
సాక్షి, భాగ్యనగర్ కాలనీ(హైదరాబాద్): భర్తతో గొడవపడి పార్క్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ తన చిన్నారులతో కలిసి అదృశ్యమైన సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ నగర్‌లో చీకటి జవహర్ విజయ్, స్వాతి (35) కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నారు.
విజయ్ నానక్ రామ్ గూడలోని యూబీఎస్ బ్యాంకులో పని చేస్తున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో గొడవలు పడగా పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. ప్రతిరోజు తన పిల్లలు ద్యుతి (5), కుమారుడు విరాజు (3)తో కలసి స్వాతి పార్క్‌కు వెళుతుంది.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో భర్త నిద్రలో ఉండగా పిల్లలతో సమీపంలోని పార్క్‌కు వెళ్ళింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment