lahore court
-
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్‌ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్‌పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్.. భారత్, అమెరికాకు భంగపాటు -
మరోసారి చిక్కుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని గతంలో హమీజా ముఖ్తార్ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆజంతో పాటు పలువురు వ్యక్తులు తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు ఆ మహిళ మరో కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన లాహోర్‌లోని సెషన్స్ కోర్టు.. బాబర్ అజమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన సైబర్ క్రైమ్ సర్కిల్‌ను ఆదేశించింది. తనకు బెదిరింపులు వస్తున్నట్లు హమ్జా ఫిర్యాదు చేసిన తర్వాత తాము ఫిర్యాదు చేశామని, ఆ ఫోన్ నంబర్లలో ఒకటి బాబర్ ఆజంపై పేరుపై ఉన్నదని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. మరో రెండు నంబర్లు ఇద్దరు మహిళలకు చెందినవిగా గుర్తించారు. దీనిపై బాబర్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఎఫ్ఐఏ కొంతకాలం ఆగాలని అతని తరఫున హాజరైన సోదరుడు ఫైజల్ ఆజం కోరాడని, అయితే ఇప్పటి వరకూ బాబర్ మాత్రం రాలేని తన రిపోర్ట్‌లో ఎఫ్ఐఏ వెల్లడించింది. దీంతో బాబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. గతంలో హమీజా ముఖ్తార్ ఫిర్యాదుపై బాబర్‌పై కేసు నమోదు చేయాలన్న సెషన్స్ కోర్టు ఆదేశాలను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అయితే తాజాగా బెదిరింపుల అంశంలో మరోసారి బాబర్‌పై కేసు నమోదు చేయాలని సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బాబర్ అజమ్ పాక్ తరపున 31 టెస్టుల్లో 2167 పరుగులు, 77 వన్డేల్లో 3580 పరుగులు, 47 టీ20ల్లో 1730 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బాబర్ అజమ్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: 'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు' 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా' -
లైంగిక ఆరోపణలు.. పాక్ కెప్టెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్ అనే మహిళ, బాబర్ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడన్నది. ఆ తర్వాత తనను వదిలించుకోవాలని చూశాడని.. అంతేకాక ఓ సారి తనకు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హమీజా తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నసీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను ఆదేశించారు. (చదవండి: 'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు' ) ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించింది. దాంతో మరో అదనపు సెషన్స్ జడ్జి అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. నసీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, వివాహ పునః భరోసాపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాబర్ తనను బలవంతం చేశాడని హమీజా ఆరోపించింది. బొటనవేలు గాయం కారణంగా న్యూజిలాండ్‌లో మొత్తం సిరీస్‌ను కోల్పోయిన బాబర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్, టీ 20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. -
హఫీజ్ సయీద్‌కు కఠిన కారాగార శిక్ష
లాహోర్: ముంబై దాడుల్లో మాస్టర్ మైండ్, నిషేధిత జమాత్ –ఉద్–దవా(జుద్) చీఫ్, హఫీజ్ సయీద్‌కి పాక్‌లోని లాహోర్‌లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్‌కి 21 ఏళ్ళ శిక్ష పడింది. గురువారం సయీద్ సహా జమాత్–ఉద్–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్‌కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. కాగా, 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. -
మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసేందుకు పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) డైరెక్టర్ జనరల్ షహ్జాద్ సలీం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు ఈ రెండు కేసులను ఎన్ఏబీ లాహోర్ ఛైర్మన్ జస్టిస్ (ఆర్) జావేద్ ఇక్బాల్ అనుమతి కోసం పంపనున్నుట్లు అధికారులు తెలిపారు. ‘షరీఫ్ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసులు ఎన్ఏబీ చైర్మన్ ఆమోదం పొందిన తరువాత వచ్చే వారం లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయబడతాయి’ అని ఒక అధికారి పీటీఐకి చెప్పారు. ‘జియో’ గ్రూప్ గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు ట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. -
నిర్బంధంపై కోర్టుకు..
లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం తమను గృహనిర్బంధం చేయడంపై జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ సహా మరో నలుగురు లాహోర్ కోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. సీనియర్ న్యాయవాది ఏకే దోగర్ ద్వారా హఫీజ్ సయీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుర్ రహమాన్, మాలిక్ జాఫర్ రెహమాన్ అబిద్, కాజీ కషీఫ్ హుస్సేన్, అబ్దుల్లా ఉబాయిద్‌ల నిర్బంధాన్ని కోర్టులో చాలెంజ్ చేశారు. గృహనిర్బంధంపై ఫిబ్రవరి ప్రారంభంలోనే పిటిషన్ దాఖలు చేసినా టెక్నికల్ గ్రౌండ్స్ లేకపోవడం లాహోర్ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయాద్, మరో నలుగురిని పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. మంగళవారం సయీద్‌కు ఉన్న ఆయుధ లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎన్ కౌన్సిల్ ఆదేశాల మేరకే సయీద్‌ను 90రోజుల పాటు గృహనిర్బంధం చేస్తున్నట్లు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. కాగా, పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులకు కారణం సయీద్ అనే ఆరోపణలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సయీద్‌ను నిర్బంధించింది. అప్పట్లో లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సయీద్.. నిర్బంధం నుంచి బయటకు వచ్చాడు. అమెరికాలో సయీద్‌పై రూ.10 లక్షల డాలర్ల రివార్డు ఉంది.