
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి.
వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl
— Niv Calderon (@nivcalderon) April 16, 2025