
పెషావర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కొందరు దారుణానికి పాల్పడ్డారు. బన్ను ప్రాంతంలోని జనీ ఖేల్ ప్రాంతంలో ఓ శునకానికి పీటీఐ జెండాను కట్టి దాన్ని దారుణంగా కాల్చి చంపారు. వీడియో కాస్త వైరల్ కావటంతో రంగంలోకి దిగిన బన్ను పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను ఖ్వామి వాతన్ పార్టీ కార్యకర్తలుగా గుర్తించారు. వీడియో వైరల్ అయిన 12 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయటం విశేషం. ఈ మేరకు నిందితులు నేరాన్ని అంగీకరిస్తున్న వీడియోను సైతం కేపీ పోలీసులు రిలీజ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల మొదట్లో ఓ గాడిదను పీటీఐ కార్యకర్తలు చిత్ర వధ చేయగా, ఆరో రోజుల తర్వాత అది ప్రాణాలు కోల్పోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆయా ఫోటోలను వైరల్ చేసింది. దీనికి ప్రతిగా కొందరు పీటీఐ జెండాను ఓ కుక్కకు కట్టి ఊరేగించారు కూడా. పాకిస్థాన్ రాజకీయాలకు మూగజీవాలను హింసించటాన్ని జంతు పరిరక్షక సంఘాలు ఖండిస్తున్నాయి. పలువురు నిందితులకు శాపనార్థాలు పెడుతున్నారు.
EXTREMELY GRAPHIC AND BRUTAL: A viral post purports to show someone apparently affiliated with Qomi Watan Party shot dead a dog after wrapping it up in PTI flag pic.twitter.com/cNSyxwGycg
— Khalid khi (@khalid_pk) July 28, 2018
Comments
Please login to add a commentAdd a comment