కవితతో తల్లి శోభ ములాఖత్‌  | Mother Shobha Mulakhat with Kavitha | Sakshi

కవితతో తల్లి శోభ ములాఖత్‌ 

Mar 22 2024 4:44 AM | Updated on Mar 22 2024 4:44 AM

Mother Shobha Mulakhat with Kavitha - Sakshi

ఐదో రోజూ కొనసాగిన ఈడీ విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తల్లి శోభ ములాఖత్‌ అయ్యారు. శోభతోపాటు సోదరుడు కేటీఆర్, సోదరి సౌమ్య కూడా కలిశారు. వీరు గురువారం సాయంత్రం సుమారు గంట సేపు కవితతో మాట్లాడారు.

కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న కవిత పిటిషన్‌పైనా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు, ఐదోరోజూ గురువారం కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులైన తన పీఏలు చెప్పిన సమాచారం మేరకు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement