డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment