ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన దాయాది దేశంలో పాకిస్తాన్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు.. లాహోర్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పీటీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు వ్యతిరేకంగా పీటీఐ నేతలు నినాదాలు చేశారు.
కేసు ఇదే.. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గతేడాది అక్టోబర్‌లో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం తీరుపై(తోషిఖానా తీర్పు) పీటీఐ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా, దీనిపై ఇమ్రాన్ సహా పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ కావాల్సి ఉండగా.. గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్‌కు బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో కోర్టు హాజరయ్యేందుకు కొంత సమయం ఇచ్చారు.
అయితే, కేసులో భాగంగా కోర్టులో హాజరు కాకుండా ఇమ్రాన్ జాప్యం చేయడంతో ఇమ్రాన్ బెయిల్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. కానీ ఆయన దీన్ని అలుసుగా తీసుకున్నారని ఫైర్ అయ్యారు. దీంతో, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది.
Was police planning to arrest Imran Khan?
— The Correspondent PK (@correspondentPk) February 17, 2023
.
.
.
.#thecorrespondentpk #ImranKhanPTI #ImranKhan #PTI #Zamanpark #watch #foryoupage #fyp pic.twitter.com/5bpDKPXa1n
Comments
Please login to add a commentAdd a comment