‘మా’ టీవీలో ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌లోడాక్టర్ మౌనితగా తెలుగు ప్రేక్షకులకుఆమె పరిచయమే. అసలు పేరు శోభాశెట్టి.‘ముందు నెగిటివ్ రోల్ అని డిజప్పాయింట్ అయ్యాను,కానీ ఇదే ఇప్పుడు నాకు ఎంతోమంది అభిమానులనుతెచ్చిపెట్టింద’ంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది శోభ.
సీరియల్ నటి ఎప్పుడు అనిపించుకున్నారు?
ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. తెలుగువారికి పరిచయమై మూడేళ్లు అవుతోంది. నేను కన్నడ నటిని. మాది బెంగుళూరు. చదువుకునేప్పటినుంచే నటన అంటే పిచ్చి ఇష్టముండేది. కాలేజీ రోజుల్లోనే ఫేస్‌బుక్ ద్వారా నా ప్రొఫైల్, ఫొటోస్ టీవీ వారికి చేరవయ్యాయి. అలా, నటినయ్యాను. తెలుగులో కార్తీకదీపం సీరియల్‌కు ముందు అష్టాచెమ్మాలో నటించాను.
నెగిటివ్ రోల్ తెలిసే ఒప్పుకున్నారు..?
అవును, ముందు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నా. అప్పటికే సీరియల్ థీమ్ గురించి తెలుసు. హీరోయిన్‌కి పోటాపోటీగా ఉంటుంది నా క్యారెక్టర్. పాజిటివ్ రోల్ చేస్తే మంచి పేరొస్తుంది. అయితే, ఇలాంటి నెగిటివ్ రోల్స్ వల్ల మన వర్త్ ఏంటో తెలుస్తుంది.
ఫ్యామిలీ గురించి..?
అమ్మానాన్న, అన్నయ్య, అక్క, నేను. మా ఫ్యామిలీ ఒకానొకసమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆస్తులన్నీ దూరమైన పరిస్థితి. ఐదారేళ్లపాటు ఆ స్థితి నుంచి ఇప్పుడు అన్ని విధాలా నిలదొక్కుకున్నాం. నా సక్సెస్‌లో మా అమ్మ సపోర్ట్ ఉండటంలో ఈ రోజు ఇంత బాగా నటనలో రాణించగలుగుతున్నాను. ముందు నాన్నకు నేను యాక్టింగ్‌లోకి రావడం అంతగా ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నాన్ననే అప్పుడప్పుడు సెట్స్‌కు వస్తుంటారు.
డాక్టర్ మోనిక..?
నాకు ఇంజినీరింగ్ చేయాలని ఉండేది. డాక్టర్ ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ఎందుకంటే (నవ్వుతూ) నిజానికి నాకు చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటేనే భయం. నీడిల్‌ను కూడా చూడలేను. అలాంటిది డాక్టర్ పాత్ర. మా ప్రొడ్యూసర్ అయితే.. ‘ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. కనీసం బి.పి కూడా చెక్ చేయడం రాదు, స్టెతస్కోప్ ఎలా పట్టుకోవాలో తెలియదు, నువ్వేం డాక్టరమ్మా!’ అని నవ్వుతుంటారు. ఈ సీరియల్ పూర్తయ్యేసరికి బి.పి చెక్ చేయడం ఎలాగో తెలుసుకుంటాను. ఇక క్యారెక్టర్ గురించి అయితే డాక్టర్‌ని. కార్తీక్‌ని విపరీతంగా ఇష్టపడుతుంది. ఏం చేసయినా కార్తీక్‌ను తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. దీప నుంచి విడదీయాలనుకుంటుంది.
రియల్ లైఫ్‌లో పార్టనర్?
డాక్టరే కావాలని అనుకోవడం లేదు. నాలాగ యాక్టరైతే నేనున్న సిచ్యుయేషన్స్ బాగా అర్థమవుతాయి. మా అమ్మలా నాకు సపోర్ట్‌నిచ్చే వ్యక్తి, నన్ను ప్రేమించేవాడు కావాలని కోరుకుంటున్నాను. పెళ్లికి మాత్రం మరోమూడేళ్ల సమయం ఉంది.
ఖాళీ దొరికితే..?
(నవ్వుతూ) పుస్తకాలు చదువుతా, మ్యూజిక్ వింటా... అంటూ అలాంటి హాబీస్ లేవు. హాయిగా నిద్రపోతాను. రైస్–రసం నా ఫేవరెట్ డిష్. మూడుపూటలా ఇదే పెట్టినా సుష్టుగా తింటాను. లావు అవుతున్నాను అనుకుంటే ఈ డిష్‌నే కొద్దిగా తగ్గించే వెసులుబాటు చేసుకుంటాను.
కాస్ట్యూమ్స్ ఎంపిక?
నాకేం కావాలో, నేనెలా ఉంటే బాగుంటానో నూటికి నూరుపాళ్లు అమ్మే చూసుకుంటుంది. ఎప్పుడైనా షాపింగ్, సెలక్షన్‌లో నేనుంటాను. కానీ, అమ్మ మాటే ఫైనల్. ఎందుకంటే నేనెలా ఉంటే బాగుంటానో అమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మ చెబితే అంతే!
తెలుగుప్రేక్షకులు..?
నా ప్రాణం. ఎంతలా అయిపోయారంటే.. సీరియల్ వస్తున్నప్పుడు టీవీ స్క్రీన్‌లో నేనున్న సీన్ ఫొటో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోసట్ చేస్తారు. చాలా బాగా నటించారంటూ మెచ్చుకుంటారు. ఇంతకుమించి ఓ నటిగా ఇంకా ఎవరైనా ఏం కోరుకుంటారు. ఐ లవ్ తెలుగు ఆడియన్స్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment