liquor scandal
-
బెయిల్ నిలిపివేతపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ (ఈడీ)కేసులో తనకు ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ మీద హైకోర్టు స్టే ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ ఆదివారం(జూన్23) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సోమవారం(జులై24) ఉదయమే పిటిషన్‌ను విచారించాలని కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్20న ఈ కేసులో ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌పై 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణ చేపట్టి అదే రోజు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తుది తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ లోపే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కే జ్రీవాల్‌ను ఈడీ ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేసింది. అనంతరం ఆయనకు లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొడిగించాలని తిరిగి కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించింది. వెంటనే కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు తీర్పు రిజర్వు చేయడంతో ఆయన తిరిగి తీహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది.తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ వేయడంతో హై కోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే ఇచ్చింది. -
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ
ఢిల్లీ, సాక్షి : మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే వారం వరకు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో (రిమాండ్ ఖైదీగా) కొనసాగనున్నారు. కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘చూస్తాం, పరిశీలిస్తాం’ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తిరస్కరించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు తన క్లయింట్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అందుకు ఈరోజు విచారణకు అనుమతిస్తారో లేదో చెప్పేందుకు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. అందుకు ‘చూస్తాం, పరిశీలిస్తాం’ అని చెప్పారు. అప్పటి వరకు తీహార్ జైల్లోనే కాగా, కేజ్రీవాల్ అప్పీల్‌పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం..గురువారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోర్టు కార్యకలాపాలు జరగవు. శుక్రవారం స్థానిక సెలవుదినం, ఆపై వారం ముగుస్తుంది. సోమవారం తిరిగి సుప్రీం కోర్టు కార్యకలాపాలు పున: ప్రారంభం అవుతాయి. అప్పటి వరకు తీహార్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. మీరు ముఖ్యమంత్రి అయితే .. నిన్న ఢిల్లీ హైకోర్టు ‘కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హుక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదంటూ’ కీలక వ్యాఖ్యలు చేసింది. -
కవితతో తల్లి శోభ ములాఖత్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తల్లి శోభ ములాఖత్ అయ్యారు. శోభతోపాటు సోదరుడు కేటీఆర్, సోదరి సౌమ్య కూడా కలిశారు. వీరు గురువారం సాయంత్రం సుమారు గంట సేపు కవితతో మాట్లాడారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న కవిత పిటిషన్‌పైనా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు, ఐదోరోజూ గురువారం కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులైన తన పీఏలు చెప్పిన సమాచారం మేరకు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. -
చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం జరిగిందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ చేశారని, తద్వారా పలు డిస్టిలరీలకు, బార్లకు లబ్ధి చేకూర్చారని ఆయన వివరించారు. ఇందులో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నిందితులకు సైతం సంబంధం ఉందన్నారు. వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ సైతం తేల్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్వలాభం కోసం, డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారని శ్రీరామ్ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్రకు డబ్బు అందిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు. ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముందస్తు బెయిల్ పేరుతో దాఖలు చేసిన ఈ పిటిషన్.. క్వాష్ పిటిషన్ రీతిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయాన్ని తేల్చాలన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు సహకారం మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ పేరు లేదన్నారు. సీఐడీ మాత్రం కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా చేర్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం మేరకే పిటిషనర్ వ్యవహరించారన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తన వాదనల సమయంలో 17ఏ గురించి ప్రస్తావించడంతో దానిపై వాదనలు వినిపిస్తానని, విచారణను వాయిదా వేయాలని పోసాని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
కేసీఆర్ అక్రమార్జన రూ.లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్‌కు వేల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఎలా వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భూములను కొల్లగొట్టి రూ. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని, ఆ సంపాదనతోనే దేశ రాజకీయాలను శాసించాలను కుంటున్నారని ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్‌లతో కలసి రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ భూములు అమ్మితే రూ.2,500 కోట్లు వస్తాయని, ఆ డబ్బులతో రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకోవచ్చని వ్యాఖ్యానించారు. రూ. 800 కోట్ల భూమిని రూ. 100 కోట్లకే.. యశోద ఆసుపత్రులకు రూ. 800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్లకే సీఎం కేసీఆర్ కేటాయించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలెగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఐదెకరాల స్థలాన్ని వైద్య, ఆరోగ్య రంగంలో పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిందని చెప్పారు. ఆ తర్వాత ధరను సవరించారని, సవరించిన మేరకు ఎక్కువ ధర చెల్లించాలని అలెగ్జాండ్రియాతోపాటు మారుతి సుజుకీ కంపెనీకి హెచ్ఎండీఏ లేఖ రాసిందని రేవంత్ పేర్కొన్నారు. అయితే అలెగ్జాండ్రియా కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించుకుండా కోర్టుకు వెళ్లిందని, కోర్టులో కేసు నడుస్తుండగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఆ భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని, అలెగ్జాండ్రియా కంపెనీని బెదిరించి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు ఓడిపోయేలా చేసి రూ. 500 కోట్ల విలువైన భూమిని అలెగ్జాండ్రియా కంపెనీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు కూడా వెళ్లలేదని, ఆ తర్వాత అదే సర్వే నంబర్లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని కూడా అగ్గువకు కొట్టేశారని ఆరోపించారు. ఈ భూమిని యశోదా ఆసుపత్రుల గ్రూప్ గజం రూ. 37,611 చొప్పున కొనుగోలు చేసిందని, వాస్తవానికి అక్కడ గజానికి కనీసం రూ. 2 లక్షల ధర పలుకుతుందని చెప్పారు. ఆ భూమి వెనుక ఉన్న భూమికి హెచ్ఎండీఏ గజం రూ. 80 వేలను అప్సెట్ ప్రైస్‌గా నిర్ధారించిందని రేవంత్ పేర్కొన్నారు. కమీషన్లు తీసుకొని అదనపు అంతస్తులకు అనుమతులు... లిక్కర్ కుంభకోణంలో ఉన్న పెద్దలకు ఖానామెట్‌లో 25 ఎకరాల భూమిని కేటాయించారని, ఇందుకోసం మంత్రి కేటీఆర్‌కు 20 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నాగార్జున సర్కిల్లోని భవనాలకు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలన్నారు. తాను చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. -
సీబీఐ విచారణకు సిద్ధమేనా?: వైఎస్ విజయమ్మ
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్ బొబ్బిలి (విజయనగరం జిల్లా)/ శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయామంతా స్కామ్‌లమయమే. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, తెల్గీ కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకో ణం, ఐఎంజీ, ఎల్ అండ్ టీ, రహేజా తదితర కుంభకోణాలకు చంద్రబాబు పాల్పడ్డాడు. పనికి ఆహార పథకం, ఇంకు డు గుంతలు, నీరు-మీరు పథకాల్నీ వదల్లేదు. తుఫాన్ నిధుల్ని దిగమింగేశాడు. చంద్రబాబుపై దర్యాప్తు చేయమం టే నెల రోజుల పాటు జాప్యంచేసి సిబ్బంది లేరని కోర్టుకు చెప్పారు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ. ఈలోగా దాదాపు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు. అటువంటి అవినీతిపరుడా... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్మోహన్రెడ్డిని విమర్శించేది? చంద్రబాబూ.. నువ్వే తప్పూ చేయలేదనుకుంటే, నీకంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?’’ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ మ్మ విరుచుకుపడ్డారు. ఆమె గురువారం విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, పార్వతీపురం, కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం, పొందూరు పట్టణాల్లో జరి గిన వైఎస్సార్ జనభేరి బహిరంగసభల్లో ప్రసంగించారు. పాలకొం డ, రాజాంలలో భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు. పార్టీలో 15 వేల కుటుంబాల చేరిక మక్కువ మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, రంగునాయుడుల ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలు గురువారం కాంగ్రెస్‌ను వీడి విజ యమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. డీసీసీబీ డెరైక్టరు మావుడి తిరుపతిరావుతో పాటు 11 మంది సర్పంచ్‌లు, 42 మంది వివిధ స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు.