reject
-
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. -
Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే సామాన్యులను మహామండలేశ్వరులు, నాగ సాధువులు అమితంగా ఆకర్షిస్తున్నారు. అయితే మహామండలేశ్వరులు, నాగసాధువులుగా మారడం అంత సులభం కాదు.మహామండలేశ్వరులు, నాగ సాధువులుగా మారేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జీవితంలో సత్యనిరతి, సనాతనధరంపై అంకితభావం కలిగివుండాలి. ఈ విలువలకు అఖాడాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మహామండలేశ్వరులు, నాగ సాధువులకు అఖాడాలు దీక్షనిస్తారు. జీవితంలో ఏమాత్రం విలువలు పాటించకుండా సాధకులమని చెప్పుకునేవారికి దీక్షలు ఇచ్చేందుకు అఖాడాలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మహామండలేశ్వరులు, నాగసాధుకులుగా మారాలనుకున్న పలువురికి నిరాశ ఎదురయ్యింది.మహామండలేశ్వరులుగా మారాలనుకున్న 12 మంది సాధకులు, సాగ సన్యాసం స్వీకరించాలనుకున్న 92 మంది సాధకుల దరఖాస్తులను అఖాడాలు తిరిస్కరించారు. జునా అఖాడా, ఆవాహన్ అఖాడా, నిరంజని అఖాడా, బడా నిరంజని అఖాడాలు మొత్తం 104 అభ్యర్థనలను తిరస్కరించారు. ఈ అభ్యర్థుల తీరుతెన్నులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని తేలండంతో అఖాడాలు వీరి దరఖాస్తులను తిరస్కరించారు.మకర సంక్రాంతి నుండి ఇప్పటివరకు వివిధ అఖాడాలలో కొత్తగా 30 మందికి మహామండలేశ్వరులుగా, 3,500మందికి నాగ సాధువులుగా దీక్ష ఇచ్చారు. వసంత పంచమి నాడు జరిగే మూడవ అమృత స్నానం వరకు, మహామండలేశ్వరులకు, నాగ సన్యాసులకు దీక్షనిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.మహామండలేశ్వరులు, లేదా నాగ సాధువుగా మారేందుకు ముందుగా అఖాడాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వారు ఆ దరఖాస్తులో తల్లిదండ్రులు, విద్యార్హతతో సహా పలు వ్యక్తిగత వివరాలు తెలియజేయాలి. వీటిని అఖాడాలు సమగ్రంగా పరిశీలిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులలో నిరంజని అఖాడా ఆరు దరఖాస్తులను, జునా అఖాడా నాలుగు దరఖాస్తులను, ఆవాహన్ అఖాడా మహామండలేశ్వర్‌గా మారేందుకు వచ్చిన రెండు దరఖాస్తులను రద్దు చేసింది. నాగ సాధువులుగా మారేందుకు వచ్చిన దరఖాస్తులలో 92 దరఖాస్తులను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
లిక్కర్ కేసు: కవితకు మళ్లీ నిరాశే
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం. -
కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన కోర్టు.. సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పని చేయదంటూ వ్యాఖ్యానించింది. -
Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా మొదటి షో నుంచే పలు వివాదాలను క్రియేట్ చేసింది. మరోవైపు సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. కానీ చివరకు ఈ సినిమా లాభాలను తెస్తోందో, లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేశారు. నిజానికి మొదట UV క్రియేషన్స్ నిర్మాతలు 'ఆదిపురుష్' మూవీని తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు వారి స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేందుకు పీపుల్స్ మీడియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దిల్ రాజు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. చివరకు నైజాం రైట్స్ అయినా తీసుకోవాలని వారు కోరితే దానిని కూడా దిల్ రాజు సున్నితంగా తిరస్కరించాడట. శాకుంతలం సినిమా వల్ల అప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నష్టాలను చూసిన ఆయన మళ్లీ రిస్క్ చేయడం ఎందుకని తిరష్కరించాడని తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై నమ్మకం లేకపోవడం వల్లే దిల్ రాజు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు ఆయన భయం నిజమయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దిల్ రాజు అంచనా ఎలాంటిదో తేలాలంటే మరో వారం ఆగాల్సిందే. (ఇదీ చదవండి: అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్ డైరెక్టర్) -
కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సంచలనాలకు చిరునామా, వివాదాలకు పేటెంట్ నటి కంగనా రనౌత్. ఆమె సమాజంలో జరిగే సంఘటనలపై తనదైనశైలిలో స్పందిస్తుంది. ప్రతిభకు తక్కువ కాదు అనే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన సత్తా చాటుకుంటున్న కంగనా తాజాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన, నాటి సంఘటనలతో 'ఎమర్జెన్సీ' చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం విశేషం. తమిళంలో ఇప్పటికీ ధామ్ ధూమ్, తలైవి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్కడా అవకాశాలు వస్తున్నాయి. కానీ తమిళ చిత్రాల అవకాశాలను తిరస్కరిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. ఆమె క్యాస్ట్‌పై తెగ వెతికేస్తున్నారు!) ఇంతకు ముందు నటుడు శింబు సరసన నటించే అవకాశాన్ని నిరాకరించిన కంగనా రనౌత్ తాజాగా నటుడు ధనుష్‌తో జత కట్టే అవకాశానికి నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ధనుష్ పాన్ వరల్డ్ నటుడు అన్నది తెలిసిందే. కాగా ఈయనలోనూ టాలెంట్‌కు కొదవ లేదు. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. తాజాగా తన 50వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించనున్నారు. భారీ తారాగణంతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో ధనుష్‌కు జంటగా కంగనా రనౌత్‌ను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు, ఆమె కాల్ షీట్స్ సమస్య అంటూ నిరాకరించినట్లు టాక్. దీంతో ధనుష్ తన అర్ధ సెంచరీ చిత్రంలో నాయకిగా నటి త్రిషను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీంతో మరో సౌత్ హీరోకు కంగనా నో చెప్పిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జజర్దస్త్ కమెడియన్) -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
ఈవీఎంలో పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్‌ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని పేర్కొంది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీల నీడలో అభ్యర్థులు ఉండడం వల్లే చట్టసభల సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నేర చరిత్ర లేని వారికి పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనపై అటార్నీ జనరల్ వెంకట రమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఓటు వేయడానికి ముందుగానే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది. కోర్టు విచారణకు అంగీకరించని నేపథ్యంలో తాను ఈసీని ఆశ్రయిస్తాయని వికాస్ సింగ్ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. చదవండి: ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం -
నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట
న్యూఢిల్లీ: బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం కమ్యూనిటీ మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ‘‘ఆదేశాలు జారీ చేసేప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది’’ అని పిటిషనర్‌కు సూచించారు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్. దీంతో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్ శర్మ కామెంట్లపై అరబ్ దేశాల నుంచి, భారత్‌లోని ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగింది. అయితే తదుపరి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ.. అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదీ చదవండి: పక్కా ప్లాన్.. అయినా దుస్థితికి కారణాలేంటి? -
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!
భువనేశ్వర్: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్‌స్టాప్ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
గేట్ పోస్ట్‌పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు
సాధారణంగా ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు హెచ్ఆర్లు తాము ఎంపిక చేయబోయే అభ్యర్థులకు కొన్ని అర్హతలు నిర్ణయించుకుంటారు. వాటిని అనుసరించే ఆ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఇంటర్యూ సమయంలో చెప్పిన సమాధానాలను మరికొన్ని వాటిని పోల్చి చూసుకుని వారిని ఎంపిక చేయాలా, వద్దా అనేది తేలస్తారు రిక్రూటర్లు. కానీ ఓ యువతి ఒక వింత కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఈ సిల్లీ రీజన్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాపర్టీ రిక్రూట్మెంట్ సంస్థ డైరెక్టర్ ఫాయె ఏంజెలెట్టా తన క్లయింట్ కంపెనీలో ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు తీసుకుంది. అందులో ఒక యువతిని ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆ యువతి బయోడేటాను సదరు క్లయింట్‌కు పంపించింది. అయితే.. వాళ్లు మాత్రం ఆ యువతి లావుగా ఉందనే కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ యువతిని ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చూసి ఏంజెలెట్టా షాక్ అవుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో.. తను లావుగా ఉందని.. ఉద్యోగంలోకి తీసుకోకపోవడం అసలు కారణమే కాదు. ఇంతవరకు నేను ఇలాంటి కారణాలతో ఉద్యోగులను రిజెక్ట్ చేయడం చూడలేదు. ఇప్పుడు నేను ఆ యువతికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ రాసుంది. నిజానికి ఆ యువతి అంత లావుగా కూడా లేదు, కానీ వాళ్లు ఎందుకు రిజక్ట్ చేశారో తెలియదు కానీ కారణం మాత్రం ఇదే చెప్పారని ఏంజెలెట్టా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు యువతిని రిజక్ట్ చేయడం పై మండిపడుతున్నారు. చదవండి: Interesting Facts About Toothbrush: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
సాక్షి, కొత్తగూడెంటౌన్ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది. తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం రాత్రి పాయిజన్ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా.. -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
మామిడి దౌత్యం.. పాక్‌కు చైనా సహా 32 దేశాల ఝలక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు మామిడి పండ్ల షాక్ తగిలింది. స్నేహపూర్వకంగా పండ్లు పంపిస్తే.. వద్దని తిప్పి పంపించాయి కొన్ని దేశాలు. ఈ లిస్ట్‌లో మిత్ర దేశం చైనాతో పాటు అమెరికా, కెనెడా, నేపాల్, శ్రీలంక.. ఇలా 32 దేశాలున్నాయి. అయితే ఈ మామిడి పండ్ల దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనా వైరస్ క్వారంటైన్ కారణంగా చూపిస్తూ మామిడి పండ్లను వెనక్కి పంపాయి. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ కార్యాలయానికి ఆయా పార్శిళ్లు వెనక్కి వచ్చేశాయి. కాగా, మేలిమి రకాలైన అన్వర్‌రొట్టోల్, సింధారి రకాలు కరోనా ప్రభావంతో ఈసారి పండించకపోవడంతో.. చౌన్సా రకపు మామిడి పండ్లను పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వి పేరు మీదుగా ఆయా దేశాలకు పంపింది పాక్. గల్ఫ్ దేశాలు టర్కీ, యూకే, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా సహా.. అన్ని దేశాలు వద్దని పంపించడం విశేషం. ఇక ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయానికి పంపినట్లు పాక్ చెప్తున్నప్పటికీ.. అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ప్రతీ ఏడాది ఇలా స్నేహ పూర్వక సంబంధాల కోసం పాక్ ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పంపడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో నరేంద్ర మోదీ, ప్రణబ్‌ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీకి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీప్ మామిడి పండ్లు పంపించాడు కూడా. -
చోక్సీకి కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. క్యూబాకు పారిపోతూ డొమినికాలో అరెస్ట్ అయిన చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా ఉందని న్యాయవాది లారెన్స్ వాదించారు. కాగా పీఎన్బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. చదవండి : చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్‌కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ల కంటే ముందే ఈ అమ్మడికి బీటౌన్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన జెర్సీ రీమెక్‌లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్ పిలుపు కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్పుకొచ్చింది. 'జెర్సీ' మూవీలో నాని సరసన హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్‌లోనూ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. చదవండి : ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ -
సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అక్టోబర్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) సైతం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల 2020లో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతూ సివిల్ సర్వీసెస్‌లో ‘చివరి ప్రయత్నం’ దాటిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎ.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. ఈ మేరకు 40 పేజీల తీర్పును వెలువరించింది. ఇలా లాస్ట్ అటెంప్ట్‌లో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, సివిల్స్ అభ్యర్థుల వయో పరిమితిలోనూ ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సడలింపులు ఇవ్వడం ఇతర అభ్యర్థులపై వివక్ష చూపినట్లే అవుతుందని స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 32 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు సివిల్స్ రాయొచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 37 ఏళ్లు. గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల 10,000 మందికిపైగా అభ్యర్థులు నష్టపోతారని అంచనా. -
నిర్భయ కేసు : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార కేసులో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. 2012 సామూహిక హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్) ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది. చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా? -
నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషిగా ఉన్న పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో మైనర్‌ననీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆరోపిస్తూ పవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ దాఖలు చేసిన పిటిషన్లో పరిశీలించాల్సిన అంశాలేమీ కనబడలేదని పేర్కొంది. గతంలో పవన్ దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లు హైకోర్టు, ట్రయల్ కోర్టులలో తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేసింది. వీటిపై వేసిన రివ్యూ పిటిషన్లను సైతం తిరస్కరించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..పవన్ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు. పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి మార్గం సుగమమైంది. మార్గదర్శకాలు ఇవ్వాలి: నిర్భయ తండ్రి ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేయవచ్చో తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్భయ తండ్రి సుప్రీంకోర్టును కోరారు. నిర్ణీత సమయంలో మాత్రమే పిటిషన్లు దాఖలు చేసేలా మార్గదర్శకాలు ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. వీటివల్ల నిర్ణీత సమయంలో దోషులకు శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. -
సరెండర్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
-
షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు
కోల్‌కతా: టీమిండియా ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీకి అమెరికా వీసా తిరస్కరణ... అనుమతి పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. గతేడాది కుటుంబ వివాదాలతో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతడిపై వరకట్న, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వీటికి సంబంధించి పోలీసు తనిఖీ రికార్డులు అసంపూర్తిగా ఉండటంతో షమీ వీసాను ముంబైలోని అమెరికా ఎంబసీ ప్రాథమికంగా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రి... ఆటగాడిగా షమీ ఘనతలు, కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి పోలీస్ రిపోర్ట్‌ను జతచేస్తూ అమెరికా ఎంబసీకి లేఖ రాశారు. దీంతో షమీకి మార్గం సుగమమైంది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు ఈ నెల 29న ముంబై నుంచి బయల్దేరనుంది. ఆగస్టు 3, 4 తేదీల్లో రెండు టి20లను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్స్‌లో ఆడుతుంది. వాస్తవానికి షమీ టి20 జట్టులో లేడు. వన్డేలు, టెస్టులకు మాత్రమే అతడిని ఎంపిక చేశారు. అయితే, చివరి టెస్టు ముగిశాక... టీమిండియా అమెరికా మీదుగానే స్వదేశానికి వస్తుంది. దీంతో ఆ దేశ వీసా పొందడం అవసరమైంది. -
ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
-
వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ శుక్రవారం ఇక్కడ కాసేపు హల్చల్ చేశారు. కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు. దాంతో అన్ని రకాల పత్రాలను తీసుకొని మారోసారి వస్తానని ఆయన వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ప్రాంత వాసులకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సోమవారం 19వ తేదీన మళ్లీ వస్తానని, అప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. -
షికాగో దెబ్బ అమెరికా వీసాల తిరస్కరణ
-
షికాగో సెక్స్ రాకెట్ దెబ్బ : వీసాల తిరస్కరణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : మేక మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఉత్తర అమెరికా తెలంగాణ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడంతో ఇటీవల యూఎస్ కాన్సులేట్‌లో బీ1బీ2 వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమెరికా ఎందుకు వెళుతున్నారని అడిగితే.. ఉత్తర అమెరికా తెలుగుసభల కోసమని సమాధానమిచ్చారు.. ఆ మరుక్షణమే ఆయన చేతికి వీసా తిరస్కరణ పత్రం అందింది. సురేఖరాణి, డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టు. అమెరికా తెలుగు అసోసియేషన్ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందడంతో బీ1బీ2(పర్యాటక వీసా) కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 22న వీసా ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆమెకు ఎదురైన ప్రశ్న కూడా ఎందుకు వెళుతున్నారనేదే.. ఆటా సదస్సులో పాల్గొనడానికని సమాధానం చెప్పడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అమెరికాలో తెలుగు సదస్సులకు అధికారిక బృందాలు వెళుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించింది. ..ఇలా అమెరికా వీసాలను తిరస్కరించడం గతంలో ఎన్నడూలేదు. తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతామని దరఖాస్తు చేసినా 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ తిరస్కరించింది. సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతోనే.. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం, ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడమే దీనికి కారణం. షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్ మార్క్ పెడుతోంది. వీసా కోసం ఆన్లైన్లో డీఎస్ 160 ఫామ్ సమర్పించాలి. ఆ ఫామ్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మే–జూన్‌కు ఎంత తేడా.. మే నెలలో యూఎస్ వీసా కోసం వచ్చిన (బీ1బీ2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి(65 శాతం) వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి(కన్సల్టెన్సీ సంస్థల లెక్కల ఆధారంగా). తెలుగు సదస్సు పేరుతో అమెరికా వెళుతున్న వారు అక్కడకు వెళ్లి ఆరు నెలలు ఉండటం, కొంత మంది మరో మూడు మాసాలు పొడిగించాలని దరఖాస్తు చేయడం వంటివి లెక్కకు మించి ఉంటున్నాయి. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ‘వీసా ఇవ్వాలా? లేదా? అన్న అధికారం కాన్సులేట్ అధికారికి ఉంటుంది. ఇందులో ఎలాంటి మతులబూ ఉండదు’అని యూఎస్ కాన్సులేట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తల్లిదండ్రులకూ తప్పని తిప్పలు.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల గ్రాడ్యుయేషన్‌కు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకూ తిప్పలు తప్పడం లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వెళతామన్న తల్లిదండ్రులు, బంధువుల్లో 90 శాతం మందికి వీసాలు మంజూరవుతాయి. కానీ, ఇటీవల ఆ దరఖాస్తులనూ క్షుణ్ణంగా పరిశీలించి నో చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అధికారి, అతని భార్యకు వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ సీనియర్ అధికారి కుమారుడి గ్రాడ్యుయేషన్‌కు వెళ్లడానికి వీసా చేసుకున్న దరఖాస్తునూ కాన్సులేట్ అధికారి గత గురువారం తిరస్కరించారు. గతంలో ఇలా లేదు.. గతంలో దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఈ పదిహేను రోజుల్లో మంజూరైన వీసాల సంఖ్య 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. గత 15 రోజుల్లో మా సంస్థ 220 దరఖాస్తులను ఫార్వర్డ్ చేయగా 34 మందికే వీసాలు వచ్చాయి. గతంలో మా సంస్థ ద్వారా వెళ్లిన 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. – ఓ కన్సల్టెన్సీ ప్రతినిధి -
‘మగవారిలా గడ్డం ఉంది...విడాకులు ఇప్పించండి’
గుజరాత్ : తన భార్య గొంతు మగవారిలా రావడమే కాక గడ్డం కూడా ఉంది...కాబట్టి తనకు విడాకులు మంజూరు చేయాలని కోరిన ఓ వ్యక్తి పిటిషన్‌ను గుజరాత్ అహ్మాదాబాద్ ఫ్యామిలి కోర్టు కొట్టి వేసింది. కోర్టు పిటిషన్లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు. కానీ వివాహం అయిన అనంతరం తాను ఆమె మొహం చూసి ఆశ్చర్యపోయానని ఎందుకంటే ఆమెకు మగవారిలాగా గడ్డం ఉందన్నాడు. అంతేకాక ఆమె గొంతు కూడా మగవారి గొంతులాగానే ఉన్నదని తెలిపాడు. ఈ విషయాల గురించి తన భార్య కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు తనకు చెప్పకుండా మోసం చేశారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇందుకు సమాధానం చెప్పాలని కోర్టు పిటిషన్‌దారు భార్యను కోరింది. అందుకు ఆమె హార్మోన్ల అసమతుల్యం వల్ల తనకు మొహం మీద వెంట్రుకలు ఉన్న మాట వాస్తవమే అని, కానీ వాటిని తొలగించవచ్చని తెలిపారు. తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విడాకులు కావాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. పిటిషన్‌దారు భార్య తరుపు లాయర్ ఈ విషయాలను కోర్టుకు తెలియజేసాడు. వీరిద్దరి వాదనలు విన్న కోర్టు విడాకులు మంజూరు చేయలేమని భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. -
అంతరాత్మ ఒప్పుకోవట్లేదు.. వద్దు
సాక్షి, బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చి వార్తల్లో నిలిచారు ఐపీఎస్ అధికారిణి రూప. ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనప్పటికీ నిర్భయంగా నిజాలను వెలుగులోకి తెచ్చి లేడీ సింగంగా ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరోసారి వార్తల్లో కెక్కారు. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ(హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) అయిన రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని ఆమె కోరుతున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ సీఈవో ఎన్బీఎఫ్ శ్రీధర్ శెట్టికి ఆమె లేఖ రాశారు. ‘ జాబితాలో నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోట్లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదు’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా, నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అధినేత బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. ఆయన తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా నెగ్గారు. ఈ నేపథ్యంలో ఆ ఫౌండేషన్ తరపున అవార్డు ద్వారా వివాదంలో చిక్కుకోవటం ఎందుకని రూప భావించినట్లు స్పష్టమౌతోంది. -
రాజమౌళిపై కన్నడిగుల ఆగ్రహం!
సాక్షి, బెంగళూర్ : అగ్రదర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బెంగళూర్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి హాజరుకావాల్సిందిగా కర్ణాటక చలన చిత్ర అకాడమీ రాజమౌళికి ఆహ్వానం పంపింది. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించటంపై వారు మండిపడుతున్నారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చాలా మంది నటీనటులకు, మేకర్లకు ఆహ్వానం పంపాం. కానీ, చాలా వరకు హాజరుకాలేదు. దర్శకుడు రాజమౌళికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపాం. కానీ, రాలేనని నేరుగా చెప్పేశారు. ఇది కన్నడ ప్రజలను, ముఖ్యమంత్రి(సిద్ధరామయ్య)ని అవమానించటమే. వారంపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం కాస్తైనా సమయం కేటాయించాల్సింది’ అని కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్ ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు అభిప్రాయపడ్డారు. కాగా, బాహుబలి వివాద సమయంలో(సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు) తాను రాయ్‌చూర్ మూలాలు ఉన్నవాడినంటూ సినిమా విడుదలను అడ్డుకోవద్దని రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన కార్యక్రమానికి రావటానికి ఆయనకొచ్చిన సమస్యేంటని? కన్నడిగులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్లనే తాను రాలేకపోతున్నానని రాజమౌళి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్ మ్యాచ్‌లు చూపించడం కుదరదు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు విజయవంతమైన టోర్నీగా ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లోని పలువురు సభ్యులు ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేదు. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య కోల్‌కతాలో జరిగే ఐసీసీ సమావేశానికి వీరంతా హాజరవుతుండటంతో తాము ఐపీఎల్ చూడవచ్చని వారు ఆశించారు. కానీ ఆయా తేదీల్లో ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా లేదు. దాంతో తమ కోసం షెడ్యూల్‌ను కాస్త మార్చి ఒక మ్యాచ్ జరిగేలా చూడమంటూ బీసీసీఐని ఐసీసీ చిరు కోరిక కోరింది. అయితే బీసీసీఐ మాత్రం అది కుదరదంటూ తిరస్కరించేసింది. ‘ఒక మ్యాచ్‌లో మార్పులు చేస్తే మొత్తం షెడ్యూల్, దానికి సంబంధించి ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు దెబ్బ తింటాయి. కాబట్టి అది సాధ్యం కాదని మేం జవాబిచ్చాం’ అని బోర్డు ఉన్నతాధికారి వెల్లడించారు. -
హాలీవుడ్ పిలుపొచ్చింది!
గత పదేళ్లుగా హాలీవుడ్‌కు ఇండియన్ మార్కెట్లో క్రేజ్ బాగా పెరిగింది. మరోపక్క ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా కూడా రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్‌కు మరింత దగ్గరవ్వాలని హాలీవుడ్ పెద్ద స్టూడియోలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి స్టార్స్‌తో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇక్కడ ముందు వరుసలో ఉంటున్నాడు. హృతిక్ ఆరడుగులు ఉంటాడు. సిక్స్‌ప్యాక్ బాడీ. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడని పేరు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన చేసిన ‘క్రిష్’ తరహా సూపర్ హీరో సినిమాలు కూడా హాలీవుడ్‌ను తలపిస్తాయి. ఇంకేం! హృతిక్ హాలీవుడ్ హీరో అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్ నిర్మాతలు అనేసుకున్నారు. హాలీవుడ్ నిర్మాతల వరకూ చేరింది ఈ మాట. దీంతో ఇప్పటికి హృతిక్‌కు రెండు, మూడు హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే అవన్నీ సెకండ్ లీడ్ అట. హాలీవుడ్లో అయితే ఫుల్ లెంగ్త్ హీరోగానే చేయాలనుకుంటున్న హృతిక్, ఈ ఆఫర్లు ప్రస్తుతానికి రిజెక్ట్ చేశాడట. మరి ఆ ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడొస్తుందో చూడాలి! -
పద్మావత్‌కు వ్యతిరేకంగా పిల్
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రంపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది ఒకరు శుక్రవారం న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే కోర్టు మాత్రం పిల్‌ను తోసిపుచ్చింది. ‘‘మాది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. సినిమాలను అడ్డుకోవటం మా పని కాదు. శాంతి భద్రతల పని ప్రభుత్వాలు చూసుకుంటాయని’’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సినిమా విడుదలైతే అల్లర్లతో హింస చెలరేగే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పద్మావత్ సినిమాను విడుదల కానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేయటమే ఉత్తమమని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది(పిల్‌ను ఉద్దేశించి) ప్రజలకు ఏ రకంగా మేలు కలిగించేదో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిత్ర విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానేయటం ఉత్తమమని.. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు సిద్ధంగా లేమని అని పిటిషనర్‌తో న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సెన్సార్ బోర్డు చీఫ్‌కు వార్నింగ్... ఇదిలా ఉంటే పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ ఇచ్చిన సీబీఎఫ్సీపై రాజ్‌పుత్ కర్ణిసేన ఆగ్రహంతో ఊగిపోతోంది. బోర్డు చీఫ్ ప్రసూన్ జోషిని ఇక ముందు రాజస్థాన్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సెన్సార్ బోర్డు పట్టించుకోకపోవటం దారుణమని.. మున్ముందు మరిన్ని పరిణామాలు సెన్సార్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్ణిసేన ఓ ప్రకటన విడుదల చేసింది. -
వీవీపాట్లపై కలుగజేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో వినియోగించిన 20 శాతం ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పుల ఫలితాలతో సరిపోల్చాలంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖకు చెందిన మహ్మద్ ఆరీఫ్ రాజ్‌పుత్.. 20 శాతం వీవీపాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసువేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈవీఎం–వీవీపాట్‌లో అవక తవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ నిర్థారించే వరకూ ఈ విషయంలో తాము కలుగజేసుకోలే మంది. కేసును ఉపసంహరించుకోవాలని అయితే ఎన్నికల సంస్కరణల తర్వాత సమగ్ర పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంది. అయితే ఎన్నికల సంస్కరణలపై గుజరాత్లో ఎన్నికల ప్రక్రియ ముగిశాక చర్చ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని ప్రజలకు తెలియ జేసేందుకు.. ప్రతి నియోజక వర్గంలో 20 శాతం బూత్‌ల్లో వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీపాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరారు. ఈసీ నిర్ణయం లేకుండా తాము ఈ విషయంలో కలుగుజేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
దీప జయకుమార్‌కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది. ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది. -
ఆప్‌కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయకపదవుల కేసు విషయంలో ఆప్ ఎమ్మెల్యేలకు ఎలక్షన్ కమిషన్(ఈసీ) వద్ద చుక్కెదురైంది. తమపై నమోదైన కేసును వెనక్కితీసుకోవాలని 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఈసీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు తుది విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. -
భారత్ లో ఆపిల్ కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : భారత్ లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్న టెక్ దిగ్గజం ఆపిల్ కు అడగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. భారత్ లో తయారీ సంస్థ ఏర్పాటుచేసేందుకు కంపెనీ అడుగుతున్న పన్ను మినహాయింపులను ఇవ్వలేమని, వారి అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. కంపెనీకి అలాంటి మినహాయింపులేమీ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేసింది. మేకిన్ ఇండియాలో భాగంగా దీర్ఘకాలిక సుంకం మినహాయింపులతో పాటు పన్ను పరిమితుల నుంచి తమను తప్పించాలని కంపెనీ కోరుతోంది. అయితే ఈ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరిస్తూ వస్తోంది. ఆపిల్ పన్ను డిమాండ్లతో పాటు కంపెనీ ప్రైమరీ అసెంబ్లర్ తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ కూడా మొబైల్ ఫోన్లను ఎగుమతి చేయడానికి మద్దతు కోరుతోంది. అదేవిధంగా త్వరలో అమలుకాబోతున్న ఏకీకృత పన్ను విధానం జీఎస్టీ నుంచి కూడా తమకు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఆపిల్, ఫాక్స్ కాన్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దిగుమతి చేసుకునే పరికరాలపై డ్యూటీలను, 15 ఏళ్ల పన్ను హాలిడేను కల్పించాలని కోరుతున్నాయి. అయితే ఈ డిమాండ్లను జీఎస్టీ పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆర్థికమంత్రిత్వ శాఖ, వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్లను తయారుచేయడానికి బెంగళూరులో ప్లాంట్ ను నెలకొల్పబోతున్నట్టు కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ సార్! నా పేరు మూర్తి. నా వయసు 19. నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తనకి ఆరు నెలల క్రితం ప్రపోజ్ చేశాను. కాని తను రిజెక్ట్ చేసింది. మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. దానికి నేను ఒప్పుకోవడం లేదు. అయినా నాతో బాగానే మాట్లాడుతోంది. తనకి అసలు నా పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? – మూర్తి, ఈమెయిల్ ఇంత చిన్న వయసులో నీకెంత ప్రాబ్లమ్ వచ్చింది భయ్యా! నువ్వు అవునన్నా, అమ్మాయి కాదంది కదయ్యా. మాట్లాడడం మానేసి చెంప మీద పీకుంటే బాగుండేదనుకుంటున్నావ్ కదూ! నీ చెంప ఛెళ్లు మనేది, సమాజం ఘొల్లున నవ్వేది, నీ ప్రేమ చెల్లయ్యేది. దెబ్బకు దిమాక్ ఫ్రీ అయిపోయేది. చక్కగా చదువుకునే వాడివి, లేకపోతే ఇంకో అమ్మాయి దగ్గర చెంప ఛెళ్లుమనిపించుకోవడానికి రెడీ అయిపోయేవాడివి. ఇప్పుడా అమ్మాయి నవ్వుతూ మాట్లాడడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమే. నాకు తెలుసు తను నీతో ఎందుకు చక్కగా మాట్లాడుతుందో. సంస్కారవంతురాలు. మంచి పెంపకంలో ఎదిగిన బంగారం. నీ ప్రేమను తిరస్కరించినా, నీ అభిమానాన్ని గౌరవించింది. నీ జీవితం కూడా చల్లగా ఉండాలని నువ్వు గొప్పవాడివి కావాలని ఆ మంచి మాటకీ, ఆ చిరునవ్వుకీ అర్థం. నీ మరదలు కాబట్టి నీ కంటే చిన్నదే అయి ఉంటుంది. అంత చిన్న వయసులో కూడా తను చూపిన బ్యాలెన్స్ నిజంగా గ్రేట్. తనని చూసి... ప్రేమించడానికి బదులు గౌరవించడం నేర్చుకో. నువ్వు రెండు విషయాల్లో చాలా అదృష్టవంతుడివి. మొదటి విషయం దేవుడు నీకు అంత మంచి శ్రేయోభిలాషిని ఇచ్చాడు. ఇక రెండవ విషయం ఏంటంటే కొంచెం సిగ్గేస్తోంది... ఇబ్బందిగా ఉంది...‘నువ్వు తప్పదు చెప్పాలి’ అంటేనే చెబుతున్నా. దేవుడు నీకు నా లాంటి లవ్ డాక్టర్ని ఇచ్చాడు. అంటూ నవ్వుతూ తలకాయ పైకెత్తాను. బల్లమీదున్న అరటిపండును నీలాంబరి వెనక్కు లాగింది. మర్చిపోయాను, మూడో విషయం. మా ఇద్దరికంటే సూపర్ బెటర్. నీలాంబరిని ఇచ్చాడు దేవుడు. నీలాంబరి నవ్వుతూ అరటిపండును మళ్లీ ముందుకు తోసింది. బై! అల్ ది బెస్ట్. ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
3,842 కొత్త రేషన్ కార్డులకు మంగళం
–ప్రజా సాధికార సర్వే ఆధారంగా తొలగింపు కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ఇటీవల జిల్లాకు 87,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఇందులో వెంటనే 3,842 కార్డులను రిజెక్టు చేసింది. ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సర్వే ప్రాతిపదికగా రేషన్ కార్డులకు ప్రభుత్వం మంగళం పలుకుతోంది. 5 ఎకరాలు పైబడి భూములు కలిగిన వారు, ఆస్తి పన్ను చెల్లించే వారు, కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, ఆధార్ తప్పులు, డూప్లికేట్ కార్డులను ప్రభుత్వం తొలగించింది. ఇవన్నీ ప్రజాసాధికార సర్వే ద్వారా వెలుగు చూశాయి. ప్రస్తుతానికి పరిమితంగా తొలగించినా రానున్న రోజుల్లో ప్రజాసాధికార సర్వే ఆధారంగా మరిన్ని కార్డులపై వేటు పడే అవకాశం ఉంది. అయితే వీటిపై మరోసారి విచారణ జరపాలని, వీరిలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు ఉంటే రేషన్ కార్డులను పునరుద్ధరించాలని సూచించింది. జిల్లాకు ప్రభుత్వం 87వేల కార్డులు మంజూరు చేసినప్పటికీ ఇందులో కొత్త కార్డులు పరిమితంగానే ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలకు ఉన్న కార్డులను విభజించి వేరుగా కార్డులు మంజూరు చేశారు. కాకపోతే కొంతమేర యూనిట్ల సంఖ్య పెరిగింది. ఇంతవరకు ఎలాంటి కార్డుల్లేని కుటుంబాలకు పరిమితంగానే కార్డులు మంజూరు చేశారు. వీటిని కొత్తకార్డులుగా వ్యవహరిస్తారు. ఇందులోని 3,842 కార్డులు తొలగించడం పట్ల కొత్త కార్డుల సంఖ్య మరింత తగ్గిపోయింది. – ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మంజుల మల్లికార్జునకు ఇటీవల జేఏపీ 134805400032 నెంబర్ కార్డు కొత్తగా వచ్చింది. ఆయన ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో రేషన్ కార్డును రిజెక్టు చేశారు. -
తమిళనాడులో సుప్రీం ఆదేశాలు బేఖాతరు
చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తమిళనాడులో జల్లికట్టు క్రీడను కొనసాగిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలు జల్లికట్టు నిర్వహిస్తుండగా గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ అండదండలతోనే జల్లికట్టు కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. జల్లికట్టుపై ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం అర్ధం చేసుకోవాలన్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఆమె కోరారు. జల్లికట్టుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
‘1–బీ’లను తిరస్కరిస్తున్న బ్యాంకర్లు
∙అధికారులు ఇచ్చిన పçహాణీలు చెల్లవంటున్న మేనేజర్లు ∙రుణాల కోసం ఇబ్బంది పడుతున్న రైతులు మహబూబాబాద్ : రుణాలు, రుణమాఫీకి సం బంధించి రెవెన్యూ అధికారులు రైతులకు జారీ చేసిన 1–బీ నమూనా (ఆర్ఓఆర్) పహాణీలను కొందరు బ్యాంకు మేనేజర్లు తిరస్కరిస్తున్నారు. దీంతో రుణాల కోసం తాము అనేక ఇబ్బందు లు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బ్యాంకులలో రుణాలు, రుణమాఫీ, ఇతరత్ర అవసరాల కోసం వీఆర్ఓలు రూ. 20 తీసుకుని 1బీ, పçహా ణీలను అందజేశారు. అయితే వాటిని కొన్ని బ్యాంకుల మేనేజర్లు అంగీకరించడం లేదని, మీ సేవ కేంద్రాల నుంచి తేవాల్సిందేనని కొర్రీలు పెడుతున్నారనిరైతులు చెపుతున్నారు. రెవెన్యూ అధికారులే బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకే రైతులకు ఆన్లైన్ ద్వారా 1బి, పçహాణీలను అందజేశామన్నారు. ఇందుకోసం ఒక్కో రైతు నుంచి రూ.10 మాత్రమే తీసుకున్నామని తెలిపారు. అయితే వీటిపై రుణాలు ఇచ్చేందుకు కొందరు బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. బ్యాంకులలో తీసుకోవడం లేదు.. రెవెన్యూ అధికారులు ఇచ్చిన 1బి, పహాణీలను మానుకోటలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్ అంగీకరించడం లేదు. మీసేవ కేంద్రం నుంచి పహణీ, 1బీ తీసుకురావాలంటున్నారు. రెవెన్యూ అధికారులు రూ.20 తీసుకుని ఇచ్చినా అవి పనికి రావడం లేదు. అధికారులే ఈ సమస్య పరిష్కరించాలి. – రమణ, రైతు -
జీజీహెచ్‌లో చిన్నారికి వైద్యం నిరాకరణ
బాధితుల ఆందోళనతో ఆసుపత్రిలో అడ్మిషన్ గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో కొందరు వైద్యుల తీరుతో ఆసుపత్రి ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొద్దిపాటి కాలిన గాయాలతో వైద్యం కోసం వచ్చిన చిన్నారికి చికిత్స చేయకుండా రాత్రంతా అత్యవసర విభాగంలోనే ఉంచారు. వైద్యం చేయకపోగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని, లేని పక్షంలో చిన్నారి ఆరోగ్యం విషమంగా మారుతుందని భయాందోళనకు గురిచేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి వైద్య సేవలు అందించకపోవడంతో బాధితులు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళన చేశారు. దీంతో ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి చిన్నారికి వార్డులో అడ్మిషన్ లభిం చింది. బాధితుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన కొక్కెరపాటి చంద్రబాబు, నవ్య దంపతుల కుమార్తె ఎనిమిది నెల ల పూజిత సోమవారం ఇంట్లో స్నానానికి నీళ్లు తోడిన సమయంలో శరీరంపై వేడి నీళ్లుపడి గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు గుంటూరులో ప్రత్యేక వార్డు ఉందని చెప్పి రిఫర్ చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు క్యాజువాలిటీకి వచ్చిన చిన్నారి పూజితకు వైద్యులు అడ్మిషన్ ఇవ్వలేదు. జనరల్ సర్జరీ వైద్యులు, పిడియాట్రిక్ సర్జరీ వైద్యులు, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు చిన్నారిని అడ్మిట్ చేసుకోకుండా మాకు సంబంధించింది కాదంటే మాకు సంబంధించింది కాదంటూ మిన్నకుండిపోయారు. ఒక పక్క కాలినగాయాలతో పసికందు తీవ్రంగా రోదిస్తున్నా వైద్యులు పట్టించుకోకపోవడం చిన్నారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచి వేసింది. విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకోవడంతో ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్, క్యాజువాలిటీకి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి వార్డులో అడ్మిషన్ ఇచ్చారు. -
అమెరికా సెనేట్‌లో గన్స్ బిల్ ఫెయిల్
వాషింగ్టన్: అమెరికాలో వ్యక్తులకు తుపాకులు వంటి ఆయుధాలు అమ్మే విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలన్న ఆలోచన ముందుకుసాగలేదు. పరిమితులు విధించాలన్న యోచన విజయవంతం కాలేదు. ఈ మేరకు అమెరికా సెనేట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లులు మద్దతు పొందలేకపోయాయి. ఇటీవల అమెరికాలోని ఓర్లాండోలో జూన్ 12న కాల్పుల ఘటన చోటుచేసుకుని 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయుధాల అమ్మకాల చట్టంలో మార్పులు తీసుకురావాలని ఇటు డెముక్రాట్లు, అటు రిపబ్లికన్లు ఆలోచన చేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించి బిల్లుల రూపంలో సెనేట్ లో పెట్టారు. అయితే, ఈ రెండు బిల్లులు కూడా ముందుకు వెళ్లేందుకు కావాల్సిన మద్దతును పొందలేకపోయాయి. వీటిపై కార్యచరణ ప్రారంభం కావాలంటే కనీసం 60 ఓట్లు రావాల్సి ఉండగా అది విఫలం అయింది. డెమొక్రాట్ల బిల్లు రిపబ్లికన్లు నో చెప్పగా.. రిపబ్లికన్ల బిల్లుకు డెమొక్రాట్లు అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరి ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. -
అంబరీష్ రాజీనామా చెల్లదు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీష్ ఒకే లైన్‌తో పంపిన రాజీనామా లేఖ చెల్లదని స్పష్టం చేశారు. సరైన ఫార్మాట్‌తో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను కేబినెట్ నుంచి తొలగించినందుకు నిరసనగా అంబరీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య.. అంబరీష్ సహా 14 మంది మంత్రులను తొలగించి, కొత్తగా 13 మందిని కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంది. అంబరీష్ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి అంబరీష్‌ను తొలగించినందుకు ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముక్కుసూటి మనస్తత్వంగలవారు, నిజాయితీవ్యక్తులు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్ చేశారు. కాగా మంత్రి పదవి నుంచి అంబరీష్‌ను తొలగించడం సబబేనంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. -
జనతా గారేజ్కు నో చెప్పిన ప్రభుదేవా?
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో కొరియాగ్రఫీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడట ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసే ప్రతిపాదనను ప్రభుదేవా తిరసర్కించాడట. ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్టపడే ప్రభు.. ఎన్టీఆర్ ప్రతిపాదన తోసిపుచ్చడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కేవలం తను దర్శకత్వం వహించే సినిమాలకే నృత్యదర్శకత్వం చేయాలని ప్రభుదేవా నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమట. దీంతో ప్రభుదేవా తిరస్కరించిన ఆఫర్‌ను ఆయన అన్నయ్య, మరో ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం అందిపుచ్చుకున్నాడట. " జనతా గారేజ్" లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముంబైలో చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పాటకు ప్రభుదేవా డాన్స్ కంపోజింగ్ చేస్తున్నాడని, త్వరలోనే ఈ పాట చిత్రీకరణ జరగనుందని వార్తలొచ్చాయి. దీంతో ప్రభు సరికొత్త డ్యాన్స్ జనతా గ్యారేజ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ప్రభుదేవా నిర్ణయంతో వారంతా డీలాపడ్డారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమిళ హీరో మోహన్ లాల్ పెదనాన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
'బెయిల్ ఇవ్వడం కుదరదు.. 30 వరకు కస్టడీలోనే'
కోల్ కతా: ఫుల్లుగా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి యువ మిలటరీ అధికారిని ఢీకొట్టిన కేసులో నిందితులకు బెయిలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిని ఈ నెల(జనవరి) 30 వరకు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 13న రెడ్ రోడ్డు ఏరియాలో వైమానిక దళ సైనికులు రిహార్సల్స్ చేస్తుండగా సాంబియా సోహ్రాబ్, సోనూ అలియాస్ షానవాజ్ ఖాన్ వేగంగా ఆడి కారులో వెళుతూ అభిమన్యు గౌడ్ అనే సైనికుడిని ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోల్ కతా పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులు బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరించింది. వీరిలో సాంబియా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ సోహ్రాబ్ కుమారుడు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను మాయం చేయాలని ప్రయత్నించడం, హానీ కలిగించడంవంటి ఆరోపణల పేరిట కేసులు నమోదు చేశారు. -
ప్రేమను కాదన్నందుకు లారీ కిందకు..
యువతిని తోసేసిన ప్రేమోన్మాది ♦ డ్రైవర్ చాకచక్యంతో యువతికి తప్పిన ప్రాణాపాయం ♦ బంపర్ ఢీకొనడంతో ముఖం, తలకి గాయాలు ♦ పరారైన నిందితుడు ♦ ఖమ్మం జిల్లా ఇల్లెందులో దారుణం ఇల్లెందు: ప్రేమను నిరాకరించినందుకు ఓ ఉన్మాది వేగంగా వస్తున్న లారీ కిందకు యువతిని తోసేశాడు! లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పినా.. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలం బ్రహ్మణపల్లికి చెందిన గిరిజన విద్యార్థి బడె సంధ్య ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీజెడ్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్థానిక హాస్టల్లో ఉంటోంది. జూలూరుపాడు మండలం సుజాతనగర్ సమీపంలోని సత్యనారాయణపురానికి చెందిన శేఖర్ అనే యువకుడు సంధ్యను కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళ్తున్న సంధ్యను శేఖర్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని అడగడంతో సంధ్య నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన శేఖర్.. సంధ్య మెడ, చేతులను గట్టిగా అదిమి పట్టి ఎదురుగా ఐరన్‌లోడ్‌తో వెళ్తున్న లారీ ముందుకు నెట్టివేశాడు. వీరిద్దరినీ దూరం నుంచే గమనిస్తున్న డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు తప్పించాడు. ప్రాణాపాయం తప్పినా.. సంధ్యను లారీ బంపర్ ఢీకొనడంతో ముఖం, తల, ఛాతీ భాగాలపై బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోరుుంది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఆదివాసీ విద్యార్థి సంఘం నేత ఈసాల సురేశ్ ఓ ఆటోను నిలిపి సంధ్యను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లమంటూ డ్రైవర్‌ను పురామాయించాడు. అయితే ఆటో డ్రైవర్ నిరాకరించాడు. శేఖర్‌ను పట్టుకునేందుకు సురేశ్ ప్రయత్నించగా సమీపంలోని కొరగుట్ట అటవీ ప్రాంతంలోకి పారిపోయూడు. ఘటన విషయాన్ని సురేశ్ మీడియాకు చేర్చాడు. కాసేపటికే ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య, పోలీసులు అక్కడికి చేరుకొని గాయాలతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న సంధ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. నిందితుడు శేఖర్ నర్సరీలో పనిచేస్తాడని తెలిసింది. విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన ఈ ఘటనను నిరసిస్తూ ఏవీఎస్పీ, పీడీఎస్‌యూ, ఏఎస్పీ, టీఎన్ఎస్ఎఫ్, తుడుందెబ్బ, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఇల్లెందులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలన్నారు. -
డీకే అరుణ పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ: కేబినెట్ లో మహిళల స్థానంపై మాజీ మంత్రి డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్రం సహా మరో 7 రాష్ట్రాల్లో కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించలేదని డీకే అరుణ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ఈ అంశం ముఖ్యమంత్రుల పరిధిలోనిదని పిటిషన్ ను తిరస్కరించింది. కేబినెట్ లో మహిళలకు స్వచ్ఛందంగా స్థానం కల్పించి ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాగా సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలోనైనా సీఎం కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించాలని డికే అరుణ సూచించారు. -
'ఓటుకు కోట్లు'లో ఈసీ పిటిషన్ తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అనూహ్య పరిణామం సంభవిచింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను తెలుగుదేశం పార్టీ అధినేత సహా ఇతర నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఏసీబీ రికార్డు చేసిన ఆడియో, వీడియో రికార్డులను ఎన్నికల సంఘానికి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి లక్ష్మీపతి శనివారం తిరస్కరించారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినవ్యవహారానికి సంబంధించి ఏసీబీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర ఆడియో, వీడియో రికార్డులు ఇప్పించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ శ్రీదేవసేన అల్లంరాజు గత మూడు రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
'విస్తృత ధర్మాసనం’ విజ్ఞప్తికి సుప్రీం నో
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చెల్లుబాటు అంశాన్ని 9 మంది లేదా 11 మంది జడ్జీలున్న విస్తత ధర్మాసనానికి అప్పగించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీని యోగ్యతపై తొలుత తామే వాదనలు వింటామని, అనంతరం అవసరమైతే విస్తత ధర్మాసనానికి నివేదిస్తామని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. దీంతోపాటు త్వరలో హైకోర్టుల్లో పదవీకాలం పూర్తికానున్న అదనపు న్యాయమూర్తులు మరో మూడునెలలు కొనసాగేలా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
‘రైల్వే బడ్జెట్‌ను కేసీఆర్, బాబు తిరస్కరించాలి’
సాక్షి,హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపులు చేసి తెలుగు రాష్ట్రాలను కేంద్రం అవమానించిందని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బడ్జెట్‌ను తిరస్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు మొండి చేయి చూపినందుకు నిరసనగా రాష్ట్ర ఎంపీలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ నిరసన తెలపాలని అన్నారు. కేంద్ర మంత్రి పదవి కోసమే ఎంపీ కవిత ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. -
జీఎంఆర్‌కు ఈఆర్సీ షాక్!
సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయంలోని సెజ్ ప్రాంతానికి ప్రైవేటుగా విద్యుత్‌ను పంపిణీ చేసుకుంటామని, ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని ఈఆర్సీని జీఎంఆర్ కోరింది. అయితే ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలంటే విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14లో కొన్ని నిబంధనలున్నాయని.. ఈ నిబంధనలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ లేదని డిస్కంలు వాదించాయి. ఈ వాదనతో ఈఆర్సీ ఏకీభవించింది. సెక్షన్ 14 ప్రకారం ఏ కంపెనీకైనా విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాలంటే.. విద్యుత్ పంపిణీ చేసే ప్రాంత కనీస పరిధి మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ లేదా రెవెన్యూ జిల్లా (ఆపరేషన్ సర్కిల్) అయి ఉండాలి. అలాగైతేనే విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక కంపెనీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్లో స్పష్టంగా ఉంది. ఇందుకు పూర్తి భిన్నంగా కేవలం ఎయిర్‌పోర్టు ప్రాంతానికి మాత్రమే విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలని జీఎంఆర్ కోరింది. -
తిరస్కరణం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో భారీ సంఖ్య లో తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థి సంతకాలు లేకపోవడం, పూర్తి వివరాలు పొందుపర్చక పోవడం వంటి కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు కాగా, నాలుగు నామినేషన్లు తిరస్కరించారు. తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు 21 నామి తిరస్కరణకు గురైన వారు.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి రితేష్ రాథోడ్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతోపాటు ముస లి చిన్నయ్య, సిడాం గణపతి, రాథోడ్ శ్యామ్రావుల నా మినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అసెంబ్లీ స్తానాల్లో 65 నామినేషన్లు తిరస్కరించారు. మంచిర్యాల లో అరుణ, జి.వెంకటానంద్కృష్ణారావు, కొండేటి సత్యనారాయణ, బెల్లంకొండ మురళీధ ర్, రఘువీరన్, ఇఫ్తేఖార్ అహ్మద్, దీక్షిత్, నర్సయ్య, ఆర్.సునీల్, జె.సతీష్, పి.మధుసూదన్‌రావు నామినేషన్లను తిరస్కరిం చారు. అలాగే ఆసిఫాబాద్‌లో రితేష్ రాథోడ్, చారులత, భగవంత్‌రావు, పి.గోపి, మెస్రం శంకర్.. నిర్మల్‌లో అల్లేటి కవిత, కె.భూషణ్‌రెడ్డి, కూచాడి శ్రీదేవి, వి.రాజేం దర్‌రెడ్డి, ముథోల్‌లో ఓంప్రకాశ్ లడ్డ, ఎల్.నారాయణరెడ్డి, కాంబ్లే దిగంబర్.. సిర్పూర్లో కె.విజయ్‌కుమార్, కె.సాయిలీల, గొల్లపల్లి బుచ్చలింగం (రెండు నామినేష న్లు), పాల్వాయి రాజ్యలక్ష్మి, పి.హరీష్‌బాబు, ఎం.మెంగాజీపటేల్ (రెండు నామినేషన్లు), దుర్గం శ్యామ్‌రావు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్, చౌహాన్ ప్రేమలత, ఆత్రం భీంరావు, రవీందర్, శ్రావణ్‌కుమార్, చంద్రశేఖర్, జాదవ్ కృష్ణ, రోహిదాస్, టి.నగేష్, తొడసం నాగోరావు, జగన్, సిడాం శంభు, కుడ్మెత మాధవ్‌రావు, బి. అశోక్, బోథ్‌లో రాములు నాయక్, మెస్రం భీంరావు, మడావి సుమలత, పవార్ చందర్‌సింగ్, అర్క జ్యోతిరాం.. చెన్నూర్‌లో బోడ జనార్ధన్, శ్రీనివాస్, నల్లాల రాజలింగు, సరోజ, సైదాల లక్ష్మయ్య,మల్లయ్య, వి.రాజం, బెల్లంపల్లిలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. -
మీ బాస్మతీ మాకొద్దు!
ఎగుమతులు తిరస్కరిస్తున్న అమెరికా కాకర, బెండ, మిర్చి ఉత్పత్తులు కూడా.. పురుగు మందుల అవశేషాలే కారణం సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉంటున్న కారణంగా ఇటీవలి కాలంలో మన దేశానికి చెందిన వ్యవసాయోత్పత్తులు ఎగుమతికి నోచుకోక పోవడం ప్రభుత్వవర్గాలను కలవరపరుస్తోంది. అమెరికా ఆహార, పురుగుమందుల పర్యవేక్షణ శాఖ గణాంకాల మేరకు ఎక్కువ వ్యవసాయోత్పత్తులు తిరస్కరణకు గురవుతున్న దేశాల్లో మన దేశం చైనా తర్వాత రెండోస్థానంలో ఉంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడం కాగా...ఇలా తిరస్కరణకు గురైన సరుకులు దేశీయ మార్కెట్లో యథేచ్ఛగా చలామణి అవుతున్నాయి. వీటివల్ల వినియోగదారుల ఆరోగ్యానికి చేటు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పలు రకాల బియ్యం, కూరగాయలు కూడా ఈ విధంగా తిరస్కరణకు గురవుతున్నారుు. మన దేశ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు 1,500 కోట్ల డాలర్లు. అయితే 2013 నవంబర్‌లో 202 సందర్భాల్లో భారత వ్యవసాయోత్పత్తులను అమెరికా తిరస్కరించింది. ఎక్కువగా బాస్మతి బియ్యం తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో దాదాపు 13 కంపెనీలు ఎగుమతి చేసిన బాస్మతి, సోనామసూరి బియ్యాన్ని అమెరికా తిరస్కరించింది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో బాస్మతి పైరుపై అగ్గితెగులు నివారణకు ‘ట్రై సైక్లోజోల్’ మందును అధికంగా వాడుతున్నారని, ఈ కారణంగానే బియ్యం ఎగుమతులను అమెరికా తిరస్కరిస్తోందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా నిబంధనల ప్రకారం బాస్మతిలో ‘ట్రై సైక్లోజోల్’ అవశేషాలు 0.01 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కన్నా ఎక్కువ ఉండకూడదు. మనదేశం ఎగుమతి చేస్తున్న బియ్యంలో దీని అవశేషాలు ఈ పరిమితికి మించి ఉండటం వల్ల అవి తిరస్కరణకు గురవుతున్నాయి. అహార పదార్థాల్లో పురుగుమందుల అవశేషాలను నిర్ధారించే, నియంత్రించే విధివిధానాలే మనకు లేవు. దీంతో ఆ సరుకు యథేచ్ఛగా దేశీయ మార్కెట్లలో చలామణి అవుతుంది. దీని వల్ల దేశీయ వినియోగదారులకు కలిగే నష్టం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. -
అమెరికా ప్రతినిధి బృందంతో భేటీకి నో
నాగ్‌పూర్: న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయానిని అవమానించినందుకు నిరసనగా నాగ్‌పూర్ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడానికి రాష్ట్ర విధానసభ నిరాకరించింది. దేవయాని కోర్బాడేకి చేసిన అవమానానికి నిరసనగా అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవకూడదని బుధవారంనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. యువజనోత్సవాలకు మహారాష్ట్ర ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేయడానికి వచ్చిన ఈ బృందానికి నిరసన తెలపాలని ఎమ్మెల్యే ప్రణీతి షిండే శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. అమెరికా ప్రతినిధి బృందం మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్లతో పాటు మంత్రివర్గాన్ని, శాసనసభ సభ్యులను కలవాల్సి ఉంది. దేవయానిని అత్యంత అవమానకరంగా సోదా చేసినందుకు నిరసనగా ఈ బృందాన్ని ఎవ్వరూ కలవరాదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూతురు, మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు ప్రణీతి షిండే విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఏకనాథ్ ఖడ్సే మద్దతు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే, శివసేన సభ్యుడు నీలం ఘోరేలు కూడా తమ నిరసనను నమోదు చేశారు. మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ‘దేవయాని భారత విదేశాంగ శాఖలో సేవలందిస్తున్న వారిలో అత్యంత సమర్థురాలైన అధికారిణి అని పేర్కొన్నారు. పాక్ పర్యటన సందర్భంగా తాను దేవయానిని కలిసినట్లు సభకు వివరించారు. శాసనసభ, శాసన మండలుల సంయుక్త నిరసనను కేంద్రానికి తెలపాలని సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘేని కోరారు.