ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్‌ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్‌పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్.. భారత్, అమెరికాకు భంగపాటు
Comments
Please login to add a commentAdd a comment