![Delhi High Court Rejects Manish Sisodia Bail](/styles/webp/s3/article_images/2024/05/21/manishsisodia_0.jpg.webp?itok=XoJJ4Cr2)
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.
సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment