TV serial actress
-
హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం
వెంగళరావునగర్(హైదరాబాద్): స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీసుల సమాచారం మేరకు... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే సంతోషి, నీలకంఠ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె 8వ తరగతి వరకు చదివి బడి మాసేసింది. ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడూ సీరియల్స్‌లో షూటింగ్‌కు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 12న మధ్యాహ్నం తల్లి ఇంట్లో లేకపోవడంతో తన స్నేహితురాలు ఇంట్లో పూజ ఉంది వెళ్లివస్తానని సోదరుడు భరత్‌కుమార్‌కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో సంతోషి కుమార్తెకు ఫోన్ చేయగా తాను యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నానని చెప్పింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెంబర్ కలవలేదు. చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్ రాత్రంతా ఎదురు చూసినా ఇంటికి రాలేదు. గురువారం బంధువులు, స్నేహితులను విచారించి, పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. దీంతో మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వయసు దాదాపు 16 ఏళ్లు ఉంటాయని, సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎర్ర రంగు డ్రెస్, తెలుపు చున్నీ ధరించిందని, తెలుగు, హిందీ మాట్లాడగలదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
కార్తీకదీపం కోసం చేయకూడని పనులు అన్ని చేయించారు
-
కోలీవుడ్ హీరోయిన్ గా బుల్లితెర నటి
-
రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్ నటుడి మృతి
ఏటూరు నాగారం(ములుగు జిల్లా): ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు(32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొయ్యూర్ గ్రామానికి చెందిన బాలుకు ఎవరు లేకపోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రంల్లో నటిస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈనెల 18న కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి చెందిన తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్ నుంచి వచ్చారు. వివాహం అనంతరం ఈనెల 19 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండా యాదాద్రి సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు బుల్లితెరలో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతుండగా విధి వక్రించి ఈ కానరాని లోకాలకు తీసుకెళ్లిందని స్నేహితులు, గ్రామస్తులు వాపోతున్నారు. మృతుడికి భార్య ఉంది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి: తమన్నా -
బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత
తమిళ సినిమా: బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఈమె మొట్టి ఒళి టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఒరు కథైయిన్ కథై, మంజల్ మహిమై తదితర సీరియళ్లలో ప్రధాన పాత్ర పోషించారు. వెట్టి చాకిరి, కొడికట్టు, అల్లి అర్జన్ తదితర సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు చేశారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) ఈమె భర్త మురుగన్ పశువైద్యుడు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నా రు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈమె మృతిపై పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి: (ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్) -
లంగా ఓణీలో హొయలు పోతున్న నవ్య స్వామి
-
'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ చేసిన మొదటి ఉద్యోగం ఇదే..
ఆమె నానమ్మగా వేసిన ‘బాలికా వధు’ 2248 ఎపిసోడ్స్‌తో దేశంలోనే సుదీర్ఘంగా సాగిన టీవీ సీరియల్‌గా రికార్డు స్థాపించింది. మొన్నటి ‘బధాయి హో’ సినిమాలో 50 ఏళ్ల కోడలు గర్భం దాలిస్తే ఆ కోడలిని అత్తగారి పాత్రలో ఆమె అక్కున చేర్చుకున్న తీరు అద్భుతం. సురేఖ సిక్రి (75) అంటే నాటక, టీవీ, సినిమా రంగంలో ఒక విశిష్టమైన పేరు. ఒక పరంపరకు ప్రతినిధి. సిక్రి శుక్రవారం కన్ను మూసింది. ఆమెకు నివాళి. దూరదర్శన్‌లో విఖ్యాతమైన ‘తమస్’ సీరియల్లో ఒక దృశ్యం. ఒక వృద్ధ సిక్కు జంట నిలువ నీడ లేక ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ సిక్కు జంటకు ఇల్లు లేదు. దారి లేదు. గమ్యం లేదు. దేశంలో దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని హత మారుస్తున్నారో తెలియదు. పోనీ ఎందుకు హతమారుస్తున్నారో తెలియదు. మనిషి కళ్లేలు ఉన్నంత వరకే మనిషి. వదిలితే మృగం. ఆ వృద్ధజంటను గడప దగ్గర చూసిన ‘రాజో’ అనే ముస్లిం మహిళ పాత్రలో ఉన్న సురేఖ సిక్రి ‘మా ఇంట్లో చోటు లేదు వెళ్లండి’ అంటుంది. వాళ్లు నిరాశతో తిరిగి వెళ్లిపోతుంటే తమాయించుకోలేక ‘ఆశపడి వచ్చారు ఆ పై గదిలో దాక్కోండి’ అని చోటు ఇస్తుంది. అన్నం పెడుతుంది. ‘నా మొగుడికి దేవుడంటే భయం ఉంది. మిమ్మల్ని ఏమి అనడు. కాని నా కొడుకు సంగతి చెప్పలేను’ అని తాపత్రయ పడుతుంది. కొడుకు వస్తాడు. ఈ సిక్కు జంటను చూసి మండిపడతాడు. వాళ్లను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక హృదయమున్న స్త్రీ, సిక్రి, ఊరుకుంటుందా? బెబ్బులిలా తిరగబడుతుంది. ఆ ముసలి జంట పక్షాన నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సురేఖా సిక్రి నటన చూడాలి. అలాంటి ఇలాంటి నటన కాదు. 2018లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బధాయి హో’లో సురేఖ సిక్రి చివరి రోజులలో ఉన్న వృద్ధురాలు. ఇంటి పెద్ద. కొడుకు, కోడలు, వయసొచ్చిన మనవలు... అలాంటి టైమ్‌లో, 50 ఏళ్ల వయసులో కోడలు గర్భం దాల్చిందన్న వార్త ఆమెకు తెలుస్తుంది. ఇదేమి చోద్యం? ఈ వయసు లో. కొడుకును తిట్టిపోస్తుంది. కోడల్ని గదిలో వేసి తాళం పెడుతుంది. అయ్యో.. ఏమి ఖర్మరా అని బాధ పడుతుంది. కాని తల్లి గర్భం దాల్చిందని నామోషీ ఫీలైన పెద్ద కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని, ఒక సహజమైన సహజాతమైన విషయానికి కోడలు మాటలు పడుతోందని సాటి స్త్రీగా అర్థం చేసుకొని తానే మొదట ఆ గర్భాన్ని అంగీకరించి ఆహ్వానిస్తుంది. మన ఇళ్లల్లో కనిపించే వృద్ధుల మనస్తత్వాన్ని, రూపాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది సురేఖ సిక్రి ఆ పాత్రలో. ఏళ్ల తరబడి ‘కలర్స్ టీవీ’లో ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రసారమైన ‘బాలికా వధు’లో ఆమె నానమ్మ పాత్రలో నటించింది. ఆమె ఆ కథలో ఎంత సేపటికి తన మనవడి పక్షం. అందుకని ఆ మనవణ్ణి చేసుకున్న చిన్నారిని అదలిస్తుంది. బెదిరిస్తుంది. దారికి తేవడానికి చూస్తుంది. కాని కథ గడిచే కొద్దీ మనవడు సరైన వాడు కాదని గ్రహించి చిన్నారి పెళ్లి కూతురుకు పెద్ద సపోర్ట్‌గా మారుతుంది. అంతేకాదు ఆ పెళ్లి కూతురు తన మనవణ్ణి వదిలి మరో కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సురేఖ సిక్రి పాత్రలు ఇలాంటి పాత్రల వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. సురేఖ సిక్రీ ఒక కాలంలో వచ్చిన ఉత్తమ నటులు నసీరుద్దిన్ షా, ఓం పురి, రఘువీర్ యాదవ్... వీళ్ల సమకాలికురాలు. అలిగర్లో తల్లి టీచర్‌గా పని చేయడం వల్ల అలిగర్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే ఉర్దూ కవిత్వం అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో మూడేళ్ల నటనలో కోర్సు చేసి అక్కడి రెపట్రీలో నాటకాలు వేస్తూ వేయిస్తూ 15 సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత ముంబై వచ్చి సినిమాల్లో పని చేసింది. ‘సలీమ్ లంగ్డే పే మత్ రో’, ‘మమ్నో’, ‘నసీమ్’, ‘సర్దారీ బేగమ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యర్ వంటి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది. ‘ఆమె నాటకాలు వేస్తుంటే తొంగి తొంగి చూసి ఆమెలా నటించాలని ఎన్.ఎస్.డిలో నేను అనుకునేదాన్ని’ అని నటి నీనా గుప్తా అంది. వీరిద్దరూ కలిసి ‘బధాయీ హో’లో నటించారు. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమా హీరోయిన్గా నటించిన అవికా గోర్ ‘బాలికా వధు’లో చిన్నారి పెళ్లికూతురిగా నటించింది. ‘నా నట జీవితం అటువంటి శిఖరంతో మొదలుకావడం నా అదృష్టం’ అని అవికా గోర్ అంది. సురేఖ సిక్రికి నటుడు నసీరుద్దిన్ షాకు బంధుత్వం ఉంది. సిక్రి సవతి చెల్లెలు పర్వీన్ మురాద్‌ను నసీరుద్దిన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి షీబా షా అనే కుమార్తె ఉంది. షీబా షా సురేఖ సిక్రితో కలిసి నటించింది. ‘ఒక మంచి నటికి రెండులైన్ల డైలాగ్ ఉన్న పాత్ర దొరికినా ఆ రెండులైన్లను ఎంత బాగా చెప్పొచ్చు.. ఆ లైన్ల వెనుక కథ ఏమిటి... ఆ లైన్లకు ఎలా న్యాయం చేయాలి... ఇవి ఆలోచించి నటించినట్టయితే తప్పక ఆత్మతృప్తి పొందవచ్చు’ అంటుంది సురేఖ సిక్రి. కవిత్వం మీద తన అభిమానాన్ని ఉర్దూ స్టూడియో, హిందీ స్టూడియోలలో గొప్ప గొప్ప కవుల కవిత్వాన్ని చదివి రికార్డు చేసి ఆమె మనకు కానుకగా ఇచ్చింది. భారతీయ నటనా రంగం చూసిన ఒక ఉత్తమ కవిత సురేఖ సిక్రి. ‘బధాయీ హో’లో... ‘తమస్’ సీరియల్లో... ‘బాలికా వధు’ సీరియల్లో... -
‘అనసూయ’గా వంటలక్క అత్తమ్మ!
‘కేరాఫ్ అనసూయ’తో మరో పవర్ఫుల్ పాత్ర ద్వారా ‘స్టార్ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి అర్చన అనంత్. ఐపీఎల్‌ను మించిన క్రేజ్ కార్తీకదీపం సీరియల్‌కు తెలుగునాట ఉన్నా సీరియల్లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు. కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్ అనసూయ అంటూ ‘స్టార్ మా ’ ఛానెల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు. అలా మొదలైంది.. డాక్టర్ కాబోయి యాక్టర్ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్... నో ఎక్స్ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. సినీ కుటుంబమే కానీ.. అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది.. నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్లో ప్రవర్తిస్తుందన్నారు. ఇకపై అనసూయ అనే అంటారు..? ‘కేరాఫ్ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్లాగానే అనసూయ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ ఇది. ‘స్టార్‌మా’ లోనే తాజా సీరియల్ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను. కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో సినీ రంగానికి... కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్‌తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె. -
ఏది నిజం..?
-
నటి శ్రావణి- ఆర్ఎక్స్100 నిర్మాత ఆడియో లీక్
-
స్వస్థలానికి చేరుకున్న టీవీ నటి శ్రావణి భౌతికకాయం
-
శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’
అమీర్‌పేట(హైదరాబాద్): టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రావణి ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్మెంట్లో శ్రావణి కుటుంబం ఉంటోంది. టిక్ టాక్ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అలియాస్ సన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దేవరాజ్ వారి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్‌కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్‌కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్‌రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో యువతిని మోసం చేయడంతో.. శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్‌రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. శ్రావణి వద్ద నుండి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్.. ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. రెండు రోజుల అనంతరం ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తరువాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్‌రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్ 22న ఎస్ఆర్నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్‌ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. నాకేం సంబంధం లేదు.. తన కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్‌రెడ్డి దీనిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, కుటుంబ సభ్యులు కొట్టారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. డబ్బుల కోసం తానేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ అన్నాడు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని తెలిపాడు. దేవరాజ్వల్లే..: సాయి ఇదిలా ఉండగా.. దేవరాజ్‌రెడ్డి శ్రావణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపించాడు. శ్రావణి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి సమాచారం రాగానే వెంటనే వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తానే ఆసుపత్రికి తీసుకువెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రావణిని దేవరాజ్‌రెడ్డి ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడినట్టు చెబుతు న్న ఆడియోను విడుదల చేశాడు. ప్రతి పండుగకు గొల్లప్రోలుకు వచ్చేది.. పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదా వరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన టీవీ సీరి యల్ నటి శ్రావణి ఆత్మహత్యతో ఆమె కు టుంబంలో విషాదం నెలకొంది. తమ తం డ్రి కొండపల్లి భాస్కరావు వ్యవసాయ కూలీ అని, చిన్ననాటి నుంచి సెలబ్రిటీగా ఎదగా లని శ్రావణి తపన పడేదని మృతురాలి అక్క విమల తెలిపారు. మృతురాలికి విమ ల, మహేశ్వరి అనే ఇద్దరు అక్కలు, శివ అనే సోదరుడు ఉన్నారు. తమ చెల్లి శ్రావణి ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లి తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం సంపాదించిందని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని విమల తెలిపారు. సీరియల్స్‌లోనే కాకుండా ఆర్ఎక్స్ 100తోపాటు 30 సినిమాల్లో కూడా శ్రావణి నటించిందని ఆమె వెల్లడించారు. ఇటీవలే గొల్లప్రోలులో శ్రావణి సొంతంగా ఇల్లు కొనుగోలు చేసిందని, మూడేళ్ల కిందట తమ తల్లిదండ్రులను గొల్లప్రోలు నుంచి హైదరాబాద్‌లో తన వద్దకు తీసుకువెళ్లడంతో అక్కడే ఉంటున్నారని విమల చెప్పారు. ప్రతి పండుగకు గొల్లప్రోలు వచ్చి తమతో ఆనందంగా గడిపి వెళ్లేదని, ఇటీవల వరలక్ష్మి వ్రతానికి కూడా వచ్చిందని.. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె విలపించారు. -
మూడేళ్లుగా ప్రేమలో ఉన్నా.. కానీ అతను!
ముంబై : గత మూడేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానని బాలీవుడ్ బుల్లితెర నటి ఎరికా ఫెర్నాండెజ్ తెలిపారు. అయితే తన ప్రియుడు చిత్ర పరిశ్రమకు చెందినవాడు కాదని ఆమె స్పష్టం చేశారు. 'కసౌతి జిందగీ కే 2’ సీరియల్లో ప్రేర్నాగా నటించిన టీవీ స్టార్ ఎరికా ఫెర్నాండెజ్ తన సహనటుడు పార్థ్ సమతాన్‌తో, ఇంతకముందు ఎరికా ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ’ సహనటుడు షాకీర్ షేక్‌తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే పార్థ్, షాకీర్ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనని ఎరికా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన ఎరికా ఫెర్నాండెజ్.. తాను మూడేళ్లుగా ఒకరితో ప్రేమాయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక అతను సినీ పరిశ్రమకు చెందిన వాడు కానందున అతన్ని ఎవరూ తెలుసుకోలేరని అన్నారు. (గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాను.. కానీ) 'నా భాయ్‌ఫ్రెండ్ నా షోలు చూస్తుంటాడు. అతనికి నేను వేరే వాళ్లతో రొమాన్స్ చేయడం నచ్చదు. కానీ మా మధ్య ఉన్న స్నేహం, అవగాహన వల్ల ఇంకా రిలేషన్లో కొనసాగుతున్నాం. అయితే ఇటీవల నా కోస్టార్స్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో మా రిలేషన్షిప్ గురించి చెప్పాలనుకున్నాను. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అని ఎరికా తెలిపారు. ఇక ఎరికా ఆది సాయికుమార్ నటించిన గాలిపటం వంటి తెలుగు సినిమాల్లోనూ కనిపించారు. (ఈ బుడ్డోడి డ్యాన్స్‌కు రచయిత ఫిదా) -
చిన్ని తెర తారలకు టిక్‌టాక్ క్రేజ్
‘ఆయన్ను నేనెంతో ప్రేమించా..నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు’ అంటూ కన్నీళ్లు కుమ్మరించి వీక్షకుల కళ్లూ చెమర్చేలా చేస్తారు టీవీ స్టార్స్. ఇప్పుడు వీరికి ఏడుపు సన్నివేశాల విరామాల్లో వినోదాన్ని పండించేందుకు, తమ పాపులారిటీకి పదును పెట్టుకునేందుకు అందివచ్చిందో అవకాశం.. అదే టిక్ టాక్...వీమేట్..హలో యాప్స్. బుల్లితెర నటులు ఈ మధ్య షూటింగ్ గ్యాప్‌లో ఫన్నీ వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. వీటికి వీక్షకులు, ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే ఉంటోంది. కంటతడి పెట్టించే అభినయంలో నిష్ణాతులైన చిన్నితెర స్టార్స్ వైవిధ్య భరిత అంశాల్లో ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి టిక్ టాక్ వీడియాలను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని, ఫాలోయర్స్‌ని సాధించుకుంటున్నారు. గ్యాప్‌లో.. టాక్‌షో సిటీలో ఎప్పుడూ ఏదో ఒక స్టూడియోలోనో, ఇంట్లోనో చిన్నితెర షూటింగ్స్ సర్వసాధారణం. నిన్నా మొన్నటి దాకా ఆయా షూటింగ్స్‌లో పాల్గొంటున్న తారలు షాట్ గ్యాప్స్‌లో పిచ్చాపాటీ మాట్లాడుకోవడంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడా ముచ్చట్ల స్థానాన్ని టిక్ టాక్ షూటింగ్స్ ఆక్రమించాయి. షూటింగ్ గ్యాప్స్‌లో మేకప్ సైతం తీయకుండానే సెకన్లు, నిమిషాల వ్యవధి వీడియోలను రూపొందించేస్తున్నారు. ఎవరితో అయినా కలిసి లేదా ఒంటరిగా వచ్చిన ఐడియా మేరకు వీడియోలు చేస్తున్నారు. ‘షూటింగ్ గ్యాప్స్‌లో లాంగ్ బ్రేక్స్ ఏర్పడినప్పుడు బోర్డమ్ పోగొట్టుకోవడానికి ఈ బుల్లి వీడియోలు. చాలా ఉపకరిస్తాయి’అని జీ తెలుగు సూర్య వంశం సీరియల్ ద్వారా పాపులరైన మీనా వాసు చెప్పారు. పాటపై ఇష్టమే బాట వేసింది చిన్నితెర మెగా నటిగా ఉన్న హరిత టిక్‌టాక్‌పై కూడా టాప్‌ప్లేస్‌లో ఉండడం విశేషం. జీ తెలుగులో వస్తున్న ముద్ద మందారంతో పాటు పలు సీరియల్స్‌లో ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రలు పోషిస్తున్న హరిత 3 లక్షలకు పైగా ఫాలోయర్స్‌తో టిక్‌టాక్‌లో పీక్స్‌లో ఉన్నారు. ‘పాటలంటే చాలా ఇష్టం. అయితే సీరియల్స్‌లో పాటలకి పెద్దగా ఆస్కారం ఉండదు కదా. అందుకే టిక్‌టాక్ ద్వారా నచ్చిన పాటలకు అభినయాన్ని జోడిస్తున్నా. నటిగా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడానికి, ఎన్నో భావోద్వేగాలను పలికించడానికి, వినోదం అందుకోవడానికి సహకరిస్తాయీ వీడియోలు’ అంటున్నారు హరిత. రొటీన్ నుంచి రిలీఫ్ కెమెరాలు, డైరెక్టర్లు, దట్టంగా మేకప్పులు, చాంతాడంత డైలాగులు, కట్స్, కష్టాలు, కన్నీళ్లు, .. వీటన్నింటికీ భిన్నంగా దర్శకత్వం నుంచి సర్వం మనమే అయి రూపొందించుకునే ఈ వీడియోల ద్వారా బోలెడంత రిలీఫ్ లభిస్తోందని ఈ తారలు అంటున్నారు. పెద్దగా వ్యయ ప్రయాసలేవీ లేకుండా నిమిషాల్లో తీసేసి క్షణాల్లో సోషల్ మీడియాలోకి అప్లోడ్ అయిపోతూ చిన్నితెర కన్నా మిన్నగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ‘బిజీ షూటింగ్స్ సమయంలో షాట్ గ్యాప్స్‌లో తీసే ఈ వీడియోలు ఒత్తిడి నివారిణిలాగా వినోదాన్ని పంచుతాయి’ అని రక్త సంబంధం, కళ్యాణ వైభోగమే సీరియల్ నటి మేఘనా లోకేష్ అంగీకరించారు. నైపుణ్యాలకు సాన.. ఓ వైపు నటిస్తూనే మరోవైపు తమ అభినయ సామర్థ్యానికి మరింత సాన బెట్టడానికి ఇది చక్కని అవకాశంగా స్మాల్స్క్రీన్స్టార్స్ భావిస్తున్నారు. ‘ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లకుండానే టిక్‌టాక్ ద్వారా నటనానుభవంతో పాటూ వినోదమూ లభిస్తుంది’ అన్నారు ముద్దమందారం ఫేమ్ తనూజ గౌడ్. ‘ఇది మన ప్రతిభ ప్రదర్శనకు వేదిక. దీని ద్వారా మరింత మందికి నేను చేరువ అవగలుగుతున్నా’ అని చెప్పారు గంగ మంగ సీరియల్ నటి ప్రణవి, ‘తొలుత ట్రెండ్‌ను అనుసరిస్తూ వీడియోలు చేశా. ఇప్పుడు అది అలవాటైంది. మీనా అక్కతో కలిసి వీడియోలు జంటగా రూపొందించడం అంటే ఇష్టం’ అని చెప్పారు సీరియల్స్ నటి గీతాంజలి. భార్యతోనే జోడీ.. టైమ్ పాస్ కోసం ఎప్పుడైనా ఫ్రీ టైమ్‌లో, షూట్ గ్యాప్‌లో టిక్ టాక్స్ చేస్తాం. నేనూ నా వైఫ్ విష్ణుప్రియ చేసిన టిక్‌టాక్స్ ఎక్కువే. మా సీరియల్ హీరోయిన్ మేఘన నేను కూడా టిక్‌టాక్‌లు చేస్తుంటాం. టిక్టాక్స్కి ఫాలోవర్స్ ఎక్కువ. ఫన్ ఉండటంతో వర్క్ స్ట్రెస్ ఏదైనా.. రిలాక్స్ అయినట్టూ ఉంటుంది. – సిద్ధార్థ్ వర్మ -
అన్న చనిపోతే తమ్ముడితో పెళ్లి..
కన్నడ సీరియల్ నటి తెలుగు ప్రేక్షకులకు భానుగా పరిచయం అయ్యింది. ‘మనసిచ్చి చూడు’ అంటూ ‘స్టార్ మా’లో వచ్చే ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న ఈ నటి పేరు కీర్తి భట్. సీరియల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయంటూ తన గురించి చెప్పుకొచ్చింది కీర్తి. ‘‘నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కన్నడ పరిశ్రమలోనే ఉన్నాను కాబట్టి ఇంకా తెలుగు సరిగా రాదు. అర్ధం చేసుకుంటూ నేర్చుకుంటున్నాను. ‘ది క్రైస్ట్ సేవ్ యూ’ అనే సినిమా తెలుగు, ఇంగ్లిష్‌లోనూ వచ్చింది. ఆ విధంగా తెలుగువారికి పరిచయం అయ్యాను. కిందటేడాది వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా చేశాను. ఇప్పుడు ‘మనసిచ్చిచూడు’ సీరియల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ సీరియల్లో నాది సంప్రదాయాలను గౌరవించే భాను పాత్ర. పెద్దల పట్ల మన్నన గౌరవం అధికం. బాధ్యతలను, బంధాలను వదలుకోని భాను జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు ఉంటాయి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలన్నది భాను కల. ఆ కల నిజమవుతున్న వేళ అతను ప్రమాదంలో చనిపోతాడు. దీంతో అతని తమ్ముడినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్నో ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్ ఉంటుంది. ఇప్పటి వరకు కన్నడలో మూడు టీవీ సీరియల్స్ చేశాను. రెండు కన్నడ సినిమాల్లో నటించాను. నిజజీవితంలోనూ పెద్ద ప్రమాదమే! సీరియల్లో హీరోయిన్ కష్టాలు కల్పితమే. కానీ, నిజ జీవితంలో.. బిబిఎమ్ చేసిన నాకు ఎప్పుడూ సినీ ఫీల్డ్ మీద ఆసక్తిగా ఉండేది. అమ్మానాన్న అంత ఆసక్తి చూపకపోయినా నా ఇంట్రస్ట్ చూసి కాదనలేదు. అయితే, మూడేళ్ల క్రితం కారు ప్రమాదంలో అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమయ్యారు. దీంతో ఒంటరిదాన్నయ్యాను. కుటుంబాన్ని కోల్పోయి దురదృష్టవంతురాలిగా మిగిలిపోయాను. బాధపడుతూ కూర్చుంటే కాదని, లైఫ్‌ను సింగిల్‌గానే ఎదుర్కోవాలని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఉన్న ఫీల్డ్‌లోనే కొనసాగాలని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా అవకాశాల కోసం ఎదురు చూడకుండా సీరియల్స్ వైపు వచ్చాను. ఇక్కడ ఆదరణ, అభిమానం ఈ పరిశ్రమలో కొనసాగేలా చేస్తోంది. నా తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు, అందరితో కలిసే చేసే ఈ టీమ్‌లో నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఎంపికలో ముందు డ్రెస్ సెలక్షన్, ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా ఆసక్తి ఉండటం నా వర్క్‌కి ప్లస్ అయ్యింది. నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టుగా కాంబినేషన్ డ్రెస్సులను ఎంచుకుంటాను. కొంతవరకు నా డిజైనర్ ఫ్రెండ్ సలహాలు తీసుకుంటాను. అమ్మాయిలు ఇప్పుడు ప్రతి రంగంలోనూ తమని తాము నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు. ఎవరూ లేరని, తమకేదో జరుగుతుందని జంకితే ఎదుగుదల ఉండదు. మనం పుట్టిందే సవాళ్లను ఎదుర్కోవడానికి అర్ధమయ్యాక ఇప్పుడు ఏ సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ నిలిచేఉండేలా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా అభిలాష.’’– ఆరెన్నార్ డ్యాన్స్‌తో మాయం చిన్పప్పటి నుంచి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలాగే పుస్తకాలు చదవడం కూడా. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లోన్లీగా అనిపించినా, ఎక్కువ హ్యాపీ అనిపించినా డ్యాన్స్‌నే బేస్ చేసుకుంటాను. ఏ స్ట్రెస్ అయినా డ్యాన్స్‌తో ఇట్టే మాయం అయిపోతుంది. డ్యాన్స్ షోస్ చూడడం కూడా చాలా ఇష్టం. -
‘పెళ్లెప్పుడు’ అని అడుగుతుంటారు..
బాలనటిగా సినిమాల్లోకి ఎంటర్ అయిన ప్రణవి సీరియల్ నటిగా పేరుతెచ్చుకుంటోంది. ‘గంగ మంగ’ సీరియల్లో గంగ గా తెలుగింటి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అచ్చతెనుగు అమ్మాయిగా పదోతరగతితోనే ‘బుల్లితెర’ంగేట్రమ్ చేసిన ప్రణవి చెబుతున్న ముచ్చట్లివి. ‘‘మాది తాడేపల్లి గూడెం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. శాస్త్రీయ నృత్యం కూచిపూడితో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఢీ, ఆట.. ప్రోగ్రామ్‌ల్లోనూ పాల్గొన్నాను. ఆ ఇష్టం వెండితెరకు బాలనటిగా పరిచయం చేసింది. సినిమాల్లో ఉయ్యాల జంపాల, సీరియల్స్‌లో పసుపు కుంకుమ, భార్యామణిలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎవరేమోహినిలో హీరోయిన్గా చేశాను. గంగ మంగ సీరియల్‌కి ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు గంగ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. దృశ్యం సినిమాలోని చిన్నపాపకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మారాను.’’– నిర్మలారెడ్డి మా అక్కే నా టీచర్! నేనిప్పుడు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్నాను. బాలనటిగానే ఈ రంగంలోకి వచ్చాను. షూటింగ్స్ లేని రోజుల్లో చదువుకుంటాను. మా అక్క డిగ్రీ చేస్తోంది. తనే నా సబ్జెక్ట్స్ అన్నీ చెబుతుంటుంది. అక్కతో... లొకేషన్ ఎట్ ఫన్! కాన్సెప్ట్ ఏదైనా డైరెక్టర్ చెప్పగానే అలా ఒక్కసారి ఊహించుకొని చేసేస్తాను. యూనిట్లో అంతా నన్ను మెచ్చుకుంటారు. కాకపోతే ఎక్కడా ఖాళీ ఉండను. లొకేషన్ ఎప్పుడూ ఫన్‌గా ఉంటుంది. అల్లరి బాగా చేస్తానని నాకు పేరు(నవ్వుతూ). ఖాళీ దొరికితే లొకేషన్లోనే కాసేపు చదువుకోవడం లేదంటే టిక్‌టాక్ వీడియోలతో హడావిడి చేస్తుంటాను. నా ఫ్యామిలీ నా బలం ఇంట్లో నన్ను ముద్దుగా ‘గంగమ్మ’ అని పిలుస్తుంటారు. నేనీ రంగంలోకి రావడానికి మా నాన్న శ్రీనివాసమూర్తి కారణం. ఏ సన్నివేశంలో ఎలా యాక్ట్ చేయాలో చెబుతుంటారు. అమ్మ రత్నవల్లి నా క్యాస్ట్యూమ్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అక్క నా చదువు చూసుకుంటుంది. బామ్మలు నేను ఎదగాలని కోరుకుంటారు. నా ఫ్యామిలీ నా బలం. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న కల. సీరియల్లో ఓ దృశ్యం సీరియల్లో గంగ! ‘గంగమంగ సీరియల్లో గంగ మొదట్లో ఏమీ తెలియని అమాయకురాలు. ఇప్పుడు మంగ ఆస్తికోసం చేసే కుట్రలను తిప్పి కొడుతుంటుంది. అమ్మమ్మతో చనువుగా ఉంటుంది. ఆమె చెప్పింది వేదంలా పాటిస్తుంది. నిజ జీవితంలోనూ అంతే అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పింది బుద్ధిగా వింటాను. వాళ్లకీ నన్ను నటిగా చూడటమే ఇష్టం. నటిగా బాగా ఎదగాలని కోరుకుంటారు. స్నేహితులు కలిస్తే! మా ఫ్రెండ్స్ ఇప్పుడు కలిస్తే చాలు నన్ను ‘పెళ్లెప్పుడు’ అని సరదాగా అడుగుతుంటారు. సీరియల్లో పెళ్లి సందర్భం సన్నివేశాలు చెప్పి ఆటపట్టిస్తుంటారు. చిన్నదాన్నైనా సీరియల్లో పెద్దదానిగా కనిపిస్తుంటాను. అప్పుడు మా అమ్మ కూడా నవ్వుతూ వాళ్లకి సమాధానమిస్తుంది. -
న్యూస్ రీడర్ నుంచి సీరియల్ నటిగా!
‘టీవీలో యాంకరింగ్ చేశాను. న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో వర్క్ చేస్తున్నాను.నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటున్న సీరియల్ నటి సిరి చెబుతున్న ముచ్చట్లివి. ‘‘మాది వైజాగ్. పుట్టి పెరిగింది అక్కడే. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కి వచ్చేశాను. అమ్మ, నేను, అన్నయ్య.. ఇదీ మా కుటుంబం. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ చిన్న కిరాణా షాపు పెట్టి, అలా వచ్చిన ఆదాయంతో మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఎంబీయే చేస్తూనే సీరియల్స్‌లో నటిస్తున్నాను. సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. అన్నయ్య ఫొటోగ్రఫీ వర్క్ చేస్తున్నాడు. మా బలం అమ్మనే. అగ్నిసాక్షి ఇప్పటి వరకు మూడు సినిమాలలో అవకాశాలు వస్తే చేశాను. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కి ముందు ‘ఉయ్యాల జంపాల’, ‘ఎవరేమోహినీ’లో వర్క్ చేశాను. ఇప్పుడు అగ్నిసాక్షిలో ప్రాధాన్యం ఉన్న రోల్లో నటిస్తున్నాను. సిరిగా ఇప్పుడు అందరిలోనూ మంచి గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ చేస్తూనే యాంకరింగ్ వైపు నేను టీవీలో, సినిమాలో కనిపించడం అమ్మకు నచ్చలేదు. ఈ ఫీల్డ్ అంటే ఉన్న సందేహాలు, నాన్న లేకపోవడంతో మేం భవిష్యత్తులో ఎలా నిలదొక్కుకుంటామో అనే భయాల వల్ల మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి ఆన్‌స్క్రీన్ అంటే బాగా ఇష్టం. అలా డిగ్రీ చేస్తూనే యాంకరింగ్ వైపుకు వచ్చాను. ఆ తర్వాత న్యూస్రీడర్గానూ వర్క్ చేశాను. పది వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. అవి చూసిన వాళ్లు అమ్మకు ‘మీ అమ్మాయి చక్కగా ఉంది. మంచి జాబ్ చేస్తోంది. మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకునేవారు. దీంతో అమ్మకు ఈ ఫీల్డ్ అంటే ఉన్న భయం పోయింది. సిరి ఎక్కడున్నా బతికేస్తుంది అని నమ్మకం వచ్చేసింది. అన్నయ్య కన్నా నేనే బెస్ట్! నాన్నగారు లేకపోవడంతో అమ్మ నన్ను ఇండిపెండెంట్‌గా బతకడం అలవాటు చేసింది. ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని అని అన్నయ్యను నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. పైగా ఎక్కడున్నా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అంటుండేది. అలా పనులు చేయడంలో, యాక్టివ్‌గా ఉండటంలో అన్నయ్య కన్నా నేనే బెస్ట్ అనిపించుకుంటాను. ఇప్పుడు అమ్మను పనిచేయనివ్వడం లేదు. షాప్ తీసేశాం. ‘మా కోసం ఇన్నాళ్లు కష్టపడ్డావు ఇక రెస్ట్ తీసుకో’ అని అమ్మకు చెబుతుంటాం నేనూ, అన్నయ్య. అభిరుచులు డ్యాన్స్ అంటే పిచ్చి. కానీ, ఒక పద్ధతి ఉండదు (నవ్వుతూ). ఎలా అంటే అలా గెంతులు వేస్తుంటాను. పాటలు కూడా అంతే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఎప్పుడూ ఫోన్ చేతిలోనే ఉంటుంది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కలర్ కాంబినేషన్స్.. చూసుకోవడం ఇష్టంగా చేస్తాను. డ్రీమ్ రోల్ ఎప్పటికీ ఇలా మీ మధ్య ఈ ఫీల్డ్‌లో కొనసాగాలన్నదే నా కల. ఇదే నా జీవితం. ఈ ఫీల్డ్‌లో దేనినీ వదిలేయను. ఇప్పటికీ ఎవరైనా పిలిచి యాంకరింగ్ చేయమన్నా చేస్తాను. షోస్‌లో పాల్గొంటాను. ఒకటి అని ఏమీ లేదు. సినిమా, టీవీ .. యాక్టింగ్‌లో ఆల్‌రౌండర్ అనిపించుకోవాలి. – నిర్మలారెడ్డి -
చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటేనే భయం..
‘మా’ టీవీలో ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్లోడాక్టర్ మౌనితగా తెలుగు ప్రేక్షకులకుఆమె పరిచయమే. అసలు పేరు శోభాశెట్టి.‘ముందు నెగిటివ్ రోల్ అని డిజప్పాయింట్ అయ్యాను,కానీ ఇదే ఇప్పుడు నాకు ఎంతోమంది అభిమానులనుతెచ్చిపెట్టింద’ంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది శోభ. సీరియల్ నటి ఎప్పుడు అనిపించుకున్నారు? ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. తెలుగువారికి పరిచయమై మూడేళ్లు అవుతోంది. నేను కన్నడ నటిని. మాది బెంగుళూరు. చదువుకునేప్పటినుంచే నటన అంటే పిచ్చి ఇష్టముండేది. కాలేజీ రోజుల్లోనే ఫేస్బుక్ ద్వారా నా ప్రొఫైల్, ఫొటోస్ టీవీ వారికి చేరవయ్యాయి. అలా, నటినయ్యాను. తెలుగులో కార్తీకదీపం సీరియల్‌కు ముందు అష్టాచెమ్మాలో నటించాను. నెగిటివ్ రోల్ తెలిసే ఒప్పుకున్నారు..? అవును, ముందు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నా. అప్పటికే సీరియల్ థీమ్ గురించి తెలుసు. హీరోయిన్‌కి పోటాపోటీగా ఉంటుంది నా క్యారెక్టర్. పాజిటివ్ రోల్ చేస్తే మంచి పేరొస్తుంది. అయితే, ఇలాంటి నెగిటివ్ రోల్స్ వల్ల మన వర్త్ ఏంటో తెలుస్తుంది. ఫ్యామిలీ గురించి..? అమ్మానాన్న, అన్నయ్య, అక్క, నేను. మా ఫ్యామిలీ ఒకానొకసమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆస్తులన్నీ దూరమైన పరిస్థితి. ఐదారేళ్లపాటు ఆ స్థితి నుంచి ఇప్పుడు అన్ని విధాలా నిలదొక్కుకున్నాం. నా సక్సెస్‌లో మా అమ్మ సపోర్ట్ ఉండటంలో ఈ రోజు ఇంత బాగా నటనలో రాణించగలుగుతున్నాను. ముందు నాన్నకు నేను యాక్టింగ్‌లోకి రావడం అంతగా ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నాన్ననే అప్పుడప్పుడు సెట్స్‌కు వస్తుంటారు. డాక్టర్ మోనిక..? నాకు ఇంజినీరింగ్ చేయాలని ఉండేది. డాక్టర్ ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ఎందుకంటే (నవ్వుతూ) నిజానికి నాకు చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటేనే భయం. నీడిల్‌ను కూడా చూడలేను. అలాంటిది డాక్టర్ పాత్ర. మా ప్రొడ్యూసర్ అయితే.. ‘ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. కనీసం బి.పి కూడా చెక్ చేయడం రాదు, స్టెతస్కోప్ ఎలా పట్టుకోవాలో తెలియదు, నువ్వేం డాక్టరమ్మా!’ అని నవ్వుతుంటారు. ఈ సీరియల్ పూర్తయ్యేసరికి బి.పి చెక్ చేయడం ఎలాగో తెలుసుకుంటాను. ఇక క్యారెక్టర్ గురించి అయితే డాక్టర్ని. కార్తీక్‌ని విపరీతంగా ఇష్టపడుతుంది. ఏం చేసయినా కార్తీక్‌ను తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. దీప నుంచి విడదీయాలనుకుంటుంది. రియల్ లైఫ్‌లో పార్టనర్? డాక్టరే కావాలని అనుకోవడం లేదు. నాలాగ యాక్టరైతే నేనున్న సిచ్యుయేషన్స్ బాగా అర్థమవుతాయి. మా అమ్మలా నాకు సపోర్ట్‌నిచ్చే వ్యక్తి, నన్ను ప్రేమించేవాడు కావాలని కోరుకుంటున్నాను. పెళ్లికి మాత్రం మరోమూడేళ్ల సమయం ఉంది. ఖాళీ దొరికితే..? (నవ్వుతూ) పుస్తకాలు చదువుతా, మ్యూజిక్ వింటా... అంటూ అలాంటి హాబీస్ లేవు. హాయిగా నిద్రపోతాను. రైస్–రసం నా ఫేవరెట్ డిష్. మూడుపూటలా ఇదే పెట్టినా సుష్టుగా తింటాను. లావు అవుతున్నాను అనుకుంటే ఈ డిష్‌నే కొద్దిగా తగ్గించే వెసులుబాటు చేసుకుంటాను. కాస్ట్యూమ్స్ ఎంపిక? నాకేం కావాలో, నేనెలా ఉంటే బాగుంటానో నూటికి నూరుపాళ్లు అమ్మే చూసుకుంటుంది. ఎప్పుడైనా షాపింగ్, సెలక్షన్లో నేనుంటాను. కానీ, అమ్మ మాటే ఫైనల్. ఎందుకంటే నేనెలా ఉంటే బాగుంటానో అమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మ చెబితే అంతే! తెలుగుప్రేక్షకులు..? నా ప్రాణం. ఎంతలా అయిపోయారంటే.. సీరియల్ వస్తున్నప్పుడు టీవీ స్క్రీన్‌లో నేనున్న సీన్ ఫొటో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోసట్ చేస్తారు. చాలా బాగా నటించారంటూ మెచ్చుకుంటారు. ఇంతకుమించి ఓ నటిగా ఇంకా ఎవరైనా ఏం కోరుకుంటారు. ఐ లవ్ తెలుగు ఆడియన్స్. – నిర్మలారెడ్డి -
సీరియల్ నటిపై దాడి చేసిన హెయిర్ డ్రెసర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సీరియల్ నటి రాగమాధురిపై షూటింగ్ సెట్లోనే దాడి జరిగింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్ డ్రెసర్ జ్యోతిక తన అనుచరులతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద ఓ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుంది. అయితే రెండు రోజుల క్రితం ఆ సీరియల్లో నటిస్తున్న రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడకుండా పోయింది. తన గొలుసు మిస్ కావడంపై రాగమాధురి సెట్లో ఉన్నవారిని అడిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. హెయిర్ డ్రెసర్తోపాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాగమాధురి ఫిర్యాదు మేరకు పోలీసులు జ్యోతికను విచారించేందుకు సిద్దమయ్యారు. అయితే ఆ సమయంలో షూటింగ్ సెట్లోని వారు కారులో గొలుసు లభించిందని చెప్పి పోలీసులకు దాన్ని అప్పగించి జ్యోతికను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిక మరో ఎనిమిది మంది అనుచరులతో కలిసి షూటింగ్ వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. రాగమాధురిని తీవ్రంగా కొట్టారు. సెట్లో వారు నిలువరించిన వినకుండా ఆమె చీరను కూడా లాగేశారు. దీంతో రాగమాధురి మరోసారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నాగమాధురి ఫిర్యాదు మేరకు జ్యోతికతోపాటు ఆమె అనుచరలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
టాలెంట్ ఉంటే దాచుకోవద్దు
అనంతపురం కల్చరల్: బాలనటిగా హీరోలు సూపర్‌స్టార్ కృష్ణ, నటకిరీటి రాజేంద్రప్రసాద్, అర్జున్ వంటి వారి సరసన నటించి తర్వాతి కాలంలో హీరోయిన్గా కూడా చక్కటి వేషాలు వేసి మెప్పించింది నటి భావన. జిల్లాకు చెందిన ర్యాంబో అస్లాం దర్శకత్వంలో వస్తున్న ఓ లఘు చిత్రంలో నటించడానికి శుక్రవారం ఆమె అనంతపురానికి విచ్చేశారు. ప్రస్తుతం ప్రజాధరణ పొందుతున్న సీరియల్స్ కల్యాణ వైభోగం, పౌర్ణమిలలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న భావన అనేక స్టేజ్ షోలు కూడా చేశారు. కళ్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన షూటింగ్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. ఇదే తొలిసారి అనంతపురం జిల్లాకు రావడం నేనిదే మొదటిసారి. అయితే గతంలో రెండుసార్లు జిల్లా మీదుగా తిరుపతికి వెళ్లినా ఇక్కడకు రాలేకపోయాను. లేపాక్షి, పుట్టపర్తి ప్రాంతాలు చూడమని చాలా మంది చెప్పేవారు. ఈసారి కూడా చూసే అవకాశం వస్తుందో రాదో కానీ అనంతకు రావడం మాత్రం నాకు ఆనందంగా ఉంది. కళ్యాణదుర్గంలో జరిగే ఓ ప్రాయోజిత కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం భక్తిభావాన్ని పెంచింది. బాలనటిగానే ప్రయాణం నేను మూడేళ్ల వయసు నుండే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. హీరో అర్జున్ నటించిన కుట్ర సినిమాతో ప్రారంభమైన నా సినీ ప్రయాణం రాజేంద్రప్రసాద్, ఆలీ, చిరంజీవి, శోభన్‌బాబు, కృష్ణ వంటి పెద్ద నటుల వద్ద వాళ్ల కూతురుగా నటించిన నేనే వారి సరసన హీరోయిన్గా కూడా చేసే దాకా కొనసాగింది. విజృంభన, లాయర్ సుహాసిని, అమ్మాయి బాగుంది, చిక్కడు–దొరకడు, కన్యాదానం, మానవడు–దానవుడు వంటి సినిమాల్లో నటించాను. అదేవిధంగా తమిళ సినిమాల్లో కూడా జెమినీ గణేశన్, కమలహాసన్ వంటి హీరోలతో దేవరమగన్, మహానది సినిమాల్లో నటించాను. ప్రాధాన్యత ఉంటే ఏ పాత్ర అయినా ఒకే.. చాలా మంది నటీనటులు గిరి గీసుకుని చట్రంలో ఉండిపోవడం వల్ల త్వరగా షేడ్అవుట్ అయిపోయిన సందర్భాలను చూశాను. అలాగని ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాలని కాదు. నా వరకు నా రోల్‌కు ఇంపార్టెన్స్ ఉందంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నాను. ఆ క్రమంలో హీరోయిన్‌గానే కాదు ఇతర పాత్రలూ ధరించాల్సి వస్తోంది. అయితేనే ఆ పాత్రలే మలుపు తిప్పేవిగా ఉండాలని నేను భావిస్తాను. ప్రస్తుతం కల్యాణ వైభోగం సీరియల్లో యంగ్ చార్మింగ్ మదర్‌గా నటిస్తున్నాను. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. టీవీ క్రేజ్ అంతా ఇంతా కాదు ఈ రోజుల్లో సినిమాలకు, టీవీ షోలు, సీరియల్స్ ఆదరణ సమానంగా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే టీవీ క్రేజ్ ఇంతా అంతా కాదు. నిత్యం ఏదో ఒక చానెల్లో వచ్చే సీరియల్లో కనిపిస్తుండడం వల్ల ఇంట్లో సభ్యులుగా మారిపోయాము. నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘అందం’ సీరియల్లో నటించిన తర్వాత ఆ పాత్ర పేరుతోనే పిలుస్తున్నారు. కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును కూడాగెలుచుకున్నాను. టాలెంట్ ఉంటే దాచుకోవద్దు టాలెంట్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అందరికీ సాధ్యం కాని కళలు మనలో ఉన్నప్పుడు వాటిని ప్రదర్శించుకునే అవకాశం కోసం ఎదురు చూడాలి. చాలా మంది యూత్ ఒక్కసారిగా పెద్దస్థాయికి వెళ్లిపోదామనుకుంటూ కలలు కంటుంటారు. తప్పులేదు. కానీ అవి నెరవేరకపోతే నిరుత్సాహం పడొద్దు. ఇండస్ట్రీలో ఎంతో మంది నానా అవస్థలు పడి స్టార్డమ్కు వచ్చారు. ఆ విజయం వెనుక అంతులేని శ్రమ కృషి ఉంటాయి. వాటిని గమనించాలి కానీ పైౖపై మెరుగులను చూసి కాదు. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి అవకాశాలను టీవీలందిస్తున్నాయి. సక్రమమైన పద్ధతుల్లో రాకపోతే మోసపోయే ప్రమాదముంది. -
ఆ ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు
-
నాపై దాడి చేసి రివర్స్ కేసు పెట్టారు
-
సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తా
చింతలపూడి : సినిమాల్లో మంచి అవకాశం వస్తే నటిస్తానని టీవీ సీరియల్ నటి ఆర్.పల్లవి అన్నారు. చింతలపూడి మండలం యర్రగుం టపల్లి రామునిగట్టుపై శ్రీరామనవమి వేడుకలకు శనివారం ఆమె హాజరయ్యూరు. కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ రాముడిని దర్శిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనది విజయవాడ అని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2008లో టీవీ రంగంలో అడుగుపెట్టానన్నారు. ఆడదే ఆధారం, భార్యామణి, అత్తారింటికి దారేది సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పారు. భవిష్యత్‌లోనూ మహిళలు మెచ్చే పాత్రలలో నటిస్తానన్నారు. పల్లెవాతావరణం అంటే తనకు ఇష్టమని, మూడేళ్లుగా రామునిగట్టుపై వేడుకలకు వద్దామనుకుంటున్నా.. ఈసారి వీలు కుదిరిందని పల్లవి చెప్పారు.