train accident case
-
రైలు కిందపడి తండ్రి, కుమార్తెల విషాదం!
మహబూబ్‌నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్‌కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుండేవారు.వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
బెంగాల్ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కాంచన్‌జంగా రైలు ప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇప్పటిదాకా పది మంది మరణించగా.. 40 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు మాట మార్చారు. అసలు తాను ఫిర్యాదే చేయలేదని బాంబ్ పేల్చారు.బెంగాల్ రైలు ప్రమాదంపై జల్పాయ్గురి రైల్వే పోలీసులు(GRP) మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోకో పైలట్, కో-పైలట్ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతూ.. చైతలి మజుందార్ అనే ప్రయాణికురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘రైలు రంగపాణి-నిజ్బరి స్టేషన్ల మధ్య ఉండగా.. హఠాత్తుగా కుదుపులకు లోనైంది. మా బోగీలో ఉన్నవాళ్లమంతా అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈలోపు స్థానికులు తీవ్రంగా గాయపడిన మమ్మల్ని బయటకు తీశారు. బయటకు వచ్చి చూస్తే మా రైలును వెనుక నుంచి గూడ్స్ ఢీ కొట్టింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనూ కొందరు చనిపోయారు. పైలట్-లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నా’’ అని ఫిర్యాదులో ఉంది. అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్ మరణించగా.. లోకో పైలట్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చైతలి ఫిర్యాదు ఆధారంగానే ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈలోపే ఆమె ట్విస్ట్ ఇచ్చారు. తాను అసలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చారు. జీఆర్పీ అధికారులు ఓ తెల్లకాగితంపై తనతో సంతకం చేయించుకున్నారని.. దానినే ఫిర్యాదులేఖగా మార్చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అయితే మజుందార్ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
ఒడిశా రైలు ప్రమాదం: ‘లడ్డూ గోపాలుడే నన్ను కాపాడాడు’
‘భూమిపై ఇంకా నూకలున్నాయి’ ఈ నానుడి ఒడిశా రైలు దుర్ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నవారిని చూస్తే నూటికి నూరుశాతం నిజం అనిపిస్తుంది. ఒక మహిళా ప్రయాణికురాలి విషయంలో అదే జరిగింది. నిజానికి ఆమె కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేయాల్సివుంది. అయితే చివరి నిముషంలో ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మహిళ తన కథను వినిపించడంతో పాటు తనను లడ్డూ గోపాలుడు (శ్రీకృష్ణుడు) కాపాడానని కనిపించినవారందరికీ చెబుతున్నారు. మీడియాతో లక్ష్మీదాస్ సర్కార్ అనే మహిళ మాట్లాడుతూ తాను మిగిలిన ప్రయాణికుల మాదిరిగానే జూన్ 2న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సివుందన్నారు. అయితే తన కుమార్తెకు ఏదో పని ఉండటం వలన ప్రయాణం రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆమె లడ్డూ గోపాలుని విగ్రహాన్ని భక్తితో చేతుల్లోకి తీసుకుని, భగవంతునికి ధన్యవాదాలు తెలిపారు. లడ్డూ గోపాలుని దయ వలనే తాను ప్రాణాలతో ఉన్నానని పేర్కొన్నారు. హౌరాకు చెందిన లక్ష్మీదాస్ సర్కార్ జూన్ 2న షాలిమార్ నుంచి చెన్నై వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఆమె చెన్నైలోని తన కుమార్తెను చూసేందుకు వెళ్లాలనుకున్నారు. ఆమె కుమార్తె ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే కుమార్తెకు ఏదో పని ఉన్న కారణంగా లక్ష్మీదాస్ సర్కార్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని, తరువాత ఎప్పుడైనా వెళ్లవచ్చని నిర్ణయించుకున్నారు. అయితే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె భగవంతుడే తన ప్రాణాలు కాపాడాడని చెబుతున్నారు. చదవండి: కుమారుని మృతదేహం మాయం.. కంగుతిన్న తండ్రి! -
రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్
-
రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్
గుంతకల్లు రూరల్ (అనంతపురం జిల్లా): పెనుకొండ సమీపంలోని మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో రైల్వే పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ యజమాని వెంకట సుబ్బయ్య తనకున్న రెండు లారీల్లో గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి పంపాడు. లోడ్ తో వస్తున్న మొదటి లారీ సోమవారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. వెనక నుంచి వస్తూ ఘటనను కళ్లారా చూసిన మరో లారీ డ్రైవర్ దూదేకుల బాషా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వెంకటసుబ్బయ్యతో పాటు, ప్రమాదాన్ని చూసి కూడా చెప్పకుండా వెళ్లిపోయిన దూదేకుల బాషాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి గుత్తి సబ్ జైలుకు తరలించారు.