petetion
-
వాచీలు, చెప్పులు, గాజులకు రూ.50 వేలు ఇవ్వాలి
సాక్షి, అమరావతి: భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తం సర్వత్రా సంచలనంగా మారింది. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో ఖర్చుల కింద ఆ మహిళ అడిగిన మొత్తానికి హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. నెల ఖర్చులు రూ.6.16 లక్షలా? అంటూ కర్ణాటక హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ఒంటరి మహిళ నెలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘ఈ స్థాయిలో ఆమె ఖర్చు చేయాలనుకుంటే భర్త సంపాదన మీద కాదు. ఆమెనే సంపాదించుకోమనండి. అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ఈ మహిళకు కుటుంబ బాధ్యతలు లేవు. అంత మొత్తం ఖర్చుల కిందే కావాలంటోంది. సింపుల్‌గా రూ.6.16 లక్షలు అడిగేసింది. భార్య ఎంత అడిగితే అంత భర్త నుంచి భరణం కింద ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయకుండా గట్టిగా సందేశం పంపాలని ఈ కోర్టు నిర్ణయించింది. భార్యతో విభేదాలు భర్తకు ఈ విధమైన పనిష్మెంట్గా మారకూడదు’ అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ అంత ఖర్చులు ఏమున్నాయని ఆ మహిళ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన వివరాలు హైకోర్టును షాక్‌కు గురి చేశాయి. భర్త విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అందువల్ల తన క్లయింట్ అయిన మహిళ కూడా అదే స్థాయిలో జీవితాన్ని ఆస్వాదించదలచుకున్నారని ఆ న్యాయవాది చెప్పారు.‘ఇల్లు, తిండి ఖర్చుకు రూ.40 వేలు.. వాచీలు, దండలు, గాజులు, చెప్పులు ఇలాంటి కనీస అవసరాలకు రూ.50 వేలు కావాలి. వైద్యం, కాస్మోటివ్ వంటి వాటి కోసం రూ.4 – 5 లక్షలు అవుతుంది. ఇవి కాక పిల్లల ఫీజులు అవీ ఉన్నాయి. అంతేకాక బంగారం రుణం తీర్చాలి. ఇలా అన్నింటికీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని ఆ న్యాయవాది చిట్టా విప్పారు. వాస్తవ అవసరాలు ఏమిటో చెప్పకుండా ఇలా విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చులు అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయనుకుంటున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భర్త సంపదన రూ.10 కోట్లు ఉందని, అందువల్ల తనకు రూ.5 కోట్లు కావాలని ఎవరైనా అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయా? అని నిలదీసింది. అసలు వాస్తవ ఖర్చులు ఏమిటో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6,16,300 ఖర్చుల కింద ఇప్పించేలా ఆదేశించాలంటూ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. అయితే వాస్తవ ఖర్చుల వివరాలు ఆమె సమర్పించక పోవడంతో ఆమె పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఢిల్లీ హైకోర్టుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అంజలి బిర్లా తన తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ పరీక్షల్ని తొలి ప్రయత్నంలో పాసయ్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజలి బిర్లా.. తన పరువు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court. She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father's influence.…— ANI (@ANI) July 23, 2024అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో పోస్టుల్లో అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లాఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. -
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు
ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఆదేశించినట్లుగా ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని, దాని ఆధారంగా కేసుతో ఎలాంటి సంబంధంలేని వారిని ఇరికించాలని దర్యాప్తు సంస్థ ప్రయతి్నస్తోందని వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధమని, అతడికి బెయిల్ ఇచ్చే సమయంలో కిందికోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దస్తగిరి చెప్పిన వివరాల అధారంగా తనతోపాటు మరి కొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు. ‘దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచి్చన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలు ఇవ్వాలి’అని అభ్యరి్థస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్లోనూ వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. ‘దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. హత్యకు ఆయుధాన్ని కొనుగోలు చేసింది అతడే. దస్తగిరికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ పూర్తిగా సహకరించింది. దస్తగిరిపై వాచ్‌మన్ రంగన్న చెప్పిన అంశాలను కిందికోర్టు పట్టించుకోలేదు’అని వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్లో మరికొన్ని అంశాలివీ.. అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చా.. నా వయసు సుమారు 73 ఏళ్లు. దీర్ఘకాలిక వెన్నునొప్పి, ఛాతీలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నా. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరయ్యా. దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద వివేకా వాచ్‌మన్ రంగన్న స్టేట్మెంట్ను దర్యాప్తు సంస్థ రికార్డ్ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం వంటి శబ్దాలు వినపడటంతో లేచి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. లోపలి నుంచి ఏడుపు లాంటి శబ్దం వినిపించడంతో పార్క్ వైపు ఉన్న ద్వారం వద్దకు వెళ్లి పక్కనే ఉన్న కిటికీ లోంచి లోపలికి చూశాడు. ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వాళ్లు హాల్లో ఏదో వెతుకుతూ కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌గా గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్ వైపు ద్వారం తెరిచి సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్ హడావుడిగా వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. అక్కడ దొరికిన ఆధారాల మేరకే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మమ్మల్ని ఇరికించే ప్రయత్నం.. ఆ నలుగురే ఈ హత్య చేసినట్లు రంగన్న స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెబుతున్నా ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేని నాతోపాటు మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఇరికించేందుకు దర్యాప్తు సంస్థ అక్రమ పద్ధతులను అనుసరిస్తోంది. వివేకా కుమార్తె సునీత, దర్యాప్తు అధికారులు వారికి తోచిన చట్టవిరుద్ధ ప్రక్రియలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే దస్తగిరికి కొన్ని సూచనలు చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో దస్తగిరి.. ఏ–5(శివశంకర్‌రెడ్డి)తో పాటు నాపై, మరో ఇద్దరిపై నిరాధార ఆరోపణలు చేశాడు. సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మరో ఇద్దరికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దస్తగిరి గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చేసుకుని సీబీఐ నాపై ఆరోపణలు మోపుతోంది. నాకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అనుసరించిన విధానం పూర్తిగా చట్టవిరుద్ధం. హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. దస్తగిరి చెప్పిన దానికి ఎలాంటి సాక్ష్యం లేదు. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీ రిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా కీలక పాత్ర పోషించిన దస్తగిరికి మాత్రం బెయిల్ ఇవ్వడం సరికాదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. ఆయుధాన్ని తెచ్చానని, హత్యలో ప్రధాన పాత్ర పోషించానని కూడా ఒప్పుకున్నాడు. ఈ అంశాన్ని కిందికోర్టు మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదు. బెయిల్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. అప్రూవర్‌గా మారడం, బెయిల్ ఇవ్వ డం అంతా చట్టవిరుద్ధంగానే జరిగింది. బెయిల్ మంజూరు చేస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా నన్ను నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
ఎమ్మెల్యేల కేసులో హైలైట్ ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీరు ముగ్గురు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. మొదటి నుంచి సిట్ విచారణను హాజరుకాలేదు. అంతేకాకుండా, తమపై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలుచేయడంతో వారి మద్దతుగానే కోర్టు సైతం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఏసీబీ కోర్టు మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది. -
తమిళనాడులో ట్విస్ట్.. జయలలిత సోదరుడినంటూ కోర్టులో పిటిషన్
తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు. తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు. కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. -
అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Plea moved in Supreme Court seeking directions to setup a Special Investigation Team (SIT) to enquire about the violent protests against the #AgnipathRecruitmentScheme launched by the Govt, and to enquire about the damage caused to the public property including that of Railways. pic.twitter.com/UOYDr9Xt0L — ANI (@ANI) June 18, 2022 -
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
స్పైస్‌జెట్ దివాలా పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటిషన్ ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ఏటీ) తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధి ంచిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను స్పైస్‌జెట్‌కు పంపినట్లు గానీ లేదా స్పైస్‌జెట్ వాటిని అందుకున్నట్లు గానీ దాఖలాలేమీ లేవని తెలిపింది. -
నటుడు ధనుష్‌పై మళ్లీ కేసు
చెన్నై, పెరంబూరు: నటుడు ధనుష్ తన కుమారుడని ఇంతకు ముందు మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్ష్మి దంపతులు చెన్నై హైకోర్టు శాఖ మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కధిరేశన్ దంపతుల వాదనలో నిజం లేదం టూ నటుడు ధనుష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు, ప్రతి వాదనలు విన్న మదురై న్యాయస్థానం కధిరేశన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. అయినా కధిరేశన్ పట్టువిడువని విక్రమార్కుడిలా ధనుష్‌పై పోరాడుతూనే ఉన్నాడు. ఆయన తాజాగా మదురై జేఎం.6 కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు ధనుష్ తన కుమారుడేనని, ఈ విషయమై మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ధనుష్ బర్త్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ తదితర నకిలీవి కోర్టుకు సమర్పించాడని పేర్కొన్నారు. ఈ విషయమై మధురై పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నకిలీ ఆధారా లతో తప్పించుకున్న నటుడు ధనుష్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు నవంబర్ 9న విచారణకు రానుంది. -
ఎవరీ స్వప్నారెడ్డి?
జోగిపేట (అందోల్): గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతున్నాయ ని, ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని అందోల్ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్ స్వప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించి ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమ వారం తేల్చిచెప్పింది. దీంతో స్వప్నారెడ్డి పేరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు ఈ స్వప్నారెడ్డి ఎవరు? అని ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ స్పందించి సర్పంచ్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌గా సీఎం ప్రస్తావించడంతో స్థానిక నాయకులు చర్చించుకున్నారు. ఎన్నికలు ఆపాలన్న ఉద్దేశం లేదు.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలన్న ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘనకు గురవుతోందనే పిటిషన్ వేశాం. ఒకవేళ దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే నేను కూడా సుప్రీంకు వెళ్లి 50% మించకుండా చూడాలని కోరతాను. – స్వప్నారెడ్డి -
నల్ల కోటు.. ఖరీదైన ఓటు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ కావచ్చు.. పార్లమెంటు.. కావచ్చు ఏ ఎన్నికలైనా కరెన్సీ కట్టలు కట్టలుగా ఖర్చుకావాల్సిందే. అయితే ఈరకమైన కరెన్సీ కట్టల భాగోతం ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సైతం చొరబడింది. ‘నల్లకోటు’ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.30 వేలు పలుకుతున్నట్లు సమాచారం. తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటుకు నోటుపై విజయనారాయణన్ అనే న్యాయవాది మదురై హైకోర్టు శాఖలో శుక్రవారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు కృపాకరన్, ధరణి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలను మించిపోయినట్లుగా భావించాల్సి వస్తున్నదని వారు వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా నగదు చలామణిపై అవసరమైన ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘాపెట్టి కరెన్సీని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సక్రమంగా జరగలేదని పిటిషన్ వేసే న్యాయవాదులే నేడు నగదు చలామణికి సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరు ఎవరిని తప్పుపడతారని ప్రశ్నించారు. పదవి, అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశ రాజకీయ నేతల్లో పెరిగిపోవడంతో నోటును విసిరి ఓటును పట్టుకుంటున్నారు, ఇది మన కళ్ల ముందు అనాథిగా కనపడే సత్యమని అన్నారు. అయితే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సైతం రాజకీయపార్టీల విధానం అలవడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 230 న్యాయవాదుల సంఘాలు ఉండగా, అన్ని సంఘాలు 1961లో ఏర్పడిన మద్రాసు హైకోర్టులోని బార్ కౌన్సిల్ పరిధిలోకే వస్తాయి. ఎంతో అధికారంతో కూడిన పదవి కావడంవల్లనే బార్ కౌన్సిల్ ఎన్నికలు రానురానూ ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. మద్రాసు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అఖిలభారత బార్ కౌన్సిల్ ప్రతినిధికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్లో ఓటున్న న్యాయవాదులు ముందుగా 25 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఈ 25 మంది సభ్యులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎంపికైన 25 మందిలో 13 మంది సభ్యులు ఎవరివైపు ఉంటారో అతనే అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఆ తరువాత ఒక సాధారణ న్యాయవాదిగా చలామణి కాడు. అతనికంటూ ఒక పెద్ద కార్యాలయం, కింద పనిచేసే సిబ్బంది ఉంటారు. న్యాయవాదుల మధ్యలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడికి లభించే గౌరవమర్యాదలే ప్రత్యేకంగా ఉంటాయి. గౌరవం మాత్రమే కాదు గొప్ప అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం, న్యాయమూర్తులుగా ఎన్నికైన వారికి సచ్చీల సర్టిఫికెట్ జారీచేసే అధికారం ఉంటుంది. బార్ కౌన్సిల్లో చేర్చుకోవడం, నిరాకరించే అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సహకారం చెల్లించడం అధ్యక్షుని చేతుల్లోనే ఉంటుంది. ఇంతటి అధికారాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టే పోటాపోటీగా నోట్లు వెదజల్లైనా ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధం అవుతున్నారు. రెండేళ్ల క్రితం జరగాల్సిన ఎన్నికలను వాయిదావేస్తూ పోతుండడంతో కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీచేయడంతో వచ్చేనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పర్యవేక్షణలోనే బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నందున అక్రమాలు చోటుచేసుకుంటే వేటు తప్పదనే భయం కూడా సభ్యుల్లో ఉంది. -
వీవీపాట్లపై కలుగజేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో వినియోగించిన 20 శాతం ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పుల ఫలితాలతో సరిపోల్చాలంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖకు చెందిన మహ్మద్ ఆరీఫ్ రాజ్‌పుత్.. 20 శాతం వీవీపాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసువేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈవీఎం–వీవీపాట్‌లో అవక తవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ నిర్థారించే వరకూ ఈ విషయంలో తాము కలుగజేసుకోలే మంది. కేసును ఉపసంహరించుకోవాలని అయితే ఎన్నికల సంస్కరణల తర్వాత సమగ్ర పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంది. అయితే ఎన్నికల సంస్కరణలపై గుజరాత్లో ఎన్నికల ప్రక్రియ ముగిశాక చర్చ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని ప్రజలకు తెలియ జేసేందుకు.. ప్రతి నియోజక వర్గంలో 20 శాతం బూత్‌ల్లో వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీపాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరారు. ఈసీ నిర్ణయం లేకుండా తాము ఈ విషయంలో కలుగుజేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
నిర్బంధంపై కోర్టుకు..
లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం తమను గృహనిర్బంధం చేయడంపై జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ సహా మరో నలుగురు లాహోర్ కోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. సీనియర్ న్యాయవాది ఏకే దోగర్ ద్వారా హఫీజ్ సయీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుర్ రహమాన్, మాలిక్ జాఫర్ రెహమాన్ అబిద్, కాజీ కషీఫ్ హుస్సేన్, అబ్దుల్లా ఉబాయిద్‌ల నిర్బంధాన్ని కోర్టులో చాలెంజ్ చేశారు. గృహనిర్బంధంపై ఫిబ్రవరి ప్రారంభంలోనే పిటిషన్ దాఖలు చేసినా టెక్నికల్ గ్రౌండ్స్ లేకపోవడం లాహోర్ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయాద్, మరో నలుగురిని పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. మంగళవారం సయీద్‌కు ఉన్న ఆయుధ లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎన్ కౌన్సిల్ ఆదేశాల మేరకే సయీద్‌ను 90రోజుల పాటు గృహనిర్బంధం చేస్తున్నట్లు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. కాగా, పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులకు కారణం సయీద్ అనే ఆరోపణలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సయీద్‌ను నిర్బంధించింది. అప్పట్లో లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సయీద్.. నిర్బంధం నుంచి బయటకు వచ్చాడు. అమెరికాలో సయీద్‌పై రూ.10 లక్షల డాలర్ల రివార్డు ఉంది.