చందమామ రావె జాబిల్లి రావె! | Sridevi, Raveena Tandon and Sunita Kapoor's Karva Chauth | Sakshi
Sakshi News home page

చందమామ రావె జాబిల్లి రావె!

Published Thu, Oct 20 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

చందమామ రావె జాబిల్లి రావె!

చందమామ రావె జాబిల్లి రావె!

ఎరుపు రంగు చీరలో అప్పుడే పూసిన ఎర్ర గులాబీలా శ్రీదేవి, గులాబీ రంగు డ్రెస్సులో అందమైన గులాబీ పువ్వులా బిపాసా బసు, హాఫ్ వైట్ శారీ, రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజులో మాన్యతా దత్, రెడ్ కలర్ చుడీదార్‌లో రవీనా టాండన్.. ఇలా అందరూ మెరిసిపోయారు. ‘కర్వా చౌత్’ పండగ కోసమే వీళ్లంతా ఇలా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ అంటే ఏంటో కొంతమందికి తెలిసే ఉంటుంది. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చందమామను చూసి, ఉపవాస దీక్షను విరమిస్తారు.
 
 ఉత్తరాదిన చాలా ఘనంగా చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వా చౌత్ ఆచరించే తన బంధువులు, స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. షబానా ఆజ్మి, ఆమె భర్త జావేద్ అఖ్తర్, శ్రీదేవి, బోనీకపూర్, రవీనా టాండన్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ తన ఇంట్లోనే కర్వా చౌత్‌ని ఆచరించారు. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్‌ని పెళ్లి చేసుకున్న బిపాసా బసు తొలి కర్వా చౌత్‌ను ఘనంగా జరుపుకున్నారు.
 
  సాయంత్రం చందమామ కనిపించగానే ఉపవాసాన్ని విరమించి, ‘ఇప్పుడు ఫుడ్ దొరుకుతుంది’ అంటూ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేశారు. మొత్తానికి చిన్నప్పుడు ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తే.. పెళ్లయ్యాక భర్త క్షేమం కోసం పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ చంద్రుణ్ణి ఆహ్వానించడం ఓ మంచి అనుభూతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement