న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో వినియోగించిన 20 శాతం ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పుల ఫలితాలతో సరిపోల్చాలంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖకు చెందిన మహ్మద్ ఆరీఫ్ రాజ్‌పుత్.. 20 శాతం వీవీపాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసువేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈవీఎం–వీవీపాట్‌లో అవక తవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ నిర్థారించే వరకూ ఈ విషయంలో తాము కలుగజేసుకోలే మంది.
కేసును ఉపసంహరించుకోవాలని అయితే ఎన్నికల సంస్కరణల తర్వాత సమగ్ర పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంది. అయితే ఎన్నికల సంస్కరణలపై గుజరాత్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిశాక చర్చ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని ప్రజలకు తెలియ జేసేందుకు.. ప్రతి నియోజక వర్గంలో 20 శాతం బూత్‌ల్లో వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీపాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరారు. ఈసీ నిర్ణయం లేకుండా తాము ఈ విషయంలో కలుగుజేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment