సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తలపడనున్నారట. ఒకరి మీద ఒకరు ఎలాంటి ఎత్తులు వేసుకుంటారో చూడాలి. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. బ్యాంక్‌లో తీసుకున్న సొమ్మును తిరిగి కట్టకుండా పారిపోయే విలన్ల ఆట హీరో ఎలా కట్టించాడన్నది చిత్రకథ అని సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను సంప్రదించిందట చిత్రబృందం. అనిల్ కపూర్‌కు కథను వినిపించారట కూడా. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరామేన్: మది.
Comments
Please login to add a commentAdd a comment