పెనుకొండ సమీపంలోని మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో రైల్వే పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ యజమాని వెంకట సుబ్బయ్య తనకున్న రెండు లారీల్లో గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి పంపాడు. లోడ్ తో వస్తున్న మొదటి లారీ సోమవారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది.