shobha
-
కవితతో తల్లి శోభ ములాఖత్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తల్లి శోభ ములాఖత్ అయ్యారు. శోభతోపాటు సోదరుడు కేటీఆర్, సోదరి సౌమ్య కూడా కలిశారు. వీరు గురువారం సాయంత్రం సుమారు గంట సేపు కవితతో మాట్లాడారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న కవిత పిటిషన్‌పైనా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు, ఐదోరోజూ గురువారం కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులైన తన పీఏలు చెప్పిన సమాచారం మేరకు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. -
శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు
Bigg Boss 7 Day 96 Highlights: బిగ్ బాస్‌లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్‌లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ బిగ్ బాస్‌లో ఓట్ అప్పీల్ కోసం ఫన్నీ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్ అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్‌లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్ టాస్క్ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్, ప్రశాంత్‌ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్ బాస్ కిమ్మనడు. దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్ టాస్క్ విషయంలో శోభపై ఫైర్ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్ లెస్, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్కు సంబంధంలేని వ్యాఖ్యాలు చేశాడు శివాజీ. ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఓట్ అప్పీల్ చేసుకున్న శివాజీ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్జున్. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకోవడం వల్ల హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్ అప్పీల్ అవకాశం దక్కేలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆయన ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. తన గేమ్ నచ్చితే ఓట్ వేయాలని ఆయన కోరుతాడు. SPA బ్యాచ్‌లో గొడవలకు కారణమైన శోభ బిగ్ బాస్‌లో ఒక యాడ్‌కు సంబంధించిన టాస్క్‌లో అమర్, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్‌లో రెండు గ్రూపులుగా డివైడ్ చేసి.. ఒక బ్యాచ్‌లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్ ఉంటారు. మరోక బ్యాచ్‌లో శోభ,యావర్,అర్జున్ ఉంటారు. సంచాలక్‌గా అమర్ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్‌లో వండర్ ఉమెన్‌గా ప్రియాంకను విన్నర్‌గా ప్రకటిస్తాడు అమర్ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్‌లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. Sivaji crossed all the limits today. 40 seconds of utter garbage🤮 Ammayila character nunchi valla marriage life varaku neechamga dhigajaaripoyi maatladadu @StarMaa @iamnagarjuna#Sivaji #BiggBoss7Telugu#biggbosstelugu7 pic.twitter.com/SK59Km9Xo4 — Betty🌶️ (@BinduFanBettyyy) December 8, 2023 -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్‌ను కొరికి నెట్టేస్తూ..
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్‌లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్‌లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్‌కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్‌కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్‌కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్‌లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్‌కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్‌లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్‌లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్‌ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్‌కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్‌ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్‌లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్‌లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్‌లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్‌కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్‌కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్‌ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్‌పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్‌ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం...
కర్ణాటక: ముగళూరు దక్షిణ పినాకిని నదిలో గతనెల 26న హత్యకు గురైన చేతన్(26) అనే యువకుడి కేసులో బ్యూటీపార్లర్ మహిళతో పాటు ముగ్గురిని సర్జాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన శోభ, కోలారు జిల్లా మాలూరు తాలూకా చిక్కతిరుపతికి చెందిన సతీశ్, స్నేహితుడు శశి పట్టుబడారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణరాజపురంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. అతను కృష్ణరాజపురంలోని అయ్యప్పనగర రియల్ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే శోభకు చిక్కతిరుపతికి చెందిన సతీశ్ అనే వ్యక్తితో పరిచయమైంది. సతీశ్ భూ విక్రయ వ్యవహారంలో రూ.40 లక్షలకు పైగా డబ్బు సంపాదించగా శోభ కోరిక మేరకు రూ.25 లక్షలు ఖర్చుచేసి బ్యూటీపార్లర్ పెట్టించాడు. సతీశ్ తన స్నేహితులైన మధు, శశితో కలిసి చేతన్‌ను చిక్కతిరుపతి సమీపంలోని బార్‌కు పిలిపించి మద్యం తాపించి హత్యచేసి దక్షిణ పినాకినిలో మృతదేహం పడేసి ఉడాయించారు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని బార్ వద్ద అమర్చిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్యకేసులో నిందితులను ఆదివారం అరెస్ట్‌చేశారు. -
బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ
బిగ్ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఎప్పిటిలాగే ఈ వారం కూడా హౌస్‌లో నామినేషన్స్ రచ్చ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చూస్తే ఈసారి శివాజీని శోభ ఢీ కోట్టినట్లు కనిపిస్తుంది. గతవారంలో శోభ- ప్రియాంకల మీద బూతు పదాలతో భోలే షావాలి విరుచకపడ్డాడు. దీంతో వారిద్దరూ కూడా అదే రేంజ్లో తిప్పికొట్టారు. దీనిని తప్పుబడుతూ శోభను నామినేషన్ చేస్తున్నట్లు శివాజీ చెప్పాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌తో గౌతమ్ నామినేషన్ వాగ్వాదం నడిచింది. హౌస్‌లో ఆడపిల్లలపై బూతులు.. సమర్థించిన శివాజీ శోభ- ప్రియాంకలపై గతవారంలో భోలే షావాలి బూతు మాటలు అన్నాడు. ఆ మాటలు తెలంగాణ మాండలికంలో అత్యంత దారుణమైనవి. అది గమనించిన ప్రియాంక శోభకు తెలిపి వెంటనే రియాక్ట్ అయ్యారు. తూ... అంటూ భోలేపై ప్రియాంక విరుచుకుపడింది. ఆపై వెంటనే ప్రియాంక క్షమాపణ కోరింది. కానీ బూతు మాటలు మాట్లాడిన భోలే అప్పటికి కనీసం క్షమాపణ కూడా కోరలేదు. కొంత సమయం తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాక భోలే క్షమాపణలు కోరాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడే ఉన్న వేరే లేడీ కంటెస్టెంట్లు గానీ, మేల్ కంటెస్టెంట్లు గానీ కిక్కుమనలేదు. అన్నింట్లో వేలు పెట్టే శివాజీ కూడా భోలేను ఒక్కమాట అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం భోలే చేసింది తప్పే అంటూ కలరింగ్ ఇస్తున్నాడు శివాజీ. పైగా నేడు ఇదే గొడవను మళ్లీ తెరపైకి తెచ్చి శోభను నామినేట్ చేశాడు. అదే బూతు పదం శివాజీ కుటుంబ సభ్యులను అంటే తీసుకుంటాడా..? సారీ చెబితే సంతోషిస్తాడా..? వాళ్లిద్దరూ కూడా ఆడపిల్లలు.. భోలే మాటలకు కన్నీరు పెట్టలేదు. శివంగుల్లా తిరగబడ్డారు. తన మనసులో ఏదైతే ఉందో అదే బయటకు చెప్పారు. భోలేను క్షమిస్తున్నారా అని నాగార్జున అడిగినా.. లేదు సార్ అని చెప్పారు. అంతలా భోలే మాటలు వారిని బాధించాయి. కనీసం ఈ సోయ కూడా లేకుండా శోభ పేరును శివాజీ ఎలిమినేషన్ ప్రక్రియలో చేర్చాడు. దీంతో భోలే వాడిన బూతులను శివాజీ సమర్థించినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా పట్టని కొన్ని పీఆర్ టీమ్ వాల్లు కావాలని తెలుగు వెబ్సైట్లతో ఆమె మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఒక ఆడపిల్లను అంత మాట అనేశాడే అనే సోయ కూడా లేకుండా భోలే,శివాజీ లాంటి వారి కోసం పీఆర్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అయినా సరే ఆమె మరింత గట్టిగా ఆటలో నిలబడుతోంది. -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకన్న సీఎం కేసీఆర్ సతీమణి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి శోభ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహుకరించారు. అయితే, నిన్న తిరుమలకి చేరుకున్న కల్వకుంట్ల శోభ, రాత్రి తిరుమలలో బస చేశారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఐదు కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,828. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. సోమవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,768గా ఉంది. Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday evening@xpressandhra pic.twitter.com/8Xcd2Ppu4c — TNIE Telangana (@XpressHyderabad) October 9, 2023 -
టాప్ హీరోయిన్.. 18 ఏళ్లకే గదిలో శవమై.. మెడపై ఉరితాడు గుర్తులు!
1980 మే 1.. ఆరోజు జనాలు మహాలక్ష్మి మీనన్ అలియాస్ శోభ మరణవార్తతో నిద్రలేచారు. నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఆమె పట్టుమని 18 ఏళ్లకే తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. హీరోయిన్గా సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలో శవమై తేలింది. విషాదంగా ముగిసిన తన జీవిత గాథపై నేటి ప్రత్యేక కథనం.. తల్లి అడుగుజాడల్లో 1962 సెప్టెంబర్ 23న నటి ప్రేమ కడుపున మహాలక్ష్మి పుట్టింది. నాలుగేళ్లకే కెమెరా ముందు నటించి అందరినీ తన బుట్టలో వేసుకుంది. ఈ చిన్నారి నటకౌశల్యాన్ని చూసి మంత్రముగ్ధులైన జనాలు ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నారు. తమిళ థ్రిల్లర్ 'తట్టుంగల్ తిరక్కప్పడమ్' సినిమాతో వెండితెరపై బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఇందులో ఆమె బేబీ మహాలక్ష్మిగా నటించింది. ఈ మూవీలో సావిత్రి, విజయ వంటి మహామహులు నటించారు. ఆ తర్వాత ఏడాది మలయాళంలో 'ఉద్యోగస్త' చిత్రంలో బేబీ శోభగా యాక్ట్ చేసింది. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతోపాటు శోభకు ఊహించని స్థాయిలో పేరు తీసుకువచ్చింది. హీరోయిన్గా అవార్డులు, తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమ 15 ఏళ్లకే 'ఉత్రద రాత్రి' చిత్రంతో హీరోయిన్గా మారింది. 1978లో 'బంధనం', 'ఏంటె నీలాకాశం' సినిమాలకుగానూ ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంది. 'అపరిచిత' అనే కన్నడ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు సైతం వరించింది. ఈ క్రమంలో ఆమె తండ్రి వయసున్న వ్యక్తి దర్శకుడు బాలూ మహేంద్రతో ప్రేమలో పడింది. అతడికి పెళ్లై పిల్లలున్నా అతడినే కావాలనుకుంది. తన కోసం వారిందరినీ వదిలేస్తాడనుకుంది. కన్నవాళ్లను సైతం కాదని 1978లో గుడిలో దర్శకుడిని పెళ్లాడింది. మొదటి భార్యను వదిలేయని భర్త అతడిని గుడ్డిగా ప్రేమించిన శోభకు ఊహించని షాక్ తగిలింది. అతడు భార్యాపిల్లలను వదిలేయలేనన్నాడు. తరచూ వారి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇది శోభకు నచ్చలేదు. ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సెట్లో మాత్రం అన్నీ కడుపులోనే దాచుకుని నిష్కల్మషంగా నవ్వుతూ కనిపించేది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేసింది. 1979లో వచ్చిన పసి మూవీకి ఉత్తమ నటిగా రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకుంది. తెలుగులో తరం మారింది, మనవూరి పాండవులు చిత్రాల్లోనూ నటించింది. ఒకరోజు ఆలస్యంగా సూసైడ్ లెటర్ రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఏలడం ఖాయం అనుకుంటున్న సమయంలో 1980 మే 1న ఆమె తన గదిలో మంచం పక్కన మృతదేహమై కనిపించింది. తన మెడమీద ఉరి వేసుకున్న గుర్తులు కనిపించాయి. సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే కళ్లు వాపు వచ్చి, నాలుక బయటకు వస్తుంది. కానీ శోభ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు సూసైడ్ లెటర్ కూడా ఒక రోజు ఆలస్యంగా దొరికింది. తను నిజంగానే ఉరి వేసుకుంటే కిందరు ఎవరు దించారన్నది ప్రశ్న! శోభ చనిపోయిన ముందు రోజు రాత్రి మహేంద్ర తన మొదటి భార్య దగ్గరే ఉన్నాడు.. అంటే వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయా? అసలు శోభది హత్యా? ఆత్మహత్యా? ఇవన్నీ మిస్టరీగానే మిగిలిపోయాయి. 43 ఏళ్లవుతున్నా ఇప్పటికీ మిస్టరీనే శవపరీక్షలో ఆమె ఉరి వేసుకుందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమె తల్లి మాత్రం ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ హత్యేనని.. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు. శోభ భర్త బాలూ మహేంద్ర డబ్బుల కోసం వేధించాడని, ఆయనే హత్య చేశాడని సైతం ఆరోపించారు. ఇది జరిగి 43 ఏళ్లవుతున్నా ఇప్పటికీ నిజానిజాలు బయటకు నిర్ధారణ కాలేదు. తన మరణం మాత్రం మిస్టరీగానే చరిత్రలో ఉండిపోయింది. ఈమె జీవిత కథ ఆధారంగా మలయాళంలో లేఖయుడె మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్(1983) సినిమా కూడా వచ్చింది. చదవండి: జైలర్ కలెక్షన్స్.. భోళాశంకర్‌ను డామినేట్ చేస్తున్న రజనీ సినిమా -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు
వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ సలహాదారుగా శోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు. అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్ఎం డోబ్రియల్ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. -
ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్: శోభ
సాక్షి, మంచిర్యాల: ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులను ప్రోత్సహించేలా ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్.శోభ అన్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఔత్సాహికులతో కలసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యంలోని బైసన్‌కుంట పరిసరాల్లో వివిధ రకాల పక్షులను స్వయంగా వీక్షించారు. అనంతరం రెండ్రోజులుగా సాగిన బర్డ్ వాక్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు అనే భేదం లేకుండా ప్రకృతిపై ప్రేమతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఔత్సాహికులను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. రాష్ట్రంలో యువ ఫారెస్టు అధికారులు చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం కలప అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందని, పులుల సంతతి పెరుగుతోందని ఆనందం వ్యక్తంచేశారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్, నిర్మల్ సర్కిల్ సీఎఫ్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ పులుల అభయారణ్యంలో కోర్ అవతలి కొంత భాగాన్ని ప్రకృతి ప్రేమికులు పర్యటించేలా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సీఎఫ్ రామలింగం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి డీఎఫ్‌వోలు శివాని డోగ్రా, శాంతారామ్, వికాస్ మీనా, రాజశేఖర్, నిఖిత బోగ, ఉమ్మడి జిల్లాలోని ఎఫ్‌డీవోలు, ఎఫ్ఆర్వోలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు
ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు. కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్ శోభ పులుల సంరక్షణ అందరి బాధ్యత... అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ శివఆశీష్, ఎస్ఎస్ తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పస్రా ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు, వెటర్నరీ డాక్టర్ కరుణాకర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రగతిభవన్‌లో వినాయకుడికి సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టించిన మట్టి గణపతికి తన సతీమణి శోభతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూజలకు కేసీఆర్ మనమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య రావు కూడా హాజరయ్యారు. -
ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శోభ స్వాతి ప్రమాణం
-
అవార్డు రెడీ! అమౌంట్ రెడీయేనా!!
దిగాలుగా కూర్చున్న శోభను చూస్తూ ‘ఏమైంది..?’ అడిగింది లలిత. ముందు కొంచెం సంశయించినా అసలు విషయం చెప్పక తప్పింది కాదు శోభకి. ∙∙∙ ఆర్నెల్లుగా శోభ యూ ట్యూబ్‌లో వంటల ఛానెల్ నడుపుతోంది. వారంలో రెండు రకాల వంటలైనా అప్లోడ్ చేస్తుంటుంది. ఛానెల్ మానిటైజేషన్‌కు దగ్గరలో ఉంది. సబ్స్క్రైబర్ల జాబితా ఇంకాస్త పెరిగితే అనుకున్న టార్గెట్ పూర్తవుతుందనే ఆనందంలో ఉంది శోభ. ఓరోజున వీడియో షూట్లో బిజీగా ఉన్న శోభ ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్. ఫోన్ చేసినవారు తమని తాము పరిచయం చేసుకున్నారు. విషయం విన్న శోభ మొహం వెలిగిపోయింది. రూల్స్ అన్నీ నోట్ చేసుకుంది. పని పూర్తయ్యాక నోట్ చేసుకున్న వెబ్సైట్లో తన వివరాలన్నీ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంది. మరుసటి రోజు మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్. శోభ ఇచ్చిన వివరాలన్నీ చాలా బాగున్నాయని, కార్పోరేట్ çసంస్థలతో డీల్‌కి ఈ ప్రొఫైల్ వెళ్లాలంటే ది బెస్ట్ అవార్డు ఒకటుండాలని, అది తమ కంపెనీ ఇస్తుందంటూ ఇప్పటి వరకు అవార్డు వచ్చినవారు ఏ స్థాయిలో ఉన్నారో ఊరిస్తూ చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలతో మెయిల్ పంపించాం చెక్ చేయండి అని చెబుతూ... అవార్డుకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంద’న్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ‘పెద్ద స్థాయి కంపెనీల నుంచి స్పాన్సర్స్ వస్తే ఛానెల్ పాపులర్ అవుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. కదా..‘ఇంట్లోవారికి చెబితే ఈ డిజిటల్ గోల వారికి అర్ధం కాదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు, వద్దులే!’ అనుకుంది. అవార్డు కంపెనీ పెట్టిన నిబంధనలకు ఓకే చెబుతూ.. వారు చెప్పిన అమౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసింది. వారం రోజులుగా అవార్డ్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుందని, మెయిల్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఈ విషయమంతా శోభ ద్వారా విన్న లలిత... ‘నువ్వు మోసపోయావు శోభా! డబ్బు సెండ్ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలింది. సోషల్ మీడియాలో ఇటీవల ‘అవార్డు ఇస్తామహో..’ అనే మోసాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయి. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకు టోపీ పెడుతున్నారు అవార్డ్ ఫ్రాడ్స్.. అంటూ ఏయే విధంగా సోషల్ మీడియాలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయో వివరించింది లలిత. టార్గెట్ ఇలా మొదలు ► కరోనా మొదలైనప్పటి నుంచి ఇలా అవార్డ్ ఫ్రాడ్ చేసే వారి సంఖ్య పెరిగింది. మహిళలను, టీనేజర్స్‌ను టార్గెట్ చేసుకొని అవార్డు గాలం వేస్తుంటారు. ► ఛానెల్ మానిటైజేషన్‌కి అంచున ఉన్నవారు మొదటి టార్గెట్. ► సోషల్ ప్రొఫైల్స్‌లో పూర్తి వివరాలున్నవారు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నవారు రెండవ టార్గెట్. ► మీరు, మీ వర్క్ చాలా బాగుంది అంటూ మాటలు కలుపుతారు. మీకు బెస్ట్ అవార్డు తప్పక వస్తుందని నమ్మబలుకుతారు. ► తమ కంపెనీ నుంచి తీసుకున్న అవార్డుతో జాతీయ స్థాయిలో ఫేమస్ అవుతారని, అలా ఇప్పటివరకు ఫేమస్ అయినవారి జాబితా చూపుతారు. అవార్డు తీసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు మరింత ఫోకస్ అవుతారని మాటల్లో పెడతారు. ముంబయ్ లేదా ఢిల్లీ వంటి నగరాలలో పెద్ద స్థాయి వేదికల మీద వచ్చి అవార్డు ఫంక్షన్ అంటారు. ► మా దగ్గర మీరు అవార్డు తీసుకుంటే మీ ప్రొఫైల్ కార్పోరేట్ స్పాన్సర్స్‌కు వెళుతుందని, అప్పుడు వారు మీకు స్పాన్సర్షిప్ ఇస్తారని చెబుతారు. ► సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్.. ఇలా అవార్డ్‌కి ఒక రేటు చొప్పున చెబుతారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవారుంటే డైమండ్ అవార్డ్ ఎర వేస్తారు. ► ఇంకా లొంగిపోతే మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్తాం.. అంటూ ఇంకా డబ్బులు లాగుతారు. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ ఎప్పుడూ ఈ తరహా పనిలో ఉంటారు. మేం కన్ఫర్మ్ చేసుకుంటాం అంటూ... రెండు, మూడు వీడియోలు కూడా లైవ్ లో చేయిస్తారు. రిజిస్ట్రేషన్‌కే 5 నుంచి 10 వేల రూపాయలు కట్టించుకుంటారు. ∙ లింక్స్‌ను గుడ్డిగా క్లిక్ చేయకూడదు వాస్తవానికి పెద్ద పెద్ద కార్పొరేట్ డీల్స్‌తో ఒక వీడియో చేస్తే పాతికవేల ఆదాయం వస్తుంది. వీరు కూడా అలాగే ఆలోచించి రెండు వీడియోలు చేసినా యాభై వేలు వస్తుంది కదా! అనుకుంటారు. అందుకు అవార్డు ఒక అర్హతగా నమ్ముతారు. అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. మోసగాళ్లు పాష్ ఇంగ్లిష్ మాట్లాడే ఒకరిద్దరిని అపాయింట్ చేసుకొని ఈ తరహా ఫ్రాడ్‌కి తెర లేపుతుంటారు. అందుకే ఒకే నెంబర్ నుంచి కాకుండా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. డబ్బులు ఇచ్చి అవార్డు ఇస్తున్నారంటేనే అది పెద్ద స్కామ్ అనుకోవాలి. అలాంటి లింక్స్ ఏవైనా వచ్చినా క్లిక్ చేయకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ అత్యాశకు పోకూడదు ఈ తరహా ఫ్రాడ్స్ గురించి కేసులు ఫైల్ అవలేదు. కానీ, నేరాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. డబ్బులిచ్చి అవార్డు తీసుకోవడం అనేదే పెద్ద స్కామ్ అని గుర్తించాలి. నిజమైన అవార్డు ఇచ్చేవారెవరూ డబ్బులు తీసుకోరని గుర్తుంచుకోవాలి. డిజిటల్ మార్కె టింగ్ గురించి కూలంకషంగా తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. కానీ, ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకూడదు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
వారణాసి పర్యటనలో కేసీఆర్ భార్య, కూతురు
వారణాసి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఆమె కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్ నుంచి దశాశ్వేమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం చేశారు. అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: ‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’) pic.twitter.com/yHUh0ZdpTw — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021 -
తల్లిదండ్రులతో ‘దిశ’కు సఖ్యత లేదు..
‘దిశ’ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం వల్లే దిశ తన చెల్లికి ఫోన్ చేసిందని పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దిశ తన చెల్లెలికి కాకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉంటే వారు వచ్చి తీసుకెళ్లేవారన్నారు. తల్లిదండ్రులతో దిశకు సఖ్యతతో లేనట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశం మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భాగంగా విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన చైర్పర్సన్ దిశ ఘటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దిశ తన సోదరికి కాకుండా తండ్రికి ఫోన్ చేయాల్సిందన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన ఆమె తండ్రి వెంటనే అక్కడికి వచ్చి తీసుకువెళ్లేవారన్నారు. దిశ తన పేరెంట్స్ దగ్గర ధైర్యాన్ని కోల్పోయిందన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. అప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. వీటిని ప్రభుత్వం ఎక్కడ ఆపగలదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం చూసుకోవడం ఎలా సాధ్యపడుతుందన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సరిగా అర్థం చేసుకోలేదు.. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జెడ్పీ చైర్పర్సన్ స్పందించారు. బుధవారం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు. దిశ సంఘటన ఎంత బాధాకరమైనదో చెప్పడం మాటలకందని విషయమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక మహిళగా, ఆడబిడ్డల తల్లిగా ప్రతిస్పందించానని వివరించారు. సభలు, సమావేశాలలో దిశ సంఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు సాటి మహిళగా ఆవేదనను వ్యక్తం చేశానని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన ఒక సమావేశంలో తాను మాట్లాడిన మాటలను కొంతమంది మీడియా మిత్రులు సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరించడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకునే విధంగా సంబంధాలు ఉండాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు. -
దక్షిణాదిలో తొలి మహిళ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి(పీసీసీఎఫ్)–ఎఫ్ఏసీగా రొయ్యూరు శోభ నియమితులయ్యారు. పీసీసీఎఫ్‌గా నియ మితులైన మహిళా ఐఎఫ్ఎస్ అధికారుల్లో దక్షిణాది రాష్ట్రా ల్లో మొదటివ్యక్తిగా, దేశంలోనే నాలుగో మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. బుధవారం పీసీసీఎఫ్‌గా పదవీ విరమణ చేసిన ప్రశాంత్‌కుమార్ ఝా నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో ఆమెను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి , ఇతర అధికారులు అభినందించారు. ఆర్.శోభను పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ బుధవారం సీఎస్ ఎస్కేజోషి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె పీసీసీఎఫ్ పోస్టులో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా కొనసాగుతారని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూపీ డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, అనంతపురంలోని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయోసైన్స్‌లో పట్టా పొందారు. 1986లో ఆమె ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన ఆమెకు పీసీసీఎఫ్ ర్యాంకుతో పదోన్నతి కల్పించారు. దాంతో తెలుగురాష్ట్రాల నుంచి అటవీశాఖలో పీసీసీఎఫ్ వంటి అత్యున్నత ర్యాంక్ చేరుకున్న తొలి మహిళగా శోభ నిలిచారు. అప్పటి నుంచి ఆమె అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్(ఎఫ్సీఏ)గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మూడేళ్ల పాటు అదనపు పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ)గా పనిచేశారు. 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె భర్త ఆర్.సుందరవదన్ ఐఎఫ్ఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. -
చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటేనే భయం..
‘మా’ టీవీలో ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్లోడాక్టర్ మౌనితగా తెలుగు ప్రేక్షకులకుఆమె పరిచయమే. అసలు పేరు శోభాశెట్టి.‘ముందు నెగిటివ్ రోల్ అని డిజప్పాయింట్ అయ్యాను,కానీ ఇదే ఇప్పుడు నాకు ఎంతోమంది అభిమానులనుతెచ్చిపెట్టింద’ంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది శోభ. సీరియల్ నటి ఎప్పుడు అనిపించుకున్నారు? ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. తెలుగువారికి పరిచయమై మూడేళ్లు అవుతోంది. నేను కన్నడ నటిని. మాది బెంగుళూరు. చదువుకునేప్పటినుంచే నటన అంటే పిచ్చి ఇష్టముండేది. కాలేజీ రోజుల్లోనే ఫేస్బుక్ ద్వారా నా ప్రొఫైల్, ఫొటోస్ టీవీ వారికి చేరవయ్యాయి. అలా, నటినయ్యాను. తెలుగులో కార్తీకదీపం సీరియల్‌కు ముందు అష్టాచెమ్మాలో నటించాను. నెగిటివ్ రోల్ తెలిసే ఒప్పుకున్నారు..? అవును, ముందు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నా. అప్పటికే సీరియల్ థీమ్ గురించి తెలుసు. హీరోయిన్‌కి పోటాపోటీగా ఉంటుంది నా క్యారెక్టర్. పాజిటివ్ రోల్ చేస్తే మంచి పేరొస్తుంది. అయితే, ఇలాంటి నెగిటివ్ రోల్స్ వల్ల మన వర్త్ ఏంటో తెలుస్తుంది. ఫ్యామిలీ గురించి..? అమ్మానాన్న, అన్నయ్య, అక్క, నేను. మా ఫ్యామిలీ ఒకానొకసమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆస్తులన్నీ దూరమైన పరిస్థితి. ఐదారేళ్లపాటు ఆ స్థితి నుంచి ఇప్పుడు అన్ని విధాలా నిలదొక్కుకున్నాం. నా సక్సెస్‌లో మా అమ్మ సపోర్ట్ ఉండటంలో ఈ రోజు ఇంత బాగా నటనలో రాణించగలుగుతున్నాను. ముందు నాన్నకు నేను యాక్టింగ్‌లోకి రావడం అంతగా ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నాన్ననే అప్పుడప్పుడు సెట్స్‌కు వస్తుంటారు. డాక్టర్ మోనిక..? నాకు ఇంజినీరింగ్ చేయాలని ఉండేది. డాక్టర్ ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ఎందుకంటే (నవ్వుతూ) నిజానికి నాకు చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటేనే భయం. నీడిల్‌ను కూడా చూడలేను. అలాంటిది డాక్టర్ పాత్ర. మా ప్రొడ్యూసర్ అయితే.. ‘ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. కనీసం బి.పి కూడా చెక్ చేయడం రాదు, స్టెతస్కోప్ ఎలా పట్టుకోవాలో తెలియదు, నువ్వేం డాక్టరమ్మా!’ అని నవ్వుతుంటారు. ఈ సీరియల్ పూర్తయ్యేసరికి బి.పి చెక్ చేయడం ఎలాగో తెలుసుకుంటాను. ఇక క్యారెక్టర్ గురించి అయితే డాక్టర్ని. కార్తీక్‌ని విపరీతంగా ఇష్టపడుతుంది. ఏం చేసయినా కార్తీక్‌ను తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. దీప నుంచి విడదీయాలనుకుంటుంది. రియల్ లైఫ్‌లో పార్టనర్? డాక్టరే కావాలని అనుకోవడం లేదు. నాలాగ యాక్టరైతే నేనున్న సిచ్యుయేషన్స్ బాగా అర్థమవుతాయి. మా అమ్మలా నాకు సపోర్ట్‌నిచ్చే వ్యక్తి, నన్ను ప్రేమించేవాడు కావాలని కోరుకుంటున్నాను. పెళ్లికి మాత్రం మరోమూడేళ్ల సమయం ఉంది. ఖాళీ దొరికితే..? (నవ్వుతూ) పుస్తకాలు చదువుతా, మ్యూజిక్ వింటా... అంటూ అలాంటి హాబీస్ లేవు. హాయిగా నిద్రపోతాను. రైస్–రసం నా ఫేవరెట్ డిష్. మూడుపూటలా ఇదే పెట్టినా సుష్టుగా తింటాను. లావు అవుతున్నాను అనుకుంటే ఈ డిష్‌నే కొద్దిగా తగ్గించే వెసులుబాటు చేసుకుంటాను. కాస్ట్యూమ్స్ ఎంపిక? నాకేం కావాలో, నేనెలా ఉంటే బాగుంటానో నూటికి నూరుపాళ్లు అమ్మే చూసుకుంటుంది. ఎప్పుడైనా షాపింగ్, సెలక్షన్లో నేనుంటాను. కానీ, అమ్మ మాటే ఫైనల్. ఎందుకంటే నేనెలా ఉంటే బాగుంటానో అమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మ చెబితే అంతే! తెలుగుప్రేక్షకులు..? నా ప్రాణం. ఎంతలా అయిపోయారంటే.. సీరియల్ వస్తున్నప్పుడు టీవీ స్క్రీన్‌లో నేనున్న సీన్ ఫొటో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోసట్ చేస్తారు. చాలా బాగా నటించారంటూ మెచ్చుకుంటారు. ఇంతకుమించి ఓ నటిగా ఇంకా ఎవరైనా ఏం కోరుకుంటారు. ఐ లవ్ తెలుగు ఆడియన్స్. – నిర్మలారెడ్డి -
ఐఎఫ్ఎస్ అధికారిణి శోభకు పీసీసీఎఫ్‌గా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: అదనపు పీసీసీఎఫ్‌గా పనిచేస్తున్న ఆర్.శోభ (ఐఎఫ్ఎస్)కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా పదోన్నతి కల్పించారు. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో పీసీసీఎఫ్ ఎఫ్‌సీఏగా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు శనివారం సీఎస్ ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదోన్నతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన తొలి ఐఎఫ్ఎస్ అధికారిణిగా శోభ నిలిచారు. -
డిజిశాసనులు
స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇప్పటికీ మనకు ఆ దుశ్శాసనుడే గుర్తుకు వస్తాడు. టెక్నాలజీ పెరిగింది. స్త్రీలకు రక్షణా పెరిగింది. అయినప్పటికీ.. ఏదో ఒక మూల దుశ్శాసనులు డిజిటల్ వరల్డ్‌లోకి దూరి మగువల వలువల్ని లాగి.. విలువల్ని నాశనం చేస్తున్నారు. డిజిశాసనులై పట్టి పీడిస్తున్నారు. ఆమె పేరు శోభా సజ్జు. కేరళలోని కొచ్చి. భర్త పేరు సజ్జు. ఉద్యోగస్తుడు. ఆయన ఆఫీస్‌లోని వాట్సాప్ గ్రూప్‌లో ఒక అమ్మాయి న్యూడ్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సజ్జు భార్య శోభ అంటూ అతడి కొలీగ్ లిట్లో ప్రచారం చేశాడు. ఒక యువతి కెమెరా వైపు తిరిగి దుస్తులు మార్చుకుంటున్న వీడియో అది. శోభా సజ్జు ఈ విషయం ఇంటి వరకు తెచ్చాడు సజ్జు. ఖంగు తింది శోభ. వీడియో చూసింది. మరింత షాక్. అసలు అందులో ఉన్నది తను కానేకాదు! ఎవరో ప్రచారం చేస్తే.. తన భర్త ఎలా నమ్మాడు? ఆమె వెళ్లి కమిషనర్‌కి కంప్లయింట్ ఇచ్చింది. కమిషనర్ సైబర్ సెల్‌కు కేసును రిఫర్ చేశారు. వీడియోను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్నది తను కాదు అన్న శోభ మాటను ధృవపరిచారు. పైగా శోభలా మార్ఫింగ్ కూడా చేయలేదనీ నిర్ధారించారు. కాబట్టి తొలి విచారణకు ఆమె పోలీస్ స్టేషన్‌కు రావల్సిన అవసరమూ లేదని శోభతో చెప్పారు. కాని ఆమె భర్తను పిలిచారు. ఆ వీడియోలో ఉన్నది తన భార్య శోభే అని సజ్జు వాదించాడు. అప్పటికి శోభ తన తల్లిగారింట్లో ఉంది. భర్త నుంచి విడాకుల నోటీస్ కంప్లయింట్ ఇచ్చిన నాలుగు రోజులకు శోభకు భర్త నుంచి విడాకుల పిటిషన్ కాపీ అందింది. తన భార్య స్వయంగా తనే తన న్యూడ్ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిందనే అభియోగం కింద! శోభకు ఇది ఇంకో షాక్. ఈలోపు పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదని ఘంటాపథంగా రిపోర్ట్ ఇవ్వకపోయినా.. ఆమె కాదు అనే అర్థంలోనే అసంపూర్తి నివేదికను ఇచ్చారు. ఇంకోవైపు లిట్టో మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీని వల్ల శోభకు ఒనగూడిన లాభం ఏమీలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి స్పష్టమైన నివేదిక రాలేదు. అందుకే శోభ తన పోరాటం ఆపలేదు. వీడియోలో ఉన్నది తను కాదు అని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా శోభే అని చెప్పలేదు. అందుకే తను కాదని అస్పష్టంగా చెప్పడం కాదు స్పష్టంగా చెప్తూ నివేదిక కావాలనే పట్టు వీడలేదు శోభ.పిల్లల్నీ దూరం చేశాడు! శోభకు ముగ్గురు పిల్లలు. ఈ గొడవ మొదలైనప్పటి నుంచి పిల్లలు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ప్రతి రెండో శనివారం పిల్లల్ని కలిసే విజిటింగ్ రైట్ను శోభకు ఇచ్చింది కోర్టు. నాలుగు శనివారాలు సాఫీగా గడిచాయి. అయిదో శనివారం వచ్చేసరికి.. పిల్లలతో ఆమె సరిగ్గా ప్రవర్తించట్లేదు కాబట్టి పిల్లలు ఆమెను కలవడానికి ఇష్టపడట్లేదంటూ భర్త రిపోర్ట్ చేశాడు. న్యూడ్ వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌గా వేసుకున్న డైవోర్స్ పిటిషన్‌కు ఈ కంప్లయింట్ కూడా తోడై పిల్లలను కలిసే విజిటింగ్ రైట్ను తాత్కాలికంగా కోల్పోయిన శోభకు గుండె ఆగినంత పనైంది. రెండోసారి కోర్టును ఆశ్రయించింది శోభ. న్యూడ్ వీడియో వ్యవహారం వెనక తన భర్త పాత్ర గురించి ఆరా తీయమని. ఆమె విజ్ఞప్తిని మన్నించింది కోర్టు. రీ ఇన్వెస్టిగేషన్లో ఆ వీడియోను మొదట పంపించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కి కాకుండా ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించమని కోరింది శోభ. కాని పోలీసులు మొదటి ల్యాబ్‌కే పంపించారు. నివేదిక కూడా మొదటిసారిలాగే అసంపూర్తిగా వచ్చింది. విసిగెత్తిపోయింది శోభ. అయినా తమాయించుకుని సైబర్ ఫోరెన్సిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బాడీకి పంపించమని అడిగింది. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ‘‘అందులో ఉన్నది మీరు కాదుకదా.. వదిలేయండి’ అనే సమాధానమిచ్చారు పోలీసులు. ఆఖరి ప్రయత్నంగా డీసీపీ లోక్‌నాథ్ బెహరాను కలిసింది. వీడియోను చూపించింది. వీడియో చూశాక.. ఆమెను చూశాడు లోక్‌నాథ్. ఇందులో ఉన్నది ససేమిరా నువ్వు కాదు అన్నాడు. ఇన్నాళ్లూ భరించావా? ‘‘ఎప్పుడో వచ్చేస్తే నీ పిల్లలు నీ దగ్గరుండే వాళ్లు కదమ్మా’’ అంటూ శోభ కేస్ ఇన్వెస్టిగేషన్‌ను ఎర్నాకులంలోని లాల్జీ. కే అనే ఏసీపీకి అప్పజెప్తూ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేశాడు. లాల్జీ ఆ వీడియోను, సంబంధిత నివేదికను తిరువనంతపురంలో ఉన్న ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)కు పంపించాడు. ఆర్నెల్ల తర్వాత.. అంటే పదిరోజుల కిందట సీడాక్ పూర్తి నివేదికను ఇచ్చింది. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదు అని స్పష్టం చేస్తూ! ఆమె చేపట్టిన ఒక యుద్ధం ముగిసింది. విజేతగా నిలిచింది. ఇప్పుడిక పిల్లల కస్టడీ కోసం యుద్ధం ప్రారంభించింది. ‘‘నా భర్త నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే.. ఆ వీడియో నాది కాదు అని తేలగానే దాన్ని వదిలేసేదాన్ని. ఇవ్వకుండా మూలం తెలుసుకునేలా చేశాడు. మంచిదే అయింది. నేనొక మామూలు కుటుంబం నుంచి వచ్చా. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నా పోరాటంలో వాళ్లంతా తోడుగా ఉన్నా.. ఒంటరిగానే అనిపించింది. నా పిల్లలను కలవాలి. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోతుంది’’ అంటోంది శోభ. ఈమె పోరాట పటిమ తక్కిన వారికి స్ఫూర్తి కావాలి. బాధపడడం మాని, నిజాన్ని నెట్ నుంచి బయటికి కక్కించాలి. డబ్బులిస్తే వస్తారని ఫేక్ పోస్ట్ కోల్‌కతాలోని జయదేవ్పూర్లో ఓ కుటుంబం తన ఇంటి ముందు సీసీటీవీ బిగించుకుంది. ఇంటి తలుపులపై ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ భాషల్లో ‘ఈ ఇల్లు అలాంటిది కాదు. దయచేసి మమ్మల్ని వేధించకండి’ అని రాసి ఉన్న బోర్డును వేలాడదీసుకుంది. దీనంతటికీ కారణం.. ‘‘ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు డబ్బులిస్తే వస్తారు అని వాళ్ల ఫొటోలు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో ఎవరో అప్లోడ్ చెయ్యడం! అప్పట్నుంచీ ఎవరెవరో ఫోన్లు చేసి ఆ ఇంట్లోని ఆడవాళ్లను మాటలతో చంపుతున్నారు. కొందరైతే నేరుగా ఇంటికే వచ్చి తలుపు తడుతున్నారు! అదెలా జరిగిందో ఆ ఇంటివారికి తెలియదు. ఆ ఇంటి యజమాని సైబర్ కేఫ్ నడుపుతుంటాడు. 27 ఏళ్ల భార్య, పెద్దవాళ్లయిన తల్లిదండ్రులు, 40 ఏళ్ల అక్క.. ఇదీ అతడి కుటుంబం. ‘‘అక్టోబర్ మొదటివారంలో నా పేరుతో, అడ్రస్‌తో ఎవరో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మా ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబర్లు, మెట్రో స్టేషన్‌కు మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుందో వివరాలు ఇచ్చారు. తర్వాత నా తమ్ముడి ఫొటో (సైబర్‌కేఫ్ ఓనర్), మా నాన్న ఫొటో అప్లోడ్ చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి నాకు అసభ్యకరమైన వాట్సాప్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి’’ అని ఆ నలభై ఏళ్ల మహిళ కోల్‌కతా సైబర్ పోలీస్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెకు పెళ్లయింది. అక్కడికి కాస్త దగ్గర్లోనే తన అత్తమామలతో కలిసి ఉంటోంది. తరచు పుట్టింటికి వచ్చి వెళుతుంటుంది. ఇలాంటి వేధింపులే ఆమె ఆడపడుచుకూ (సైబర్ కేఫ్ యజమాని భార్య) వస్తున్నాయి. పైశాచికత్వానికి పరాకాష్ట అయిన ఈ ఆన్లైన్ క్రూరత్వంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఫొటోలు పంచి పెట్టాడు! అతను నేవీ కమాండర్. వయసు 39. భార్య ఒకప్పుడు ఆర్మీలో కెప్టెన్. కుటుంబం ఢిల్లీలో ఉంటోంది. అతడికి పుణె నుంచి ఢిల్లీకి పోస్టింగ్ పడడంతో అక్కడ ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్తను వదిలేసి, ఇద్దరు పిల్లలతో పుణె వచ్చి వేరుగా ఉంటోంది. మంగళవారం పుణె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్త మీద ఫిర్యాదు చేసింది. పోర్నోగ్రఫీ అంటే అతడికి పిచ్చి. పదకొండేళ్లుగా చెబుతోంది, ఆ పాడు అలవాటు మానుకొమ్మని. మానుకోలేదు. అత్తమామల చేత చెప్పించింది. మారలేదు. అక్టోబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టింది. íపిటిషన్ ఇచ్చేందుకు కోర్టుకు వెళుతుంటే దారిలో ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఆమెను కలిశాడు. అతను కూడా నేవీ ఆఫీసరే. ఆమె భర్తకు స్నేహితుడు. తన భార్యతో కూడా ఆమె భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఈ వివరాలన్నీ స్టేట్మెంట్లో రాసిచ్చింది. ఫిర్యాదు స్టేట్మెంట్లో ఇవన్నీ వెల్లడించింది కానీ, ఇవన్నీ వెల్లడించడానికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. అసలు కేసు వేరు. భార్య ఫొటోలను, ఫ్రెండు భార్య ఫొటోలను, ఇంకో గుర్తు తెలియని మహిళ ఫొటోలను అశ్లీల చిత్రాలకు మార్ఫింగ్ చేసి తన జీ మెయిల్ అకౌంట్ నుంచి బట్వాడా చేస్తున్నాడట ఆమె భర్త. ఆ విషయం చెబుతూ ఈ వివరాలన్నీ ఇచ్చింది. పోలీసులు అతడిపై సెక్షన్ 509 (మహిళ గౌరవాన్ని కించపరిచి, అవమానాలపాలు చెయ్యడం), సెక్షన్ 67 (అశ్లీల సమాచారాన్ని, చిత్రాలను ముద్రించడం లేదా నెట్లో సరఫరా చెయ్యడం) కింద కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేసి విచారించడం కోసం భారత నౌకాదళంలోని అధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. – శరాది -
టీఆర్ఎస్ పార్టీ నేతల విభేదాలు!
-
టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు!
సాక్షి, కరీంనగర్/సిరిసిల్లా : ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కూమార్ ముందే ఎమ్మెల్యే శోభ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్త చుక్కారెడ్డిలు వాగ్వాదానికి దిగారు. ఫైర్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం వద్ద చుక్కారెడ్డి టెంకాయ కొడుతుండగా ఎమ్మెల్యే శోభ అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే తమ అనచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రితో చుక్కారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రమేశ్ బాబు స్వచ్చందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. వేములవాడలో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు. -
సీఎం సతీమణికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్ పీవీ రావు ఆమెకు వైద్యసేవలు అందిస్తున్నారు. కేసీఆర్ గురువారం ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఆమెకు అన్నీ తానే...
ఆదర్శం ఆమె పేరు శోభ. సాధారణ గృహిణి... ఆమెకు పెళ్లయి పాతికేళ్లయింది. పదిహేడేళ్లుగా ఆమె మంచం దిగనే లేదు. ప్రమాదం ఆమె వెన్నును విరిచేసింది... విధి ఆమెను పరిహసించింది. నాతి... చరామి... అని పెళ్లి నాడు చేసిన బాసను గుర్తు చేసుకున్నాడామె భర్త.ఉద్యోగాన్ని వదిలేశాడు... భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తన బాధ్యత అనుకున్నాడు. భర్త అంటే ఇంత బాధ్యతగా ఉండాలని చెబుతున్నాడు సిద్ధరామ్‌రెడ్డి. మెదక్ జిల్లా పర్వతాపూర్ గ్రామానికి చెందిన సిద్ధ్దరామ్రెడ్డి, కామారెడ్డి పట్టణానికి చెందిన శోభను సరిగ్గా పాతికేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉద్యోగరీత్యా కామారెడ్డిలోనే స్థిరపడ్డాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. శోభ ఇంటి వద్దే ఉంటూ కొడుకును చూసుకునేది. దాదాపుగా ఏడెనిమిదేళ్లపాటు హాయిగా ఉన్నారు. విధి వీరి జీవితంలో పిడుగు వేసింది. అది 2000 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ. ఆ దంపతులకు చేదు అనుభవం మిగిల్చిన రోజది. సాయంత్రం ఇంటి డాబా మీద ఏదో పనిచేస్తూ ఉంది శోభ. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేశారు. ఐదు లక్షలకు పైగా ఖర్చయింది. కానీ విరిగిన వెన్నును మామూలు చేయడం సాధ్యం కాదన్నారు. ఇక ఆమె లేచి నడవడం జరిగేపని కాదని తేల్చేశారు. తనతోపాటు ఏడడుగులు నడిచిన సహధర్మచారిణి ఇక నడవలేదని తెలిసి సిద్ధరామ్‌రెడ్డి తల్లడిల్లిపోయాడు. కన్నీళ్ల పర్యంతమవుతున్న శోభ కన్నీళ్లు తుడిచి తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే సిద్ధరామ్‌రెడ్డి భార్య కోసం తన ఉద్యోగానికి స్వచ్చంద విరమణ చేశాడు. కొంతకాలం పాటు అటు ఉద్యోగానికి వెళ్లడం, తిరిగి వచ్చి ఆమెకు సేవలు చేయడం ద్వారా అలసట తీవ్రమైన అలసటకు లోనయ్యేవాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి భార్యతోనే ఉంటున్నాడు. శోభను చేతులతో లేపి వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకెళతాడు. ఒక మోస్తరుగా కోలుకున్న తర్వాత శోభ భర్త వంట చేసి పెడితే తిని కూర్చోవడానికి మనసొప్పడం లేదని, తానే వంట చేస్తానని పట్టుపట్టింది. శోభ మంచం వద్దనే గ్యాస్ స్టౌను ఏర్పాటు చేయగా, ఆమె మంచం మీద కూర్చునే వంట చేస్తోంది. భర్త అన్ని సామాన్లను అందిస్తుంటే వంట పెడుతుంది. ఇంటికి ఎవరు వెళ్లినా చాయ్ చేసి తాగిన తర్వాత కానీ పంపించదు. కొడుకుని పెంచి పెద్ద చేశాడు... శోభకు ప్రమాదం జరిగేటప్పటికి కొడుకు వంశీ సాయికి రెండున్నరేళ్లు. అప్పటి నుంచి కొడుకు ఆలనా, పాలనా అంతా సిద్ధరామ్‌రెడ్డి చూసుకునేవాడు. వంశీ సాయి ఇప్పుడు జలంధర్‌లోని ఎన్ఐటీ (నిట్)లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగం సంపాదిస్తే తమకు ఆర్థిక కష్టాలు కూడా తీరుతాయని ఆ దంపతులు ఆశతో ఉన్నారు. ఇంట్లో తల్లి పరిస్థితి, తండ్రి కష్టాలను చూసిన వంశీ పట్టుదలతో చదివి నిట్‌లో సీటు తెచ్చుకున్నాడని వారు చెబుతున్నారు. అదే నాకు జరిగితే! మంచానికే పరిమితమైన శోభకు ధైర్యాన్నిస్తూ ఆమెకు అన్నీ తానై సేవలు చేయసాగాడు సిద్ధరామ్‌రెడ్డి. గడచిన పదిహేడేళ్లుగా సపర్యలు చేస్తూనే ఉన్నాడు. భార్య మంచాన పడడంతో బంధువులందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోవాలనే సలహా ఇచ్చారు, ఒత్తిడి చేశారు. కాని ఆయన ససేమిరా అన్నాడు. ‘ఆమెకు అలా అయ్యిందని రెండో పెళ్లి చేసుకోమంటున్నారు. అదే నాకు జరిగి ఉంటే ఏమనేవారు’ అని వారిని ఎదురు ప్రశ్నించేవారాయన. భార్య కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. జీవచ్ఛవంలా పడి ఉన్న భార్యకు అన్ని సేవలు చేస్తూ ఆత్మసై ్థర్యాన్ని నింపాడు. అవస్థలతో ఈ బతుకే ఎందుకనుకున్న శోభకు మనోధైర్యాన్నిచ్చి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. శోభ ఇప్పుడు తనలాంటి సమస్యతో నడవలేని వారెందరికో మనోధైర్యాన్నిచ్చే స్థాయికి ఎదిగింది. వెన్ను సమస్యతో మంచం పట్టిన వారి నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి వారికి ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని నింపుతోంది. ఆయన త్యాగం గొప్పది నా వెన్ను విరిగి మంచం పడితే అందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోమని వెంట పడ్డారు. కాని ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. అంతేగాక రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఎంత అలసట ఉన్నా నొచ్చుకున్న సందర్భం ఒక్కటీ లేదు. పదిహేడేళ్లుగా ఆయన నాకు చేసిన సేవలు నాలుగు జన్మలెత్తినా తీర్చుకోలేనివి. మా బాబుని ఆయనే పెంచి పెద్ద చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చలించిపోలేదు. నా కోసం ఎన్నో భరించాడు. – శోభ అది నా బాధ్యత... నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి కష్టాలపాలైతే ఆమెను అలాగే వదిలేయడం ఎలా? అలాంటి ఇబ్బంది భర్తకు ఎదురైతే భార్యే అన్నీ చూస్తుంది. మరి భార్యకు కష్టం వస్తే చూసుకోవలసింది భర్తే కదా. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా. ఆమె ధైర్యంగా ఉండడమే నాకు సంతోషం. – సిద్దరాంరెడ్డి, శోభ భర్త సిద్ధరామ్‌రెడ్డి... పేరు చెప్పగానే తెలిసిన వాళ్లంతా ‘‘ఆయన అందరిలా కాదు. ఆదర్శ భర్త. నేటి తరం ఆయన్ను చూసి నేర్చుకోవాలి’’ అంటారు. భార్యభర్తల బంధం ఇలా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడు–నీడ అంటే అర్థం ఏమిటో ఈ దంపతులను చూస్తే తెలుస్తుంది. వీళ్లను చూస్తే వివాహ బంధం విలువ తెలుస్తుంది. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి భార్యతో సిద్దరాంరెడ్డి -
పెద్దమ్మకు కేసీఆర్ సతీమణి పూజలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శోభ ఆదివారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ రోజు ఉదయం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పాల్వంచ చేరారు. అమ్మవారికి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. -
కొరియర్ బోయ్‌లా వచ్చి...
హైదరాబాద్: కొరియర్ బోయ్ అంటూ ఇంట్లోకి వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కుపోయాడో ఆగంతకుడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గదర్శి కాలనీ రోడ్డు నంబర్-6లోని శోభ(23) అనే మహిళ బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా కనిపెట్టిన ఓ దుండగుడు ఆ ఇంటి డోర్ బెల్ కొట్టి కొరియర్ అని చెప్పాడు. నిజమేననుకున్న శోభ బయటకు రావడంతో దుండగుడు ఆమె కళ్లలో కారంకొట్టి.. మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కుపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
అనంతపురం సెంట్రల్ : నగరంలో న్యూ రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శోభ ఇంట్లో చోరీ జరిగింది. వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా శోభ పని చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వచ్చే సరికి ఇంటి బీరువాలోని 20 తులాలు బంగారు, రూ. 50 వేలు నగదు అపహరించుకుపోయారు. ఘటనపై బుధవారం ఉదయం బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్వేచ్ఛాడే
శోభాడేని స్వేచ్ఛాడే అనడానికి రెండు కారణాలు. ఒకటి: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నెలల్లో ఆమె జన్మించారు. రెండు: రచయిత్రి, కాలమిస్టు కనుక ఆమె ఊహల్లో కావలసినంత స్వేచ్ఛ. అయితే ఈ రెండూ పైపై కారణాలు మాత్రమే. లోతైన కారణం ఏమిటంటే... స్వేచ్ఛ ఆమె జీవన విధానం. ఇంట్లో, బయటి ఇరుకులో ఆమె ఎప్పుడూ ఫిట్ కాలేదు. ఒళ్లు విరుచుకున్నట్లుగా... ఆలోచనలు పరుచుకోడానికి స్పేస్ ఉన్నచోటే ఆమె కుదురుగా ఉన్నారు. శోభాడేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాకుమారి కేట్ మిడిల్టన్ ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు.. ‘చీర కట్టుకోడానికి తగిన ఒంపులు ఆ పిల్లకు లేవు’ అని శోభాడే బహిరంగంగా అనడం భారతీయులందరినీ నివ్వెరపరిచింది. నిజానికి శోభాడే మాట్లాడింది కేట్కి లేని వాటి గురించి కాదు. చీరకు ఉండవలసిన వాటి గురించి! శోభ.. చీరల డిజైనింగ్‌లో కూడాస్పెషలిస్టు మరి. తనకు తెలిసిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేని స్వేచ్ఛాప్రియత్వమే ఈ డెబ్బై ఏళ్ల సౌందర్యరాశి వ్యక్తిత్వాన్ని నిత్యం శోభాయమానం చేస్తోంది. సోఫిస్టికేటెడ్, స్లెండర్, స్మార్ట్, షార్ప్, ష్రూడ్! ఇవన్నీ ‘ఎస్’తో మొదలయ్యే మాటలు. శోభాడేని నిర్వచించే మాటలు కూడా! శోభాడే పేరూ ‘ఎస్’తోనే మొదలౌతుంది. ఆమె రాసిన పుస్తకాల్లో దాదాపుగా అన్నీ ‘ఎస్’తో స్టార్ట్ అయినవే.. సిస్టర్స్, స్టారీ నైట్స్, సల్ట్రీ డేస్, సెకండ్ థాట్స్, సెలెక్టివ్ మెమరీ, సర్వైవింగ్ మెన్.. ఇలా. శోభాడే నవనాగరికురాలు (సోఫిస్టికేటెడ్). ఆమెవి నాజూకైన భావాలు (స్లెండర్). వివేకవంతురాలు (స్మార్ట్). చురుకైన మనిషి (షార్ప్). నేర్పరి (ష్రూడ్). ఏంటీ ‘ఎస్’? సెంటిమెంటా? ‘ఎస్’లో ఏదైనా పవర్ ఉందా? శోభాడేని చాలామంది అడిగారు. పవర్ ‘ఎస్’లో లేదు. ‘నో’లో ఉంది. ‘నో’ చెప్పడంలో ఉంది.. అన్నట్లు నవ్వేస్తారు శోభాడే. జీవితంలో ప్రతి విషయాన్నీ ఆమె తేలిగ్గానే తీసుకున్నారు. విత్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఏదైనా.. తొలగించుకోవడంలో లేదు.. తగిలించుకోవడంలో ఉంది అని నమ్ముతారు శోభ! తలచినదే జరగాలి! సంప్రదాయం కుటుంబంలో సంకెళ్లు తెంచుకోలేనివిగా ఉంటాయి. అసలు తెంచుకోవాలన్న ఊహే రానివ్వని విధంగా ఉంటాయి. మహారాష్ట్ర సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని ఈ ఆడపిల్ల ఊహనూ రానిచ్చింది, వాటిని తెంపుకునీ బయటికి రానూ వచ్చింది! సాధారణంగా.. వద్దన్న పని చెయ్యొద్దు అన్నప్పుడు పెద్దవాళ్ల భ్రుకుటి ముడివడుతుంది. కానీ.. చెయ్యాలనుకున్న పనిని చెయ్యొద్దు అన్నప్పుడు శోభాడే భ్రుకుటి ముడివేస్తుంది! ఆమె జీవితమంతా ఇదే ధోరణి. నాన్న చెప్పినా వినలేదు శోభాడే సెయింట్ జేవియర్స్ కాలేజీ స్టూడెంట్. అంతవరకు బాగుంది. మోడలింగ్ చేస్తానంటే మాత్రం తండ్రి ఒప్పుకోలేదు. ‘మా అమ్మాయి న్యాయ మంత్రిత్వశాఖలో ప్రభుత్వ కార్యదర్శి లేదా పెద్ద అధికారి’ అని చెప్పుకోవడం ఆయనకు గర్వం. అప్పటికే ఆయన రెండు మూడు గర్వాలను తలపై కిరీటంలా ధరించి ఉన్నారు. కొడుకు ఇంజినీర్. ఒక కూతురు ఆఫ్తాల్మిక్ సర్జన్. ఇంకో కూతురు ‘లా’ గ్రాడ్యుయేట్. వీళ్లందరి వరుసలోనే చిన్న కూతురు శోభను ఐ.ఎ.ఎస్.కు పంపించాలనుకున్నారు. కానీ శోభ పెదవి విరిచింది. ఊహు.. ఈ మాటను ఇలా చెప్పకూడదు. తండ్రి ముందు పెదవి విరిచేంత ధైర్యం చేసింది! ‘వావ్’ అంటూ వచ్చి అడిగారు శోభ శరీర నిర్మాణం పెళుసుగా ఉంటుంది. ఈ మాట సరిగా అర్థం కాకపోతే ‘నాజూకు’గా అనుకోవచ్చు. మోడలింగ్ చూపు ఇలాగే ఉంటుంది. ఇక ఆ దృఢమైన దవడ కండరాలు, ఆమె ఆత్మవిశ్వాసం కూడా మోడలింగ్‌కు అవసరమైన సౌందర్య సాధనాలే. అయితే శోభకు తనలో ఇంతుందని తెలీదు! తండ్రీకూతుళ్లు ఓ రోజు తాజ్ లాంజ్‌లో కూర్చొని ఉన్నారు. ఏ అతిథి కోసమో ఎదురుచూస్తున్నారు. అటుగా వెళుతున్న వారెవరో శోభను చూశారు! ‘వావ్’ అనుకున్నారు. అలా చాలామంది శోభను చూసి వావ్ అనుకోవడం మామూలే కానీ, ఇక్కడ వావ్ అనుకున్నది, వీళ్ల దగ్గరికొచ్చి శోభను పరిచయం చేసుకున్నది మోడలింగ్ ఫీల్డ్ వాళ్లు. ఆ తర్వాత శోభ ఖటావ్ శారీస్, తాజ్ టీ, పాండ్స్, బాంబే డయింగ్.. అన్నీ టాప్ బ్రాండ్స్.. వాటికి మోడల్ అయ్యారు. ఆరేళ్లు తన 22 వ యేట వరకు శోభ మోడలింగ్‌కి శోభ తెచ్చారు. మరి బాలీవుడ్ శోభకు ఎట్రాక్ట్ కాలేదా? అయింది. కానీ శోభే బాలీవుడ్‌కి ఎట్రాక్ట్ కాలేదు! ఏంటీ అమ్మాయి? ఏం లేదు. మృదుభాషి. ఆమె ఆలోచనలు మాత్రమే నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి. వాటి ధ్వని అక్షరాల్లో వినిపిస్తుంది. అంతే తప్ప అస్తమానం మానవలోకంలో తిరుగాడుతుండే స్త్రీ కాదు శోభాడే. సత్యజిత్‌రాయ్, ఇంకా ఒకరిద్దరు బెంగాలీ దర్శకులు.. సినిమాల్లోకి వస్తారా అని శోభను అడిగారు. శోభ రాలేననలేదు. చేయలేనన్నారు. క్రీడలు.. క్రియేటివిటీ శోభ అథ్లెట్ కూడా అని చెబితే సడెన్‌గా ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయినట్లు ఉంటుంది. శోభ కూడా ఇలాగే ఆటల్నుంచి డైవర్ట్ అయ్యారు. చదువుకునే రోజుల్లో ఆమె రాష్ట్ర స్థాయి అథ్లెట్. ఇక బాస్కెట్ బాల్లో అయితే ఆమె రికార్డ్ హోల్డర్. కానీ అటువైపే వెళ్లలేదు. మోడలింగ్ చేస్తూనే మాస్ కమ్యూనికేషన్స్‌లోకి వచ్చేశారు. భవాన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ‘క్రియేటివ్ యూనిట్’లో కాపీ రైటర్‌గా చేశారు. అదొక యాడ్ ఏజెన్సీ. స్టార్‌డస్ట్, సొసైటీ, సెలబ్రిటీ పత్రికలకు ఎడిటర్‌గా చేయడం శోభ జర్నలిజం కెరీర్‌లోని శిఖరాగ్ర దశ. మూడూ ఒకే దేహంలా ఉండే ఈ పత్రికలకు మూడు వేర్వేరు ఆత్మలను ఇచ్చి, కొత్త తరం జర్నలిస్టులను తయారు చేశారు శోభా డే. రాయలేదు! చెక్కారు!! మరి ఇన్నిన్ని పుస్తకాలు ఎలా రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? మొదటిది: తపన. అది ఆమెను నిలవనివ్వలేదు. అందుకు రాశారు. రెండోది: తపన. దానికి టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాశారు. మూడోది: తపన. దాని పని అది చేసుకుపోయింది. పుస్తకాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చేశాయి. జీవితంలోని ప్రతిక్షణం ఆమెకొక ప్రేరణ. ‘సోషలైట్ ఈవినింగ్స్’ లో శోభాడే ముంబై మహా నగరపు సంపన్న జీవితాల్లోని ఏకాంతపు విషాదాన్ని, విఫల వివాహాలను, పరస్పర్శలోని ఓదార్పును కోరుకునే దేహాలను, ఆత్మలను... శిల్పాల నీడల్లా చెక్కారు. న్యూ యాంగిల్ సామాజిక పరిణామాల్లో కొత్త కోణాలను చూస్తారు, వ్యాఖ్యానిస్తారు శోభాడే. దేశంలో ముందు వరుసలో ఉన్న కాలమిస్టు ఆమె. రోజుకి కనీసం 1500 పదాలైనా రాయగల శక్తిమంతురాలు. ఒక్కోరోజు రాయడానికి ఏమీ ఉండదు. అయినా సరే ఏమీ రాయకుండా ఉండలేదు. సంతృప్తి... పశ్చాత్తాపం ఏ కళతోనూ, ఏ కలలోనూ సంతృప్తి చెందని మనిషి శోభాడే. ఆవులకు మాత్రమే సంతృప్తి ఉంటుందని ఆమె అభిప్రాయం. ఆవు అయినా ఎలా సంతృప్తి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శోభాడే మాటల్లో వినడమే బాగుంటుంది. ‘‘కొంచెం దాణా, కుడితి, నీడ, పక్కనే తన లేగదూడలు ఉంటే చాలు ఆవు సంతృప్తి చెందుతుంది’ అంటారు శోభ. మరి జీవితంలోని పశ్చాత్తాపాలు? అవి లేకుండా జీవితం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్న. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ శోభాడే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. కాలేజ్ బయట, కాలేజ్ లోపల. అలా గడిచాయి ఆ రోజులు. ఇప్పుడీ జనరేషన్ మీద ఏమిటి ఆమె అభిప్రాయం? అసలు మనకో అభిప్రాయం ఎందుకు ఉండాలి అనేది శోభ క్వొశ్చన్. ఎందుకంటే ఆమె కొన్ని పుస్తకాల్లో రాశారు.. ఇప్పటి అమ్మాయిలు మరీ గడుసుగా తయారయ్యారని. అయ్యారని రాశాను కానీ, అవకూడదని రాయలేదుగా అని శోభ! అమె చిన్న కూతురు డీజే అవుదామని అనుకుంది. ఆ మాటే అమ్మతో చెప్పింది. వద్దన్నారు శోభ.. తన స్వభావానికి భిన్నంగా. నేను చేసేది చేసేదే అన్నట్లు డీజే దారిలోకి వెళ్లింది చిన్నమ్మాయి. ఆ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మాయిలకు అంటారు శోభ. దీన్ని మనం ద్వంద్వ వైఖరి అనుకోనవసరం లేదు. ద్వైదీభావం అనుకోవాలి. శోభాడే మనోగతం మగవాళ్లలో నచ్చనివి? నోటి దుర్వాసన, చుండ్రు ఆదర్శ పురుషుడు అంటే? ఆదర్శ పురుషులంటూ ఎవరూ ఉండరు. సూపర్‌మేన్, రావణ్ కాంబినేషన్ నచ్చుతుంది నాకు. కానీ ఈ కాంబినేషన్‌తో మనకు మగాళ్లెవరూ కనిపించరు. మీ చర్మం నిగారింపు రహస్యం ఏమిటి? జీన్స్ బట్టి వచ్చింది. ప్లస్ మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్... రచయిత్రి కాకపోయుంటే... ఆర్కిటెక్ట్ ని అయుండేదాన్ని. చక్కటి ఆకాశ హర్మ్యాలను కట్టి ఉండేదాన్ని. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుడతారా? మీరు ఇప్పుడు ఉన్నట్లే.. ఈ ప్రశ్న మీరు ఏ మిస్ ఇండియాకో వెయ్యవలసింది (నవ్వుతూ) మీ సోషల్ స్టేటస్‌ని మీ భర్త దిలీప్ డే ఎంజాయ్ చేస్తారా? ఏం ప్రశ్న అండీ ఇది! ఏకాలంలో ఉన్నారు? మీకు ఇంకా ఏమేం ఇష్టం? సినిమాలు... సినిమాలు. చాలా చూస్తాను. అలాగే ప్రయాణాలు నాకు ఇష్టం. తెల్లారేసరికల్లా మిలియన్ డాలర్లు (సుమారు 7 కోట్ల రూపాయలు) మీ ముంగిట్లోకి వచ్చిపడితే.. అవన్నీ ఖర్చయిపోయేంత వరకు దక్షిణమెరికాలో పర్యటిస్తాను. మీకు చాలా భాషలు తెలుసంటారు? చాలా కాదు. కొన్ని. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్.. కొద్దిగా ఫ్రెంచి. అభిమాన రచయిత విక్రమ్ సేథ్, స్కాట్ ఫిట్టెగరాల్డ్ నచ్చిన సినిమాలు చాలా. ‘పాకీజా’ వాటిల్లో ఒకటి. ఎవరంటే ప్రేమ? జీవించడం, ప్రేమించడం. -
సీఎం భార్య.. సాధారణ మహిళలా..!
సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీమణి శోభ బుధవారం తమ సొంతూరు మెదక్ జిల్లా చింతమడకలో సాధారణ మహిళలా కలియతిరిగారు. కనిపించిన వారినల్లా ఆత్మీయంగా పలకరించారు. వారితో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆమె తీరుతో గ్రామస్తులు పులకించిపోయారు. చింతమడక గ్రామానికి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శోభ.. తమ బంధువులతో కలసి గతంలో ఉన్న ఇంటిని, తమకున్న స్థలాలను పరిశీలించారు. గ్రామంలో కేసీఆర్‌కు ఉన్న స్థలాల్లో ఎస్బీహెచ్ బ్యాంక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశువైద్యశాలలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇంటి స్థలంలో ప్రస్తుతం ఉన్న ఎస్బీహెచ్ బ్యాంక్‌లోకి శోభ వెళ్లగానే అక్కడే గోడకు ఉన్న అత్తమామలైన కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావుల చిత్రపటానికి దండం పెట్టారు. బ్యాంక్‌లో ఉన్న గదులు చూస్తూ.. అందులో ఉన్నప్పుడు ఏ గదిలో ఏముండేదో గుర్తు చేసుకుంటూ పక్కనే ఉన్న బంధువులకు చెప్పారు. అదే విధంగా గ్రామంలోని ఆయా స్థలాల్లో ఎవరు ఉంటున్నారని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కేసీఆర్ తల్లిదండ్రుల స్మారకార్థ్ధం నిర్మించిన కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న లక్ష్మిని పేరు పెట్టి పిలిచి బాగున్నారా అని పలకరించారు. ‘మంగమ్మ లేదా?’ అంటూ ఆరా తీశారు. పాఠశాలలో నీళ్ల వసతి ఉందా? కేసీఆర్ సతీమణి శోభ కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్లి పాఠశాలలో నీళ్ల వసతి ఉందా అని పాఠశాలలో వంట చేసేవారిని అడిగారు. ఈ సందర్భంగా వారు నీళ్లు సరిగ్గా రావడంలేదు.. బయట నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో నీళ్ల ట్యాంక్ ఉందనగా, దానికి కనెక్షన్ లేదని వారు బదులిచ్చారు. గ్రామంలో కనిపించిన వృద్ధులను, తెలిసిన వారిని పేరు పెట్టి పలకరించడంతో వారంతా సంతోషంలో మునిగారు. దశ దినకర్మలో.. సిద్దిపేట మండలం చింతమడకలో కేసీఆర్ వదిన సుభద్ర మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. దశ దినకర్మ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఆమె సుమారు ఐదు గంటల పాటు గ్రామంలోనే ఉన్నారు. -
పని మనిషిపై నటి శ్రుతి పరువు నష్టం దావా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బహు భాషా నటి శ్రుతి తన పని మనిషి శోభాపై బుధవారం పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారు. మంగళవారం శ్రుతి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను వేధించానంటూ గతంలో శోభా చేసిన ఫిర్యాదుపై బసవేశ్వర నగర పోలీసులు దర్యాప్తు చేశారని, ఆ సందర్భంగా ఆమె చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని వివరించారు. డబ్బు ఆశతో తాను ఆరోపణలు చేశానని దర్యాప్తు సందర్భంగా శోభా ఒప్పుకుందని చెప్పారు. దీని వెనుక తాను విడాకులిచ్చిన చంద్రచూడ్ హస్తం ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. తన కదలికలపై శోభా ఎప్పటికప్పుడు అతనికి సమాచారం చేరవేస్తూ ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో తనపై లేని పోని ఆరోపణలు చేయడం ద్వారా, సమాజంలో తన గౌరవానికి భంగం కలిగించినందున దావా వేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. -
‘సర్పంచ్ గ్రామ బహిష్కరణ’పై విచారణ
జక్రాన్‌పల్లి : చింతలూర్ సర్పంచ్ శోభతోపాటు ఆమె భర్త సంతోష్‌లను గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు గ్రామ బహిష్కరణ చేశారన్న ఆరోపణలపై మంగళవారం నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. సర్పంచ్ శోభ, ఆమె భర్త సంతోష్‌లకు లక్ష రూపాయల జరిమానా విధించారని సాయమ్మ అనే మహిళ తెలిపింది. సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు మైక్ ద్వారా దండోరా వేయిం చారని పేర్కొంది. సర్పంచ్‌కు దుకాణాల్లో ఎలాంటి వస్తువులు ఇవ్వరాదని, సర్పంచ్‌కు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకోరాదని హెచ్చరించారని పోశన్న అనే వ్యక్తి తెలిపారు. వీడీసీ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటునుంచే నీళ్లు తెచ్చుకోవాల ని, కలిగోట్‌లో ఉన్న సర్పంచ్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోకూడదని మాత్రమే మైక్‌లో చెప్పించామన్నా రు. ఇసుక విషయంలో సర్పంచ్ భర్త సంతోష్ అధికారులకు ఫిర్యాదు చేశారని పెద్దోళ్ల గంగారాం తెలిపారు. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంతో అతడికి లక్ష రూపాయల జరిమానా విధించామని పేర్కొన్నారు. కానీ సంతోష్ ఆ జరిమానా చెల్లించలేదన్నారు. అదే సమయంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు పెద్దగా నినాదాలు చేశారు. గ్రామ బహిష్కరణ విధిం చిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వారిని సముదాయించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించరాదని వీడీసీ సభ్యులకు సూచించారు. డీఎస్పీ వెంట డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాయినాథ్ ఉన్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి చింతలూర్ సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐకేఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చింతలూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్‌ను బహిష్కరించడం ఆటవిక చర్యన్నారు. వీడీసీ పేరుతో దళితులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయకపోతే గురువారం ఆర్మూర్‌లో నిర్వహించే సీఎం సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాం, దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు సంకెపల్లి బుచ్చన్న, వాడి ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ తదితరలు పాల్గొన్నారు. -
'కష్టాల్లో నాకు అండగా నిలబడ్డ అక్కను కోల్పోయాను'
-
ఆళ్లగడ్డలో భూమా కుటుంబం ప్రచారం
-
సొంత గూటికి యడ్డి
యడ్డికి బీజేపీ తీర్థం పూర్తయిన లాంఛనం శోభా, రేణుకాచార్య, సీఎం ఉదాసీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరిక సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్‌కు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు యూబీ. బనకార, విశ్వనాథ పాటిల్, సుమారు 300 మంది కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ అధ్యక్షుడు కేఎస్. ఈశ్వరప్ప యడ్యూరప్పకు ఎదురు వెళ్లి మెడలో పూలమాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యేలు బనకార, విశ్వనాథ పాటిల్ రూ.105 చెల్లించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ .. అధికార వ్యామోహంతో తాను తిరిగి బీజేపీలోకి రాలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమన్నారు. బీజేపీని వదిలి తప్పు చేశానన్నారు. ఇకపై అలాంటి తప్పులు జరగబోవని సంజాయిషీ ఇచ్చారు. బీజేపీ నాయకులు మనసులో ఏమీ పెట్టుకోకుండా కేజేపీ నాయకులకు, కార్యకర్తలకు వారి సామర్థ్యానికి తగిన విధంగా పార్టీ పదవులు ఇవ్వాలని సూచించారు. కాగా మాజీ మంత్రులు శోభా కరంద్లాజె, రేణుకాచార్య, సీఎం. ఉదాసీ తదితరులు కూడా ఇదే సందర్భంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, ఎమ్మెల్సీ తార తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా రచ్చబండ కార్యక్రమం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా 19,307 మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. 55,335 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని, 29,047 మందికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 38 పనులకు శంకుస్థాపన జరుగుతాయని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 78 పనులకు గానూ రూ 17.60 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 నుంచి 39 శాతం లోపు వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్ కింద రూ. 200 అందజేయడానికి సదరమ్ కార్యక్రమం చేపట్టనున్నామని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే 1 తర్వాత పుట్టిన అర్హత గల ఆడ పిల్ల పేరు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు. ఎస్.కోట, విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అనుమతితో షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ యు.సి.జి. నాగేశ్వరరావు, పీఓ రజిత్కుమార్సైనీ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సీపీఓ బి.మోహనరావు పాల్గొన్నారు. రచ్చబండ షెడ్యూల్ ఖరారు నేడు జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న రచ్చబండ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం సాయంత్రానికి ఖరారవుతుందని ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ తెలిపారు. గురువారం జేసీ చాంబర్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరిస్తామన్నారు. -
వైఎస్ఆర్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు