
రచన (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: వివాహిత అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండి ఉప్పరిబస్తీకి చెందిన రచన, మధులు భార్యాభర్తలు. వీరికి శ్రీహాన్, సుహాన్ ఇద్దరు పిల్లలు.
నాగోల్‌లోని బీబీజీ రియల్ ఎస్టేట్ సంస్థలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తున్న రచన (26) ఈనెల 1న విధులకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. సన్నిహితులు, బంధుమిత్రులతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త మధు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.
చదవండి: (సహజీవనం.. ప్రియుడితో కలిసి కన్నబిడ్డకు చిత్రహింసలు)
Comments
Please login to add a commentAdd a comment