
మహబూబ్‌నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్‌కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుండేవారు.
వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment