నిర్బంధంపై కోర్టుకు..
నిర్బంధంపై కోర్టుకు..
Published Wed, Feb 22 2017 10:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం తమను గృహనిర్బంధం చేయడంపై జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ సహా మరో నలుగురు లాహోర్ కోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. సీనియర్ న్యాయవాది ఏకే దోగర్ ద్వారా హఫీజ్ సయీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుర్ రహమాన్, మాలిక్ జాఫర్ రెహమాన్ అబిద్, కాజీ కషీఫ్ హుస్సేన్, అబ్దుల్లా ఉబాయిద్‌ల నిర్బంధాన్ని కోర్టులో చాలెంజ్ చేశారు. గృహనిర్బంధంపై ఫిబ్రవరి ప్రారంభంలోనే పిటిషన్ దాఖలు చేసినా టెక్నికల్ గ్రౌండ్స్ లేకపోవడం లాహోర్ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయాద్, మరో నలుగురిని పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. మంగళవారం సయీద్‌కు ఉన్న ఆయుధ లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎన్ కౌన్సిల్ ఆదేశాల మేరకే సయీద్‌ను 90రోజుల పాటు గృహనిర్బంధం చేస్తున్నట్లు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. కాగా, పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులకు కారణం సయీద్ అనే ఆరోపణలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సయీద్‌ను నిర్బంధించింది. అప్పట్లో లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సయీద్.. నిర్బంధం నుంచి బయటకు వచ్చాడు. అమెరికాలో సయీద్‌పై రూ.10 లక్షల డాలర్ల రివార్డు ఉంది.
Advertisement
Advertisement