కర్వా చౌత్ ‌: మిస్‌ యూ శ్రీదేవి | Karva Chauth 2018 - Miss You Sridevi | Sakshi
Sakshi News home page

కర్వా చౌత్ ‌: మిస్‌ యూ శ్రీదేవి

Published Sat, Oct 27 2018 8:59 PM | Last Updated on Sat, Oct 27 2018 9:06 PM

Karva Chauth 2018 - Miss You Sridevi - Sakshi

ముంబై: సాంప్రదాయబద్దంగా జరుపుకునే కర్వా చౌత్‌ రోజున (ఇక్కడ అట్ల తద్ది) కపూర్‌ కుటుంబం దివంగత అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఈ  పర్వ దినం సందర్బంగా ఎప్పటిలాగానే  ఆతిధ్య మిచ్చిన  సునీతా కపూర్ (అనిల్‌ కపూర్‌భార్య)  సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. శనివారం కర్వా చౌత్ పూజలకు హాజరైన ఇతర స్నేహితుల ఫోటోను  పంచుకున్నారు. ఈ సందర్భంగా ఐ మిస్‌ యూ శ్రీ అంటూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు.

ఈ వేడుకకు  బాలీవుడ్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌తోపాటు  నీలం కోఠారి, కైకిషాన్ పటేల్, నటుడు వరుణ్ ధావన్ తల్లి లాలి ధావన్, నిర్మాత రేణు రవి చోప్రా ఇతరుల హాజరైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. అలాగే గతంలో శ్రీదేవితో కలిసి కర్వా చౌత్‌  సంబరాన్ని నెమరు వేసుకుంటూ అప్పటి ఫోటోను కూడా పోస్ట్‌ చశారు.  దీంతో  ఈ పోస్ట్‌కు చాలామంది స్పందించారు.  శ్రీదేవికి కర్వా చౌత్ అంటే చాలా ఇష‍్టమనీ, ఈ  ఉత్సవాలకు ఎదురు చూసేవారంటూ  భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు  శిల్పాశెట్టి   ఒకప్పటి వీడియోను పోస్ట్‌ చేశారు.

బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్‌ వెళ్లిన  అతిలోక సుందరి  శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితులో బాత్‌ టబ్‌లో   పడి (ఈ  ఏడాది  ఫిబ్రవరి  24న)  చనిపోవడం  యావత్‌ ప్రపంచాన్ని దిగ‍్భ్రాంతికి గురి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement