ఇస్లామాబాద్: నేరగాళ్ల అప్పగింతకు భారత్‌తో తమకు ద్వైపాక్షిక ఒప్పందమేమీ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా పాక్‌ను భారత్ కోరడం తెలిసిందే.
ఇందుకవసరమైన అన్ని పత్రాలను కూడా పాక్‌కు ఇప్పటికే అందజేసినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ నుంచి అభ్యర్థన అందిందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ధ్రువీకరించారు. అయితే హఫీజ్ అప్పగింతకు వీలు కల్పించే ద్వైపాక్షిక ఒప్పందమేదీ ఇరు దేశాల మధ్య లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment