
వెంగళరావునగర్(హైదరాబాద్): స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీసుల సమాచారం మేరకు... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే సంతోషి, నీలకంఠ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె 8వ తరగతి వరకు చదివి బడి మాసేసింది.
ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడూ సీరియల్స్‌లో షూటింగ్‌కు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 12న మధ్యాహ్నం తల్లి ఇంట్లో లేకపోవడంతో తన స్నేహితురాలు ఇంట్లో పూజ ఉంది వెళ్లివస్తానని సోదరుడు భరత్‌కుమార్‌కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో సంతోషి కుమార్తెకు ఫోన్ చేయగా తాను యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నానని చెప్పింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెంబర్ కలవలేదు.
చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్
రాత్రంతా ఎదురు చూసినా ఇంటికి రాలేదు. గురువారం బంధువులు, స్నేహితులను విచారించి, పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. దీంతో మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వయసు దాదాపు 16 ఏళ్లు ఉంటాయని, సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎర్ర రంగు డ్రెస్, తెలుపు చున్నీ ధరించిందని, తెలుగు, హిందీ మాట్లాడగలదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment