
సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తా
చింతలపూడి : సినిమాల్లో మంచి అవకాశం వస్తే నటిస్తానని టీవీ సీరియల్ నటి ఆర్.పల్లవి అన్నారు. చింతలపూడి మండలం యర్రగుం టపల్లి రామునిగట్టుపై శ్రీరామనవమి వేడుకలకు శనివారం ఆమె హాజరయ్యూరు. కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ రాముడిని దర్శిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనది విజయవాడ అని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2008లో టీవీ రంగంలో అడుగుపెట్టానన్నారు. ఆడదే ఆధారం, భార్యామణి, అత్తారింటికి దారేది సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పారు. భవిష్యత్‌లోనూ మహిళలు మెచ్చే పాత్రలలో నటిస్తానన్నారు. పల్లెవాతావరణం అంటే తనకు ఇష్టమని, మూడేళ్లుగా రామునిగట్టుపై వేడుకలకు వద్దామనుకుంటున్నా.. ఈసారి వీలు కుదిరిందని పల్లవి చెప్పారు.