నిన్న(మే 22న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ తనది అంటూ విశాల్ సింగ్ అనే ఓ రచయిత వరుస ట్వీట్స్ చేశాడు. ‘కరణ్ తెరకెక్కిస్తున్న జగ్ జుగ్ జీయో కథను ‘బన్నీరాణి’ పేరుతో జనవరి 2020లో రిజిస్టర్ చేసుకున్నాను. ఫిబ్రవరి 2022లో ధర్మప్రోడక్షన్‌కు ఈ కథ మెయిల్ చేసి మీతో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాను నాకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరాను. దీనికి ధర్మ ప్రొడక్షన్ నుంచి కూడా నాకు సమాధానం వచ్చింది. కానీ, తీరా నా కథను జగ్ జుగ్ జీయో పేరుతో తెరకెక్కించారు. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కరణ్ జోహార్ గారు’ అంటూ అతడు మొదట ట్వీట్ చేశాడు. Screenshot of my mail to @DharmaMovies dated 17.02.2020. An official complaint will follow.@karanjohar @somenmishra0 @jun6lee #JugJuggJeeyo#BunnyRani@Varun_dvn @AnilKapoor @raj_a_mehta pic.twitter.com/k7WV4kvK2a — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 చదవండి: క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి ఆ తర్వాత ధర్మ ప్రొడక్ష్‌న్‌కు అతడు చేసిన స్క్రిప్ట్ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశాడు. అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్ చేస్తూ కరణ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, అతని నిర్మాణ సంస్థ, ఇతర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అతడు తెలిపాడు. మరోవైపు కరణ్ జోహార్ తన లేటెస్ట్ మూవీలో తన పాటకు కాపీ చేశారని పాకిస్తాన్ సింగర్ ఆరోపించాడు. సింగర్ అబ్రార్ ఊ హాకు గాయకుడు నిజానికి ‘జగ్ జుగ్ జీయో’లోని నాచ్ పంజాబన్ అనే పాట తనదని, ఈ పాటను ఆయన కాపీ చేశారని పేర్కొన్నాడు. కాగా చిత్రాన్ని రాజ్ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్, వయాడాట్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. If this would have been for publicity..would have given statements to all publications that contacted me today. Chose to lay down the facts in public and let you all decide what is right and what is wrong? सच और साहस हो जिसके मन में अंत में जीत उसी की रहे!https://t.co/n1f8MW3VqT — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 Outcome of this matter will be a strong comment on the power of @swaindiaorg? If #HindiCinema industry has to flourish... @swaindiaorg has to be a strong body. Hope it's taking note of this matter..and ideally should act suo moto. Being a member..am bound to register a complaint. — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 -
జగ్‌జగ్ జియో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జిగేల్మన్న కియారా అద్వానీ
-
నవ్వులు పూయిస్తున్న 'జగ్ జగ్ జీయో' ట్రైలర్
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది. -
జస్ట్ రూ.కోటి కారు కొనగలనంతే.. హీరోపై ట్రోలింగ్
Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, ఆయన కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఈ మూవీ మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని విషాదకరమైన వాస్తవాన్ని పంచుకున్నాడు. కానీ అదికాస్త రివర్స్ అయింది. హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాడు హర్షవర్ధన్ కపూర్. ఇంటర్వ్యూలో 'ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు. నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను. అందుకే నేను రూ. 3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు. నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం.' అని హర్షవర్ధన్ తెలిపాడు. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు.. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ హర్షవర్ధన్‌ను ఆడేసుకుంటున్నారు. 'నాకు కూడా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ల విచారంగా ఉండాలని ఉంది' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు అతనికున్న షూ వార్డ్రోబ్ చూపిస్తూ 'ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు. అదే నిజమైన బాధ.' 'ఇది చూసి ఆడిషన్స్‌కు 125సీసీ బైక్స్‌పై ఎవరు వెళ్తారు.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో and this guy has room filled of shoes..... pic.twitter.com/IPKVFosGZP — pretty P (@sassymocha_) May 10, 2022 Strugglers who go to auditions on 125cc bikes reading this pic.twitter.com/hiyVUvCcjk — Sagar (@sagarcasm) May 10, 2022 Siddhant Chaturvedi is a legend 🔥🔥 pic.twitter.com/8bf8IhzEVx — Rahul D / राहुल / راہول (@rdalwale) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రెగ్నెన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్
Sonam Kapoor Announces Her Pregnancy, Shares Baby Bump Pics: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. నీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే ఒక కుటుంబం నీ రాక కోసం ఎదురుచూస్తుంది'. అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
యవ్వనంగా ఉండాలంటే పాము రక్తం తాగుతారా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. 64 వయస్సులో కూడా కుర్రహీరోలు కుళ్లుకునేలా మజిల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. అయితే యంగ్‌గా కనిపించేందుకు పాము రక్తంగా తాగుతారన్న వ్యాఖ్యలకు తాజాగా స్పందించారు. ఇపుడిదే బీ టౌన్ టాపిక్‌గా మారిపోయింది. ఫిట్‌గా కండలు తిరిగిన బాడీతో అనిల్ కపూర్‌ను చూసిన యువ హీరోలు వావ్ అంటారు. జెరోజ్ క్లూనీస్ లా హాట్‌గా ఉన్నాడనే కమెంట్లు చాలా సాధారణంగా వినిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో మరింత స్టయిలిష్‌గా అదరగొడుతున్నాడు. (చదవండి :Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే) తాజాగా అర్బాజ్ ఖాన్ టాక్ షోలో అనిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీరు యవ్వనంగా ఉండటానికి పాము రక్తం తాగుతారటగా అని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. అంతేకాదు ఏకంగా ప్లాస్టిక్ సర్జన్ వెంటబెట్టుకని తిరుగుతారటగా అన్న నెటిజనుల కమెంట్లను చూపించాడు. దీంతో షాకైన అనిల్ కపూర్..ఇవి నిజమైన ప్రశ్నలేనా? లేదంటే మీరే డబ్బులిచ్చి కల్పించారా అంటూ చమత్కరించారు. పెద్దగా నవ్వేసి ఆయా కమెంట్లను కొట్టి పారేశారు. ఒక్క రోజుకి 24 గంటలు...ఇందులో ఒక గంట కూడా మనం మన శరీరం మీద శ్రద్ద పెట్టకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తద్వారా వ్యాయామ అవసరాన్ని చెప్పకనే చెప్పారు. అలాగే తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటానని అనిల్ చెప్పుకొచ్చారు. -
లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం
Sonam Kapoor In Rhea Kapoor Wedding: ‘‘మీరు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులే. మరిది కంటే కూడా ఒక స్నేహితుడిగానే మీరంటే నాకు ఎక్కువ అభిమానం. ఇప్పుడు మీరెంత సంతోషంగా ఉన్నారో.. నేను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను. లవ్ యూ’’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ తన సోదరి రియా కపూర్ భర్త కరణ్ బులానీ పట్ల ఆప్యాయతను చాటుకున్నారు. అతడితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... తనకున్న గొప్ప స్నేహితుల్లో మరిదిగారు కూడా ఒకరంటూ ప్రేమను కురిపించారు. కాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చిన్న కుమార్తె, నిర్మాత రియా కపూర్- యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కరణ్ బులానీ శనివారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత 12 ఏళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో ఉంటున్న సోనం కపూర్ సోదరి రియా వివాహానికి హాజరయ్యేందుకు ముంబైకి వచ్చారు. వివాహ తంతు జరుగుతున్న సమయంలో సోనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక చెల్లెలి పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోనం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Rhea Kapoor: నా బెస్ట్‌ఫ్రెండ్‌ని పెళ్లాడాను.. ఎంతగా ఏడ్చానో.. పూజా హెగ్డేపై డైరెక్టర్ ఆర్కే సెల్వమణి ఫైర్ -
12 ఏళ్ల తర్వాత.. నాకేమీ కొత్తగా అనిపించడం లేదు.. కానీ
Rhea Kapoor- Karan Boolani Pic After Mariage: ‘‘12 ఏళ్ల తర్వాత.. నాకు మరీ అంత సంతోషంగా ఏమీ లేదు. అలా అని నర్వస్‌గా కూడా ఫీలవడం లేదు.. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అత్యుత్తమైన వ్యక్తివి కూడా. కానీ ఈరోజు నేను ఎంతగా ఏడ్చానో.. భయంతో వణికిపోయానో నాకే తెలుసు. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు కదా! ప్రతిరోజు రాత్రి 11 గంటల కంటే ముందే.. నా తల్లిదండ్రులు నిద్రపోకముందే.. ఇంటికి చేరుకునే అమ్మాయిని నేను. ఇప్పుడు మనదైన సరికొత్త కుటుంబంలో కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం నిజంగా గొప్ప అనుభూతి’’ అంటూ బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ భావోద్వేగానికి గురయ్యారు. సోదరి రియా వివాహానికి హాజరైన సోనం కపూర్ దంపతులు కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్- సునీత కపూర్ల చిన్న కుమార్తె రియా కపూర్ పెళ్లి శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో రియా- కరణ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా భర్త కరణ్ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన సందర్భంగా అతడిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భర్త ఆనంద్ అహుజాతో సోనం కపూర్ ప్రాణ స్నేహితుడిని జీవిత భాగస్వామిగా పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా కరణ్ బూలానీ పలు యాడ్స్ నిర్మించి గుర్తింపు పొందాడు. రియా సైతం పలు బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక ఇద్దరూ కలిసి ఐషా, వేక్ అప్ సిద్ వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇక వీరి వివాహానికి హాజరయ్యేందుకు రియా సోదరి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్ లండన్ నుంచి ముంబైకి చేరుకున్నారు. ఈ వివాహ వేడకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
చిరకాల ప్రియుడితో రియా పెళ్లి..!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీతా కపూర్ల చిన్న కుమార్తె రియా కపూర్ పెళ్లి పీటలెక్కనుంది. తన చిరకాల ప్రియుడు కరణ్ బూలానీని ఈరోజు(ఆగష్టు14) జూహూలోని కపూర్ బంగ్లాలో వివాహమాడనున్నారు. ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకలు రెండు నుంచి మూడు రోజల వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు కపూర్ ఫ్యామిలీ రియా పెళ్లి వార్తలను ధృవీకరించలేదు. అయితే కరణ్ కరణ్ జుహూలోని అనిల్ కపూర్ ఇంటి వద్ద సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో శనివారమే రియా, కరణ్‌లు మూడుమూళ్ల బంధంతో ఏకం కానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా నిర్మాత అయిన రియా కపూర్, కరణ్‌తో గత 13 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. కరణ్ బూలానీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నో యాడ్స్‌ను నిర్మించి మంచి పేరును సాధించారు. అంతేగాక రియా కపూర్ నిర్మించిన ఐషా, వేక్ అప్ సిడ్ వంటి చిత్రాలకు సహాయ నిర్మాతగా పనిచేశాడు. మరోవైపు ఏడాదిపాటటు లండన్‌లో ఉన్న సోనమ్ కపూర్ గత నెల జూలైలో ముంబైకి తిరిగొచ్చింది. ఆమె భర్త ఆనంద్ అహుజా కూడా ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న రియా కపూర్, టీవీ సిరీస్ డైరెక్టర్ కరణ్ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్ భాగం కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇందుకుతోడు కొన్నిరోజుల క్రితం సోనమ్ తల్లి సునీత కపూర్.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్ అహుజాలతో పాటు కరణ్ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ జతచేసి హింట్ ఇచ్చారు. అయితే సోనమ్ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్ అయ్యింది. View this post on Instagram A post shared by SimplyAmina 🌴 (@simplyaminaofficial) -
వెడ్డింగ్ స్పెషల్ : 'మలబార్' పాట వైరల్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాహాది కార్యక్రమాల కోసం రూపొందించిన పాటకు అనూహ్య స్పందన వస్తోంది. 'మేక్ వే ఫర్ ది బ్రైడ్' అనే పేరుతో మూడు నిమిషాల సేపు సాగే పాటను యూట్యూబ్‌లో 48 గంటల్లో రెండు మిలియన్ల మంది వీక్షించారు. ఇందులో బాలీవుడ్ నటులు అనిల్‌కపూర్-కరీనా కపూర్ జంటగా కనిపిస్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లొ ఎక్కువగా వీక్షిస్తున్నట్లు తెలిపారు. -
ఏంటి బెబో: ఆ డ్రెస్‌లో ఏముంది.. మరీ అంత ధరా!
ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది కరీనా కపూర్. ఒద్దికైన శరీర సౌష్టవం కోసం కఠిన శ్రమకోర్చే బెబో తాజా లుక్ చూస్తే అలాగే అనిపిస్తోంది మరి. రెండో కుమారుడు ‘జే’ జన్మించిన తర్వాత కాస్త విరామం తీసుకున్న కరీనా.. ప్రస్తుతం యాడ్ షూట్లతో బిజీ అయ్యింది. అనిల్ కపూర్‌తో కలిసి ప్రముఖ ఆభరణాల సంస్థకు ఎండార్స్ చేస్తోంది. ఈ క్రమంలో... ఇందుకు సంబంధించిన షూట్లో పాల్గొన్న బెబో.. ఫొటోలు, వీడియో షేర్ చేసింది. ఎంతో అందంగా ఉన్న ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బెబో అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ అనార్కలీ డ్రెస్ ధరించిన కరీనా కపూర్... అద్భుతమైన జువెల్లరీతో అదరహో అనిపించింది. కాగా ఫ్యాషన్ డిజైనర్ రిధి మెహ్రా రూపొందించిన ఈ జార్జెట్ ఎంబ్రాయిడరీ ఎల్లో కలర్ డ్రెస్ ధర... అక్షరాలా లక్షా నలభై ఎనిమిది వేల రూపాయలట. ఏంటీ నమ్మబుద్ధి కావడం లేదా.. కావాలంటే.. డిజైనర్ మెహ్రీ వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు. కాగా బెబో ధరించిన ఈ డ్రెస్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘‘అంతగా ఏముంది బెబో ఆ డ్రెస్‌లో.. లక్షన్నర ఖర్చు పెట్టడానికి. ఏదేమైనా ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నావ్. డ్రెస్ భలేగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తను గర్భవతిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను కరీనా కపూర్ ఇటీవలే పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) -
వరుణ్ ధావన్ షాకింగ్ లుక్, అనిల్ కపూర్ స్పందన!
ప్రస్తుతం యంగ్ హీరోలంతా సినిమాల్లో తమ లుక్ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఏవేవో ప్రమోగాలు చేస్తుంటారు. అలా డిఫరెంట్ లుక్స్‌తో అందరికి షాక్ ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన తాజా లుక్‌తో సూపర్ స్టార్ అనిల్ కపూర్‌ను ఆశ్చర్యపరిచాడు. భారీగా కండలు పెంచేసి షర్ట్ లేకుండా దిగిన మూడు ఫొటోలను షేర్ చేశాడు. ఇలా వరుణ్‌ను చూసిన సెలబ్రెటీలు, అభిమానులు అతడి శరీర సౌష్టవంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనిల్ కపూర్ దీనిపై స్పందిస్తూ ‘టెర్రిఫిక్’ అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వరుణ్‌కు సంబంధించిన ఈ ఇన్‌స్టా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వరుణ్ తన తాజా చిత్రం ‘బేడియా’ కోసం భారీగా కండల పెంచాడట. హరర్ కామెడీ నేపథ్యంలో తెరక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కృతీ సనన్ నటిస్తోంది. కరోనా సమయంలో కూడా ఈ మూవీ అరుణాచల్ ప్రదేశ్‌లో షూటింగ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
వరుణ్ ధావన్‌కి కరోనా పాజిటివ్.. జుగ్ జుగ్.. చిన్న బ్రేక్!
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా హిందీ చిత్రం ‘జుగ్ జుగ్ జియో’ (కలకాలం జీవించు, ఆశీర్వాదం, దీవెన వంటి చాలా అర్థాలున్నాయి) చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మేం షూటింగ్ ఆరంభించాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మా సినిమా హీరో వరుణ్ ధావన్‌కు కరోనా సోకింది. వరుణ్‌తో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. ఎలాగోలా ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కరోనా సెకండ్ వేవ్‌ను ఊహించని మేం మా సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ముంబయ్‌లో ప్లాన్ చేశాం. ముందస్తుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కానీ ఇప్పుడు షూటింగ్ జరపలేని పరిస్థితి. ఈసారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే చిత్రీకరణ ఆరంభిస్తాం. ఇప్పటికి నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని ఈ చిత్రదర్శకుడు రాజ్ మెహతా పేర్కొన్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నీతూ కపూర్, అనిల్ కపూర్ కీలక పాత్రధారులు. -
స్ట్రాంగ్ ఎవ్రీడే.. నో ఎక్స్క్యూజెస్
అనిల్ కపూర్‌కు ఇప్పుడు 64 వయసు. ఫొటోలో కనిపిస్తున్నది ఆయన భుజబలమే. 60 దాటినా ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో అనిల్ కపూర్ ఎప్పుడూ అశ్రద్ధ చేయక చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ముంబైలో ఉన్నా ఔట్‌డోర్ షూటింగ్లో ఉన్నా వ్యాయామం తప్పనిసరి. ‘స్ట్రాంగ్ ఎవ్రీడే’... ‘నో ఎక్స్క్యూజెస్’ అనేది ఆయన నినాదం. అంటే ప్రతిరోజూ మనం శక్తితో ఉండాలి. వ్యాయామం చేయకుండా ఉండేందుకు సాకులు చెప్పడం మానుకోవాలి అని ఆయన ఉద్దేశ్యం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో మొన్న ఆయన ట్విటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఉదయ్‌పూర్‌లో షూటింగ్లో ఉన్నా’ అని క్యాప్షన్ పెట్టారు. హోటల్ రూమ్‌లో తన బైసెప్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారాయన ఈ ఫొటోలో. (చదవండి: సీన్ తొలగించాల్సిందే) అనిల్ కపూర్ తాజాగా ‘ఏకె వెర్సస్ ఏకె’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి రివ్యూలు పొందింది. ప్రస్తుతం ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసమే ఉదయ్‌పూర్‌లో ఉన్నారు. ఇందులో నీతూ కపూర్, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘యానిమల్’లో నటించనున్నారు. బాలీవుడ్లో అనిల్ కపూర్ నేటికీ స్టార్డమ్ తగ్గని హీరో. ఆ స్టార్డమ్ వెనుక ఆయన ఫిట్నెస్ ఉందని వేరే చెప్పాలా? -
అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్
కుమార్తె కిడ్నాప్ అయితే ఏ తండ్రి అయినా చాలా ఆందోళన చెందుతాడు. అనిల్ కపూర్ మీద కక్షతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ అతని కుమార్తె సోనమ్ కపూర్‌ను కిడ్నాప్ చేశాడు. అతని నుంచి అనిల్ కపూర్ తన కుమార్తె ను ఎలా రక్షించుకున్నాడు?ఇది నిజంగా జరగలేదు. కాని నిజంలా జరిగింది. దానినే ఇప్పుడు ‘మెటా మూవీ’, ‘ఫిల్మ్ వితిన్ ఏ ఫిల్మ్’, ‘మాక్యుమెంటరీ’ అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా విడుదలైన ఈ సినిమా తండ్రి అనిల్ కపూర్ ఎలా ఉంటాడో అన్న ఆనవాలు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది.‘ఏకె వెర్సెస్ ఏకె’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన సినిమా. ఇందులో ఒక ఏకె అనిల్ కపూర్. మరో ఏకె అనురాగ్ కశ్యప్. ఒక హీరో ఒక దర్శకుడి మధ్యలో వచ్చిన తగాదా ఆ హీరో కుమార్తెను ఆ దర్శకుడు కిడ్నాప్ చేసే వరకూ వెళుతుంది. ఇది సినిమాయే అయినా అందరూ ఇందులో తమలాంటి ఫిక్షనల్ పాత్రలనే పోషించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇది పూర్తిగా కొత్త నేరేటివ్. డాక్యుమెంటరీలా అనిపించే సినిమా. లేదా సినిమాలా అనిపించే డాక్యుమెంటరీ. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని వచ్చి దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. పోలీస్ స్టేషన్‌కు వెళితే అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ఇంటికి వచ్చి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు. కిడ్నాపర్ అయిన అనురాగ్ కశ్యప్ ‘నువ్వొక్కడివే నీ కూతురుని కనుగొనాలి’ అని కండీషన్ పెట్టడంతో అనిల్ కపూర్ ఒక్కడే బయలుదేరుతాడు. అతన్ని నీడలా అనురాగ్ కశ్యప్ అనుసరిస్తాడు కెమెరాతో. కూతురి కోసం కలవరపడిపోయే తండ్రిలా అనిల్ కపూర్ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విక్రమాదిత్య మోత్వానే దీని దర్శకుడు. అనురాగ్ కశ్యప్ నటించి డైలాగులు కూడా రాశాడు. ‘వీడి హిట్ సినిమాలు తెచ్చిన కలెక్షన్లన్నీ కలిపి వీడి తమ్ముడి ఒక్క ఫ్లాప్ సినిమా తెచ్చింది’ అని అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్‌ను వెక్కిరిస్తాడు. మన మీద మనం జోక్ చేసుకోవడం ఎదగడానికి గుర్తు. అనురాగ్ కశ్యప్, అనిల్ కపూర్ ఎదిగి చేసిన సినిమా ఇది. ప్రయోగాలు నచ్చేవారు చూడాల్సిన సినిమా ఇది. -
నాకు కోవిడ్.. బాగానే ఉన్నాను: నటి
బాలీవుడ్ సీనియర్ నటి నీతు కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ‘షూటింగ్ ముగించుకుని ముంబై వచ్చాను. ఈ వారం ప్రారంభంలో నాకు కోవిడ్-19 సోకింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. విషయం తెలిసి వెంటనే స్పందించి సాయం చేసిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్లో ఉన్నాను. డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ ధరించండి.. సామాజిక దూరం పాటించండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నీతు కపూర్. (కరోనా పాజిటివ్: రూమర్స్‌పై స్పందించిన హీరో ) View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) అయితే పోయిన వారం నీతు కపూర్.. అనిల్ కపూర్, వరుణ్ ధావన్‌లతో కలిసి చండీగఢ్‌లో ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్, దర్శకుడు రాజ్ మెహతాలకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో షూటింగ్‌కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘పుకార్లకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. నేనే స్వయంగా ప్రకటిస్తున్నాను. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
“ఏకే వర్సెస్ ఏకే” : అనిల్ కపూర్ క్షమాపణలు
న్యూ ఢిల్లీ: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న “ఏకే వర్సెస్ ఏకే” చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీసివేయాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డిమాండ్ చేసింది. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం తప్పుగా ధరించారని, వాడకూడని భాష మాట్లాడారని భారత వైమానిక దళం బుధవారం చేసిన ఓ ట్వీట్లో పేర్కొంది. ‘‘ఇది భారత దళాలలో ఉన్నవారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదు. సంబంధిత దృశ్యాలను తీసివేయాలి’’ అని చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఈ ట్వీట్లో ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో అనిల్ కపూర్ స్పందించారు. బుధవారం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘నా కొత్త చిత్రం ఏకె వర్సెస్ ఏకె ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని తెలిసింది. నేను భారత వైమానిక దళం యూనిఫాం ధరించి అభ్యంతరకర భాషను మాట్లాడి అందరినీ బాధపెట్టినందుకు నా వినయపూర్వకమైన క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏకే వర్సెస్ ఏకే. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
జగ్ జగ్ జీయో.. బ్రేకయ్యో!
కరోనా లాక్డౌన్ తర్వాత సినిమాల చిత్రీకరణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే చిత్రీకరణ సమయంలో కొందరు కరోనా బారిన పడుతుండటంతో కొన్ని చిత్రాల షూటింగ్‌కి బ్రేకులు పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మూవీ ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జగ్ జగ్ జీయో’. అనిల్ కపూర్, నీతూ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను చండీగఢ్‌లో ఆరంభించారు. అయితే వరుణ్ ధావన్, నీతూ కపూర్‌తో పాటు దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారిన పడటంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. అనిల్ కపూర్, కియారా అద్వానీకి మాత్రం నెగటివ్ అని నిర్ధారణ అయింది. -
కరోనా పాజిటివ్: రూమర్స్‌పై స్పందించిన హీరో
ముంబై: బాలీవుడ్ ‘జగ్ జగ్ జీయో’ మూవీ టీంకు కరోనా సెగ అంటుకున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ ధావన్, నటీ నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహితాలకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే ఇందులో నటిస్తున్న మరో నటుడు, సినీయర్ హీరో అనిల్ కపూర్‌కు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ఇన్‌స్టాగగ్రామ్ స్టోరీని షేర్ చేశారు. ‘నా ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకంటున్న. (చదవండి: హీరోకి, దర్శకుడికి కరోనా : నిలిచిపోయిన షూటింగ్) ఇటీవల చేయించుకున్న కోవిడ్ పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. త్వరగా కోలుకోవాలని నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘జగ్ జగ్ జీయో’లో నీతూ కపూర్, హీరో అనిల్ కపూర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఇటీవల ఛండిఘర్ వెళ్లింది. ఈ క్రమంలో ఈ సినిమా హీరో వరుణ్, నటి నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహతాలు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పటి వరకు దీనిపై వీరెవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం. -
హీరోకి, దర్శకుడికి కరోనా : నిలిచిపోయిన షూటింగ్
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ బృందానికి కరోనా షాక్ తగిలింది. తాజా నివేదికల ప్రకారం, వరుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. చండీగఢ్‌లో షూటింగ్లో ఉండగా వీరికి సోకినట్టు సమాచారం. అయితే కరోనా నిర్ధారిత పరీక్షల్లో సీనియర్ హీరో అనిల్ కపూర్‌కు నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో షూట్ ఆగిపోయిందని ఫిలింఫేర్ ఒక నివేదికలో పేర్కొంది. వరుణ్, నీతు, దర్శకుడు రాజ్ కోలుకునేంతవరకు గత నెలలో ప్రారంభమైన షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలిపింది. అయితే సినిమా ముచ్చట్లను ఎప్పటికపుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న చిత్రయూనిట్‌గానీ, నీతూ, వరుణ్, అనిల్ కపూర్‌గానీ ఈ వార్తలపై ఇంకా స్పందించ లేదు. కాగా దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ మరణం తరువాత నీతు కపూర్ మళ్లీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నీతూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతకు ముందు మహమ్మారి సమయంలో తొలిసారి విమానం ఎక్కుతున్నా..కొంచెం టెన్షన్‌గా ఉందంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ‘‘ కపూర్ సార్ నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పడానికి మీరిక్కిడ లేరు...అయినా నిత్యం నాతోనే ’’ అంటూ నీతూ తన భర్త రిషీకపూర్‌ను గుర్తు చేసుకున్నారు. అలాగే నీతూ కపూర్ కరోనా టెస్టులు చేయించుకున్న వీడియో వైరల్ అయింది. కాగా 2021లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మనీష్ పాల్ ప్రజక్త కోలి కూడా నటిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి : వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం) View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) -
‘హ్యాపీ బర్త్‌డే మై ఫన్నీయర్ వెర్షన్’
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తన సోదరుడు, నటుడు సంజయ్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇవాళ (అక్టోబర్ 17) సంజయ్ 55వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌తో కలిసి చేసిన బూమారాంగ్ వీడియోను అనిల్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: మహేశ్ వర్సెస్ అనిల్) ‘నా ప్రియమైన సోదరుడు, మై ఫన్నీయర్ వెర్షన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే సంజయ్. లవ్ యూ’ అంటూ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న రాత్రి జరిగిన సంజయ్ బర్త్‌డే పార్టీకి సంబంధించిన పలు ఫొటోలను ఆయన భార్య మహీప్ కపూర్ పలు ఫొటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే హస్భెండ్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోల్లో బోణికపూర్, అర్జున్ కపూర్, మోహిత్, సందీప్ మార్వాలు ఉన్నారు. అది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్) To the younger, brighter, fun-ner version of me... Happy Birthday #SanjayKapoor! When the situation allows, let's get away for a family vacation 🤗 Have a great day brother! Love you! pic.twitter.com/k7FZax4rsy — Anil Kapoor (@AnilKapoor) October 17, 2020 -
నటుడితో జాన్వీ స్టెప్పులు.. అనిల్ కపూర్‌కు అంకితం
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్నారు. నటనతోపాటు జాన్వీ కపూర్ మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. పలుసార్లు ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె నటించిన గుంజన్ సక్సేనా చిత్రంలో జాన్వీకి సోదరుడిగా నటించిన అంగద్ బేడీతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అంగద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం షేర్ చేశారు. ‘‘ఎవరూ చూడని డ్యాన్స్. అనిల్ కపూర్ సర్.. ఈ పాట మీకు అంకితం. మా చిత్రం గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ నుంచి రిహార్సల్ దృశ్యం’ అంటూ పోస్టు చేసిన ఈ వీడియోలో వీరిద్దరూ అనిల్ కపూర్ సూపర్ హిట్ పాట 2మై నేమ్ ఈజ్ లఖన్’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. (మా పిల్లలు ప్రతిభావంతులు) కాగా ‘గుంజన్ సక్సేనా’ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన కరణ్ జోహర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2021 డిసెంబర్లో క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (పర్ఫెక్ట్ స్టెప్పులతో ఇరగదీసిన జాన్వీ) View this post on Instagram Dance like nobody’s watching.. @anilskapoor sir this is a tribute to you. Rehearsal scene from our film #gunjansaxenathekargilgirl when gunjan expresses”dada main pilot ban na chahti hoon”. #dhinakdhindha #rampampam my #mondaymotivation 🥳😉 #dance A post shared by ANGAD BEDI (@angadbedi) on Sep 20, 2020 at 11:42pm PDT -
మహేశ్ వర్సెస్ అనిల్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తలపడనున్నారట. ఒకరి మీద ఒకరు ఎలాంటి ఎత్తులు వేసుకుంటారో చూడాలి. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. బ్యాంక్‌లో తీసుకున్న సొమ్మును తిరిగి కట్టకుండా పారిపోయే విలన్ల ఆట హీరో ఎలా కట్టించాడన్నది చిత్రకథ అని సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను సంప్రదించిందట చిత్రబృందం. అనిల్ కపూర్‌కు కథను వినిపించారట కూడా. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేశ్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరామేన్: మది. -
20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్
ముంబై: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఎప్పుడు హుషారుగా తన అభిరుచులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకిష్టమైన అలీబాగ్ ప్రదేశాన్ని 20ఏళ్ల తర్వాత సందర్శించినట్లు తెలిపారు. అనిల్ కపూర్ తెల్లషర్ట్ నీలి రంగు పాయింట్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న దృష్యాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీకు 63సంవత్సరాలంటే నమ్మలేమని చాలా యంగ్ కనిపిస్తున్నారని అనిల్ కపూర్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా అనిల్ కపూర్ సందర్శించిన బీచ్ చెట్లు, నీటితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రదేశంలొ ఉన్న అలీబాగ్ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిజికల్ ఫిట్ నెస్ వ్యాయామం చెస్తున్న దృష్యాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్) -
అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ (63) సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఈ వయస్సులో కూడా ఆయన కండల్ని, ఫిజికల్ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, యంగ్ హీరోలు వావ్....అంటున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించారు. దీనిపై స్పందించిన మరో హీరో సునీల్ శెట్టి నో ప్రాబ్లమ్ ..యంగ్ ఫేస్ మెచ్యూర్డ్ మజిల్స్.. కిల్లర్ కాంబో..అని కమెంట్ చేశారు. ఇక అనిల్ కపూర్ కుమారుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ "వావ్" అని వ్యాఖ్యానించగా, "ఫైటర్" అంటూ వరుణ్ ధావన్ పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఫోటోలతో అనిల్ కపూర్ ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అందరూ కనీసం అర్థగంట సేపు వ్యాయామం చేయాలంటూ సూచించిన సంగతి తెలిసిందే. View this post on Instagram When muscles look better than your face... A post shared by anilskapoor (@anilskapoor) on Aug 18, 2020 at 1:51am PDT -
నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్ కపూర్
‘నీకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు’ అని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్‌ను ఉద్ధేశించి పేర్కొన్నారు. మంగళవారం సోనమ్ కపూర్ 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ తన పెద్ద కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా సోనమ్ ఈసారి తన బర్త్‌డేను తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి జరుపుకోవడం విశేషం. లాక్డౌన్ కాలంలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి న్యూఢిల్లీలో ఉన్న సోనమ్.. సోమవారం ముంబైకు చేరుకున్నారు. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’) ‘ఒక కూతురిగా నీకంటే ఎవరూ బాగా ఉండలేరు. ఆనంద్ అహుజాకు సరైన భాగస్వామి. సినిమా తెరపై ఒక స్టార్. నువ్వు నా నమ్మకం, ఆనందం, నీకు తండ్రిగా ఉండటం గర్వకారణం. నా అందమైన సోల్. అలాగే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి. ఇప్పుడు మాస్టర్ చెఫ్ కూడా అయ్యావు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోనమ్. ఈ రోజు నువ్వు మా అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తునే ఉంటా.’ అంటూ అనిల్ కపూర్ తన కూతురు సోనమ్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున ) View this post on Instagram To a daughter like no other, the perfect partner to @anandahuja, a star on screen and an icon with an unimitable style. She's my confidant, my joy, my pride, the most generous hearted soul I know, (the only person I am shit scared of) & now a bona fide master chef! Happy Birthday, @sonamkapoor! I’m so happy that you’re here with all of us today! Love You, Always! A post shared by anilskapoor (@anilskapoor) on Jun 8, 2020 at 11:30am PDT కాగా అనిల్ కపూర్ పోస్ట్‌పై కూతురు సోనమ్ స్పందించారు. తండ్రికి ‘లవ్ యూ డాడీ’ అని కామెంట్ చేశారు. అలాగే అతని అల్లుడు ఆనంద్ అహుజా స్పందిస్తూ.. ‘సోనమ్ కేవలం మిమ్మల్ని మాట్రమే భయపెట్టడం లేదు. నన్ను కూడా భయపెడుతుంది’ అని సరదాగా కామెంట్ చేశాడు. View this post on Instagram The best best husband in the world , who gives me everything that I truly need. He is my blessing on my birthday. Love you @anandahuja from the first day I hugged you. A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Jun 8, 2020 at 12:33pm PDT -
‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’
‘‘అన్ని అడ్డంకులు అధిగమించి మే 19న మేం పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నాకింకా గుర్తు. నా వధువు నవ్వుతూ ఉంది. తనను చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... అవి ఆనంద భాష్పాలు. మా పెళ్లి మాటలు, వివాహ తంతు ఒక్కరోజులోనే పూర్తై పోయింది. అట్టహాసాలు, ఆర్భాటాలు లేవు. హనీమూన్‌కి కూడా వెళ్లలేదు. ఆ విషయం గురించి తను నన్ను ఇప్పటికీ ఆటపట్టిస్తూనే ఉంటుంది. తను నా జీవితంలోకి రావడం అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన విషయం’’ అంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన పెళ్లినాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సునీత కపూర్, తాను కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్ హీరోలే) కపూర్ ఖాన్‌దాన్‌కు చెందిన అనిల్, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన సునీత 1984లో మేరీ జంగ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. వారి అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం తమ పెళ్లి రోజు సందర్భంగా సునీతకు తన ప్రేమను వెల్లడించిన నాటి జ్ఞాపకాలను అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు.(మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్) ‘‘నా గర్ల్‌ఫ్రెండ్ సునీత దగ్గరకు వెళ్లి.. భార్యగా నా జీవితంలో అడుగుపెడతావా అని అడిగాను.. మా పెళ్లి ఆలస్యంగా జరిగింది. తను నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉండగలదు. తన కోసం నేనేం చేయగలను. తన కన్న కలలను కొంతమేర అయినా నిజం చేయగలనా అని నిరూపించేందుకు ఆ సమయాన్ని వినియోగించుకున్నాను. కనీసం ఒక ఇల్లు కొని, పనిమనిషిని పెట్టకోగలననే నమ్మకం వచ్చిన తర్వాత తనను పెళ్లిచేసుకోవాలనుకున్నాను. ఆ మాత్రం పొందేందుకు తను అర్హురాలే కదా. ఇంకోవిషయం కెరీర్ తొలినాళ్లలోనే పెళ్లి ఎందుకు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అయితే సునీత సాంగత్యం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేనన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ప్రేమా, కెరీరా అనే ప్రశ్నలు మాలో తలెత్తలేదు. మా దృష్టిలో ఆ రెండూ ముఖ్యమే. సమాంతరంగా సాగాల్సిన విషయాలే. ఎల్లప్పుడూ మా మధ్య అవగాహన, ప్రేమ ఇలాగే ఉంటుంది. నా ప్రేమ, జీవితం సునీతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని అనిల్ కపూర్ తన ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. కాగా అనిల్ కపూర్- సునీత జంటకు కూతుళ్ళు సోనం కపూర్, రియా కపూర్.. కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు సినిమా రంగానికే చెందిన వారు కావడం విశేషం. View this post on Instagram How 19th May became the best day of our lives! I proposed to my girlfriend Sunita and asked her to be my wife... our wedding had been delayed a lot because I wanted to be sure that I could take care of her in the way she deserved and give her everything she could ever dream of...in the very least, I needed to be able to afford to buy a house and hire a cook!! I just wanted to be worthy of her... We got married on 19th May, against all odds....I still remember when I entered her house on our wedding day and saw my bride, she was smiling and I had tears in my eyes... Tears of happiness, but also nervousness... I mean it was my wedding day! Our wedding was planned and executed within a day, and yes we may not have had a big wedding or even a honeymoon, which she still teases me about, but it was still the best thing that ever happened to me....it was now or never for us and I’m so glad we took the leap that day and started our lives together... many people prophesied that marrying so early would be disastrous for my career, but all I knew was that I did not want to waste another day without her and wanted her by my side through it all... for us it was never career or love.. it was always love AND career... I won’t say in the end we lived happily ever after...because it is not even close to the end of our love story... we still have a lot of love to share together, forever.... Happy Anniversary to the love of my life, my wife Sunita... @kapoor.sunita A post shared by anilskapoor (@anilskapoor) on May 19, 2020 at 1:53am PDT -
మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్
కరోనా పోరాటంలో బాధితుల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసి లైవ్ కాన్సర్ట్ ‘ఐ ఫర్ ఇండియా’ కార్యక్రమాన్ని వీక్షించి, విరాళాన్ని అందించిన ప్రతి ఒక్కరికి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రెండు రోజుల అనంతరం అనిల్ కపూర్ మంగళవారం సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఐ ఫర్ ఇండియా’లో తన పార్ఫామెన్స్కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఐ ఫర్ ఇండియా’ను చూసి విరాళాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు చూడని వారు సైతం చూసి విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనావైరస్కు వ్యతిరేకంగా చేస్తున్నపోరాటానికి తోచినంత సహాయం అందించాలని ప్రజలలను కోరారు. (రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్) అదే విధంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటున్న రోజువారీ వేతన కార్మికులు, వలస కూలీలకు సహాయం అందించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో కరోనాపై అందరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలేనని ప్రశంసించారు. కాగా కరోనాపై పోరుకు నిర్వహించిన ఐ‘ ఫర్ ఇండియా’ ఆదివారం సాయంత్రం ఫేస్బుక్లో లైవ్ షో ఇచ్చారు. ఫేస్బుక్ ద్వారా విరాళాలు సేకరించిన అతి పెద్ద కార్యక్రమంగా ‘ఐ ఫర్ ఇండియా’ నిలిచింది. 80 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ. 52 కోట్లు వచ్చినట్లు నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని గివ్ ఇండియా సంస్థ ఆద్వర్యంలో కరోనానపై పోరాటానికి వెచ్చించనున్నారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్, శ్రేయా ఘోషల్ తదితరులు ప్రేక్షకులను అలరించారు. (రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో..) ‘జేమ్స్.. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’ -
‘జేమ్స్.. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’
బాలీవుడ్ చాకొలెట్ బాయ్ రిషి కపూర్ మరణంపై ఆయన స్నేహితుడు, నటుడు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ఆవేదనతో కూడిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనిల్ కపూర్, రిషి కపూర్ ఒకరినొకరు ప్రేమగా జేమ్స్, పాటన్ అని పిలుచుకుంటారు. అయితే వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కలిసి విజయ్, గురుదేవ్, కరోబార్, ది బిజినెస్ ఆఫ్ లవ్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే వీరి పిల్లలు రణ్‌బీర్, సోనమ్ కపూర్ కూడా 2007లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘సావరియా’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం) pic.twitter.com/p5IdXdw3wk — Anil Kapoor (@AnilKapoor) April 30, 2020 చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ..‘నా ప్రియమైన జేమ్స్‌కు.. నీ గురించి ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియడం లేదు. కానీ చిన్నప్పటి నుంచి మన కలలను తెరపై చూసుకున్నప్పటి వరకు అన్నింటిలో మనం కలిసే ఉన్నాం. మీరు నాకు ఒక అన్నయ్యలాగా ఉన్నారు. నాకు సహాయం కావల్సినప్పుడు భుజం తట్టి నా వెంటే ఉన్నారు. ధైర్యం కోల్పోయినప్పుడు గురువులాగా ఉన్నారు. నాకు, నా కుటుంబానికి మీరు చూపిన అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు. మీరు నా తల్లికి కొడుకులాగా ఉన్నారు. అలాగే కృష్ణ ఆంటీ కూడా నాకు ఎప్పుడూ అమ్మలాగే ఉంటుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సినీ ప్రేమికులకు మీరు స్పూర్తిదాయకంగా నిలిచారు. ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటాను. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు. కానీ మీరు కోరుకున్నట్లు నేను మీ జీవితాన్ని జరుపుకుంటాను. మీ పాటన్’ అంటూ అంతిమ వీడ్కోలు పలికారు.( ముగిసిన రిషీ కపూర్ అంత్యక్రియలు ) అదే రిషి కపూర్ చివరి కోరిక.. హిందీ తెరకు రొమాంటిక్ హీరో.. తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతాను చింటూ సార్’ ‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’ బాలీవుడ్ ‘రిషి’ మరణం: పవన్ సంతాపం -
‘సోనంను ఆయన బాగా చూసుకునేవారు’
ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు. ఇర్ఫాన్ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్, ఇర్ఫాన్‌లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్లు స్లమ్‌డాగ్ మిలియనీర్, డీ-డే, చాకొలెట్ : డీప్ డార్క్ సీక్రెట్స్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి : పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది -
‘శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేశారు’
సాక్షి, ముంబై: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితయ్యారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అనిల్ కపూర్ ఓ త్రో బ్యాక్(పాత) ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫోటోకు.. ‘షూటింట్ సమయంలో నన్ను ఫోటో తీసినట్లు నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నన్ను, శ్రీదేవిని ఫోటోలో బంధించినందకు కృతజ్ఞతలు, శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను తిరిగి తెచ్చినందుకు మీకు (స్టీవ్ మెక్‌కరీ) ధన్యవాదాలు’ అంటూ ఆయన కామెంట్ జతచేశారు. అనిల్ కపూర్, అందల నటి శ్రీదేవి కలిసి 1994లో నటించిన ‘లాడ్ల’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ అమెరికన్ సినిమాటోగ్రఫర్ స్టీవ్ మెక్‌కరీ ఈ ఫోటోను తీశారు. ఈ ఫోటోలో అనిల్ కపూర్ శ్రీదేవిని తన భుజాలపై ఎత్తుకుంటే.. అదే సమయంలో శ్రీదేవి అద్దంలో చూస్తూ తన మేకప్ ఎలా ఉందో గమనిస్తోంది. (లాక్ డౌన్లో ప్రయోగం) Had no clue at the time that I was being shot by such a talented man! #SteveMccurry Thank you for capturing us and for bringing back memories with Sri ji...always a perfectionist pic.twitter.com/FepUkZ7RhB — Anil Kapoor (@AnilKapoor) April 28, 2020 మొదట అనిల్‌కపూర్‌కు సంబంధించిన ఈ త్రో బ్యాక్ ఫోటోను అమెరికన్ సినిమాటోగ్రఫర్ స్టీవ్ మెక్‌కరీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన అనిల్ కపూర్ తన ట్విటర్‌ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 70 ఏళ్ల స్టీవ్ మెక్‌కరీ బాలీవుడ్లో తాను పనిచేసిన సినిమాల్లో నటించిన నటీనటుల పాత ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఆనాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే. (చిన్న విరామం) View this post on Instagram 1st image: The late, great Sridevi checks her makeup before a scene with Anil Kapoor on film location in #Mumbai, #India, 1993. 2nd image: Dev Anand giving direction for a fight scene during rehearsal, Mumbai, 1993. 3rd image: A group of men working on a hand-painted movie poster. Mumbai, 1996. 4th image: Juhi Chawla and Rishi Kapoor prepping for a scene, Mumbai, 1993. 5th image: Amitabh Bachchan, one of the most prominent actors in the history of cinema. He has been in 200 films in over 5 decades. 2010. #SteveMcCurry #SteveMcCurryIndia #Bollywood A post shared by Steve McCurry (@stevemccurryofficial) on Apr 27, 2020 at 3:27pm PDT -
నేను లేకుండా హనీమున్కి..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక చిత్ర పరిశ్రమలో పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. బాలీవుడ్ నటీనటులు కరోనావైరస్పై అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు తమ కుంటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తన భార్య సునితా కపూర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తన జీవిత భాగస్వామి ఫ్యాషన్ డిజైనర్ సునితా కపూర్ గురించి ఓ రహస్యాన్ని వెల్లడించారు. (కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్) ‘నన్ను పెళ్లి చేసుకోవాలని సునితకు ప్రపోజల్ పెట్టినప్పుడు, మేరీ జంగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే సునితా పెళ్లికి ముందే నాకు ఇల్లు ఉండాలి, వంట మనిషి ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టారు. అనంతరం ఇళ్లు, వంట గది, వంటకు సాయం చేసే మనిషి కూడా ఉంటుందని చెప్పాను. అనంతరం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత నేను మూడు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లాను. కానీ మా మేడం మాత్రం నేను లేకుండా ఒక్కతే హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది(నవ్వుతూ). ఇక నా కూతురు రియా కపూర్ మంచి కుక్, సోనమ్ కపూర్ కూడా వంట చేయటంలో ఆసక్తిని కనబరుస్తోంది’ అని అనిల్ కపూర్ సరదాగా చెపుకొచ్చారు. అనిల్ కపూర్, సునితా కపూర్ వివాహం జరిగి 35 ఏళ్లు అవుతోంది. వీరికి రియా, సోనమ్‌తోపాటు కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్నారు. సోనమ్, హర్షవర్ధన్ నటనలో కొనసాగుతుండగా, రియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సోనమ్‌కపూర్ చాక్లెట్ వాల్నట్ కేకు తయారు చేసిన ఓ ఫోటోను తన ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram Made chocolate walnut cake today. I had run out of chocolate and @fortunegourmetindia sent me some amazing quality chocolate. Thanks so much @missdevi for organising. Love you A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Apr 10, 2020 at 5:43am PDT -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
మలంగ్ ట్రైలర్ లాంచ్
-
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్‌గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్‌తో ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. -
చిన్ననాటి ఫోటో పంచుకున్న నటుడు
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తన అభిమనులను అలరిస్తూ ఉంటారు. రిషీ.. విలక్షణమైన పాత్రలతో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రిషీ తన చిన్ననాటి ఫోటోను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఉన్నవారంతా తన పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సోదరులు.. బోని కపూర్, అనిల్ కపూర్, అదిత్య కపూర్, టూటూ శర్మలుగా పేర్కొన్నారు. వీరంతా పుట్టిన రోజు వేడుకల్లో కూల్‌డ్రింక్ కోకాకోలా తాగుతున్నట్టు కనిపిస్తున్నారు. రిషీ కొంటెగా తన పక్కన ఉన్న సోదరున్ని కొడుతున్నట్టు, అతని చేతిలో ఏదో ఉంటే.. లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ ఫోటోకి ‘ఒరిజినల్ కోకా కోలా ప్రకటనలో.. బోని కపూర్, ఆదిత్య కపూర్, రిషికపూర్, టూటూ శర్మలతోపాటు, క్యూట్ అనిల్ కపూర్’ ఉన్నారంటూ రిషీ కామెంట్ పెట్టారు. Original “Coca Cola” advertisement. Boney Kapoor,Aditya Kapoor, Rishi Kapoor,Tutu Sharma and that cute brat Anil Kapoor( photo courtesy Khalid Mohammed) pic.twitter.com/RXIEUxCAlp — Rishi Kapoor (@chintskap) November 13, 2019 రిషీ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అద్భుతం రిషీజీ.. ఇది అరుదైన ఫోటో, ఇలాంటివి మరికొన్ని ఫోటోలు పోస్ట్ చేయండి’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘మీరు చాలా ముద్దుగా ఉన్నారు. కొన్ని సార్లు మా అల్లుడిని ‘రిషీ కపూర్’ అని పిలుచుకుంటాము’ అని మరో అభిమాని కామెంట్ చేశారు. Premiere of Doosara Aadmi. pic.twitter.com/kzyhqZtg5S — Rishi Kapoor (@chintskap) October 14, 2019 రిషీ కపూర్ తాను నటించిన ‘దూస్రా ఆద్మీ’ విడుదలై 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ సినిమాకి సంబంధించిన అలనాటి ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ ఫోటోకి ‘ప్రీమియర్ ఆఫ్ దూస్రా ఆద్మీ’ అని కామెంట్ పెట్టారు. ఈ ఫోటోలో రిషీ కపూర్, యాశ్‌చోప్రా, దర్శకుడు రమోశ్ తల్వార్ ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఈ సినిమా 1977 అక్టోబర్14న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 11 నెలల తర్వాత రిషీ కపూర్ కేన్సర్ చికిత్స పూర్తి చేసుకొని న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. -
నా లక్ష్యం అదే!
‘‘ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చాలెంజ్‌లాంటిదే. యాక్టర్ నుంచి వాళ్లు ఊహించినది కాకుండా విభిన్నమైనది వస్తే ఆశ్చర్యపడతారు. అది బావుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలన్నదే నటిగా నా లక్ష్యం’’ అన్నారు ఇలియానా. ‘పాగల్‌పంతి’ అనే మల్టీస్టారర్ కామెడీతో ఈ నెల 22న థియేటర్స్‌లోకి రాబోతున్నారామె. జాన్ అబ్రహామ్, అనిల్ కపూర్, ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఇలియానా ఫుల్ కామెడీ పండించబోతున్నారట. వినోదం చేయడం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘ముబారకన్’ సినిమాలో ఫస్ట్‌టైమ్ పూర్తిస్థాయి కామెడీ ట్రై చేశాను. నా గురించి ఆలోచించినప్పుడు ప్రేక్షకులకు కామెడీ మైండ్లోకి రాదు. ‘ఆ సినిమాలో మీ పాత్ర చూసి ఆశ్చర్యపోయాం’ అని చాలా మంది అన్నారు. అలా ఆశ్చర్యపరచడం చాలా కష్టం. దానికోసం ఎలాంటి క్రేజీ పాత్ర అయినా చేయాలనుకుంటాను’’ అన్నారామె. -
‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసందే. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ.. సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ సుపర్ స్టార్ అనిల్ కపూర్ సీఎంగా ఉండాలంటూ ఆయన అభిమానులు ట్విటర్ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. కాగా 2001లో విడుదలైన ‘నాయక్’ సినిమాలో అనిల్ కపూర్ నటించిన ఒకరోజు సీఎంగా నటించిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహలో నిజ జీవితంలో కూడా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం తేలే వరకు ఆయనను సీఎంగా ఉండమంటూ.. ఈ విషయం గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అదిత్య ఠాక్రే ఓసారి ఆలోచించాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోరుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనిల్ కపూర్.. ‘ నేను నాయక్‌లో మంచి నటుడిని మాత్రమే’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. मैं nayak ही टीक हूँ 😎@vijaymau https://t.co/zs7OPYEvCP — Anil Kapoor (@AnilKapoor) October 31, 2019 దీంతో ఆయన అభిమానులు ‘హ హ్హ హ్హా సినిమాలో కూడా మొదట నిరాకరించి ఆ తర్వాత సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారంటూ’ అప్పటి నాయక్ సినిమాలోని ఆయన పాత్రను గుర్తు చేశారు. ఇక తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో వహించిన నాయక్(ఒకే ఒక్కడు రీమేక్)లో అనిల్ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అనిల్ కపూర్ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ కో దేఖా ఐసేహీ హోగా’, ‘టోటల్ ధమాల్’లో చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కరణ్ జోహర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తఖ్త్’లో కూడా ఆయన నటిస్తున్నారు. కాగాఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
టవర్ సే నహీ పవర్ సే!
పేరు వైఫై భాయ్. ఇతని నెట్వర్క్ టవర్ నుంచి కాదు... అతని పవర్‌తో నడుస్తుందట. ఈ పవర్ సిగ్నల్స్‌కి ముందుగా రాజ్ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్‌తో వైఫై భాయ్ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఇలియానా, జాన్ అబ్రహాం, అర్షద్ వార్షి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్ పంతీ’. పుల్కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల లుక్స్‌ను విడుదల చేశారు. వైఫై భాయ్ పాత్రలో అనిల్ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్ కిషోర్ పాత్రలో జాన్ అబ్రహాం కనిపిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
మొసళ్లతో పోరాటం
‘అరణ్య’( హిందీలో ‘హాథీ మేరే సాథీ’) సినిమా కోసం ఏనుగులతో సహవాసం చేశారు హీరో రానా. త్వరలో మరో హిందీ సినిమా కోసం మొసళ్లతో పోరాటం చేస్తారట. బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్, రానా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య తారాగణంగా రోనీ స్క్రూవాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. నేహా రాకేష్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారట. ఈ సినిమా కథాంశం మొసళ్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగతుందని బీ టౌన్ టాక్. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ఎక్కువ శాతం షూటింగ్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారని సమాచారం. అలాగే ఈ సినిమాలో భారీగా గ్రాఫిక్స్ వర్క్స్ ఉంటాయట. అందుకే ముందుగా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట రాకేష్. -
ఎవర్గ్రీన్ హీరో.. సౌతిండియన్ ఫుడ్డే కారణం
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చే మాట ఎవర్గ్రీన్ హీరో. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఎవరికైనా వయసు పెరుగుతుంది.. కానీ అనిల్ కపూర్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. అవును వయసు పైబడుతున్న కొద్ది అనిల్ కపూర్ మరింత యవ్వనంగా తయారవుతున్నారు. ఆయన పిల్లలకే ముప్పై ఏళ్లు పైబడ్డాయి. అయినా పిల్లల్ని, అనిల్ కపూర్‌ని పక్క పక్కన నిలబెడితే.. వారందరిని తోబుట్టువులే అనుకుంటారు ఎవరైనా. ప్రతి ఇంటర్వ్యూలో సాధరణంగా అనిల్ కపూర్‌కు ఎదురయ్యే ప్రశ్న.. ఇంత అందంగా ఉంటారు ఏం తింటారు సర్ అని. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ చెప్పేశారు అనిల్ కపూర్. తను ఇంత ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి సౌత్ ఇండియన్ ఫుడ్డే కారణం అంటున్నారు అనిల్ కపూర్. ఇడ్లీ, దోశ, సాంబార్ తినడం వల్లే తాను ఇంత అందంగా ఉన్నాను అంటున్నారు అనిల్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం. మనం కూడా ఇదే ఆహారం తింటున్నాం కదా.. మరి మనం ఎందుకు అనిల్ కపూర్‌లా కాలేకపోతున్నాం అని అడిగే వారికి డైటీషియన్ కవిత చెప్పే సమాధానం ఏంటంటే.. ఆహారంతో పాటు వ్యాయామం, మంచి జీవన శైలి పాటించాలి అంటున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశ ఆహారంలో ప్రధానంగా కన్పించే అంశం.. పులియబెట్టడం. ఇడ్లీ, దోశ పిండిని పులియబెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా పులియబెట్టిన ఆహారం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు కవిత. పులియబెట్టిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. అందువల్ల మన శరీరం తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. రెండు.. పులియబెట్టడం వల్ల ఆహార పోషక విలువ పెరుగుతుంది. తద్వారా మన శరీరం ఎక్కువ పోషకాలను గ్రహించడమే కాక శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఫలితంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పుకొచ్చారు కవిత. అయితే పులియబెట్టిన ఆహారాన్ని.. కొబ్బరి నూనెతో కలిపి ఉడికించి తింటేనే ఈ ఫలితం దక్కుతుందంటున్నారు కవిత. కొబ్బరి నూనె, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు కవిత. దాంతో పాటు తరచుగా కొబ్బరి నీరు తాగాలని సూచిస్తున్నారు. -
ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు
పాపులర్ పాటల్ని రీమిక్స్ చేసే ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉంది బాలీవుడ్. పాత పాటలకి ట్రెండీ టచ్ ఇచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటోంది. లేటెస్ట్గా రెండు పాత పాటల్ని ఒకే సినిమాలో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు. జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ నటించిన చిత్రం ‘పాగల్ పంతీ’. అనీజ్ బజ్మీ దర్శకుడు. ఈ సినిమా కోసం సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన ‘చాల్బాజ్’లోని ‘తేరా బీమార్ మేరా దిల్..’ పాటను రీమిక్స్ చేశారట. మరో పాట ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒరిజినల్ పాటలో సన్ని, శ్రీదేవి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచినట్టు, జాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో ఓ హెలైట్ అవుతుందట. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ 2005లో నటించిన బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నో ఎంట్రీ’. ఈ సినిమా విడుదలై సోమవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్ కపూర్ ఆ చిత్రంలో పాపులర్ సరదా సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సన్నివేశంలో అనిల్, ఫర్దీన్ ఖాన్‌కు పాజిటివ్‌గా ఉండమని సలహా ఇస్తుంటాడు.‘నా రక్తంలో సానుకూలత ప్రవహిస్తోంది, ఎందుకంటే నో ఎంట్రీ సినిమాకు 14 ఏళ్లు’ అనే క్యాప్షన్‌తో అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్ చేశాడు. దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ చిత్రంలో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్లు హీరోలగా నటించగా.. బిపాస బసు, లారా దత్త, ఇషా డియోల్‌లు హీరోయిన్లుగా నటించారు. అదే విధంగా ఈ సినిమా నిర్మాత బోని కపూర్ కూడా ‘2005లో అత్యంత ఘన విజయం సాధించిన ‘నో ఎంట్రీ’కి నేటితో 14 ఏళ్లు! తొందరల్లోనే మనందరం ‘నో ఎంట్రీ2’ తో మళ్లీ కలవబోతున్నందుకు సంతోషం’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నో ఎంట్రీ2’ డైరెక్టర్ అనీస్ బాజ్మీకి, చిత్ర బృందానికి బోనీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నో ఎంట్రీ’ని తెరకెక్కించిన దర్శకుడు అనీస్ బాజ్మీనే దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. B-eing positive runs in my blood 😂 #14YearsOfNoEntry @BazmeeAnees pic.twitter.com/jGSOx9Kl39 — Anil Kapoor (@AnilKapoor) August 27, 2019 -
‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్‌మీడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ - ఆశా భోంస్లే ‘20 ఏళ్ల క్రితం అరుణ్ జైట్లీని కలిశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనను ఇష్టపడుతూనే ఉన్నాను. ఆయన మరణం మన దేశానికి తీవ్ర నష్టం. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం జైట్లీ జీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.’ - అనిల్ కపూర్ ‘అరుణ్ జైట్లీ చాలా గొప్ప వ్యక్తి. లోధి గార్డెన్స్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఆయనను కలిసి పలకరించే అవకాశం లభించేది. మీరు లేని లోటు తీర్చలేనిది.’ - శేఖర్ కపూర్ ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. డైనమిక్ లీడర్, ప్రతి విషయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడప్పుడు ఆయన నన్ను కలవడానికి వచ్చే వారు. మేము చాలా సేపు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాంపం తెలియజేస్తున్నాను.’ - లతా మంగేష్కర్ ‘అరుణ్ జైట్లీ మరణించారని విని ఎంతో బాధపడ్డాను. ఆయన గొప్ప దార్శనీకుడు. ఆయనతో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ - అజయ్ దేవగన్ ‘అరుణ్‌జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ - రితేశ్ దేశ్‌ముఖ్ -
అప్పుడు కాలు.. ఇప్పుడు చేయి!
వరుస గాయాలతో హీరోయిన్ దిశా పాట్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సల్మాన్‌ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్ సమయంలో దిశా కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి దిశా గాయపడ్డారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మలాంగ్’ సినిమాలో దిశాపాట్నీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్లోనే ఆమె చేతికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేశాకే దిశా హస్పిటల్‌కి వెళ్లారు. పెద్ద గాయం కాకపోవడంతో నో రెస్ట్ అంటున్నారు దిశా. ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కేము, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
పదకొండు కిలోలు పెరగాలి!
... అంటున్నారు ఆదిత్య రాయ్ కపూర్. మోహిత్ సూరి దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పాట్నీ, అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మళంగ్’. ఈ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. తన పాత్ర కోసం పదకొండు కిలోలు పెరగనున్నారట. ‘‘ఈ సినిమా కోసం నా శరీరాన్ని భారీగా మార్చేయనున్నా. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశాను’’ అన్నారు ఆదిత్య. ‘ఆషికీ 2’ తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య కలసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. -
తనయుడితో తొలిసారి
అనిల్ కపూర్‌కు 2019 చాలా స్పెషల్ ఇయర్‌గా మారబోతోంది. ఈ ఏడాది తనయ సోనమ్ కపూర్‌తో తొలిసారి కలసి నటించారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’లో తండ్రీ–కూతుళ్లలానే కనిపించారు. తాజాగా కుమారుడు హర్షవర్థన్ కపూర్‌తో కలసి యాక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. షూటర్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. అభినవ్‌గా హర్షవర్థన్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో అభినవ్ తండ్రి అప్జిత్ బింద్రా పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ‘‘దేశం గర్వించే వ్యక్తుల కథలో భాగమవ్వడం ఎప్పుడూ సంతోషమే. ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి అస్సలు సందేహించలేదు. రెండు సినిమాలే చేసినప్పటికీ మా అబ్బాయి నాతో నటించడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు’’ అన్నారు అనిల్ కపూర్. ఇలా ఒకే ఏడాది కుమార్తె– కుమారుడితో నిజ జీవిత రిలేషన్షిప్నే స్క్రీన్ మీద చూపించడం విశేషమే. -
‘అలా చేస్తే మా నాన్న శ్రమను కించపర్చనట్లే’
బాలీవుడ్లో హీట్ రైజింగ్ టాపిక్ అంటే బంధుప్రీతి అనే చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కుదిరినప్పుడల్లా ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ బంధుప్రీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్ కార్యక్రమానికి హాజరయ్యారు సోనమ్ కపూర్. ఈ సందర్భంగా తనను విమర్శిస్తూ వచ్చిన ఓ ట్వీట్ గురించి మాట్లాడారు. ఎవరో ఓ వ్యక్తి ‘పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నావ్.. ఇప్పటికి నీకు నటించడం రాద’ని విమర్శిస్తూ నెపోటిజమ్ అని హ్యాష్‌టాగ్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘పదేళ్ల నుంచి కాదు.. 11 ఏళ్ల నుంచి నేను పరిశ్రమలో ఉంటున్నాను. ఇంతకాలం నుంచి మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు.. అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. బంధుప్రీతి అనే పదానికి ఈ రోజు అసలైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. బంధుప్రీతి అనగానే అది ఓ వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఓ వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల మీకు మంచి ఉపాధి దొరకడం. కానీ జనాలు తమ స్వలాభం కోసం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని.. అవతలివారిని కించపరుస్తున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘మా నాన్న ఓ ప్రముఖ కుటుంబం నుంచి రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నారు. ఇదంతా ఆయన కుటుంబం కోసం.. పిల్లల కోసమే చేస్తున్నారు. మా కోసం ఆయన పడిన శ్రమను మేం సరిగా వినియోగించుకోకపోతే.. ఆయన కష్టానికి మేము మర్యాద ఇవ్వనట్లే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది వారి పిల్లల కోసమే కదా’ అంటూ చెప్పుకొచ్చారు. సోనమ్ తొలిసారి తండ్రి అనీల్ కపూరతో కలిసి ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా లగా చిత్రంలో నటించారు. -
‘18 ఏళ్లకే నాకు ఫ్రీడం దొరికింది’
ప్రతీ ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది జీవితంలో అత్యంత ముఖ్యమని బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అన్నారు. తనకు పద్దెనిమిదేళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని.. అయితే తానెప్పుడు దానిని దుర్వినియోగం చేయలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ రేడియో షోలో సోనమ్ మాట్లాడుతూ.. ‘ అందరు భారతీయ పిల్లల్లాగే నాకు కూడా 18 ఏళ్లకే నా తల్లిదండ్రులు ఆర్థికంగా నాకు స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా ప్రతీ విషయంలో నాకు నేనుగా సలహాలు తీసుకునేలా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. తప్పో ఒప్పో సొంత నిర్ణయాలు తీసుకున్నపుడే వ్యక్తిగా పరిణతి చెందుతారని మా నాన్న చెబుతూ ఉంటారు. అయితే నేనెప్పుడు ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు’ అని పేర్కొన్నారు. తన తండ్రిలాగే ప్రతీ తండ్రి తమ బిడ్డలకు సొంతంగా ఎదిగే స్వేచ్ఛనివ్వాలని, అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయాలు గౌరవిస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని సోనమ్ సూచించారు. కాగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు సోనమ్. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటూ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ దేఖా తో ఐసా లగా’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాలో సోనమ్ లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం జోయా ఫ్యాక్టర్ సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉన్నారు. -
ఆస్కార్ లైబ్రరీకి సోనమ్ సినిమా
కపూర్ల ఖాన్దాన్ నుంచి వచ్చినప్పటికి.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్. ‘నీర్జా’ సినిమాలో తన నటనకుగాను జ్యూరీ విభాగంలో ఉత్తమ నటి అవార్డు సైతం సొంతం చేసుకున్న సోనమ్‌కు.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. సోనమ్, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రాన్ని ఆస్కార్ లైబ్రరీలో చేర్చనున్నారు. మూవీకి సంబంధించిన ఓ కాపీని అందించాలని.. దాన్ని లైబ్రరీ కోర్ కలెక్షన్స్‌లో ఉంచుతామని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ సినిమా నిర్మాతలను కోరిందట. ఈ వార్త తెలిసిన సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ లైబ్రరీలో కూడా ఉంచడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోనమ్. స్వలింగ సంపర్కం అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ భామ రెజీనా, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. -
థ్యాంక్యూ మోదీజీ : అనిల్ కపూర్
సాక్షి, ముంబై : సినీ పరిశ్రమను ముప్పతిప్పలు పెడుతున్న పైరసీని మట్టుబెట్టేందుకు సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. సినిమాలను అనధికారికంగా రికార్డు చేయడం, డూప్లికేషన్‌కు పాల్పడటంపై కఠిన చర్యలు చేపట్టేలా సవరణ బిల్లును కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెలెబ్రిటీలు స్వాగతిస్తున్నారు. సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రతిపాదిత సవరణలతో పరిశ్రమ రాబడి పెరిగి, పెద్ద ఎత్తున పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పైరసీకి వ్యతిరేకంగా కీలక అడుగులు పడతాయని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై అనిల్ కపూర్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో తాను ప్రధానితో భేటీ అయిన ఫోటోను పోస్ట్ చేశారు. -
లెస్బియన్‌గా రెజీనా..!
సౌత్‌లో యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా. సాయి ధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించిన రెజీనా స్టార్ హీరోలతో మాత్రం జతకట్టలేకపోయారు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు’
అవును.. వాళ్లిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు అంటూ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్.. తన సోదరి రియా కపూర్‌కు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నా సోదరి(రియా) పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా సంతోషించే విషయం ఏముంటుంది. తనకి పెళ్లి కుదిరితే ఆ వార్త మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా. అవును వాళ్లిద్దరు(రియా కపూర్- కరణ్ బూలానీ) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతవరకు పెళ్లైతే చేసుకోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం నా చెల్లెలి వివాహం జరిగే అవకాశం లేదు’ అని సోనమ్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న రియా కపూర్, టీవీ సిరీస్ డైరెక్టర్ కరణ్ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్ భాగం కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇందుకుతోడు కొన్నిరోజుల క్రితం సోనమ్ తల్లి సునీత కపూర్.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్ అహుజాలతో పాటు కరణ్ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ జతచేసి హింట్ ఇచ్చారు. అయితే సోనమ్ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్ అయ్యింది. ఇక సోనమ్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారిగా నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. View this post on Instagram ❤️❤️❤️❤️ #Repost @anilskapoor with @get_repost ・・・ A happy Sunday with the only humans that make me feel all warm and fuzzy inside... Celebrating yet another beautiful love story! @kapoor.sunita @anandahuja @sonamkapoor @rheakapoor @karanboolani @harshvardhankapoor A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on Jan 6, 2019 at 5:19am PST -
అడ్వంచరస్ ఫన్ రైడ్ : టోటల్ ధమాల్
2011లో ఘనవిజయం సాధించిన డబుల్ ధమాల్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమా టోటల్ ధమాల్. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లివర్, రితేశ్ దేశ్‌ముఖ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా 22న రిలీజ్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, మారుతి మల్టీనేషనల్ సంస్థలతో కలిసి అజయ్ దేవగన్ స్వయంగా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీతో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిమేష్ రేషమియా సంగీతమందించాడు. -
తెరపైకి కలాం జీవితం
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ వెండితెరకు రానుందని టాక్. బాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కలిసి ఈ ప్రాజెక్టును పలు భాషల్లో (తెలుగులోనూ) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో కలాం పాత్రలో హీరో అనిల్ కపూర్ నటించనున్నారని భోగట్టా. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2015 జులై 27న మృతి చెందారు. 2002 నుంచి 2007 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నారు. కలాం జీవితంపై రచయిత రాజ్ చెంగప్ప రాసిన ‘వెపన్స్ ఆఫ్ పీస్’ బుక్ ఆధారంగా కథ రెడీ చేశారట. కాగా, 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘వంశవృక్షం’ అనే తెలుగు చిత్రంలో నటించారు అనిల్. దాదాపు 38ఏళ్ల తర్వాత మరోసారి ఆయన నటించే తెలుగు సినిమా కలాం బయోపిక్ అవుతుంది. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదు. -
నేను మీ ఫ్యాన్ మేడమ్
సినిమా హీరోల అవుట్‘స్టాండింగ్’ ఫొటోలు చూసి, చూసి మొహం మొత్తేసిన వాళ్లకు ఈ ఫొటోలో కొంత ఛేంజ్ కనిపించవచ్చు. అనిల్ కపూర్ తన కూతురి ముందు ఒక అభిమానిగా మోకాళ్లపై కూర్చున్న ఈ అపురూపమైన క్షణాలను సత్యజిత్ దేశాయ్ అనే ఫొటోగ్రాఫర్ క్యాచ్ పట్టేశారు. సోమవారం ముంబైలోని అంథేరిలో ఒక ఫిల్మ్ ప్రివ్యూలో ఆ తండ్రికి ఈ కూతురు తారసపడింది! అప్పుడే ఇదిగో ఇలా ఆయన.. ‘నేను మీ ఫ్యాన్ మేడమ్’ అన్నట్లుగా నవ్వుతూ నేలపై కూర్చున్నారు. కూతుర్ని ఆయన ఇంకా గారాం చేస్తున్నట్లే ఉంది. ఈ ఏడాది మే నెలలో సోనమ్ బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహూజాను సోనమ్‌కి ఇచ్చి పెళ్లి జరిపించారు అనిల్ కపూర్. అక్షింతలు వేస్తూ మామూలు తండ్రి లాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత ఇష్టం కూతురంటే. ఆయనకు మహారాణే. సోనమ్‌కి కూడా తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ. డిసెంబర్ 24న అనిల్ కపూర్ బర్త్‌డే. 62 ఏళ్లు నిండాయి. బర్త్‌డేకి సోనమ్ కపూర్ తన తండ్రికి ఎలాంటి ట్రీట్.. (ట్వీట్) ఇచ్చారో చూడండి. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డాడ్. మన ఇద్దరికీ ఇది గుర్తుండిపోయే సంవత్సరం. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలోనూ తొలిసారిగా మీరున్న చిత్రంలో నేనూ నటిస్తున్నాను. ఈ ఏడాది జరిగిన మరో విశేషం మీరు నా పెళ్లి చెయ్యడం. జీవితంలోని ప్రతి అడుగులోనూ మీరు నాపై చూపించిన ప్రేమకు, మీరు నేర్పిన ఆదర్శాలకు, విలువలకూ అన్నిటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఐ లవ్యూ సో మచ్’’ అని ట్వీట్ చేశారు సోనమ్. ఈ తండ్రీకూతుళ్లు.. నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ (ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకిలా ఉంటుంది) చిత్రం 2019 ఫిబ్రవరి 1న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రివ్యూలోనే అనిల్ కపూర్ ఇలా తన డాటర్ స్టార్‌ని విష్ చేశారు. -
అబ్దుల్ కలాం బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్..!
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ప్రస్తుతం అని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ప్రముఖుడు చేరనున్నాడు. మిసైల్ మ్యాన్‌గా భారత దేశానికి ఎన్నో సేవలందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్‌ను హాలీవుడ్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ టైటిల్ రోల్లో కనిపించనున్నారట. ఇప్పటికే కథ విన్న అనిల్ కపూర్ నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘లవ్ యూ నాన్నా... నీకు ఇవ్వగలిగే కానుక ఇదే’
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈరోజు(సోమవారం) 62వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి బర్త్‌డే విషెస్ చెబుతూ... అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న... ఈ ఏడాది మనిద్దరికీ గుర్తుండిపోతుంది. నా పదేళ్ల సినీ జీవితంలో నీతో కలిసి మొదటిసారిగా నటిస్తున్నా.. అలాగే నా పెళ్లి చూడాలన్న నీ కోరిక నెరవేరింది. ఇది నిజంగా మనకు పరిపూర్ణ సంవత్సరం. కొంచెం కష్టంగా... అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉంది కదా.. ప్రేమించడం, విలువలు పాటించడం ఇవి నువ్వు నాకు ఇచ్చిన బహుమతులు. కాబట్టి ప్రస్తుతం నీకు నేను ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే వాటిని పాటించడమే. లవ్ యూ నాన్నా’ అంటూ ఆమె అనిల్ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కెరీర్ పరంగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది మే 8న తన చిరకాల స్నేహితుడు ఆనంద్ అహుజాతో సోనమ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram Happy happy birthday Dad... this has been a momentous year for both of us. For the first time in 10 years of being in this industry I shared a frame with you and was your costar.. And you also had to see me get married.. all this was a complete roller coaster... hard and beautiful at the same time.. I’m thankful for the teachings of love, progressive ideals and morals that have been a part of my upbringing , and each year I realise more and more what a gift that is in this day and age.. love you so much... ❤️❤️❤️ @anilskapoor #ekladkikodekhatohaisalaga A post shared by SonamKAhuja (@sonamkapoor) on Dec 23, 2018 at 10:57am PST -
‘శ్రీదేవి కాళ్లకు నమస్కరించేవాడిని’
శ్రీదేవి లాంటి సూపర్ స్టార్‌తో నటించడం నా అదృష్టం. ఆమెని కలిసిన ప్రతిసారి తన కాళ్లకు నమస్కరించేవాడిని అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ ఇండియా అనిల్ కపూర్. శ్రీదేవితో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు అనిల్ కపూర్. ఈ మధ్య ఓ టీవీ కార్యక్రమానికి హాజరైన అనిల్ కపూర్ ఈ సందర్భంగా శ్రీదేవితో తనకు గల అనుబంధం గురించి తెలిపారు. ‘నేను ఆమెని కలిసిన ప్రతి సారి ఆమె పాదాలకు నమస్కరించేవాడిని. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. కానీ నేను ఇలా చేయడం శ్రీదేవికి చాలా అసౌకర్యంగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఓ ఆర్టిస్ట్‌గా ఆమెలాంటి గొప్ప స్టార్‌తో కలిసి నటించడం నా అదృష్టం. ఆమెతో నటించడం నా కెరియర్‌కి బాగా హెల్స్ అయ్యింది. ఆమెలో చాలా ప్రతిభ ఉంది. స్ర్కీన్ మొత్తాన్ని ఆమె తన మ్యాజిక్‌తో నింపగలదు. ఆమె ప్రతిభకి కొలమానం లేదు. తను మా అన్నని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెపై ఉన్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె మనతో లేరని బాధపడకూడదు. ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించినందుకు సంతోషించాలి’ అని వెల్లడించారు అనిల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు శ్రీదేవి. -
డాటర్ ఆఫ్ కపూర్స్
ఆఫ్ స్క్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్క్రీన్ కలిసి యాక్ట్ చేస్తే ఆ యాక్టర్స్‌కే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడదే థ్రిల్లింగ్ మూమొంట్ను ఎంజాయ్ చేస్తున్నారు సోనమ్. ఒకసారి కాదు వరుసగా రెండోసారి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నారు సోనమ్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏశా లగా’ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో సోనమ్, అనిల్ తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న ‘జోయా ఫ్యాక్టర్’లో సోనమ్ బాబాయ్ సంజయ్ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నారట. బాబాయ్ సంజయ్ కపూర్ ఈ సినిమాలో సోనమ్‌కి తండ్రిగా కనిపిస్తారట. ఆల్రెడీ ‘ముబారకన్’ సినిమాలో అన్నయ్య అనిల్ కపూర్, మరో అన్నయ్య బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సంజయ్. ‘‘సోనమ్ నా కళ్ల ముందే పెరిగింది. తను నా కూతురు లాంటిదే. తనతో వర్క్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వర్క్ చేయడం కంటే హ్యాపీ ఏం ఉంటుంది’’ అన్నారు సంజయ్‌కపూర్. -
తొమిదేళ్ల తర్వాత తొలిసారి!
తొలిసారి డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. అదేంటీ.. ఒకటా రెండా సోనాక్షి డ్యాన్స్‌తో అదరగొట్టిన పాటలు బోలెడు ఉన్నాయి కదా అనుకుంటు న్నారా? అది నిజమే. అయితే కెరీర్లో ఆమె తొలిసారి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘టోటల్ ధమాల్’. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ సిరీస్‌లో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట సోనాక్షీ సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమిదేళ్ల తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషమే మరి. -
‘పాపం హనీమూన్‌కి తను ఒక్కతే వెళ్లింది’
‘నేను తనను ఒక ప్రాంక్ కాల్ ద్వారా కలిశాను.. రేపు పెళ్లి చేసుకుందాం అని చెప్పాను.. మరుసటి రోజే వివాహం చేసుకున్నాం.. పాపం హనీమూన్‌కి తనోక్కతే వెళ్లింది.. నా గురించి నా కన్నా ఎక్కువ తనకే తెలుసు, తనే నా బలం’ అంటూ భార్య సునీతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు ‘మిస్టర్ ఇండియా’ అనిల్ కపూర్. వివాహం కంటే ముందే ఒక దశాబ్ద కాలంగా అనిల్ కపూర్‌కు సునీతతో పరిచయం. అంటే వీరి ప్రేమకు, స్నేహానికి 45 ఏళ్లు నిండయాన్నమాట. ఇంత అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం గురించి, తన భార్య సునీత గొప్పతనం గురించి సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసలు కురిపించారు అనిల్ కపూర్. ‘సినిమాల్లోకి రాకముందే సునీతతో పరిచయం ఏర్పడింది. అది కూడా చాలా విచిత్రంగా. ఇప్పడు ప్రాంక్ కాల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ 45 ఏళ్ల మునుపే మా పరిచయానికి కారణం ప్రాంక్ కాల్. ఆ రోజు సునీతకు ప్రాంక్ కాల్ చేసిన నేను ముందు తన గొంతుతో ప్రేమలో పడిపోయాను. అప్పటికింకా నేను సినిమాల్లోకి రాలేదు. ఇంకా జీవితంలో స్థిరపడలేదు. అయినా తను నన్ను ప్రేమిస్తూనే ఉంది. నన్ను వదిలేయాలని చాలా మంది, చాలా సార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. కానీ తను అలా చేయలేదు. నా జీవితంలో తొలి విజయం ‘మేరి జంగ్’. ఈ చిత్రం విజయం సాధించడంతో పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. వెంటనే సునీతతో మనం రేపు వివాహం చేసుకుందాం అని చెప్పాను. మరుసటి రోజే మేము వివాహం చేసుకున్నాం. అలా విజయం, అదృష్టం(సునీత) రెండు ఒకే ఏడాదిలో నా జీవితంలోకి వచ్చాయి. కానీ వివాహం అయిన మూడు రోజుల్లోనే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. పాపం తను ఒక్కతే హనిమూన్‌కి విదేశాలకు వెళ్లింది’ అంటూ తమ బంధం గురించి తెలిపారు. బాలీవుడ్లో పర్ఫేక్ట్ జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు సునీత - అనిల్ కపూర్. ఈ విషయం గురించి అనిల్ కపూర్ ‘45 ఏళ్లుగా మా మధ్య ప్రేమ, స్నేహ, గౌరవం కొనసాగుతునే ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె లాంటి వ్యక్తిని మరోకరిని చూడలేదు. ఇంత చక్కని భార్య దొరికినందు వల్లే నా రోజు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. తను మంచి తల్లి, భార్య అన్నింటికి మించి మంచి మనిషి. నా గురించి నా కంటే బాగా తనకే తెలుసు. తనే నా బలం’ అంటూ పోస్టు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ ప్రేమ ఎందరికో ఆదర్శం కావాలి. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.వీరికి ముగ్గురు సంతానం. సునీత - అనిల్ కపూర్లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్. వీరంతా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్ ‘ఫనే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కూతురు సోనమ్‌తో కలిసి తొలిసారి ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డేట్ గుర్తు పెట్టుకుంటారా?
నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్ కపూర్. అనిల్ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్. -
వర్క్ మోడ్
పెళ్లి తర్వాత ఇన్ని రోజులు ఫ్యామిలీ మోడ్‌లో టైమ్ స్పెండ్ చేసిన సోనమ్ కపూర్ తిరిగి వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు. హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఏసా లగా’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్, రెజీనా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు సోనమ్. ప్రస్తుతం జూహీ చావ్లా, సోనమ్ కపూర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన గారాల కూతురు సోనమ్ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రంగంలో కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ... ‘జీవితాన్ని తీర్చిదిద్దడంలో మన ఎంపిక చేసుకునే అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. సోనమ్.. స్క్రిప్టులు, డైరెక్టర్లు, కంటెంట్ విషయాల్లో నువ్వు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావ్. వృత్తి పట్ల నిబద్ధత, నీ కఠోర శ్రమల ఫలితంగానే వరుసగా 8 విజయాలు నీ సొంతమయ్యాయి...! చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నాను’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. సోనమ్ హిట్ సినిమాలు... నీర్జా, రాంజానా, భాగ్ మిల్కా భాగ్, ప్యాడ్మాన్, ఖూబ్సూరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్, సంజు సినిమాలకు సంబంధించిన పోస్టర్ల ఫొటోల సమాహారాన్ని అనిల్ కపూర్ తన ట్వీట్‌తో పాటుగా షేర్ చేశారు. 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమైంది. కానీ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రాలు వీరే ది వెడ్డింగ్, సంజులు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది . The choices we make shape our lives. @sonamakapoor you have made some pretty damn good ones when it comes to scripts, directors & content...Your hard work, commitment & conviction has resulted in 8 hits in a row! So happy & proud of you! pic.twitter.com/R4LuMIh7oM — Anil Kapoor (@AnilKapoor) July 2, 2018 -
‘ఫన్నే ఖాన్’ టీజర్ రిలీజ్
-
సర్ప్రైజ్ సెలబ్రేషన్స్
ప్యాకప్ చెప్పారు డైరెక్టర్. ఇంటికి వెళ్లిపోదామనుకున్న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ చుట్టూ చేరారు అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్ అండ్ టీమ్. ఒక నిమిషం సైలెన్స్. ఆ నెక్ట్స్ కేక్ కటింగ్. మీరు ఊహించినట్లు రాజ్‌కుమార్ రావ్ బర్త్‌డే కాదు. ‘ఫ్యాన్నీఖాన్’ చిత్రంలో ఆయన వంతు షూటింగ్ కంప్లీటైనందుకు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది టీమ్. అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య తారలుగా అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఫ్యాన్నీఖాన్’. ‘‘గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 3న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్. అంటే ఇంతకాలం జూలైలో విడుదలవుతుందనుకున్న ‘ఫ్యాన్నీఖాన్’ ఆగస్టుకు వాయిదా పడిందన్నమాట. సెట్లో సెలబ్రేషన్సే కాదు, రిలీజ్ డేట్‌తో కూడా సర్ప్రైజ్ చేశారు టీమ్ అని అనుకుంటున్నారు బాలీవుడ్ మూవీ లవర్స్. -
సల్మాన్ ఖాన్ ‘రేస్-3’ రివ్యూ
టైటిల్ : రేస్-3 జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైసీ షా, ఫ్రెడ్ఢీ దారువాలా, షకీబ్ సలీం సంగీతం : సలీం సులేమాన్ దర్శకత్వం : రెమో డిసౌజా నిర్మాత : రమేష్ ఎస్ తౌరాని, సల్మా ఖాన్ 2008లో వచ్చిన ‘రేస్’, 2013లో రిలీజైన ‘రేస్ 2’, ఇప్పుడు 2018 జూన్ 15న (శుక్రవారం) ‘రేస్ 3’... ఈ మూడూ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలే. వీటన్నింటి కథామూలం ఒక్కటే. ‘‘తలతన్నేవాడుంటే వాడి తాడి తన్నేవాడొకడుంటాడు’’ అనే సామెత మన తెలుగులో చాలా ఫేమస్. అదే కాన్సెప్ట్‌తో ఎన్ని సినిమాలొచ్చినా సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్క సినిమాని పోల్చి చూడటం సహజం అని ఒప్పుకోక తప్పదు. అందుకే సిరీస్‌గా వచ్చిన సినిమాలన్నింటిలోకి ఏది బావుందో తప్పనిసరిగా పోలిక వస్తుంది. అలా పోలిస్తే మిగతా రెండు రేసుల కంటే ఈ రేస్ కొంచెం ఎక్కువ అంచనాలతోనే విడుదలైందని చెప్పాలి. రేస్ సిరీస్ హీరోతో సహా అన్ని పాత్రలూ డాన్లు, మాఫియా, ఇంటర్నేషనల్ క్రిమినల్స్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌తో నిండి ఉంటాయి. సినిమా అంతా పూర్తిగా ట్విస్టులతో నిండి ఉంటుంది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా మూడు ‘రేస్’లతోను అనుబంధం ఉన్న నటుడు అనిల్‌కపూర్. ఈయన ఒక్కరే ‘రేస్’, ‘రేస్–2’, ‘రేస్–3’ అన్నింటిలో నటించారు. మొదటి రెండు సినిమాలకు దర్శకులుగా పనిచేసిన బాలీవుడ్ ద్వయం ‘అబ్బాస్–మస్తాన్’లను కాదని మూడో భాగం దర్శకత్వ బాధ్యతలు మరో బాలీవుడ్ దర్శకుడు రెమో డిసౌజాకు అప్పగించారు చిత్ర హీరో మరియు నిర్మాతల్లో ఒకరైన ‘సల్మాన్ ఖాన్ ’. నిర్మాతల్లో ఒకరైన రమేశ్ తౌరాని ‘రేస్ 3’ కథను తీసుకుని సల్మాన్‌ఖాన్ దగ్గరికి వెళితే ‘సినిమా చేస్తాను కాని కథలో కొన్ని మార్పులతో పాటు దర్శకుడిగా ‘రెమో డిసౌజా’ను తీసుకోవా’లని సూచించారట. ఆ విషయాన్ని సల్మానే స్వయంగా రేస్ ప్రమోషన్ టైమ్‌లో మీడియాకు చెప్పారు. అలా ఈ ప్రొడక్షన్లోకి వచ్చిన దర్శకుడు ‘రెమో’ సినిమాను ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం... ముఖ్య తారాగణం షంషేర్ సింగ్‌గా ‘అనిల్‌కపూర్’ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఇతను చుట్టూ అల్లిన కథే ‘రేస్–3’ అని చెప్పొచ్చు. షంషేర్ సింగ్ అన్న కొడుకు సిఖిందర్ సింగ్ పాత్రలో నటించారు ‘సల్మాన్‌ఖాన్’. అనిల్ కపూర్ కవలపిల్లలుగా నటి డైసీ షా (సంజన సింగ్) మరియు సాఖిబ్ సలీమ్ (సూర జ్ సింగ్) నటించారు. య‹శ్ అనే ఓ ముఖ్య పాత్రలో హీరో బాబీ డియోల్ నటించారు. ఈ సింగ్ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వీళ్లందరికీ ట్రబుల్ షూటర్ లాగా పనిచేసే పాత్రలో నటించారు ‘బాబీ డియోల్’. సినిమా మొత్తం ఏ ఫ్రేమ్‌లో చూసినా వీరే ఉంటారు. సినిమా కథా కమామీషు... అనిల్ కపూర్ మారణాయుధాలను అమ్మే వ్యాపారి. అతని అన్న కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడు. ఓ లోకల్ లీడర్‌తో ఏర్పడిన వైరం అన్న ప్రాణాలు తీసేస్తుంది. అన్న భార్యను, కొడుకును తీసుకుని అనిల్ కపూర్ విదేశాలు పారిపోతాడు. వదినను తన భార్యగా చేసుకుంటాడు. ఈ ఇద్దరికీ కవలపిల్లలు (కొడుకు, కూతురు సాఖిబ్ సలీమ్, డైసీషా) పుడతారు. బిడ్డలిద్దరూ తండ్రితో పాటు ఉంటూ వ్యాపార శత్రువులకు పోటీగా నిలుస్తారు. ఓ రోజు అనిల్ కపూర్‌ని ఎటాక్ చేస్తారు యాంటీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ అధినేత డ్రగ్ మాఫియాలో ఆరితేరిన ఫ్రీడీ దారువాలా (రానా). తండ్రిపై జరిగిన ఎటాక్‌కు కారణం ఎవరో తెలుసుకుని ఇమ్మీడియట్‌గా ఫ్రీడి మీదకి వెళతారు డైసీ, సాఖిబ్. అలా వెళ్లిన తన తమ్ముడు, చెల్లెలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వారిద్దరినీ విడిపించటానికి అక్కడికి వెళతాడు. అది సల్మాన్ ఇంట్రడక్షన్. అలా వీరు ముగ్గురు విలన్ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తుంటే వీరికి తోడుగా ట్రబుల్ షూటర్ బాబీ డియోల్ జాయిన్ అవుతాడు. అందరూ అక్కడి నుండి సేఫ్‌గా బయటపడతారు. అనిల్ కపూర్ పిల్లలందర్నీ రమ్మని చెప్పి తన ఫ్యామిలీ లాయర్ ద్వారా ఆస్తి పంపకాలు చేస్తాడు. ఆస్తిలో 50 శాతం వాటాను తన పిల్లలైన డైసీషా, సాఖిబ్‌లకు మిగతా 50 శాతం వాటాను సల్మాన్ ఖాన్‌కు రాస్తున్నట్టు ప్రకటిస్తాడు అనిల్‌కపూర్. అది విని స్వతహాగా కోపంగా ఉండే తన పిల్లలు ఆవేశపడిపోతారు. అక్కడి నుండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ప్రారంభమవుతాయి. కానీ అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంటారు. ఈ టైమ్‌లో అందరూ పార్టీ చేసుకుంటుంటే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ తమ లవర్స్‌తో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఆ నలుగురు మాత్రం ఒంటరిగా ఉంటారు. వచ్చినవారందరూ ఎంజాయ్ చేస్తున్నారు మనం మాత్రం ఇలా ఉన్నాం అని డైసీషా అంటే మీకెవ్వరికీ ఏమీ లేదేమో కానీ నాకు మాత్రం లవర్ ఉంది అని బాబీ డియోల్ తన లవర్ ‘జాక్వెలిన్ ఫెర్నాండజ్’ గురించి చెప్తాడు. అందరూ వారి వారి కబుర్లు చెప్పుకుంటారు. ఇదిలా వుంటే అనిల్ కపూర్ చిన్ననాటి స్నేహితుడు భారత్ దేశం నుండి ఫోన్ చేసి, అర్జంట్‌గా కలవాలని ఓ మంచి డీల్‌తో వచ్చానని చెప్తాడు. సరే అని అతన్ని కలిసి విషయం తెలుసుకున్న అనిల్ కపూర్ ఫ్యామిలీ అందర్నీ పిలిచి తను ఒప్పుకున్న డీల్ గురించి చెప్తాడు అనిల్ కపూర్. ఆ డీల్ సారాంశం ఏంటంటే.. భారత్‌లో ఓ 7 స్టార్ హోటల్ ఉంది. ఆ హోటల్లో 8 మంది మంత్రులు అమ్మాయిలతో ఉండటాన్ని రహస్య కెమెరాల ద్వారా చిత్రించి, వాటిని ఆ మంత్రులకే పంపి బిజినెస్ ప్రపోజల్ పెడతారు. ఆ వీడియోలన్నీ ఉన్న హార్డ్‌డిస్క్ వేరే కంట్రీలో ఓ లాకర్లో ఉన్న సమాచారం నా దగ్గర ఉంది. ఆ హార్డ్ డిస్క్ నా కిస్తే మీకు బిలియన్ డాలర్ల మనీ ఇస్తాను, అది డీల్ అని చెప్తాడు అనిల్ కపూర్ ఫ్రెండ్. అక్కడి నుండి హార్డ్ డిస్క్‌ను ఎలా తీసుకొచ్చారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కథ ప్రీ–క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడనుండి కథలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతుంటాయి. బాబీ డియోల్ తన గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెస్ అసలు అతని ప్రేయసియేనా? సల్మాన్ లవరా? అనే డౌట్ ప్రేక్షకులకు ఉంటుంది. ఎప్పుడూ తన తమ్ముడు, చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాననే సల్మాన్ ఆస్తి వివాదాల వల్ల చివరి దాకా అలానే ఉన్నాడా? వీరి జీవితాల్లోకి జాక్వెలిన్ సడన్ ఎంట్రీకి కారణం ఏంటి? బాబీ డియోల్ క్యారెక్టర్ వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? ఎనిమిది మంత్రుల వీడియోలు ఏమయ్యాయి? అన్నది క్లైమాక్స్‌లో చూడాల్సిందే. హైలైట్స్ – తారాగణం, గత చిత్రాలతో పోల్చితే సల్మాన్ సూపర్ స్టార్ కింద లెక్క. – వండర్ఫుల్ విజువల్స్. – బ్యాగ్రౌండ్ స్కోర్. – పంచ్ డైలాగ్స్. – అద్భుతమైన లొకేషన్స్. – ఆసక్తికరమైన మలుపులు. మైనస్ – కథ, కథనాల్లో ఎక్కడా స్పీడ్ లేదు. – స్లో నారేషన్. – స్టోరీలో డ్రామా లోపించడం. – పాత్రధారులంతా పాత్రల్లో లీనమైనట్లుగా కనిపించదు. – సాంగ్స్ చెప్పుకోదగ్గ విధంగా లేవు. - శివ మల్లాల -
డాడీ టెన్షన్
జూన్ 1 దగ్గర పడుతున్న కొద్దీ అనిల్ కపూర్‌కి ఎగై్జట్‌మెంట్, టెన్షన్ రెండూ పెరిగిపోతున్నాయట. కారణం ఏంటంటే.. అనిల్ కపూర్ పిల్లలు సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడమే. మొదట సోనమ్ నటించిన ‘వీరే దీ వెడ్డింగ్’ రిలీజ్‌ను జూన్ 1న, హర్షవర్ధన్ సూపర్ హీరో మూవీ ‘బావేష్ జోషీ’ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ సడన్‌గా ‘బావేష్ జోషీ’ సినిమాను జూన్ 1కి రిలీజ్ డేట్ చేంజ్ చేశారు. పిల్లల సినిమా రిలీజ్ అంటే సాధారణంగా ఆత్రుతగా ఉంటుంది. కానీ ఇద్దరి సినిమాలూ ఒకే రోజు రిలీజ్ కానుండటంతో కొంచెం టెన్షన్‌గా కూడా ఉంది అంటున్నారు అనిల్. ఈ విషయం గురించి అనిల్ కపూర్ మాట్లాడుతూ – ‘‘రిలీజ్ డేట్స్ ఎప్పుడూ యాక్టర్స్ చేతిలో ఉండవు. సినిమా నిర్మించిన స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మీద ఆధారపడి ఉంటాయి. యాక్టర్‌గా నేనా విషయాన్ని గౌరవిస్తాను. పిల్లలిద్దరికీ ఆల్ ది బెస్ట్. అంతా మంచే జరుగుతుందని కోరుకుందాం’’ అని పేర్కొన్నారు. ‘వీరే దీ వెడ్డింగ్’కి అనిల్ కపూర్ మరో కూతురు రియా కపూర్ నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ‘‘వీరే దీ వెడ్డింగ్’ రిలీజ్ డేట్‌ను రియా, ఏక్తా కపూర్ కలసి నిర్ణయించారు. నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు’’ అని పేర్కొన్నారు అనిల్ కపూర్. -
‘రేస్-3’ ట్రైలర్ వచ్చేసింది
-
ఫ్యామిలీ ఉంటే చాలు.. శత్రువులు అవసరం లేదు!
ముంబై : అందరూ ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘రేస్-3’ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాడెంజ్, బాబీ డియోల్, అనిల్ కపూర్, డైసీ షా వంటి భారీ తారాగణం ఉన్నారు. ‘రేస్’ సీక్వెల్లో గత సినిమాల తరహాలోనే మూడోపార్టు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కింది. ‘యే రేస్ జిందగికీ రేస్ హై.. కిసికీ జిందగీ లేకేహీ ఖతం హోగీ’ వంటి షార్ప్, క్రిస్పీ డైలాగులతో మోస్ట్ యాక్షన్ సీన్స్‌తో.. సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసేలా ట్రైలర్ ఉంది. ఒక వ్యాపార కుటుంబం.. ఆ కుటుంబంలోని అంతర్గత కుట్రలు నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఫ్యామిలీ ఉంటే చాలు.. నీకు శత్రువులు అవసరం లేదు’ అని ట్రైలర్లో చూపించడం సినిమా థీమ్ ఏంటో చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతున్న ‘రేస్-3’ ట్రైలర్ భాయ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈద్ సందర్భంగా జూన్ 15న ఈ సినిమా విడుదలకానుంది. -
వైరల్ వీడియో : సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
బాలీవుడ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల పెళ్లి నిశ్చయమైంది. రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనమ్, ఆనంద్ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోనమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. సంగీత్ కార్యక్రమంలో కరణ్ జోహార్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ జోహర్ డ్యాన్స్ చేస్తుండగా... మధ్యలో అనిల్ కపూర్ రావడం... అనిల్ కపూర్, శిల్పా శెట్టిని డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం... శిల్పా డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
హంగామా స్టార్ట్
అనిల్ కపూర్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. రంగు రంగు దీపాలతో, పుష్పాలంకరణతో ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. సో.. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజాల పెళ్లి మాట నిజమేనన్న మాట. బిజినెస్‌మేన్ ఆనంద్, సోనమ్ కొన్నాళ్లుగా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ నెల 7, 8 తేదీల్లో వీరి వివాహ వేడుకలు జరుగుతాయట. కూతురి పెళ్లి వేడుక తీప్తి గుర్తుగా మిగిలిపోవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అనిల్ కపూర్ అన్నీ తీసుకుంటున్నారట. పెళ్లవగానే ఆనంద్, సోనమ్ హనీమూన్ చెక్కేస్తారని సమాచారం. అయితే అది లాంగ్ హనీమూన్ కాదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తారట. పెళ్లైన వారానికే సోనమ్ ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీ అయ్యేంతగా ఆమె డైరీ నిండిపోయిందని భోగట్టా. ఆల్రెడీ 14, 15 తేదీల్లో జరగనున్న ఈవెంట్స్‌కు కమిట్మెంట్ ఇచ్చారని టాక్. ఆ వెంటనే త్వరలో విడుదల కానున్న ‘వీరే ది వెడ్డింగ్’ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అవుతారట. మరోవైపు ఫ్రాన్స్‌లో జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనాలనుకుంటున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే సోనమ్ వెరీ ప్రొఫెషనల్ అనిపిస్తోంది కదూ. -
కూతురి పెళ్లిపై స్పందించిన హీరో..!
సాక్షి, ముంబయి : అనిల్ కపూర్ గారాలపట్టి సోనం కపూర్, ఢిల్లీ కుబేరుడు ఆనంద్ అహుజాల వివాహం మే 8న ముంబయిలో అట్టహాసంగా జరుగుతుందన్న వదంతులపై అనిల్ కపూర్ స్పందించారు. సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సంగీత్, మెహందీ ఎప్పుడు జరుగుతుంది..పెళ్లి వేడుకలు ఎలా ప్లాన్ చేశారనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతున్నాయి. ఈ విషయమై సోనం, ఆనంద్ అహుజాలు నోరుమెదపడం లేదు. అనిల్ కపూర్ ఇల్లును ముస్తాబు చేస్తుండటంతో వివాహ తంతుపై మరింతగా వార్తలు గుప్పుమన్నాయి. కాగా, తమ కెరీర్ ప్రారంభం నుంచి మీడియా తమకు అండగా నిలుస్తోందని..సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. తన పెళ్లి వేడుకలపై ఇటీవల సోనం మీడియాతో మాట్లాడుతూ వివాహ వేడుకలకు రూ లక్షలు దుబారా చేయడం తనకిష్టం లేదని ఇంట్లోనే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. -
ఆ సినిమా సరిగా ఆడలేదు: దర్శకుడు
శ్రీదేవి, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రూప్ కి రాణి చోరోం కా రాజా’ చిత్రం ఏప్రిల్ 16, 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్నేహితుడు సతీశ్ కౌశిక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం దర్శకునిగా, నటుడిగా కొనసాగుతున్న సతీశ్ తన తొలి చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆ సినిమా జ్ఞాపకాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘25 ఏళ్ల క్రితం బోనీ కపూర్ నాకు ఈ చిత్రం ద్వారా బ్రేక్ ఇవ్వాలని చూశారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అందుకు బోనీకి క్షమాపణలు. అది నా మనస్సుకు ఎంతో దగ్గరయిన చిత్రం. ఈ చిత్రం గురించి తలుచుకుంటే శ్రీదేవి మేడమ్ గుర్తొస్తున్నారు’ అని సతీశ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రూప్ కి రాణి చోరోం కా రాజా చిత్రం విడుదలై 25 ఏళ్లు గడిచాయంటే నమ్మకలేకపోతున్నాను. ఈ చిత్ర నిర్మాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనప్పటికీ, ఇది ఒక మరచిపోలేని జ్ఞాపకం. ప్రతి రోజు రూప్ కి రాణిని మిస్ అవుతున్నామని అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. కొన్ని అపజయాల్లో కూడా గొప్ప విజయం ఉంటుంది అని అనుపమ్ ఖేర్ తన సందేశాన్ని తెలిపారు. అభిమానులు మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా.. ఇది ఒక మంచి చిత్రమని తమ స్పందన తెలియజేస్తున్నారు. -
శ్రీదేవీ కోరిక నెరవేర్చిన కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : కోట్లాది అభిమానులను కన్నీటిలో ముంచి, ఈ లోకం విడిచి వెళ్లిన శ్రీదేవీ అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని హరిద్వార్‌లో కూడా నిర్వహించారు. గత వారం రామేశ్వరంలో ఆమె అస్థికలు కలిపిన తర్వాత, నిన్న(గురువారం) హరిద్వార్ వద్ద కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. హరిద్వార్ షూటింగ్ సమయంలో 1993లో ఆమె మళ్లీ అక్కడికి వస్తానని మొక్కుకున్నారని, ఈ క్రమంలో శ్రీదేవీ కోరిక నెరవేర్చడానికి రెండోసారి కూడా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. హరిద్వార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు, ఆయన సోదరుడు అనిల్ కపూర్, శ్రీదేవీ క్లోజ్ ఫ్రెండ్, డిజైనర్ మనీష్ మల్హోత్రాలు పాల్గొన్నారు. కపూర్ కుటుంబానికి చెందిన పూజారులు శివ్ కుమార్ పాలివాల్, మనీష్ జైస్వాల్‌లు హరిద్వార్‌లోని వీవీఐపీ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి కంఖల్‌లో ఉన్న హరిహర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఉత్తరఖాండ్ వ్యవసాయ మంత్రి సుబోద్ యూనియల్, హరిద్వార్ మేయర్ మనోజ్ గార్గ్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌లు కూడా ఈ పూజ కార్యక్రమానికి విచ్చేశారు. రామేశ్వరంలో జరిగిన కార్యక్రమానికి బోని కపూర్, తన కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి వెళ్లారు. మరణించిన వారి అస్థికలు నదుల్లో కలపడం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవీ, దుబాయ్ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవీ మరణం కోట్లాది మంది అభిమానులను తీవ్ర దుఃఖసాగరంలో ముంచివేసింది. -
‘ముంబై పోలీసులకు ధన్యవాదాలు’
ముంబై : దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్న ముంబై పోలీస్ సిబ్బందికి బాలీవుడ్ ప్రముఖ నటుడు, శ్రీదేవి మరిది అనిల్ కపూర్ ట్వీటర్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘మేం దుఃఖంలోఉన్నప్పుడు మా చుట్టూ చేరి మాకు మద్దతుగా నిలిచిన మిత్రులకు, మా మంచి కోరే శ్రేయోభిలాషులకు తజ్ఞతలు. ముంబై పోలీసులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ విధినిర్వహణతో మాకు కావల్సిన స్పేస్, గోప్యత దక్కాయి. మమ్మల్ని అర్థం చేసుకొని ప్రార్ధించిన వారందరికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు ముంబై పోలీస్ శాఖ సైతం స్పందించింది. ‘శోకంలో ఉన్న మీ కుటుంబం మొత్తంతో మేం కలిసున్నాం’ అని ట్వీట్ చేసింది. శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలో గత బుధవారం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు అభిమానులు పొటెత్తారు. దీంతో అంతిమ యాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. Thanks @MumbaiPolice pic.twitter.com/g6JaucW2N6 — Anil Kapoor (@AnilKapoor) 1 March 2018 We all are with you and your entire family in this moment of grief. https://t.co/px2flV9gIF — Mumbai Police (@MumbaiPolice) 1 March 2018 -
అనిల్ కపూర్ ఇంటి వద్ద సినీ ప్రముఖులు
-
అనిల్ కపూర్ ఇంటి వద్ద సినీ ప్రముఖులు
-
అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు
-
మాధురి–ఐశ్వర్య–జూహి.. ఓ అనిల్
భలే కుదిరింది జోడి. కెమిస్ట్రీ అదిరింది... ఇదిగో ఇలాంటి మాటలే అనిల్‌కపూర్–మాధురి దీక్షిత్‌లను తెరపై చూసి బీటౌన్ ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఆల్మోస్ట్ అరడజను సినిమాలకు పైగా కలిసి నటించిన అనిల్ –మాధురి కాంబో చివరిసారిగా 2000లో ‘పుకార్’ సినిమాలో కనిపించింది. ఈ ఇద్దరూ మళ్లీ నటించడానికి 17ఏళ్ల టైమ్ పట్టింది. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ‘ధమాల్’ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో పార్ట్ ‘టోటల్ ధమాల్’ చిత్రంలో అనిల్–మాధురి మళ్లీ జోడీగా నటిస్తున్నారు. సేమ్ టైమ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్తోనూ ఇదే సీన్ రీపీట్ అయ్యింది అనిల్‌కపూర్‌కు. 2000లో ‘హామారా దిల్ ఆప్కే పాస్ హై’ చిత్రంలో జంటగా నటించిన అనిల్ కపూర్, ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 17 ఏళ్ల టైమ్ పట్టింది. రాకేష్ ఓం ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యానీఖాన్’ చిత్రంలో అనిల్‌కపూర్–ఐశ్వర్యారాయ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మాధురి–ఐశ్వర్య మాత్రమే కాదండోయ్.. జూహీతో కూడా అనిల్ రీ–యూనియన్ అయ్యారు. ఆల్మోస్ట్ 11ఏళ్ల తర్వాత జూహీ చావ్లాతో కలిసి నటిస్తున్నారు అనిల్‌కపూర్. ఆయన నటించిన ‘1942: ఎ లవ్‌స్టోరీ’ మూవీలోని ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ చిత్రంలోని పాట గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి ఆ టైటిల్‌నే పెట్టారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్ తనయ సోనమ్ కపూర్ నటిస్తున్నారు. ఇలా ఈ ఏడాది అనిల్‌కపూర్, ఐశ్యర్యారాయ్, మాధురి దీక్షిత్, జూహీ చావ్లాలకు మెమొరబుల్ ఇయర్ అని చెప్పాలి. ఈ కాంబినేషన్లే కాకుండా బాలీవుడ్లో పదేళ్ల తర్వాత ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించనున్నారని, ఆల్మోస్ట్ 23 ఏళ్ల తర్వాత సంజయ్‌దత్, శ్రీదేవి సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనున్నారని బాలీవుడ్ టాక్. -
పేరు కోసం పోరు
‘‘నా పేరును వాడుకుంటున్నావు.. రాయల్టీ కట్టు లేదా లీగల్ నోటీస్ కోసం సిద్ధంగా ఉండు’’ అని నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్‌పై హెచ్చరిక జారీ చేశారు అనిల్ కపూర్. విషయం ఏంటంటే.. ‘‘బెల్లెవ్యూ’’ అనే ఓ కెనెడా పాపులర్ టీవీ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించనున్నారు అనుపమ్ ఖేర్. ఆ సిరీస్‌లో అనుపమ్ క్యారెక్టర్ పేరు డా. అనిల్ కపూర్. ఆ క్యారెక్టర్‌కు తన పేరును వాడుకుంటున్నారు అనే కారణంతో ట్విట్టర్లో ఈ కామెంట్స్ చేశారు అనిల్. దాంతో అనిల్, అనుపమ్ మధ్య గొడవ మొదలైందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం పై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ – ‘‘అనిల్‌కపూర్ సరదాగా జోక్ చేశాడు. ఈ విషయంపై అనవసరమైన చర్చ జరుగుతోంది. అయినా అనవసరమైన విషయాల్ని ఫోకస్ చేయడం మనకు అలవాటే కదా. అనిల్ అన్నాడని కాదు కానీ, అతని పేరుతో నేను ఆ క్యారెక్టర్‌ను చేస్తే కొంచెం అయోమయంగా ఉండొచ్చు. అందుకని నా పాత్ర పేరును మార్చమని ప్రొడక్షన్ టీమ్‌ను కోరాను. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ టెలివిజన్‌లోనే ‘బెల్లవ్యూ’ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్. నటుడిగా నా పరిధుల్ని పెంచుకుని, వరల్డ్ క్లాస్ టాలెంట్‌తో పని చేసే అవకాశం కల్పించనుంది ఈ సిరీస్’’ అని పేర్కొన్నారు. డేవిడ్ స్కల్నర్ రాసిన ఈ టీవీ సిరీస్‌ను ఎరిక్ మాన్హైమర్ నిర్మిస్తున్నారు. ఒక హాస్పిటల్లో పన్నెండు మంది పేషంట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్లో అనుపమ్ ఖేర్ మార్చి నుంచి పాల్గొననున్నారు. -
అన్నీ తానై!
ప్రతిభకు కష్టం తోడైతే గెలుపు మార్గం కనిపిస్తుంది. ఆ గెలుపు మార్గంలో వెళ్తున్న ఓ యంగ్ టాలెంటెడ్ టీనేజ్ సింగర్‌ని కొందరు మాటలతో ఓడించాలని ట్రై చేశారు. ఫైనల్లీ ఆ అమ్మాయే గెలిచింది. కానీ ఈ గెలుపులో ఐశ్యర్యారాయ్ ఆ అమ్మాయికి అన్నీ తానై అండగా నిలబడి, అభయమిచ్చారు. హిందీ చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’ కథ ఇలానే ఉండబోతుందని బీటౌన్ టాక్. ఐశ్యర్యారాయ్, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్, దివ్య ముఖ్యతారలుగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’. ఈ సినిమాలో సింగర్ పాత్రలో ఐశ్యర్యారాయ్ బచ్చన్ కనిపించనున్నారు. ట్యాక్సీ డ్రైవర్‌గా అనిల్‌కపూర్ కనిపించనున్నారట. సినిమాలో అనిల్ కపూర్‌కి ఓ కూతురు ఉంటుంది. తను టాలెంటెడ్ సింగర్. సీనియర్ సింగర్ అయిన ఐశ్యర్య ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తారట. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. ఈ సినిమాలో ఐశ్యర్య లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రంజాన్‌కు ‘ఫ్యాన్నీఖాన్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సల్మాన్ ‘రేస్ 3’తో రంజాన్‌కు రెడీగా ఉన్నారు. మరి.. సల్మాన్ వర్సెస్ ఐశ్యర్యలో ఎవరు వెనక్కి తగ్గుతారన్న చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. -
ఇప్పుడు రీల్ డాడ్ అండ్ డాటర్
‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా....’ అంటూ ‘1942 ఎ లవ్ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్ కపూర్ పాడిన లవ్ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన 24 ఏళ్లకు అనిల్ కపూర్ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా’ పేరుతో సినిమా చేయడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఇందులో ఆయన ముద్దుల కూతురు సోనమ్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఇంకో విశేషం కూడా ఉంది. ఈ సినిమాలో అనిల్ కపూర్‌కు జోడిగా జూహీ చావ్లా నటిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ క్లాప్ బోర్డ్‌ను పోస్ట్ చేసి, ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్ టైమ్ మా నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను. మీకు ‘ఆన్ స్క్రీన్ డాటర్’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. థాంక్యూ షెల్లీ చోప్రధర్ (చిత్రదర్శకుడు). ఇంత ఇంట్రెస్టింగ్ స్టొరీ రాసినందుకు. ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు విధు వినోద్ చోప్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు సోనమ్. దానికి అనిల్ కపూర్ ‘‘మనిద్దరం కలిసి యాక్ట్ చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూడు.. ఎక్కడున్నామో? నీకు ఎగై్జటెడ్‌గా ఉందేమో.. నాకు మాత్రం చాలా నెర్వస్‌గా ఉంది’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. రియల్ లైఫ్‌లో తండ్రీ కూతురైన అనిల్, సోనమ్‌లను రీల్‌పై డాడ్ అండ్ డాటర్‌గా చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. -
సల్మాన్ ఖాన్‌పై దాడికి యత్నం
సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ విష్టోయ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసింది. ఇటీవల కృష్ణజింక కేసులో జోద్పూర్ కోర్టుకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే తాజాగా కొందరు వ్యక్తుల సల్మాన్ ఖాన్‌పై దాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ రేస్ 3 షూటింగ్ లోబిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో చిత్రయూనిట్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు సల్మాన్ తో పాటు చిత్ర నిర్మాత రమేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి తరలించారు. ఇక మీద షూటింగ్ సమయంలో సల్మాన్ కు సెక్యూరిటీ మరింత పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారట. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న రేస్ 3 సినిమాలో అనీల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకుడు. -
ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టం
ముంబాయి : బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ కూతురిగా పుట్టడం తన అదృష్టమని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వెల్లడించారు. ఆదివారం అనిల్ కపూర్ 61 జన్మదినం. ఈ సందర్భంగా తన తండ్రితో ఆమెకున్నసాన్నిహిత్యాన్ని, అనుభవాలను కొన్ని ఫోటోల ద్వారా ట్వీట్ చేసింది. తన తండ్రి లేకపోతే నేను ఇప్పుడు ఉన్న స్థాయిలో సగానికి కూడా ఎదిగేదాన్ని కానని ట్వీట్ చేసింది. ఈ ప్రపంచంలో తనను బాగా అర్ధం చేసుకున్నవ్యక్తి తన తండ్రేనని చెప్పింది. ఈ సందర్భంగా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడూ 39 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న వారిగా కనిపిస్తారని అనుపర్ ఖేర్ ట్వీట్ చేశారు. అలాగే సినిమాల్లో మంచి పాత్రలు మీకు రావాలని కోరుకుంటున్నట్లు అనుపమ్ తెలిపారు. 1980, 1990, 2000, 2010 దశకాల్లో అనిల్ కపూర్ ఎప్పుడూ ఒకే విధంగా, యువకుడిగా కనిపిస్తున్నాడని నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు. డ్రామా, యాక్షన్, రొమాన్స్, కామెడీ లాంటి విభిన్నమైన సినిమాల్లో అనిల్ కపూర్ తన నటన ద్వారా జీవించారని, ఆయనలో ఉత్సాహం చూసి కొత్తగా సినీరంగంలోకి వచ్చేవారు కూడా అసూయపడతారని పేర్కొన్నారు. -
నో లేడీ జోడి!
ఏడేళ్లు అయ్యింది. అజయ్ దేవ్గన్ హీరోయిన్ లేకుండా సినిమా చేసి. ఏడేళ్ల క్రితం హీరోయిన్ లేకుండా అజయ్ చేసిన సినిమా ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా? 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’లో ఆయనకు లేడీ జోడీ లేదు. ‘ధమాల్, డబుల్ ధమాల్’లకు సీక్వెల్‌గా రూపొందనున్న తాజా చిత్రం ‘టోటల్ థమాల్’లోనూ ఆయనకు జోడీ లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్‌లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గన్‌ను తీసుకున్నారు. మొదట ఇలియానాను అజయ్ సరసన హీరోయిన్గా అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ పరంగా అజయ్ క్యారెక్టర్‌కు లేడీ జోడి అవసరం లేదని ఫిక్స్ అయ్యారట ఇంద్రకుమార్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేజర్ సీన్స్‌ని లక్నోలో షూట్ చేయనున్నారు. ‘టోటల్ ధమాల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?
స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ సోనమ్ కపూర్. కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేకపోయినా.. గ్లామర్ షోతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. నీర్జా సినిమాతో నటిగానూ అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఫ్యాషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కనుందట. ఢిల్లీకి చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్ ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా ఓకె చెప్పేశారట. దీంతో త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే హిట్ ట్రాక్ ఎక్కిన ఈ భామ.. అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
పదహారేళ్ల తర్వాత..
‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటింది. ఆ సినిమా తర్వాత ఐశ్వర్యా రాయ్ ఏ చిత్రంలో నటిస్తున్నారు? ఎవరితో జోడీ కడుతున్నారు? బాలీవుడ్డా.. కోలీవుడ్డా.. టాలీవుడ్డా.. ఏ వుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నకు ఐష్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాధానం రాలేదు కానీ, ఫలానా డైరెక్టర్‌తో, హీరోతో సినిమా అంటూ వార్తల మీద వార్తలు పుట్టుకొస్తున్నాయ్. చిరంజీవి నటించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ఐష్ ఓ హీరోయిన్ అని టాక్. అలాగే, అనిల్ కపూర్‌తో దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ తెరకెక్కించనున్న ‘ఫ్యాన్నీఖాన్’లో ఐష్‌ని నాయికగా తీసుకోవాలనుకున్నారట. కథ నచ్చడంతో ఈ బ్యూటీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. 2000లో వచ్చిన ‘హమారా దిల్ ఆప్ కే పాస్ హై’ చిత్రంలో చివరిసారిగా అనిల్, ఐష్ జోడీ కట్టారు. ‘ఫ్యాన్నీఖాన్’లో ఐష్ కథానాయిక అన్నది వాస్తవమైతే పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే అవుతుంది. -
ప్రపంచ చూపు.. తెలుగు చిత్రసీమ వైపు
బంజారాహిల్స్: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ (టాలీవుడ్) వైపు చూస్తోందని బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. నగరానికి చెందిన డ్రీమ్ ఇండియా గ్రూపు ప్రారంభించనున్న సరికొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను ఆయన బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీపరిశ్రమకు మంచి సామర్థ్యం ఉందని, తనకు ఈ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తన మొదటి సినిమా కూడా బాపు దర్శకత్వంలో వంశవృక్షం తెలుగులో వచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర ప్రజలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. డ్రీమ్ ఇండియా గ్రూప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ బహదుర్‌పురా సమీపంలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో 300 ఎకరాల్లో రానుందని సంస్థ సీఎండీ సయ్యద్ రఫీ ఇషాక్ తెలిపారు. -
చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెర మీదే కాదు ఇతర వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. తాజాగా టి.సుబ్బిరామి రెడ్డి మనవడి వివాహవేడుకల్లో పాల్గొన్న చిరు, సంగీత్ కార్యక్రమంలో స్టెప్పులేశాడు. చిరుతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి కూడా కాలు కదిపారు. మెగాస్టార్ మూమెంట్స్‌తో బాలీవుడ్ తారలు కూడా రెచ్చిపోయారు. అనీల్ కపూర్, రణవీర్ సింగ్‌లతో పాటు పలువురు హిందీ నటీనటులు చిరుతో కలిసి చిందేశారు. -
చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్
-
తూచ్... నేనలా అనలేదు!
దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, దిశా పాట్నీ, అమైరా దస్తూర్... తాజాగా హ్యూమా ఖురేషి... ఈ మధ్య హాలీవుడ్ ఫ్లైట్ టికెట్ (సినిమా ఛాన్స్) తీసుకుంటున్న బాలీవుడ్ భామల జాబితా పెరుగుతూనే ఉంది. అదేంటి... హిందీ హీరోయిన్లే హాలీవుడ్ వెళ్తున్నారు. హీరోలెందుకు ఇంగ్లీష్ సినిమాల్లో నటించడం లేదనే సందేహం కొందరికి వచ్చింది! ప్రియాంకా చోప్రాని ఇదే విషయం అడగ్గా... ‘‘హాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవాలంటే గట్స్ (దమ్ము) కావాలి’’ అని చెప్పినట్టు ముంబయ్ మీడియాలో కొందరు రాశారు. సదరు వార్తలు చదివిన ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేను ‘గట్స్’ అనే పదం వాడలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ప్రియాంక మాట్లాడుతూ –‘‘హిందీ నటులు హాలీవుడ్లో ఎందుకు నటించడం లేదని అడిగితే – ‘బహుశా... వాళ్లు అక్కడ నటించాలని ప్రయత్నించడం లేదనుకుంట’ అని చెప్పా. ‘గట్స్’ అనే పదం ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకు తెలీదు. ఎప్పటిలా నా మాటల్ని వక్రీకరించారు. అనిల్ కపూర్, ఇర్ఫాన్‌ఖాన్ హాలీవుడ్లో నటిస్తున్నారు. మిగతావాళ్లూ ట్రై చేస్తే విజయం సాధించే అవకాశాలున్నాయి’’ అన్నారు. ముంబయ్ మీడియా మాత్రం ప్రియాంక మాట మార్చిందని చెబుతోంది. ఆ సంగతలా ఉంచితే, ‘‘ప్రయత్నించు.. ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో రోజు విజయం సాధిస్తావ్. ప్రయత్నమే చేయకుంటే విజయం అనేది ఉండదు – నా సిద్ధాంతం ఇదే’’ అని ప్రియాంక సెలవిచ్చారు. -
ఏటీఎం క్యూలో స్టార్ హీరో..!
ముంబై: సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. కొందరు బాలీవుడ్ తారలు చేతిలో డబ్బు లేక అప్పుగా తీసుకున్నట్టు వార్తలు రాగా.. తాజాగా హీరో అనిల్ కపూర్ కరెన్సీ కోసం ఓ ఏటీఎం ముందు క్యూలో నిల్చున్నాడు. అనిల్ రాకతో క్యూలో నిల్చున్నవారు ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోను దగ్గరగా చూసినందుకు, తమతో కలసి క్యూలో ఉన్నందుకు సంతోషపడ్డారు. క్యూలో ఉన్న కొందరు యువతులు అనిల్ కపూర్‌తో సెల్ఫీ దిగారు. వారు ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సంఘటన జరిగింది. ఏటీఎం ముందు క్యూలో అనిల్ ఉన్నప్పటి ఫొటోను ఆయన అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అనిల్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశాడు. -
చందమామ రావె జాబిల్లి రావె!
ఎరుపు రంగు చీరలో అప్పుడే పూసిన ఎర్ర గులాబీలా శ్రీదేవి, గులాబీ రంగు డ్రెస్సులో అందమైన గులాబీ పువ్వులా బిపాసా బసు, హాఫ్ వైట్ శారీ, రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజులో మాన్యతా దత్, రెడ్ కలర్ చుడీదార్లో రవీనా టాండన్.. ఇలా అందరూ మెరిసిపోయారు. ‘కర్వా చౌత్’ పండగ కోసమే వీళ్లంతా ఇలా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ అంటే ఏంటో కొంతమందికి తెలిసే ఉంటుంది. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చందమామను చూసి, ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉత్తరాదిన చాలా ఘనంగా చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వా చౌత్ ఆచరించే తన బంధువులు, స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. షబానా ఆజ్మి, ఆమె భర్త జావేద్ అఖ్తర్, శ్రీదేవి, బోనీకపూర్, రవీనా టాండన్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ తన ఇంట్లోనే కర్వా చౌత్‌ని ఆచరించారు. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లి చేసుకున్న బిపాసా బసు తొలి కర్వా చౌత్‌ను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం చందమామ కనిపించగానే ఉపవాసాన్ని విరమించి, ‘ఇప్పుడు ఫుడ్ దొరుకుతుంది’ అంటూ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేశారు. మొత్తానికి చిన్నప్పుడు ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తే.. పెళ్లయ్యాక భర్త క్షేమం కోసం పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ చంద్రుణ్ణి ఆహ్వానించడం ఓ మంచి అనుభూతి. -
'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!'
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు వాటంతట అవే తలుపు తడతాయని, స్టార్ ఇమేజ్ తేలికగా వస్తుందని అందరూ భావిస్తుంటారుగానీ.. అదంతా ఒట్టి మాటే అంటోంది సోనమ్ కపూర్. తను అనిల్ కపూర్ కూతురిని అయినందుకే తనకు బోలెడన్ని అవకాశాలు చేజారాయని, చాలా సినిమాలు మిస్ అయ్యాయని వాపోతుంది. అంతెందుకు ఉదాహరణకు 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా విషయమే తీసుకోండి, సల్మాన్ నాతో సినిమా చేయనంటే చేయనన్నారు. దానికి సల్మాన్ చెప్పిన కారణం ఒక్కటే.. 'అనిల్ కపూర్ చాలాకాలంగా నాకు క్లోజ్ ఫ్రెండ్.. అలాంటిది ఆయన కూతురితో నేను రొమాన్స్ ఎలా చేయగలను? నిజంగా అది చాలా కష్టం' అని. ఇలా చెప్పుకుంటూ పోతే నేను అనిల్ కపూర్ కూతురు బ్రాండ్‌తో పోగొట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయంటోంది సోనమ్ కపూర్. అలాగే ఫరాఖాన్ మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పటివరకు నేను ఆమె సినిమాల్లో నటించలేదు. దానికి కారణం.. మా మధ్య ఉన్న రిలేషన్ వల్ల ఆమె ఎప్పుడూ నన్ను ఓ నటిలా చూడరు.. అంటోంది. మరి అలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హాలాంటి సెలబ్రిటీ వారసులు తేలికగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు కదా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌గా ఉన్న దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు ఇండస్ట్రీకి స్వశక్తితో వచ్చినవారే. ఇక ఆలియా గురించి మాట్లాడతారా.. ఆమె ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం ఆమె టాలెంట్ కాదంటారా.. అంటూ బదులిచ్చింది. అయినా బంధుప్రీతి, వారసత్వంలాంటివి అన్నిచోట్లా ఉంటాయి గానీ.. అవేమీ మన ప్రయాణాన్ని తేలిక చేయవు అంటూ ఓ న్యూస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోనమ్ ఈ విషయాలన్ని చెప్పుకొచ్చింది. తండ్రి పేరు ఎప్పుడూ ఉపయోగించుకోనని, కష్టపడి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాని సోనమ్ అంటోంది. స్టార్ వారసురాలు.. కష్టపడకుండానే తనకి అన్నీ తేలికగా వచ్చేస్తాయని అనుకోవడం చాలా తప్పని చెప్తుంది నీర్జా స్టార్. ప్రస్తుతం ఆమె 'వీర్ దీ వెడ్డింగ్' సినిమాలో కరీనాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. -
ప్రముఖ బాలీవుడ్ హీరోకి లీగల్ నోటీసులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(ఎమ్ హెచ్ఏడీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ కు సంబంధించి తప్పుడు ప్రకటన లో ఆయన ఉన్నందుకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఏక్తా వరల్డ్ లో నిర్మిస్తున్న ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక ప్రకటనను ఇచ్చారు. ఇందులో ఎమ్ హెచ్ఏడీఏ కంటే తక్కువ ధరకే తాము ఫ్లాట్ల అమ్మకం చేపడతామని ప్రకటించారు. తప్పుడు సమాచారంతో తమ సంస్థ పేరును వాడుకున్నారని ఏక్తా వరల్డ్ యాజమాని అశోక్ మెహనాని కి, ప్రకటనలో నటించినందకు అనిల్ కపూర్ కూ నోటీసులను ఎమ్ హెచ్ఏడీఏ జారీచేసింది. -
మా ఇంట్లో నాకెవరూ ఫ్యాన్స్ లేరు: హీరో
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ అనిల్ కపూర్ ది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అనిల్ కు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కు తన ఇంట్లో ఎవరూ ఫ్యాన్స్ లేరట. తాజాగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. తన ముగ్గురు పిల్లలు తనకు ఫ్యాన్స్ కాదని, వారు తన పనితీరును ఎన్నడూ పొగడ్తల్లో ముంచెత్తలేదని తెలిపారు. అనిల్ పెద్ద కూతురు సోనం కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతోంది. చిన్న కూతురు రెహా నిర్మాత కాగా కొడుకు హర్షవర్థన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఒకరి పనితీరు గురించి మరొకరు చెప్పుకొనేటప్పుడు ఎలాంటి పక్షపాతాన్ని చూపబోరని, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడిస్తారని అనిల్ చెప్పాడు. 'పనితీరు విషయంలో మేం చాలా నిజాయితీగా ఉంటాం. మాలో ఎవరు ఎవరికీ ఫ్యాన్స్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు పని విషయంలో క్లాస్ ఇస్తారు. నా తండ్రిని చూడండి. ఆయనెంత గొప్పగా నటిస్తారో.. అని గొప్పలు చెప్పుకొనే రకం కాదు నా పిల్లలు. అలా అనాలని నేను కోరుకోను. అందుకే తమదైన శైలిలో సోనం, రెహా ముందుకు వెళుతున్నారు. ఇక వాళ్లు నా సినిమాల్ని పెద్దగా చూడలేదు. నా కొడుకు అయితే నా సినిమాలు ఒకట్రెండు కూడా చూసి ఉండడు' అని అనిల్ చెప్పారు. తన తాజా టీవీ సిరీస్ 24 ట్రైలర్, తన కొడుకు హర్షవర్ధన్ హీరోగా 'మిర్జియా' సినిమా ట్రైలర్ ఒకేరోజు విడుదల కావడం తనకు డబుల్ ఆనందాన్ని ఇస్తోందని అనిల్ కపూర్ అన్నారు. -
రీల్ లైఫ్‌లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా..
ముంబై: నిజజీవితంలో బాబాయ్, అబ్బాయ్‌లు అయిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, అర్జున్ కపూర్ ఓ సినిమాలో అవే పాత్రలు పోషించనున్నారు. అనిల్, అర్జున్ తొలిసారి కలసి నటించనున్నారు. అనీస్ బాజ్మీ తర్వాతి సినిమాలో వీరిద్దరూ తెరపై కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ముబారక అనే టైటిల్ పెట్టారు. సినిమాలోనూ అనిల్, అర్జున్ బాబాయ్, అబ్బాయ్లుగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో మిగతా పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేయాల్సివుంది. కామెడీ, డ్రామా, రోమాన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అనిల్ కపూర్ సోదరుడైన నిర్మాత బోనీ కపూర్‌కు అర్జున్ కపూర్ కొడుకు. -
ఆ విషయంలో ఎందుకు సిగ్గు పడాలి!
ముంబై: ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా మహిళలు తమ వయసును దాచేయాలని నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటివి తరచూ గమనిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఎవరినైనా అడిగితే ఓ చిరునవ్వుతో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. లేనిపక్షంలో ఆడవాళ్ల వయసు ఎవరైనా అడుగుతారా అంటూ తిరిగి చిన్న ప్రశ్న వేస్తారు. కానీ తనకు మాత్రం అలాంటి భయాలు అక్కర్లేదని బాలీవుడ్ నటి సోనమ్ తేల్చేసింది. ఫ్యాషన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే కొందరు హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ జూన్ 9న పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. తన వయసు ఎంతో చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడనంటూ, తనకు 31 ఏళ్లు అని గర్వంగా చెబుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. సావారియాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కొన్నేళ్లపాటు సక్సెస్ అందుకోలేదు. లేటెస్ట్ మూవీలు ప్రేమ్ రతన్ ధన్ పాయో, నీర్జా మూవీలలో నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఎయిర్ హోస్టెస్ నీర్జా బోనోతు జీవిత కథాంశం ఆధారంగా తీసిన 'నీర్జా' తో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రతి ఏడాది మంచి ఏడాదే అవుతుందని ఇందులో మంచి, చెడు అంటూ ప్రత్యేకంగా ఉండవని వేదాంతం చెబుతోంది. ఏదేమైనా సరే చేసే పనిని ఎప్పుడూ ఎంజాయ్ చేయాలని, తనను ఆధరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సోనమ్ ఒకే చెప్పిన ఓ మూవీలో కరీనాకపూర్ కూడా నటిస్తుందని కథనాలు వచ్చాయి. అయితే త్వరలో తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. -
'ఆమీర్‌ఖాన్ ఓ లీడర్.. నేను చాలా నేర్చుకోవాలి'
ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్. బాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రస్థానానికి వెళ్లిన హీరో అనిల్ కపూర్ ఇండస్ట్రీకి తన వారసుడిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్గా వెలుగొందుతుండగా, ఇప్పుడు కొడుకు హర్షవర్ధన్ కపూర్ కూడా అరంగేట్రం చేస్తున్నాడు. అయితే తనకంటే వయసులో చిన్నవాడైనా స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనకు ఎప్పుడూ ఆదర్శప్రాయమని అంటున్నాడు. ఆమీర్ ఓ మంచి నాయకుడని, ఆయన నుంచి ప్రేరణ పొందుతుంటానని మరో స్టార్ నటుడు చెప్పడం విశేషం. '24 సీజన్ 2' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనిల్ తో పాటు సోనమ్ కపూర్,అభిమానులు 'మిస్టర్ ఫర్ఫెక్ట్' గా పిలుచుకునే ఆమీర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమీర్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. మనకంటే వయసులో చిన్నవాళ్లయినా వారి నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పాడు. తాను హిందీ, ఇంగ్లీష్ మూవీలతో బిజీగా ఉన్నప్పుడు ఆమీర్ మాత్రం 'సత్యమేవ జయతే' లాంటి ప్రోగ్రామ్స్ చేశాడని మెచ్చుకున్నాడు. 2013లో అమెరికా సిరీస్ టీవీ షో 24 వచ్చిందని, ప్రస్తుతం రెండో సీజన్ స్టార్ చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. తెరపై తాను చూడటానికి ఇష్టపడే వారిలో అనిల్ ఒకరని ఆమీర్ పేర్కొన్నాడు. అనిల్ ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన మరిన్ని ఈవెంట్స్ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. టీవీ షో ట్రైలర్ చూస్తే సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని -
'ధోనికి అలా జరగడం దురదృష్టకరం'
న్యూఢిల్లీ: పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంగా చట్టసమ్మతి ఉన్న కంపెనీపై ఒక వ్యక్తి ప్రభావం ఎంతమాత్రం ఉండదన్నాడు. 'రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అన్ని సందర్బాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్బాల్లో అదే వ్యాపారం చాలా నిజాయితీగా సాగినా.. మరికొన్ని సందర్భాల్లో అంచనాలకు తగ్గట్టుగా ఉండదు. ఒక వ్యక్తి యావత్ సంస్థనే ప్రభావితం చేయలేడు. అటువంటప్పుడు ఆ సంస్థ నుంచి ధోని వైదొలగాలని డిమాండ్ రావడం దురదృష్టమే. ఒక సంస్థ ఇచ్చిన హామీలకు క్రికెటర్ ను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. గతంలో మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కూడా అమితాబ్ బచ్చన్, మాధూరీ దీక్షిత్, ప్రీతి జింటాలపై కూడా ఇదే తరహాలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది'అని అనిల్ కపూర్ తెలిపాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆ సంస్థ ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి సంస్థ నుంచి ధోని ఆకస్మికంగా వైదొలిగాడు. -
మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..
న్యూఢిల్లీ: ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు. -
బిగ్‌బీని ఇబ్బంది పెట్టిన అనిల్ కపూర్
గత వారం జరిగిన టీఓఐఎఫ్ఏ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా ఆసక్తికరమైన దృశ్యాన్ని చూసే అవకాశం అంతర్జాతీయ సినీ అభిమానులకు కలిగింది. ఈ ఫంక్షన్లో అమితాబ్‌కు లివింగ్ లెజెండ్ అవార్డ్‌ను అందించిన అలనాటి హీరో అనిల్ కపూర్.. వేదిక మీద సీనియర్ బచ్చన్‌ను కాస్త ఇబ్బందిపెట్టాడు. ఈ విషయాన్ని తను అవార్డు అందుకుంటున్న ఫోటోలతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు బిగ్‌బీ. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా అమితాబ్‌కు బహుమతి ప్రదానం చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తరువాత ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ పరిణామంతో అమితాబ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. ఈ ఇద్దరు పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఇదే వేదికపై పీకు సినిమాకు గాను క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ను కూడా అందుకున్నారు అమితాబ్. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన టీఓఐఎఫ్ఏ అవార్డుల ఫంక్షన్‌తో పాటు ఆదివారం ముంబైలో జరిగిన స్టైల్ అవార్డ్స్ ఫంక్షన్లోనూ అమితాబ్, షారూఖ్ ఇద్దరూ కలిసి ఏదో విషయంపై సీరియస్‌గా మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపైనా సరదాగా ట్వీట్ చేసిన అమితాబ్ తామిద్దరం బోన్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్టు తెలిపారు. T 2182 -At TOIFA Anil Kapoor gives me the Lifetime Award and then this ... so embarrassing !! pic.twitter.com/vREh1gm0ib — Amitabh Bachchan (@SrBachchan) March 21, 2016 T 2182 -A TOIFA, SRK and me discuss, then a day later at HT fashion award, we are still discussing .. bone pains !! pic.twitter.com/lsPcaMr1TR — Amitabh Bachchan (@SrBachchan) March 21, 2016 -
వారిద్దరూ నాకు స్ఫూర్తి: శిల్ప
ముంబై: ఫిట్ నెస్ విషయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ తనకు స్ఫూర్తి అని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపింది. వయసు పెరుగుతున్నా ఈ ఇద్దరు అగ్రహీరోలు ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో యాక్టివ్ గా ఉన్నారని తెలిపింది. ఈ వయసులోనూ యువహీరోలతో సమానంగా నటిస్తూ, కెరీర్ లీడ్ చేస్తున్నారని ప్రశంసించింది. వీరిద్దరూ తనకే కాకుండా మొత్తం హిందీ చిత్ర పరిశ్రమకే స్ఫూర్తిగా నిలిచారని పేర్కొంది. శిల్పాశెట్టి రాసిన 'ది గ్రేట్ ఇండియన్ డైట్' పుస్తకాన్ని ఈనెల 19న అమితాబ్, అనిల్ కపూర్ ఆవిష్కరించనున్నారు. పోషక విలువలున్న ఆహారం, కొవ్వును కరిగించుకోవడం, ఫిట్ గా ఉండడం వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. -
ఆ ఐదుగురితో డెరైక్షన్ చేస్తానంటున్న సోనమ్!
పులి కడుపున పులే పుడుతుంది. అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ అదే నిరూపించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె దానితోనే సంతృప్తిపడదలచుకోలేదు. మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. ఇంతకీ సోనమ్ ఎప్పుడు డెరైక్టర్ అవుతారు? కథలు రెడీ చేసుకున్నారా? డెరైక్టర్ అయ్యాక ఏయే కథానాయికలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు?.. ఆ విషయాలు తెలుసుకుందాం... * కథానాయికగా అడుగుపెట్టే ముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సోనమ్ కపూర్ దర్శకత్వ శాఖలో చేశారు. మూడేళ్ల పాటు ఆయన దగ్గర డెరైక్షన్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌లో యునెటైడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియాలో థియేటర్లో అండ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ డెరైక్షన్, రైటింగ్ నేర్చుకున్నారు. * సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రానికి సోనమ్ దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే భన్సాలీ తన తదుపరి చిత్రం ‘సావరియా’లో హీరోయిన్గా నటించమని సోనమ్‌ని అడిగారు. అప్పుడు ఈ బ్యూటీ దాదాపు 80 కిలోల బరువు ఉండేవారు. ‘సావరియా’లో నటించడం కోసం 35 కిలోలు తగ్గారు. మొదటి చిత్రంతోనే తన అందచందాలు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుని, క్రేజీ హీరోయిన్ అయిపోయారు సోనమ్. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. * కథానాయికగా బిజీ అయినప్పటికీ డెరైక్షన్ చేయాలనే తన లక్ష్యాన్ని సోనమ్ మర్చిపోలేదు. వీలు కుదిరినప్పుడల్లా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నారు. కొన్ని కథలు కూడా రాసుకున్నారు. రొమాంటిక్ మూవీస్ అంటే సోనమ్‌కు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు, కామెడీ మూవీస్‌ని తెరకెక్కించాలనుకుంటున్నారామె. మరో ఐదు, పదేళ్లల్లో మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నారు. * ఓ దర్శకురాలిగా ఏయే కథానాయికలతో సినిమాలు చేయాలో కూడా సోనమ్ ఓ జాబితా రాసుకున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, పరిణీతి చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్ ఉన్నారు. ఈ ఐదుగురూ చాలా టాలెంటెడ్ అనీ, ఎలాంటి పాత్రలో అయినా నటింపజేయవచ్చని సోనమ్ అంటున్నారు. ‘‘వీళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన మిగతా కథానాయికలు వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అందరూ ప్రతిభావంతులే. అందుకని మిగతావాళ్లతో కూడా సినిమాలు చేస్తా’’ అంటున్నారు సోనమ్. మొత్తం మీద సోనమ్ చెబుతున్న మాటలు చూస్తుంటే డెరైక్షన్ని ఆమె సీరియస్‌గానే తీసుకున్నారని అనిపిస్తోంది. హిందీలో మీరా నాయర్, దీపా మెహతా, ఫరా ఖాన్, నందితా దాస్ వంటి లేడీ డెరైక్టర్స్ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ల జాబితాలో సోనమ్ చేరతారు. అయితే, వాళ్లందరూ వేరు. సోనమ్ వేరు. కమర్షియల్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న కేటగిరీలో ఉన్న తార సోనమ్. సో.. సోనమ్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి? నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ దర్శకురాలిగా కూడా భేష్ అనిపించుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
'మిస్టర్ ఇండియా-2'లోనూ శ్రీదేవి, అనిల్ కపూర్!
ముంబై: అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమా విడుదలై నేటికి 27 సంవత్సరాలు. బాలీవుడ్ క్లాసిక్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ తీస్తే.. అందులో మళ్లీ హీరోహీరోయిన్లుగా నటించేందుకు అనిల్ కపూర్, శ్రీదేవి జోడీ నూటికినూరుపాళ్లు సరిపోతుందని ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ పేర్కొన్నారు. 'ఆ సినిమాకు వయస్సైంది కానీ అందులో ముఖ్య పాత్రలు పోషించిన నటులకు కాదు. 'మిస్టర్ ఇండియా'కు సీక్వెల్ తీయాలని బోనీ కపూర్ భావిస్తున్నారు. అందులో మళ్లీ అనిల్ కపూర్, శ్రీదేవీని హీరోహీరోయిన్లుగా పెడితే ఏ సమస్య ఉండదు. ఆ పాత్రలకు వారు ఇప్పుడు కూడా సరిపోతారు' అని ఆయన పేర్కొన్నారు. 17వ జియో మామి ముంబై చలనచిత్రోత్సవం సందర్భంగా 'మిస్టర్ ఇండియా' చిత్రయూనిట్ ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకున్నది. -
అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?
‘కామోషియాన్’ చిత్రంలో హాట్ హాట్‌గా అందాలు ఒలికించి కుర్రకారు మనసును దోచుకున్న విదేశీ మోడల్ సప్నా పబ్బి. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా సప్నా గ్లామర్ మాత్రం క్లిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే, సప్నా ఇప్పుడు అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సమాచారం. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్, పబ్స్ చుట్టూ తిరుగుతున్నారట. పైకి మాత్రం ఫ్రెండ్షిప్ అని చెబుతున్నా, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. హర్షవర్ధన్ ప్రస్తుతం తన మొదటి చిత్రం ‘మీర్జి యాన్’ అనే సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదల వరకైనా వరకైనా మీడియా కంటపడొద్దని తండ్రి అనిల్‌కపూర్ చెప్పారట. అయినా సరే, తండ్రి మాట కాదని మరి సప్నాతో డేటింగ్ చేస్తున్నారట హర్షవర్ధన్. -
'ఆ హీరోకు జోడీగా మా అమ్మాయి అదుర్స్'
ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా తమ అమ్మాయి సోనమ్ చాలా బాగుంటుందని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో' మూవీలో సల్మాన్, సోనమ్ జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాషన్‌ను అనుసరించే బాలీవుడ్ హీరోయిన్లలో సోనమ్ ఒకరు. తండ్రిచాటు కూతురన్న ముద్ర కూడా సోనమ పై ఉంది. సోనమ్‌కి జోడీగా సల్మాన్ నటించడాన్ని వెండితెరపై చూడాలని తాను ఉవ్విళ్లూరుతున్నట్లు అనిల్ కపూర్ పేర్కొన్నారు. సల్మాన్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, కుటుంబకథా చిత్రమని మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు. సోనమ్ ఫస్ట్ మూవీ 'సావారియా'లో సల్మాన్ నటించినప్పటికీ, ఇద్దరు జత కట్టలేదని గుర్తుచేశారు. సహజసిద్ధంగానే సల్మాన్, సోనమ్ అందంగా కనిపిస్తారు. వారిని వెండితెరపై జోడీగా చూస్తే అభిమానులు మరింత ఆనందం పొందుతారని అనిల్ కపూర్ పేర్కొన్నారు. -
'బ్రేక్ తీసుకోవద్దని సలహాయిచ్చారు'
ముంబై: నటన నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ తీసుకోవద్దని అమితాబ్ బచ్చన్ తనకు సలహా యిచ్చారని నటుడు అనిల్ కపూర్ తెలిపారు. నటన నుంచి బ్రేక్ తీసుకుని తప్పు చేశానని బిగ్ బీ, తనలా చేయొద్దని చెప్పారన్నారు. ఆయన చెప్పిన సలహాను పాటించానని అన్నారు. అమితాబ్ అంటే తనకెంతో గౌరవమన్నారు. తన సినిమాల్లో ఏది బెస్ట్, ఏది వరస్టో చెప్పలేనని అన్నారు. తన కెరీర్ లో గడ్డుకాలం ఎదురైనప్పుడు కూడా బ్రేక్ తీసుకోలేదని వెల్లడించారు. మంచి సినిమాల్లో నటించడం తనకు లభించిన అదృష్టమన్నారు. -
యానిమేషన్ పాత్రకు డబ్బింగ్..
సీనియర్ నటుడు అనిల్ కపూర్ హాలీవుడ్లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్-4’ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ‘24’ అనే ఓ టెలివిజన్ సిరీస్‌లో నటిస్తున్న అనిల్‌ను ఇంకో ఆఫర్ వరించింది. 1999 సంవత్సరం నుంచి విజయవంతంగా కొనసాగుతున్న అమెరికన్ అడల్ట్ యానిమేషన్ సీరియల్ ‘ఫ్యామిలీ గాయ్’లో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారాయన. సేత్ మెక్‌ఫార్లేన్ సృష్టించిన గ్రిఫిన్ ఫ్యామిలీ చుట్టూ ఈ యానిమేషన్ సీరియల్ సాగుతుంది. ఇందులో కనిపించే ఓ అతిథి పాత్రకు అనిల్ డబ్బింగ్ చెప్పనున్నారట. -
సూర్య ‘24’ టైటిల్ మారనుందా
సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’కు చిక్కులు ఏర్పడ్డాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి 24 అనే టైటిల్‌ను నిర్ణయించారు. సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిక్కులు వచ్చి పడ్డాయి. ఇదే టైటిల్‌తో ఒక హాలీవుడ్ సంస్థ మెగా సీరియల్‌ను రూపొందిస్తోంది. ఆ సీరియల్ ఇండియా ప్రచార హక్కులను బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ ఏకంగా *150 కోట్లకు పొందారట. ఆ సీరియల్ టైటిల్‌తో సూర్య చిత్రం నిర్మించడాన్ని అనిల్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. దీంతో సూర్య తన చిత్రం టైటిల్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. -
అండర్ గ్రాడ్యుయేషన్!
అనిల్ కపూర్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన వలపుల రాణి సోనమ్‌కపూర్‌కు తీరని కోరికేదో మిగిలిపోయిందట! అది తనను తెగ బాధ పెట్టేస్తుంట! కోరికంటే ఇంకేదోలా ఊహించుకోవద్దు! ‘నా స్టడీస్‌ను పూర్తి చేయలేకపోయా. నాకన్నింటికంటే ఇదే పెద్ద బాధాకరమైన విషయం. అయితే ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తా. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా. చిన్న వయసులోనే నటిని అవ్వడం వల్ల ట్వల్త్ క్లాస్‌తోనే ఆపేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది. అంతా బానే ఉంది గానీ... ఉన్నట్టుండి సోనమ్‌కు చదువుపై మనసెందుకు వెళ్లిందన్నది అర్థం కాక బీ-టౌన్ ప్రజలు జుట్టు పట్టుకొంటున్నారు. అయితే సోనమ్‌లా బాలీవుడ్లో డిగ్రీ పూర్తి చేయలేకపోయినవారు చాలా మందే ఉన్నారు. -
‘ఇండియానా’లో మిస్టర్ ఇండియా
అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన 1987 నాటి సూపర్‌హిట్ మూవీ‘మిస్టర్ ఇండియా’ను ఇటీవల అమెరికాలోని ఇండియానా వర్సిటీలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు అనిల్ కపూర్ స్వయంగా ఇండియానా వెళ్లాడు. తన సినిమాను అక్కడ ప్రదర్శించడం చాలా థ్రిల్ ఇచ్చిందంటూ అనిల్ కపూర్ తబ్బిబ్బవుతున్నాడు. ‘మిస్టర్ ఇండియా’ సినిమాను ఇండియానా వర్సిటీ విద్యార్థులు, బోధనా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో కూడా అనిల్ కపూర్ పాల్గొన్నాడు. -
ఇల్లే స్వర్గం!
కష్టపడే వాళ్లు, వారాంతంలో ఒకసారి రిలాక్స్ అయితే చాలు, మరో వారానికి సరిపడ శక్తి వస్తుంది. అందుకే నేను వారంతాలలో రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తాను. ముంబాయి మహానగరంలో రిలాక్స్ కావడం కష్టమే. ఎందుకంటే వారం రోజులూ, 24 గంటలు నగరం మేల్కొనే ఉంటుంది. అందుకే బయటికి వెళ్లడం కంటే ఇంట్లో గడపడానికి ఇష్టపడతాను. నేను రిలాక్స్ కావడానికి అవసరమైన సహకారాన్ని నా కుటుంబం అందిస్తుంది. వారాంతంలో కుటుంబసభ్యులందరితో కలిసి కబుర్లు చెప్పుకోవడంలో నాకెంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఫైవ్‌స్టార్ హోటల్లో సేద తీరడం కంటే కుటుంబసభ్యులతో గడపడంలోనే సంతోషం లభిస్తుంది. దాని నుంచే రిలాక్స్ అవుతుంటాను. ముంబాయిలో రోజుకో కొత్త రెస్టారెంట్ ప్రారంభమవుతుంటుంది. విచిత్రమేమిటంటే ఇక్కడ చైనీస్, ఇటలియన్... మొదలైన ఫుడ్‌లన్నీ దొరుకుతాయి... ఒక్క ఇండియన్ ఫుడ్ తప్ప! అందుకే భోజనం విషయంలో ఇంటికి ప్రాధాన్యత ఇస్తాను. నచ్చిన భోజనం నుంచి ఇచ్చే తృప్తి నుంచి కూడా రిలాక్స్‌గా ఫీలవుతాను. జిమ్‌లో రిలాక్స్ కావడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. - అనిల్ కపూర్ -
'బాపు నా గురువు'
తనను నటుడిగా మలచిన ఘనత ప్రముఖ దర్శకుడు బాపుదేనని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. 1980లో ఆయన దర్శకత్వంలో వహించిన 'వంశవృక్షం' చిత్రం ద్వారా తాను తెరంగ్రేటం చేసిన సంగతి అనిల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిత్రాలలో ఏ విధంగా నటించాలి అనేది బాపు నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. అందుకే బాపు తనకు గురువని ... ఓ విధంగా చెప్పాలంటే బాపు నాకు మెంటర్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత దర్శకులతో నటించానని... అయితే బాపు దర్శకత్వంలో నటించడం తన అదృష్టమన్నారు. బాపు విభిన్న శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తారని అనిల్ ఈ సందర్బంగా ప్రశంసించారు. వంశవృక్షంలోనే కాకుండా బాపు హిందీలో తీసిన 'వోహ్ సాత్ దిన్' చిత్రంలో కూడా నటించానన్నారు. ఆయన దర్శకత్వం ప్రత్యేక శైలిలో ఉంటుందని గుర్తు చేశారు. బాపు మరణంతో దేశం మంచి దర్శకుడ్ని కోల్పోయిందని అన్నారు. -
విజయ్ చిత్రం నుంచి వైదొలగిన శ్రుతి
భారీ చిత్రం నుంచి వైదొలగినట్లు నటి శ్రుతిహాసన్ తెలిపారు. తమిళంలో విశాల్‌కు జంటగా పూజైరూ. చిత్రంలో నటిస్తున్నారు శ్రుతిహాసన్. దీంతోపాటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలావుండగా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ఒకదానికి దర్శకుడు శింబుదేవన్ డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో నటి శ్రుతిహాసన్ నటించేందుకు ఒప్పుకున్నారు. దీని గురించి గత వారం తన ఇంటర్నెట్ పేజీలో విజయ్, శింబుదేవన్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానురూ. అంటూ శ్రుతి తెలిపారు. శ్రుతిహాసన్ మళ్లీ తాను విడుదల చేసిన ప్రకటనలో కొన్ని మార్పులు జరిగాయని, భారీ చిత్రం ప్రస్తుతం లేదని అన్నారు. హిందీలో వెల్కం బ్యాక్రూ. చిత్రంలో జాన్ అబ్రహాం, అనిల్ కపూర్‌తోను, రమణ రీమేక్ అయిన కబార్రూ. చిత్రంలోను నటిస్తున్నారు శ్రుతి. ఈ రెండు చిత్రాలు 80 శాతం పూర్తయ్యాయి. ఇలావుండగా ఆమె వైదొలగినట్లు చెప్పిన భారీ చిత్రం, విజయ్ చిత్రమేనని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. -
హాలీవుడ్లో మనవాళ్లు..!
పంచామృతం: అమెరికా కేంద్రంగా ఉండే హాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ప్రపంచంలోని అనేక దేశాల నటీనటులు, దర్శకులు తమదైన ప్రభావాన్ని చూపుతున్నారు. మరి హాలీవుడ్‌పై భారతీయుల ప్రభావం ఎంత? హాలీవుడ్ సినిమాలను అమితంగా ఆదరించే భారతీయుల్లో ఎంతమంది అక్కడ ప్రముఖ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు అంటే అలాంటి వారి సంఖ్య స్వల్పమేనని చెప్పాలి. అలా హాలీవుడ్ సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న భారతీయుల్లో ముఖ్యమైన వాళ్లు... ఏఆర్ రెహమాన్ ‘ఇండియాస్ ఫస్ట్ డబుల్-ఆస్కార్ విన్నర్’ గుర్తింపు ఉన్న ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ముందు, తర్వాత కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. ‘ఎలిజబెత్: ది గోల్డెన్ఏజ్’తో రెహమాన్ హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాలకు నేపథ్య సంగీతాన్ని, స్వరాలను సమకూర్చారు. ఆస్కార్ అవార్డులను కూడా అందుకుని హాలీవుడ్‌పై భారతీయ ముద్రను వేశారు. ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా భారతదేశం ఆవల మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇర్ఫాన్‌ఖాన్. ప్రత్యేకించి భారతనేపథ్యంలో నడిచే హాలీవుడ్ సినిమాల్లో ఇర్ఫాన్‌ఖాన్ తప్పనిసరి పాత్రధారి. అకాడమీ అవార్డులు పొందిన స్లమ్డాగ్మిలియనీర్, లైఫ్ ఆఫ్ పైలలో ఈ నటుడు కీలక పాత్రలు వేశారు. ఇంకా ‘ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అనిల్ కపూర్ బాలీవుడ్లో అనిల్ కపూర్‌కు హీరోగా కాలం చెల్లిపోయిందేమో కానీ... హాలీవుడ్లో మాత్రం ఈ హీరోగారి ప్రభ క్రమంగా పెరుగుతోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో అనిల్ కపూర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా అనిల్‌కు ప్రముఖపాత్రలు దక్కుతున్నాయి. టామ్క్రూజ్తో కలిసి ‘మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమాలో అనిల్ కపూర్ నటించారు. అశోక్ అమృత్‌రాజ్ హాలీవుడ్లో దాదాపు వంద సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు అశోక్అమృత్రాజ్. ఒకనాడు భారతదేశం తరపున వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో పాల్గొన్న ఈ టెన్నిస్ ఆటగాడు ఆ తర్వాత హాలీవుడ్ సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. అనేక హిట్స్‌ను సాధించారు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఘోస్ట్‌రైడర్’ వంటి సినిమాలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఎమ్.నైట్ శ్యామలన్ స్క్రీన్‌రైటర్, డెరైక్టర్, ప్రొడ్యూసర్‌గా హాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. హాలీవుడ్లో ‘ద సిక్త్‌సెన్స్’ ‘అన్బ్రేకబుల్’ ‘లేడీ ఇన్ ద వాటర్’ ‘ఆఫ్టర్ ఎర్త్’వంటి సినిమాలతో శ్యామలన్ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. -
సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్
స్వేచ్ఛ కోసం పరితపించే సోనమ్ కపూర్.. ఇక మీదట మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంది. తాము చేసిన ప్రకటనలను తిప్పితిప్పి కావల్సినట్లు ఉపయోగించుకుంటారని ఇప్పుడు అంటోంది. సోనమ్ కపూర్ చేసిన బికినీ షాట్ వల్ల 'బేవకూఫియా' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆమె తండ్రి అనిల్ కపూర్ ఇటీవల అన్నాడు. అయితే, ''నాన్న ఎప్పుడూ అలా అనలేదు. ఆ ప్రెస్మీట్లో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మా నాన్న అన్నట్లు నేను చెప్పానంతే. కానీ మర్నాడు పేపర్లలో చూస్తే నా బికినీ షాట్ ప్రధాన శీర్షికలలో కనిపించింది'' అని సోనమ్ వాపోయింది. దాంతో ఇకమీదట ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నట్లు చెప్పింది. తాను చెప్పిన విషయాల్లో చాలా వరకు అనువాద లోపం వల్ల రాకుండా పోయాయని, అయినా ఈ పరిశ్రమలో అసలు నిజాయితీ అన్నదే పనికిరాదని సోనమ్ తెలిపింది. సాధారణంగా స్క్రిప్టు డిమాండు చేయడం వల్లనో, డైరెక్టర్ చెప్పారనో తాను బికినీ వేసుకున్నట్లు హీరోయిన్లు తరచు చెబుతుంటారు. కానీ, సోనమ్ మాత్రం తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నట్ల చెప్పింది. -
మగాళ్లేనా షేవింగ్ చేసుకునేది?
గడ్డం పెరుగుతుంది కాబట్టి... మగాళ్లు షేవింగ్ చేసుకుంటారు. అది కామన్. మరి గడ్డం అడ్డంగా లేకపోయినా... ఆడాళ్లు షేవింగ్ చేసుకుంటే... దాన్ని ఏమంటారు? సింపుల్‌గా ‘మెంటల్’ అంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో సోనమ్‌కపూర్‌ని ఉద్దేశించి అందరూ అదే అంటున్నారు. షేవింగ్ క్రీమ్‌ని గడ్డానికి పూసేసుకొని రేజర్‌తో షేవ్ చేసుకుంటూ ఫొటో షూట్ చేయించుకున్నారు సోనమ్. ఈ ఫొటో షూట్ చేసిన ఫొటోగ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠ... వాటిని తిన్నగా తీసుకెళ్ళి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాడు. అంతే... నిదానంగా సోనమ్ షేవింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. ఈవిడగారి వైనం చూస్తుంటే... మగాళ్లు షేవింగ్ చేసుకుంటున్నట్లే ఉందని, ‘పిచ్చిమాతల్లి పచ్చడంతా తిన్నది’ అన్న సామెత గుర్తొస్తుందని ఓ రేంజ్లో సోనమ్‌పై ఇంటర్నెట్లో జోకులు పేలుతున్నాయి. కొందరైతే... ఓ అడుగు ముందుకేసి సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ మీద కూడా జోకులు పేలుస్తున్నారు. దీనిపై సోనమ్ స్పందిస్తూ -‘‘మగాళ్లలా లేడీస్ కూడా షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అని సరదాగా చేసిన పని అది. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? నాపై ఎన్ని జోకులేసినా నేను ఫీలవ్వను. నాన్న గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఊరుకోను ఖబడ్దార్’’ అని వార్నింగులు జారీ చేశారు సోనమ్. ఇంతకీ ఈ షేవింగు వ్యవహారం అనిల్‌కపూర్‌కి తెలిసిందో లేదో?! -
నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను!
‘స్కిన్‌షో చేసి అవకాశాలు సంపాదించుకునే చీప్ మెంటాలిటీ కాదు నాది...’. కాస్త బ్యాగ్రౌండ్ ఉండీ... ఇండస్ట్రీలోకొచ్చిన ఏ హీరోయిన్ అయినా ముందు చెప్పే మాట ఇదే. కానీ... అవకాశాలు తగ్గాయంటే చాలు... నిదానంగా దుస్తులు కురచై పోతుంటాయి. చివరకు ఐటమ్ సాంగులకు కూడా ‘సై’ అనేస్తారు. ఉదాహరణకు మన సోనమ్ కపూర్‌నే తీసుకోండి. ఓ డజను సినిమాలు చేసుంటుంది తను. మంచి నటి అని పేరైతే సంపాదించుకుంది కానీ, స్టార్‌గా మాత్రం గుర్తింపులేదు. అందుకేనేమో... అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కుమార్తె అయ్యుండి కూడా టూపీస్ బికిని వేసేసింది. ‘బేవకూఫియా’ సినిమా కోసం దాదాపు మూడు నిమిషాల సన్నివేశంలో సోనమ్... టూ పీస్ బికినీలో హాట్ హట్‌గా నటించేసిందట. ఆయుష్మాన్ ఖురానా కథానాయకునిగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. సోనమ్ టూపీస్ బికినీ స్టిల్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘‘ఇలా బోల్డ్‌గా నటించారు. నాన్న కోప్పడతారేమో!’’ అని విలేకరులు అడిగితే -‘‘మా నాన్నకు చెప్పే చేశాను. ఆయనది విశాల హృదయం. అసలు నన్ను నటిగా ప్రోత్సహించిందే నాన్న. పాత్ర కోసం కొన్ని త్యాగాలు చేయాలని ఆయనే చెప్పారు’’ అని సమాధానమిచ్చారు సోనమ్. ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు వెల్లువెత్తుతాయని నమ్మకంగా ఉంది సోనమ్. -
బికినీ షాట్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!
-
బికినీ షాట్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!
బేవకూఫియా అనే తాజా చిత్రంలో సోనమ్ కపూర్ టూ పీస్ బికినీ వేసుకుని ఓ దృశ్యంలో నటించింది. దీని గురించి అందరూ అమ్మో అనుకున్నారు గానీ.. ఆమె తండ్రి అనిల్ కపూర్ మాత్రం ఏమంత ఆశ్చర్యపోలేదట. పైపెచ్చు, ఈ దృశ్యం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెబుతున్నాడట. ''మా నాన్నకు బికినీ షాట్ గురించి తెలుసు. ఆయన కూడా నటుడే. ఆయన హృదయం చాలా విశాలమైనది. అసలు నన్ను సినిమాల గురించి ప్రోత్సహించింది ఆయనే. అందువల్ల బికినీ షాట్ గురించి ఏమీ అనలేదు'' అని సోనమ్ చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. మంచి పొడగరి అయిన సోనమ్ కపూర్.. ఒకప్పుడు చాలా లావుగా, బరువుగా ఉండేది. కానీ ఇప్పుడు టూ పీస్ బికినీ వేసుకోడానికి తగినంత సన్నగా, రివటలా తయారైంది. తాను ఎప్పటికప్పుడు బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉంటానని, ఇందుకోసం ప్రత్యేకంగా కష్టపడేది ఏమీ లేదని తెలిపింది. పైపెచ్చు ఈ సినిమాలో తాను సాధారణ అమ్మాయిగానే కనిపిస్తాను తప్ప ప్రత్యేకంగా ఉండనని చెప్పింది. ఈ సినిమాకు సంతకం చేసేటప్పుడే బికినీ గురించి తెలుసని, ఎటూ సన్నగానే ఉన్నాను కాబట్టి, సరే అన్నానని సోనమ్ తెలిపింది. ధూమ్, రేస్ లాంటి సినిమాల్లో అయితే హీరోయిన్ల శరీరం మీదే కెమెరా కళ్లు ఉంటాయని, ఇందులో అలా ఉండదని చెప్పింది. నూపుర్ ఆస్థానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించాడు.