ప్రచారాన్ని హడలెత్తిస్తున్న ఉగ్రదాడులు | Election Candidate Killed In Suicide Bomb Attack While Election Campaign | Sakshi
Sakshi News home page

ర్యాలీపై ఉగ్ర పంజా..! పొటీ దారు హతం

Published Sun, Jul 22 2018 6:46 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

Election Candidate Killed In Suicide Bomb Attack While Election Campaign - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దేరా ఇస్మాయిల్‌ ఖాన్‌/పాకిస్తాన్‌: ఓవైపు ఎన్నికల్లో ఉగ్రనేతలు పోటీకి దిగడంతో పాకిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోవైపు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో బాంబు దాడులు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్తానీ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) తరపున ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇక్రాముల్లా ఖాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఖాన్‌ వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పంక్త్వా ప్రావిన్సులో గల దేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.ఈ దాడిలో ఇక్రాముల్లాతో జీపు డ్రైవర్‌, సెక్యూరిటీ గార్డు, ‍మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీస్‌ అధికారి పలీస్‌ జరూర్‌ అఫ్రీదీ తెలిపారు.

ఖైబర్‌ పంక్త్వాలో అతిపెద్ద బాంబు దాడి
ఇదిలా ఉండగా పది రోజుల క్రితం కూడా ఖైబర్‌ పంక్త్వా ప్రావిన్స్‌లో బాంబుల వర్షం కురిసింది.  ఎన్నికల ప్రచార ర్యాలీపై విరుచుకుపడిన ఉగ్రవాదులు 149 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్‌ ఎన్నికల ప్రక్రియకు సవాల్‌ విరిసింది. ఈ నెల 25న పాకిస్తాన్‌లోఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement