pti party
-
పాకిస్తాన్ లో హై అలర్ట్.. అమెరికా పౌరులకు హెచ్చరికలు జారీ
వాషింగ్టన్: పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు తలపెట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న అమెరికా పౌరులను ఆ దేశ అడ్వైజరీ హెచ్చరించింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులను అడ్వైజరీ హెచ్చరించింది. తమ దేశ పౌరులు పెషావర్‌లోని సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచనలు చేసింది. అయితే, సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ వరకు తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మరణించగా.. మరికొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. దీంతో, దాదాపు పదివేల మంది పీటీఐ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
PAK: పీటీఐ నిరసనలు.. ట్విస్ట్ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ భార్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్ వేళ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ విడుదల డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు నిరసనలకు దిగారు.ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, సన్నిహితుడు.. మద్దతుదారులకు హ్యాండ్ ఇచ్చారు. నిరసనల వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. దీంతో, నిరసనకారులు వెనుదిరిగినట్టు అక్కడి మీడియా పేర్కొంది.ఇక, ఇమ్రాన్ ను విడుదల చేయాలంటూ బుష్రా బీబీ, ఆయన సన్నిహితుడు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ నేతృత్వంలోపీటీఐ మద్దతుదారులు ఆదివారం నుంచి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. పదుల సంఖ్యలో మద్దతుదారులు గాయపడ్డారు. మరోవైపు.. పోలీసుల కాల్పుల హెచ్చరికల నేపథ్యంలో బుష్రా బీబీ, ఖైబర్ నిరసనల నుంచి పారిపోయారు. అక్కడే ఉండి నిరసనలు కొనసాగించాలని పార్టీ మద్దతుదారులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారిద్దరూ దొంగచాటుగా ట్రక్కులో పారిపోవడం గమనార్హం. ఈ క్రమంలో వారిపై పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Pakistan: నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధంయలో ఈ నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో పీటీఐ పార్టీ ఆందోళనలకు స్వస్త పలుకుతున్నట్లు ప్రకటించింది. పీటీఐ నిసరనల నేపధ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌తో ఆ పరిసర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేధ్యంలో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. దీంతో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి వ్యూహం ఏమిటనేది పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను పీటీఐ ‘ఫాసిస్ట్ మిలిటరీ పాలన’ చేపట్టిన జాతి నిర్మూలన ప్రయత్నంగా అభివర్ణించింది.ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పీటీఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని ఆరోపించారు. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో భద్రతా దళాలు మారణహోమం కోసం ప్రయత్నించాయని పీటీఐ ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాణ్ నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలకు చివరి పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం' -
ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట.. నిర్దోషిగా ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షైస్టా కుండి ఇమ్రాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోని లోహిభైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయన మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది నయీ పంజోథా వాదనలు వినిపించారు. తన క్లైంట్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఇమ్రాన్‌ఖాన్‌పై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా నమోదు చేశారని తెలిపారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయటం, సమాచారం అందించటం లేదని పేర్కొన్నారు. ఇక..ఫిర్యాదుదారుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)అని.. కేసు నమోదు చేసే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా ఇమ్రాన్‌ఖాన్‌పై దాఖలైన కేసుల్లో ఏ సాక్షి స్టేట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తోషాఖానా, ఇద్దత్ (ఇస్లామేతర వివాహం), ప్రభుత్వ రహస్య పత్రాల లీక్ తదితర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ‘లాంగ్ మార్చ్’ చేపట్టిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్ క్లియర్!.. ప్రధాని ఆయనేనా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పాక్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపిస్తున్న వేళ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అధికార ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య డీల్ కుదిరింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒప్పందంతో వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మార్చి తొమ్మిదో తేదీలోగా పాక్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని న్యూస్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది. ఇక, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిన తీర్పు
పాకిస్తాన్ తర్వాతి ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. నాలుగోసారి ప్రధాని అవుతారని భావించిన నవాజ్ షరీఫ్ ఉన్నట్టుండి తన సోదరుడు షెహబాజ్ పేరును ముందుకు తెచ్చారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఇక, ఈ ఎన్నికలు పాక్‌లో సైన్యం ప్రాబల్యం తగ్గిందని సంకేతిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. ఆ దేశంతో మన సంబంధాలు సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండవు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ మనకు చాలా కీలకం. ఇస్లామిక్ రిపబ్లిక్ గమ్యానికి మధ్యవర్తిగా తన ప్రాబల్యాన్ని పాకిస్తాన్ సైన్యం రాను రానూ కోల్పోతోందని ఇటీవలే ముగిసిన ఆ దేశ ఎన్నికలకు చెందిన ఆశ్చర్యకరమైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశాన్ని వాస్తవంగా నడిపిన మయన్మార్ సైన్యం... ఇప్పటి వరకూ ప్రజాస్వామ్య, వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడుతూ వచ్చినప్పటికీ వెనుకపట్టు పడుతోంది. మన దేశ తూర్పు సరిహద్దులలో జరుగుతున్న దానితో పోలిస్తే పాకిస్తాన్ పరిణామాలు కూడా మరీ భిన్నమైనవేమీ కాదు. ప్రస్తుత తరుణంలో రాబోయే కాలంలో పాక్ రాజకీయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో చెప్పడం కష్టమే. నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్– నవాజ్’(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’(పీపీపీ) కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్యలు అలాగే ఉంటాయి. ఇమ్రాన్ పార్టీని అణిచివేసేందుకు ఉద్దేశించిన చర్యలను ఆ పార్టీ నామినీలు అధిగమించి అత్యుత్తమ పనితీరు కనబరిచారు. అసమానతలకు వ్యతిరేకంగా వారు ప్రదర్శించిన పోరాట పటిమ మన దేశ ప్రతిపక్షానికి కూడా ప్రేరణగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ఫలితాలను చూస్తే పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత, ఆయన పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, పాకిస్తాన్ పంజాబ్‌లోని సైనిక స్థావరాలపై కూడా దాడి చేసిన సంఘటనలను గుర్తు చేసుకోండి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. పాకిస్తాన్ ప్రభు త్వంతో మన సంబంధాలు తీవ్రమైన సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండలేవు. పాకిస్తాన్ తనకుతాను మునిగిపోనీ లేదా తేలియాడనీ అని భావించేవారు నిజంగానే భ్రమలో ఉన్నారు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా సరే, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ అనేవి మన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. భారత్, పాకిస్తాన్ సంబంధాలు ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ జిహాదీల చొరబాట్లు, వారి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి చేరువ కావడానికి ప్రయత్నించింది. ఈలోగా, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’(ఎఫ్ఏటీఎఫ్) ఒత్తిడితో, హఫీజ్ సయీద్(లష్కర్–ఎ–తైయబా సహ వ్యవస్థాపకుడు)కు పాక్ 31 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే (లష్కర్–ఎ–తైయబా మరో వ్యవస్థాపకుడు) జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి కూడా వరుసగా మూడు ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. ఇక, 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మీర్‌ను కూడా పాకిస్తాన్ ‘దొరికించుకుని’ దోషిగా నిర్ధారించింది. 2023 జనవరిలో, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ తమ్ముడు) దేశంలో అంధకార స్థితి మధ్య ‘మేము మా గుణపాఠం నేర్చుకున్నాము. మా నిజమైన సమస్యలను పరిష్కరించు కోగలిగితే, మేము భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము’ అని ప్రకటించారు. కానీ మరుసటి రోజే, కశ్మీర్ రాజ్యాంగ హోదాను భారతదేశం పునరుద్ధరించనంత వరకూ ఎటువంటి సంభా షణా సాధ్యం కాదని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ తర్వాత, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆర్టికల్ 370 రద్దును మన సుప్రీం కోర్ట్ సమర్థించింది. జమ్మూ – కశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా పిలుపునిచ్చింది. కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లేని కొత్త సరిహద్దులను కలిగి ఉంటుంది. వాస్తవానికి, పుల్వామాలో సైనికులపై దాడి, ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ముందే, రెండు దేశాలు ఐఎస్ఐ(పాకిస్తాన్ గూఢచార సంస్థ) మాజీ డిప్యూటీ చీఫ్‌తోనూ, భారతీయ ఇంటెలిజెన్ ్స అధికారితోనూ తెరవెనుక సంభా షణను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. తర్వాత, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఒకానొక గల్ఫ్ దేశంలో అప్పటి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను కలిశారు. 2021లో ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనకూ, సింధ్‌లోని హింగ్లాజ్ మాతా ఆలయాన్ని సందర్శించడానికీ ప్రణాళికలు రూపొందాయి. కానీ అంతలోనే పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2022లో, ఆయన పదవి నుండి తొలగించబడ్డారు. మోదీ, నవాజ్ షరీఫ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆ సంబంధాల సూత్రాలను ఎంచుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. 2015లో ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారత ప్రధాని లాహోర్‌లో దిగి నప్పటి నుంచీ చాలా పరిణామాలే జరిగాయి. ముఖ్యంగా, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, తీవ్రవాద దాడి జరిగినప్పుడు పాక్‌పై దాడి చేయడానికి న్యూఢిల్లీ వెనుకాడదని స్పష్టంగా సూచించింది. భారత్ కంటే పాకిస్తాన్‌కే ఇప్పుడు శాంతియుత సరిహద్దు అవసరం. దాని ఆర్థిక పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది; జిహాదీ తీవ్రవాద ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది; అంతర్జా తీయ సమాజం దాని పగ్గాలను బిగించడానికి ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ను ఉపయోగిస్తోంది. పైగా, అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అధికార స్వీకారం నుండి ఆశించిన ప్రయోజనాలు కార్యరూపం దాల్చలేదు. బదులుగా ఇరాన్ తో పాకిస్తాన్ ప్రమాదకరమైన గొడవకు దిగింది. అమెరికా, చైనా తమ సొంత కారణాల వల్ల, పాకిస్తాన్ లో ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక ఆరోగ్యం చాలా అవసరం. కాబట్టే, ఈ రెండు దేశాలూ, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మాత్రమే కాకుండా, పాక్–అఫ్గాన్ ప్రాంతం తీవ్ర వాదులకు పుట్టిల్లు కాకుండా ఉండే వాతావరణాన్ని కోరుకుంటు న్నాయి. తన బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) పెట్టుబడులు ఉన్నప్పటికీ, తాను మాత్రమే పాకిస్తాన్ ఆర్థిక శ్రేయస్సుకు హామీ ఇవ్వలేననీ, ఇతర దేశాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలనీ చైనా గ్రహించింది. అమె రికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్నదనీ, వాషింగ్టన్ కూడా పాక్‌లో లోతైన ప్రయోజనాలను కలిగి ఉందనీ కూడా చైనీయులకు తెలుసు. ఇస్లామిక్ స్టేట్ బలపడుతున్న అఫ్గాని స్తాన్‌లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన సాధనం. సైనిక కోణంలో భారత్ విషయానికొస్తే, భారతదేశ చర్యలు గత మూడేళ్లలో పాకిస్తాన్ నుండి చైనా వైపు దృష్టిని మరల్చినట్లు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దును ప్రశాంతంగా ఉంచడం భారతదేశ ప్రయోజనాలలో భాగం. పాకిస్తాన్ మూలంలోనే పూర్తిగా గడబిడ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి బ్యాక్ ఛానల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి చర్చలు ప్రారంభించడమే మార్గం. ప్రబలమైన ఘర్షణను తగ్గించడం, రెండు దేశాల మధ్య సంబంధాలకు గానూ కొత్త విధానాన్ని రూపొందించడం తదుపరి కర్తవ్యం. మనోజ్ జోషీ వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్న గందరగోళం నడుమ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చారు. అశేష సంఖ్యాక మద్దతుదారుల నడుమ.. తమ పార్టీ పీఎంఎల్-ఎన్(పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్) ఘన విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే.. పాక్ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకముందే.. షరీఫ్ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు.. అత్యధిక స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని, సంక్షోభంతో గాయపడ్డ పాక్‌ను పునరుద్ధరించేందుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని.. ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని కోరడం గమనార్హం. ఇందుకోసం పీపీపీ(Pakistan Peoples Party) నేత పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారినీ సైతం ఆయన ఆహ్వానించారు. అంటే పాక్ ఎన్నికల ఫలితాలు దాదాపు హంగ్ అనే సంకేతాను షరీఫ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రపంచంతో సంబంధాలు బలోపేతం కోసం త్వరలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారాయన. #WATCH | Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "...We want our relations with the world to be better...We will improve our relations with them and resolve all our issues with them..." (Video: Reuters) pic.twitter.com/MJbxcV2Dox — ANI (@ANI) February 9, 2024 Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "We congratulate you all because, with God's blessings, Pakistan Muslim League (N) has emerged as the largest party...We respect the mandate given to every party...We invite them to sit with us… pic.twitter.com/im2DqIDeRG — ANI (@ANI) February 9, 2024 కానీ, ఎన్నికల్లో పీఎల్‌ఎం-ఎన్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందనేది షరీఫ్ స్పష్టంగా చెప్పలేదు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు రావాలి. అయితే.. పాక్ ఈసీ ప్యానెల్లో మాత్రం పీఎంఎల్-ఎన్ 61 స్థానాల దగ్గరే ఉందని తెలుస్తోంది. అయితే పాక్‌లో ఎన్నికల ఫలితాలపై.. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం ఒక స్పష్టత రావొచ్చు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ మద్దతుదారులు(స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి) అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు రోజంతా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఇటు షరీఫ్ ప్రకటనను.. అటు ఇమ్రాన్ మద్దతుదారుల ప్రకటనను దేనిని ధృవీకరించకపోవడం గమనార్హం. సంబంధిత వార్త: నెట్ కట్ చేస్తే.. ట్విస్టులు.. ఝలక్‌లు -
Pakistan Elections: పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్థాన్ ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ప్రతి ఫలితం తామే అఖండ మెజారిటీతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నాయంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించింది. ఈమేరకు పీటీఐ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ ప్రజల స్పష్టమైన తీర్పును తారుమారు చేస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘనలు జరిగిప్పటికీ, పోలింగ్ రోజున భారీ ఓటింగ్ జరిగింది. ప్రతి ఫలితం పీటీఐ భారీ గెలుపును సూచిస్తోంది. ఫారం 45లే ఎన్నికల ఫలితాలకు ప్రాథమిక మూలం. మా పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఆ ఫారం కాపీలు మేము భారీ మెజారిటీతో గెలిచినట్లు చూపుతున్నాయి. అయితే రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47లతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు" అని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పీటీఐ పార్టీ ఆరోపించింది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెలిపింది. రిగ్గింగ్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. ఫలితాల ట్రెండ్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాణ్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ పీఎంఎల్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది. కాగా, పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. మిగతా 70 సీట్లను మైనార్టీలు, మహిళలకు కేటాయించారు. -
పాక్‌లో ఎన్నికల ప్రహసనం
సైన్యం పడగనీడలో ఎన్నికల తంతుకు పాకిస్తాన్ సిద్ధమైంది. జాతీయ అసెంబ్లీకి గురువారం జరిగే పోలింగ్‌లో గెలిచేదెవరో ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎప్పటిలాగే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకొచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సైన్యం ఆగ్రహంతో వుంది. ఫలితంగా పదవి కోల్పోయి రెండు అవినీతి కేసుల్లో పదేళ్లు, పద్నాలుగేళ్ల్ల చొప్పున శిక్షపడి ఆయన జైలుపాలయ్యారు. చట్టవిరుద్ధంగా పెళ్లాడిన కేసులో మరో ఏడేళ్ల శిక్ష కూడా పడింది. భార్య సైతం ఈ కేసులో జైలుకు పోయారు. ఎలాగైతేనేం సకాలంలోనే ఎన్నికల తంతు మొదలైంది. ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఏటికి ఎదురీదుతోంది. పీటీఐకి న్యాయస్థానాల పుణ్యమా అని బ్యాట్ గుర్తు గల్లంతుకాగా, పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలో వున్నారు. పీటీఐ అభ్యర్థినని చెప్పుకున్నవారిని సైన్యం అరెస్టు చేసింది. వారి ఇళ్లపై దాడులకు తెగబడింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన వెంటనే అజ్ఞాతంలోకి పోగా, ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థుల కుటుంబాలకు సైతం వేధింపులు తప్పలేదు. కొందరు అభ్యర్థులు పీటీఐతో తెగదెంపులు చేసుకున్నామని ప్రకటించి, బతుకుజీవుడా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొన్న జరిగిన పీటీఐ ఎన్నికల ప్రచారసభలో వేదికపై రెండు డజన్లమంది బిక్కుబిక్కుమని కూర్చోగా, ఆ సభకు కనీసం మైక్ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదనీ, పోస్టర్లు వేయనీయలేదనీ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం. యధాప్రకారం ఇక్కడి అభ్యర్థి కూడా కేసుల్లో చిక్కుకుని పరారీలో వున్నాడు. ఇమ్రాన్ ఖాన్‌ను అందలం ఎక్కించిన 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించిందిగానీ, పాక్ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుడయ్యాక ఆయన సైన్యాన్ని తూర్పారపట్టడం మొదలెట్టారు. రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని ‘అధికార వ్యవస్థ’ పదం చాటున నిందించటం అలవాటు. ఇమ్రాన్ ఆ సంప్రదాయానికి స్వస్తిపలికారు. నేరుగా సైన్యాన్నీ, దాని అధినేతలనూ ఉద్దేశిస్తూ దూషించారు. పైగా నిరుడు మే నెలలో ఇమ్రాన్‌కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకుంది. ఊహకందని రీతిలో సైనిక కార్యాలయాలపైనా, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైనా యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాలు చేయటం సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగంలో వున్న రెండు ప్రధాన పక్షాలు– మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్–ఎన్), మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీవుండటం ఆనవాయితీ. ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ నెగ్గిన 2018 ఎన్నికలొక్కటే దీనికి మినహాయింపు. చెప్పాలంటే ఇతరులకన్నా పీపీపీ చాలా ముందుగా ఎన్నికల బరిలోకి దిగింది. విస్తృతంగా ప్రచారం చేసింది. మొదట్నుంచి బలంగా వున్న సింద్ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీ బలహీనపడింది. ప్రచారావకాశాలు బొత్తిగా లేని పీటీఐకి యువత బలమైన శక్తిగా వున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు సాగిస్తున్న ప్రచారం రెండు పార్టీలనూ బెంబేలెత్తిస్తున్నది. పాకిస్తాన్లో మరీ ముఖ్యంగా... బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాల్లో భారీయెత్తున హింస చోటుచేసుకున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించటాన్నిబట్టి ఈ ఎన్నికల సరళి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులకు ఈసారి పెద్దగా చోటు దక్కలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అంటున్నది. ఈ విషయంలో మీ సంజాయిషీ ఏమిటని పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి ఆ సంస్థ తాఖీదులు పంపింది. పాకిస్తాన్ పార్లమెంటులో మహిళా కోటా 22 శాతం వుంది. దీంతోపాటు చట్టప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5 శాతం స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు మూడూ ఈ విషయంలో మొహం చాటేశాయి. ఎన్నికలు, గెలుపోటముల సంగతలావుంచితే... రాబోయే ప్రభుత్వానికి చాలా సవాళ్లున్నాయి. నిరుడు మే నెలలో పాకిస్తాన్ దాదాపు దివాలా అంచులకు చేరింది. ఆఖరి నిమిషంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 300 కోట్ల డాలర్ల రుణం అందించి ఆదుకుంది. ఆ సాయం కూడా వచ్చే నెలాఖరుతో ఆగిపోతుంది. దాన్ని పొడిగించేలా చూసుకోవటం, అందుకు సంస్థ విధించబోయే షరతులకు తలొగ్గటం కొత్త పాలకులకు తప్పనిసరి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న ప్రజానీకంలో ఇది మరింత నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక రంగానికి కూడా సహకారం అందకపోవచ్చు. మన దేశంతో ఆది నుంచీ పాకిస్తాన్‌ది శత్రుపూరిత వైఖరే. దీనికితోడు దశాబ్దాలుగా పాక్‌లో వుంటున్న వేలాదిమంది అఫ్గాన్ పౌరులను నిరుడు వెనక్కి పంపటంతో తాలిబన్ పాలకులతో తగాదాలు మొదలయ్యాయి. ఇవన్నీ దేశంలో మిలిటెన్సీ మరింత పెరగటానికి దోహదపడతాయి. వీటిని ఒడుపుగా ఎదుర్కొంటూ, సైన్యానికి ఆగ్రహం కలగకుండా చూసుకోవటం కొత్త పాలకులకు జీవన్మరణ సమస్య. ఇన్ని భారాలు మోసేదెవరో తాజా ఎన్నికలు తేల్చబోతున్నాయి. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్‌ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్‌పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్.. భారత్, అమెరికాకు భంగపాటు -
పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పాక్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరసన గళం విప్పుతుండగా, ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కూడా ఇమ్రాన్‌ను టార్గెట్ చేసింది. ఈ పరిస్థితులు నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇమ్రాన్ పొలిటికల్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ)పై బ్యాన్ విధించాలని ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. వివరాల ప్రకారం.. ఖవాజా ఆసీఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తరచూ దేశ రక్షణశాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, దేశ సైన్య విభాగాన్ని శత్రువుగా భావిస్తున్నారని ఆరోపించారు. పాక్ సైన్యం కారణంగానే ఇమ్రాన్ రాజకీయాల్లో కాలుమోపారని, ఇప్పుడు దీనిని మరచిపోయి ఆయన సైన్యాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కాగా, మే 9న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు సైనికాధికారుల ముఖ్యకార్యాలయంపై దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక, పలు అవినీతి ఆరోపణలతో మే 9న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తింది. Defence Minister Khawaja Asif said that the Federal government considering to impose ban on Imran Khan’s Party Pakistan Tehreek-e-Insaf.https://t.co/4YhnjJIAPR#imranKhanPTI #Ptiban #pdmgovt #DefenceMinister #KhawajaAsif #burjnews pic.twitter.com/3jMyTmzs7h — Burj News (@Burjnews) May 24, 2023 ఇది కూడా చదవండి: మరో మహమ్మారి పొంచి ఉంది.. WHO వార్నింగ్ ఇదే.. -
సినిమా రేంజ్లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, రెండు కేసుల్లో బెయిల్ విషయమై మంగళవారం ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇమ్రాన్ తరఫు లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, ఇమ్రాన్‌ఖాన్ ఎందుకు అరెస్ట్ అయ్యారంటే.. వివరాల ప్రకారం.. అల్ ఖాదిర్ యూనివర్సిటీకి భూమి కేటాయించిన సమయంలో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నారు. ఆ వర్సిటీకి ఇమ్రాన్ ఖాన్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే, భూ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఈ అంశంపై కేసు నమోదు అయ్యింది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఈ కేసును విచారిస్తున్నది. ఈ కేసులో జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు వర్సిటీ ట్రస్టుకు సుమారు 180 మిలియన్ల పాక్ కరెన్సీ డొనేషన్ రూపంలో వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ వల్ల జాతీయ ఖజానాకు రూ.50 బిలియన్ల నష్టం జరిగినట్లు ప్రస్తుత మంత్రి రాణా సనావుల్లా ఆరోపించారు. ఇక, ఈ కేసులో మంత్రులు జుల్ఫికర్ బుకారీ, మాజీ అడ్వైజర్ షెహజాద్ అక్బర్లు కూడా ఉన్నారు. బ్రిటన్‌లో సీజ్ చేసిన 50 బిలియన్ల అమౌంట్‌ను పాకిస్తాన్లో అందజేసే అంశంపై రియాజ్‌తో ఒప్పందం కుదురింది. ఆ ఒప్పందం ప్రకారం అల్ ఖాదిర్ వర్సిటీ ట్రస్టుకు భూముల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. తొలుత భూమిని బుకారీ పేరిట ట్రాన్స్ఫర్ చేసి, ఆ తర్వాత ఆ భూమిని ట్రస్టుకు బదిలీ చేశారు. వర్సిటీకి భూమి అప్పగించిన కేసులో గతంలో టైకూన్ మాలిక్ రియాజ్‌కు ఎన్ఏబీ నోటీసులు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం సుమారు 57 ఎకరాల భూమిని అల్ ఖాదిర్ ట్రస్టుకు డొనేట్ చేశారు. అల్ ఖాదిర్ వర్సిటీ తరపున బుష్రా ఖాన్, డోనార్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం జరగడంతో దాంట్లో దాగిన అవినీతి బయటపడింది. ఈ కేసులో రియల్ ఎస్టేట్ టైకూన్ మాలిక్ రియాజ్ వాంగ్మూలాన్ని గతంలో తీసుకున్నారు. కాగా, ఈ రెండు కేసుల్లో బెయిల్ దరఖాస్తు చేసుకున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లారు. అయితే బయోమెట్రిక్స్ వివరాలు సమర్పిస్తున్న సమయంలో ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. Shelling at protesters outside Lahore Corps Commander House in an attempt to scatter them fails. People vow to remain here until Ex Prime Minister Imran Khan is released. pic.twitter.com/5giwnMnKR9 — Musa Virk (@MusaNV18) May 9, 2023 మరోవైపు.. ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలకు దిగారు. పలు చోట్ల కార్యకర్తలు రెచ్చిపోయారు. వాహనాలకు నిప్పటించారు. పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Another arrest video of Imran Khan. pic.twitter.com/uOg8FV2dGn — Ihtisham Ul Haq (@iihtishamm) May 9, 2023 LAHORE CROWDS ATTACK CORPS COMMANDER HOUSE AFTER IMRAN KHAN ARREST. pic.twitter.com/7L1WAP9Zd6 — SHAHEEN SEHBAI (@SSEHBAI1) May 9, 2023 PROTESTS GROW AS VEHICLES IN PAKISTAN ARE SET ON FIRE AFTER IMRAN KHAN ARREST. pic.twitter.com/NDq9CoOhwA — SHAHEEN SEHBAI (@SSEHBAI1) May 9, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ -
పాకిస్తాన్లో మరో ట్విస్ట్.. మాజీ ప్రధాని ఇంటి వద్ద హైటెన్షన్!
ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన దాయాది దేశంలో పాకిస్తాన్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు.. లాహోర్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పీటీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు వ్యతిరేకంగా పీటీఐ నేతలు నినాదాలు చేశారు. కేసు ఇదే.. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గతేడాది అక్టోబర్‌లో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం తీరుపై(తోషిఖానా తీర్పు) పీటీఐ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా, దీనిపై ఇమ్రాన్ సహా పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ కావాల్సి ఉండగా.. గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్‌కు బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో కోర్టు హాజరయ్యేందుకు కొంత సమయం ఇచ్చారు. అయితే, కేసులో భాగంగా కోర్టులో హాజరు కాకుండా ఇమ్రాన్ జాప్యం చేయడంతో ఇమ్రాన్ బెయిల్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. కానీ ఆయన దీన్ని అలుసుగా తీసుకున్నారని ఫైర్ అయ్యారు. దీంతో, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. Was police planning to arrest Imran Khan? . . . .#thecorrespondentpk #ImranKhanPTI #ImranKhan #PTI #Zamanpark #watch #foryoupage #fyp pic.twitter.com/5bpDKPXa1n — The Correspondent PK (@correspondentPk) February 17, 2023 -
ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయమైంది. మరో నలుగురు సైతం గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బులెట్ ప్రూఫ్ వాహనంలోకి తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో గురువారం ‘నిజమైన ఫ్రీడమ్’ ర్యాలీ చేపట్టారు ఇమ్రాన్ ఖాన్. జఫారలి ఖాన్ చౌక్ వద్ద దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఫైరింగ్ తర్వాత ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మారుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ర్యాలీ సదర్భంగా ఆయన ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణం చేశారు. ఈ కాల్పుల్లో పీటీఐ లీడర్ ఫైజల్ జావెద్ సైతం గాయపడినట్లు మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా దుండగుడు పలు రౌండ్ల కాల్పులకు పాల్పడగా.. ఆయన కాలికి గాయమైంది. ఇమ్రాన్‌ను బులెట్ ప్రూఫ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. #WATCH | A firing occurred near the container of former PM and Pakistan Tehreek-e-Insaf (PTI) chairman Imran Khan near Zafar Ali Khan chowk in Wazirabad today. Imran Khan sustained injuries on his leg; a man who opened fire has been arrested. (Video Source: Reuters) pic.twitter.com/Qe87zRMeEK — ANI (@ANI) November 3, 2022 ఘటనపై భారత్ స్పందన.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటనపై భారత్ స్పందించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ ఘటన ఇప్పుడే జరిగింది.అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.’అని తెలిపారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ. ఇదీ చదవండి: ఇమ్రాన్ ఖాన్ ‘సిక్సర్’ విక్టరీ.. అధికార పార్టీలో గుబులు! -
ఇమ్రాన్ ఖాన్ సిక్సర్.. ఆకాశానికెత్తిన మీడియా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరింటిలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో అధికారం కోల్పోయినప్పటికీ తెగ విమర్శలు గుప్పించిన ఆ దేశ మీడియా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికెత్తేస్తోంది. తాజాగా జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు, పంజాబ్ అసెంబ్లీకి మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాలకు పోటీ చేశారు. ఆదివారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఆరు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో.. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న పీటీఐ డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది. పాక్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాక.. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ క్రమంలో 131 స్థానాలకు గానూ దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది పాక్ ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఆరు నెలల పాలన తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందనేది పీటీఐ వాదన. ఈ మేరకు జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈసీ మాత్రం అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడం గమనార్హం. Entire nation stands with Imran Khan !! pic.twitter.com/hbvdMBAz70 — PTI (@PTIofficial) October 17, 2022 ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి భంగపాటే ఎదురైంది. అధికార పార్టీ మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా.. ఆర్థిక సంక్షోభం, ఆ వెంటనే వరదలు పాక్‌ను అల్లకల్లోలం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు, అధికారులు ఎక్కడ కనిపించినా.. ప్రజల నుంచి బహిరంగంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు సైతం ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, విదేశీ కుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరు స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఒక్కదాని మినహా మిగతా అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మిగతా స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో పాక్ గడ్డపై అత్యధికంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి.. ఐదింటిలోనూ విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి పాక్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి ఇల్లీగల్‌గా ఫారిన్ ఫండ్స్ దక్కించుకుందని పీటీఐ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి రావడమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పీటీఐ అర్హత కోల్పోతుంది కూడా. ఇదీ చదవండి: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్నదేశం -
డిప్యూటీ స్పీకర్‌పై దాడి.. జుట్టు పట్టుకుని లాగుతూ..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మాణం సందర్భంగా ఆ దేశ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం పాక్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా సభ జరుగుతున్న క్రమంలో.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు బీభత్సం సృష్టించారు. గట్టిగా అరుస్తూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై వారు దాడి దిగారు. ఆయనపైకి పువ్వులు విసురుతూ, జుట్టు పట్టుకుని లాగుతూ, చెంపపై కొడుతూ దాడి చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని నిలువరించలేకపోయారు. ఈ సందర్భంలో పీటీఐ, పీఎంఎల్‌క్యూ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ సెక్యూరిటీ గార్డుల రక్షణలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pti and pmlQ members resorting to violence eventually in Punjab assembly. Assault on Deputy speaker Dost Mazari makes it another sad day for democracy in this country and a blatant violation of LHC order. God knows what else is left for us to see, disturbing visuals. pic.twitter.com/RkblxWmd4g — Absa Komal (@AbsaKomal) April 16, 2022 -
Pakistan: పాక్ అసెంబ్లీలో ఓటింగ్‌పై సస్పెన్స్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్ జరుగనుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీకి 176 మంది ఎంపీలు ప్రతిపక్ష నేతలు హాజరు కాగా, అధికార పార్టీ పీటీఐ పార్టీ నుంచి కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కాగా, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌కు మిత్రపక్షాల నేతలు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. పాక్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఇమ్రాన్ సభకు వస్తారని అంత భావించినప్పిటికీ ప్రధాని మాత్రం రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం కంటే ముందే ఇమ్రాన్ రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మీరు (స్పీకర్) సభా కార్యకలాపాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగం, చట్టం కోసం నిలబడాలని స్పీకర్ అసద్ ఖైజర్‌ను కోరారు. Pakistan National Assembly Speaker Asad Qaiser adjourns the House proceedings till 1230pm local time. (Source: PTV) pic.twitter.com/6MAeahkoAz — ANI (@ANI) April 9, 2022 ఈ సందర్బంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి, పీటీఐ నేత షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు అవిశ్వాసం తీర్మానం పెట్టడం వారికి రాజ్యంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సమర్థించడం ప్రభుత్వం బాధత్య అని పేర్కొన్నారు. వీరు మాట్లాడిన అనంతరం సభలో గందరగోళం జరిగింది. అధికార పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రావాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలు అవిశ్వాసంపై ఓటింగ్ జరపాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర!
దారులన్నీ మూసుకుపోయాయి. అయినా రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ అన్నివిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా రాజీనామాకు ససేమీరా అంటున్నాడు. మిత్ర పక్షాలన్నీ తనని గద్దె దించడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే.. జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని సైతం ఆర్మీ సలహా మేరకు వాయిదా వేసుకున్నాడు కూడా. ఈ తరుణంలో.. పాకిస్థాన్ తెహ్రీక్-యి-ఇన్సాఫ్ పార్టీ (PTI) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పీటీఐ సీనియర్ నేత ఫైజల్ వవ్దా. పాక్ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ సంక్షోభానికి తెర లేపాయి. ఆయన మొండిగా ముందుకెళ్తున్నాడు. అందుకే చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఫైజల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్ ఖాన్‌కు సూచించాయట. అయితే తాను చావుకు భయపడనని ఇమ్రాన్ ఖాన్.. తోటి నాయకులతో చెప్పినట్లు ఏఆర్వై న్యూస్ కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని, ఇందుకోసం ప్రతిపక్షాలకు డబ్బు ఆశ ఎర చూపుతున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నాడు. ఇమ్రాన్ సర్కార్‌కు 172 మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం 164 మంది ఉన్నారు. వీళ్లలోనూ మరికొందరు బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదవండి: ఖాన్‌కు అదనంగా విషమ పరీక్ష విశేషం ఏంటంటే.. 75 ఏళ్ల పాక్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం(ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఉన్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సంబంధిత వార్త: లాస్ట్ ఓవర్.. ఐదు బంతులు.. 36 పరుగులు.. -
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై రేపు అవిశ్వాస తీర్మానం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్ తగిలింది. సోమవారం పాక్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షం జమూరీ వతన్ పార్టీ నేత షాజైన్ బుగ్తీ.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్షమైన పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్లో చేరారు. ఈ సందర్భంగా బుగ్తీ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. పాక్, బలూచిస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం, మంచి భవిష్యత్ కోసం తాను ప్రతిపక్షంలో చేరానన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో శాంతిభద్రతను మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. వారి జాడ తెలియడం లేదంటూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. తప్పిపోయిన మంత్రుల్లో 25 మంది ఫెడరల్, ప్రావిన్షియల్ అడ్వైజర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇక, పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 172 మంది జాతీయ అసెంబ్లీ సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాగా ఇమ్రాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ నుంచి 155 మంది సభ్యులు ఉండగా.. నాలుగు ప్రధాన మిత్రపక్షాల నుంచి 20 మంది సభ్యులను కలిగి ఉంది. -
సొంత పార్టీలోనే 24 మంది ఎంపీల తిరుగుబాటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ చిక్కుల్లో పడ్డారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే సొంత పార్టీలోనే ఆయనకు తిరుగుబాటు ఎదురైంది. 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఇమ్రాన్‌ను గద్దె దింపేస్తామని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి బాధ్యత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వానిదేనని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన 100 మందికిపైగా ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన నాయకులే ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేస్తూ ఉండడంతో ఆయన సమస్యల సుడిగుండంలో పడిపోయారు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సింధ్ హౌస్‌లో ఉండగా పీటీఐకి చెందిన కొందరు శుక్రవారం అక్కడికెళ్లి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బయటకు వస్తే ప్రభుత్వం తమను అపహరిస్తుందని అసమ్మతి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీలే తమ ఎంపీలను కొనేస్తున్నాయంటూ అధికార పీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో మొత్తం సభ్యులు 342 మంది కాగా అధికార పార్టీ బలం 155, మరో 23 మంది మద్దతిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఇమ్రాన్ ప్రభుత్వానికి మొత్తం 172 మంది సభ్యుల మద్దతు అవసరం. సొంత పార్టీలో సభ్యుల తిరుగుబాటుతో ఇమ్రాన్ ప్రభుత్వం గండం గట్టెక్కడం కష్టంగా మారనుందని పరిశీలకులు అంటున్నారు. -
భారత్ ఆశ్రయం కోరుతున్న పాక్ మాజీ ఎమ్మెల్యే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్‌లో రాజకీయ ఆశ్రయం కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని బారికోట్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్ కుమార్ పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్‌లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. బల్దేవ్ ఇండియా రావడానికి ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని.. అందువల్లే తన కుటుంబాన్ని పాక్ నుంచి ఇండియాకు పంపిచాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్ వెళ్లాలని కోరుకోవడం లేదన్నాడు బల్దేవ్. తన కుటుంబ భద్రత గురించి తాను భయపడతున్నానని.. అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్. నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు. అంతేకాక భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. బల్దేవ్ కుమార్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లూధియానా ఖన్నాలోని సమ్రాలా మార్గ్ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో అద్దెకుంటున్నాడు. బల్దేవ్ కుమార్ 2007లో పంబాజ్ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది. కాగా బల్దేవ్ ఇద్దరి పిల్లలు పాక్ పౌరసత్వం పొందారు. 2016 ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ ఎమ్మెల్యే సోరన్ సింగ్ హత్య కేసులో బల్దేవ్పై ఆరోపణలు ఉన్నాయి. -
హిందువులపై అనుచిత వ్యాఖ్యలు.. ఇమ్రాన్ సీరియస్
ఇస్లామాబాద్ : హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని పాకిస్తాన్ అధికారపార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) తొలగించింది. అసలే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర సమాచార మంత్రి ఫయ్యాజుల్ హసన్ హిందువులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఇమ్రాన్ ఖాన్‌తో సహా పార్టీలోని సీనియర్ మంత్రులంతా సదరు మినిస్టర్‌పై సీరియస్ అయ్యారు. మంత్రి ఫయ్యాజుల్ హిందువులను ఉద్దేశిస్తూ.. ఆవు మూత్రం తాగే జనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది. దీంతో ఫయాజుల్ హసన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పీటీఐ మంగళవారం ట్విటర్లో పేర్కొంది. ఫయ్యాజుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ముస్లింలకు ప్రత్యేకంగా ఓ జెండా ఉంటుంది. ఇది మౌలా అలియా ధైర్యానికి, హజ్రాత్ ఉమారా శౌర్యానికి ప్రతీక. కానీ మీకంటూ ఎటువంటి ప్రత్యేక జెండా లేదు. మీ చేతుల్లో ఏమి లేదు’ అన్నారు. అంతేకాక ‘గో మూత్రం తాగే మీరు మాకంటే ఏడు రెట్లు ఉన్నతులమనే భ్రమలో ఉన్నారు. కానీ మాకు ఉన్నవి ఏవి కూడా మీకు లేవు. మీరు విగ్రహారాధకులు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఫయ్యాజుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. మైనారిటీల పట్ల తప్పుగా వ్యవహరించేవారిని పీటీఐ పార్టీ ఎన్నటికి క్షమించదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. PTI Punjab government has removed Fayyaz Chohan from the post of Punjab Information Minister following derogatory remarks about the Hindu community. Bashing someone’s faith should not b a part of any narrative.Tolerance is the first & foremost pillar on which #Pakistan was built. pic.twitter.com/uKJiReWc26 — PTI (@PTIofficial) March 5, 2019 -
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం