రీల్ లైఫ్లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా.. | Anil, Arjun to play uncle-nephew in Anees Bazmee's next | Sakshi
Sakshi News home page

రీల్ లైఫ్లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా..

Published Mon, Jun 13 2016 4:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

రీల్ లైఫ్లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా..

రీల్ లైఫ్లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా..

నిజజీవితంలో బాబాయ్, అబ్బాయ్లు అయిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, అర్జున్ కపూర్ ఓ సినిమాలో అవే పాత్రలు పోషించనున్నారు.

ముంబై: నిజజీవితంలో బాబాయ్, అబ్బాయ్లు అయిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, అర్జున్ కపూర్ ఓ సినిమాలో అవే పాత్రలు పోషించనున్నారు. అనిల్, అర్జున్ తొలిసారి కలసి నటించనున్నారు. అనీస్ బాజ్మీ తర్వాతి సినిమాలో వీరిద్దరూ తెరపై కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ముబారక అనే టైటిల్ పెట్టారు.

సినిమాలోనూ అనిల్, అర్జున్ బాబాయ్, అబ్బాయ్లుగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో మిగతా పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేయాల్సివుంది. కామెడీ, డ్రామా, రోమాన్స్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అనిల్ కపూర్ సోదరుడైన నిర్మాత బోనీ కపూర్కు అర్జున్ కపూర్ కొడుకు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement